రుద్రార్చన

 

రుద్రార్చనలో చాలా విశేషములు గలవు. ‘రుద్రోవైక్రూర’ అని వేదంలో ఒక చోట వున్నది. అధర్మ నాశనమున స్వభక్తులకు గలుగు సంసార భయాదుల పట్టున ప్రళయకాలము సమీపించిన తఱి- ఆది వ్యాధి హరణ కాలమున ధర్మానికి గ్లాని సంభవించిన తరుణంలో దుర్మార్గుల విషయంలో రుద్రుడు క్రూరుడై సంచరించునని, భాష్యకారులు వచించిరి. రుద్రుడనగా రోదనకారణభూతమగు దుఃఖమును హరించువాడనియు నర్థము. అనగా భవబంధ మోచకుడని గ్రహింపదగును.
దేవతారోపణము:మనకు రుద్రార్చన అభిషేక పూర్వకముగా ప్రచారములోనున్నది. అందు ‘నా రుద్రో రుద్రమర్చయేత్’ అని బోధాయనుని పల్కు. ఇది మహన్యాసములోని వాక్యము. మొదట మహన్యాసంలో పంచముఖేశ్వరుని ధ్యానానంతరము ‘ఇంద్రాదీన్ దిక్షువిన్యస్య’ అని ప్రారంభించి ఇంద్రాది అష్టదిక్పాలురను కర్తయగు యజమాని తన పరితః వారిని మంత్ర రూపమున నాహ్వానించి, తత్తద్దిక్కుల యందు న్యాసము చేయును. అటు పిమ్మట ఆత్మయందు అనగా తన శరీరరావయములందు సర్వ దేవతలను ఆరోపించుకొనును. ఇట్లు అష్టదిక్పాలురను పృధివ్యాది సమస్త భూతములను తన యందు ఆరోపణ గావించి పిమ్మట శివ సంకల్పాదుల పఠించి అష్టవిధములగు నమస్కారముల గావించి తాను సాక్షాత్ రుద్రునిగా భావన చేసుకుని ‘మూలాధారమను చక్రగతుండగు నా పరమ రుద్రుని హృదయాకాశమున తన్మధ్యే ఆత్మని దేవతా స్థాపయేత్ అన్నట్లు హృద్దేశమున పర దేవతా రూపుడగు రుద్రుని ప్రతిష్ఠించుకొనును.
రాష్ట్రాంతరాలలోని విశేషాలు
ఆంధ్ర దేశమున మహన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకము సంప్రదాయ సిద్ధంగా ఆచరించుట అనాది నుండి వచ్చుచున్నది. కాని మనకు సమీప రాష్టమ్రులవారు తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతములవారు ఆత్మశుద్ధికై మహన్యాస పఠనము గావించి ఏకవారం అనగా ఒక పర్యాయం అభిషేకం చేసుకొనుట ఆచారము.
‘‘బోధాయనుడు ఈ మహన్యాస ప్రక్రియను ఆచరించుటకు కొన్ని పద్ధతులు చెప్పినాడు. జీవితార్థీ- సదా పాపక్షయార్థీ- వ్యాధినాశనార్థీ- పుత్రార్థీ- మోక్షార్థీ అని మొదలిడి ఈ కామ్యముల నీడేర్చుకొనుటకు మహన్యాసపూర్వక, ఏకాదశ వార రుద్రాభిషేకము చేసి, వారి వారి అభీప్సితములను పొందవచ్చును’’ అని పల్కినాడు.
కాగా మహన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకానంతర కాలమున ఆచార్యునికి వత్సలతో అనగా దూడలతో కూడిన ఆవులను ఇచ్చి తీరాలి. దానం చేసి తీరాలనెడి నియమం గూడా నిర్వర్తించుట- కర్మాంగమై ఉన్నది. ఇవి విశేషములను చెప్పుటకు గల కారణము. మహన్యాస పఠనమువలననే పఠితకు రుద్రత్వ సిద్ధి కల్గును.
దేహమే దేవాలయము- సనాతనుడగు దేవుడే జీవుడు. అజ్ఞాన నిర్మాల్యమును తొలగించుకొని ఆ దేవుడను నేనను భావములతో సంపుణీకరణము చేయవలెను.
హంస అనగా నిర్వికార నిరామయుడగు నీశ్వరుడు. హంసయే సదాశివుడును, హంస పదోచ్చారణ చేతనే తత్పద పాఠకుడు పరమహంస యగు నీశ్వరతుల్యుడును.
ఈ మహన్యాసమున సర్వదేవతలను, తన యందు ఆరోపించుకొనుటచే కలుగు లాభమును బోధాయనుడు ఈ రకంగా వివరించినాడు.
త్వగస్థితైః సర్వపాపైః ప్రముచ్యతే సర్వభూతేష్య పరాజితో భవతి! భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష యమ దూత శాకినీ, ఢాకినీ జ్వరాది ఉపద్రవ జరోగాః సర్వేజ్వలంతం (మాం) పశ్యంతు! అనగా లోకంలోని ఏ భయంకరములగు భూత ప్రేత పశాచాదులు- యమదూతాదులు- జ్వరాది ఉపద్రవజములు- త్రినేత్రుని అపాంగాజనిత కంటి మంటవలె ప్రజ్వలించే ఈశ్వరధ్యాతను జూచి వాటంతటవి పరాజితములగునని బోధాయనోత్త వాక్యార్థము. వీటినన్నిటిని పరిశీలింపగా ఈ శతరుద్రీయ ప్రకరణోక్త మహన్యాసములోని మంత్రములు యజమానికి మంత్ర పఠనము ద్వారానే రుద్రత్వ ప్రాప్తికి సన్నిహిత కారణములగుటలో సందేహము లేదు.

- మల్లాది నరసింహమూర్తి

ఈ క్రింద తెలియజేసిన అన్ని రకాల పూజలు సశాస్త్రియముగా జరిపించబడును.
౧. గృహారంభ

౨. గృహప్రవేశములు,

౩. వివాహములు ,

౪. ముహుర్తానిర్ణయములు,

౫. జాతక పరిశీలన,

౬. రుద్రాభిషేకములు,

౭. చండీ (సప్తశతి) పారాయణము,

౮. నక్షత్ర శాంతి,

౯. నవగ్రహ శాంతి,

౧౦. దేవత కళ్యాణములు ,

౧౧. దేవతా విగ్రహ ప్రతిష్టలు,

౧౨. చండీ హోమములు

౧౩. సుదర్శన హోమ్లములు మొదలగు అన్ని దైవకార్యములు

Contact for all details

Sri K Chandra Sekhar Sarma

Geetha Nagar,Yemmiganur-518360

9110726720

9573094035

విద్యావినయాలు

విద్య విహీనః పశుః’ అని భర్తృహరి ఉవాచ. అంటే విద్యలేనివాడు వింత పశువు అని తెలుగు తాత్పర్యం. దీన్నిబట్టి విద్య ఎంత విలువైనదోనన్న విషయం వివరణ, విశే్లషణ లేకుండానే అందరికీ అర్థమైపోతుంది. అవిద్యయే అన్ని అనర్థాలకు మూలహేతువు. అట్టి అమూల్యమైన విద్య యొక్క విలువను విశదపరుస్తూ భర్తృహరి ఏనాడో చెప్పాడు.

సూర్యోపాసన

మన కంటికి కనిపించే దైవం సూర్యుడు. సూర్యుడు వెలుగులేని ప్రపంచం చీకటితో భీతావహంగా ఉంటుంది. పంచాంగ సిద్ధాంత కర్తలు ‘రథసప్తమి’ని ‘సూర్యజయంతి’ అన్నారు. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని ఆరాధించే పర్వదినం రథసప్తమి. మాఘమాస శుద్ధ సప్తమే రథసప్తమి.

సూర్యారాధన

బ్రహ్మస్వరూపముదయే, మధ్యానే్నతు మహేశ్వరం
సాయంధ్యాయే సదా విష్ణుం, త్రరుూమూర్తిర్దివాకరః

శ్రీపంచమి

‘శివానుజ’ అనడం చేత విద్యనభ్యసించినవారు తమ విద్యను లోకకళ్యాణార్థం ఉపయోగించాలని భావం

 సాయి పురోహితాలయము

Let's see

అయుతం అంటే

అయుతం అంటే పదివేలు. పదివేల సంఖ్యను పూరిస్తూ చండీ (దుర్గ) సప్తశతీ పారాయణాలను పూర్తి చేసి, ఆ సంఖ్యలోని దశాంశంతో అంటే వేయిసార్లు నామాలతో హోమం చేసి, పూర్ణాహుతులను సమర్పించడమే అయుత చండీయాగం. ఆధ్యాత్మిక సంపన్నుల భాష్యమేమిటంటే.. కలియుగంలో నామజపానికీ, యాగానికీ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అంతేగాక కలౌచండీ వినాయకౌ అన్న సూక్తి మేరకు చండీ ఉపాసనకూ అమిత ప్రాధాన్యం ఉంటుంది. నిజానికి శక్తిరూపిణి అయిన చండిక ఉగ్రరూపిణి. ఆ ఉగ్రత్వం ఎందుకనేదీ ప్రస్తావనాంశమే. చండికలోని ఉగ్రత్వం శత్రుసంహారకం, దుష్టసంహారకం. అంటే ధర్మవర్తనులను పీడించే అన్ని రుగ్మతలపైనే ఆ ఉగ్రత్వం! వెరసి సమాజ కళ్యాణానికి ఆ ఉగ్రత్వం ఉపయోగకరం. ఆమెను ప్రసన్నం చేసుకునే సర్వోత్కృష్ణ ప్రయత్నమే అయుత చండీయాగం! ఈ యాగానిది ఏకోత్తర వృద్ధి విధానం! ఈ అయుత చండీయాగం పూర్తిగా శృంగేరీ పీఠసంప్రదాయాలమేరకు ఏకోత్తరవృద్ధి విధానంలో సాగనుంది. అయుత చండీయాగంతోపాటు మహారుద్రయాగం, కుమారస్వామి, గణపతి, రుద్రహోమాలు, చతుర్వేద హవనం, పారాయణాలు, జపాలు జరుగుతాయి. 106 హోమగుండాలతో 1500 మంది రుత్విక్కులు, 5 రోజులపాటు 10 వేల సప్తశతి పారాయణలను, చండీ నవాక్షరి జపాలను చేస్తారు. ఒక్కో రుత్విక్కుడు తొలిరోజు ఒక సప్తశతి పారాయణం, నాలుగు వేల చండీ నవాక్షరీ జపం చేస్తారు. రెండోరోజు రెండు వేల పారాయణాలు, మూడువేల జపాలు. మూడోరోజు మూడు వేల పారాయణాలు, రెండు వేల జపాలు. నాలుగోరోజు నాలుగు సప్తశతి పారాయణాలు, వేయి చండీ నవాక్షరీ జపం. చివరిరోజున ఒక్కో హోమగుండం వద్ద 11 మంది రుత్విక్కులు పాయసంతో హోమం చేస్తారు. 100 మంది పాలతో 10 వేల పారాయణాలకు దశాంశం వేయిసార్లు తర్పణలిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి అయుత చండీయాగం సంపూర్ణమవుతుంది. వీటితోపాటు రోజూ నవదుర్గలకు నవావరణ పూజ, బలిప్రదానం, సువాసినీపూజలు, కన్యకాపూజలు, మహిళలతో కుంకుమార్చనలు, సాయంకాలం ప్రదోషకాలంలో అవధారయలు, రాజోపచారాలు, శాస్ర్తాలు, ప్రవచనాలు, మంగళ నీరాజన మంత్రపుష్పాలు ఉంటాయి.

మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము

ప్రదోష కాలమున (సా: 5.30-7.30)

ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము చాలా విశేషము.

"ఓం నమఃశివాయః,
నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ,
శ్రీ మన్మహాదేవాయ నమః".

అని చెప్పుకుంటూ ఇంట్లో కూడా ఆ సదాశివునికి జలముతో అభిషేకము చేయవచ్చు.  

లేక

 "ఓం నమఃశివాయః" అనుచూ 108 సార్లు జపము చేసిన మంచిది.