About

Shri Saibaba Sansthan Trust, Shirdi, is the Governing and Administrative body of Shri Saibaba's Samadhi Temple and all others temples in this premises, and devoted towards development of Shirdi village.

ఈ ప్రదేశాలను తప్పక చూసిరండి ! 

షిర్డీ లో ప్రధాన ఆకర్షణ సాయిబాబా ఆలయం. కానీ షిర్డీ లో మరియు దాని చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అజంతా ఎల్లోరా గుహలు, త్రయంబకేశ్వర్, బీచ్ లు, కోటలు, హిల్ స్టేషన్లు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలను చూడవచ్చు. మీరు గనక మూడు నాలుగు రోజులు షిర్డీ ట్రిప్ ప్లాన్ వేసుకుంటే ఇవన్నీ చూసిరావచ్చు. ఇవేకాదు ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, వైల్డ్ లైఫ్ సఫారీ మొదలైన అడ్వెంచర్ సాహసాలను ఆస్వాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ లగేజ్ బ్యాగ్ లను సర్దుకొని షిర్డీ కి ప్రయాణించండీ ...! షిర్డీ దేవాలయంలో సాయిబాబా అస్థికలు పెట్టారు. నాగ్ పూర్ కు చెందిన కోటీశ్వరుడు శ్రీకృషుడు కోసం ఒక పెద్ద దేవాలయాన్ని కట్టడం మొదలుపెట్టాడట. కానీ 1918 లో సాయిబాబా దైవసాన్నిధ్యం పొందటంతో ఆయన అస్థికలు గుడిలో పెట్టారట. దాంతో దేవాలయం కాస్త 'షిర్డీ సాయిబాబా దేవాలయం' గా ప్రసిద్ధి చెందినది.

ద్వారకామాయి

షిర్డీ దేవాలయం ప్రవేశం వద్ద గల మసీదు ద్వారకామాయి. ఇందులోనే బాబా ఎక్కువ కాలం గడిపాడు. అక్కడ ప్రతి సాయంత్రం బాబా దీపాలు వెలిగించేవాడట. ఇందులో బాబా చిత్రపటం, బాబా కూర్చోవటానికి వాడిన పెద్ద బండరాయి, పల్లకీ మొదలగునవి భక్తులను ఆకర్షిస్తాయి
 

చావడి

ద్వారకామాయి మసీదు కు దగ్గరలో ఉండేది చావడి. ఇదొక చిన్న ఇల్లు. బాబా రోజు విడిచి రోజు ఇక్కడ నివసించేవారట. ద్వారకామాయి నుంచి చావడికి బాబా ను ఊరేగింపుగా తీసుకెళ్లే ఆచారం ఇప్పటికీ ప్రతి గురువారం నిర్వహిస్తారు. ఈ చిన్న ఇంట్లో బాబా వాడిన చెక్క మంచమే, తెల్ల కూర్చి లు ఆకర్షణలు.

గురుస్తాన్

గురుస్తాన్ అనేది వేపచెట్టు ప్రదేశం. బాబా ను మొట్టమొదటి సారి చూడటం జరిగింది ఇక్కడే. ఇక్కడ అగర్బత్తి లను వెలిగిస్తే అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తి అవుతామని భక్తుల విశ్వాసం. ఈ ప్రదేశాన్ని ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు.
 

ఖండోబా దేవాలయం

షిర్డీ లోని అహ్మద్ నగర్ - కోపెర్ గాన్ రోడ్డు మార్గంలో ఉన్న పురాతన దేవాలయం ఖండోబా. ఇదొక శివాలయం మరియు ఈ గుడి పూజారే బాబాను 'ఓం సాయి' అని పిలిచాడట!
 లెండివనం లెండిబాగ్ లో బాబా తరచూ ధ్యానం చేసేవారు మరియు మట్టిప్రమిదలో దీపం వెలిగించేవారు. బాబా నాటిన మర్రిచెట్టు కింద ఈ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ వనం 24 గంటలూ యాత్రికుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది. 

లెండివనం

లెండిబాగ్ లో బాబా తరచూ ధ్యానం చేసేవారు మరియు మట్టిప్రమిదలో దీపం వెలిగించేవారు. బాబా నాటిన మర్రిచెట్టు కింద ఈ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ వనం 24 గంటలూ యాత్రికుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది.

దీక్షిత్ వాడా మ్యూజియం

దీక్షిత్ వాడా మ్యూజియం షిర్డీ లో వున్న చిన్న, ఆసక్తికరమైన ప్రదర్శనశాల. సంస్థాన్ సముదాయం మధ్యలో వుండే ఈ మ్యూజియం లో కొన్ని అరుదైన బ్లాక్ అండ్ వైట్ బాబా ఫోటోలు, ఆయన వాడిన చొక్కాలు, వంటపాత్రలు, నీళ్ల గ్లాసులు, చెప్పులు లాంటి ఇతర వస్తువులు ఇక్కడ ప్రదర్శించబడతాయి. సందర్శన సమయం : 10 am - 6 pm.
 

శని శింగనాపూర్

శని శింగనాపూర్ షిర్డీ కి 73 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ శని దేవుని ఆలయం ప్రసిద్ధి. ఇక్కడి వింతేమిటంటే ఏఇంటికీ తలుపులు ఉండవు. కాదు కాదు తలుపులు పెట్టరు. ఎవరైనా దొంగతనం చేస్తే అదే రోజు గుడ్డి వారైపోతారని చెబుతారు. దేవాలయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంటుంది.
 

నాసిక్

నాసిక్ షిర్డీకి 87 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశాన్ని ప్రవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపినట్లు పేర్కొన్నారు. శ్రీరాముడి ఆనవాళ్లు నేటికీ ఆ ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో లక్ష్మణుడు సూర్పనఖ ముక్కు (నాసికం) కోశాడని ఆ కారణంగానే దీనికి నాసిక్ అన్న పేరొచ్చిందని చెబుతారు.
 

త్రయంబకేశ్వర్ ఆలయం

నాసిక్ కు కొద్ది దూరంలో ఉన్న త్రయంబకేశ్వర్ ఆలయం దేశంలోకి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. గోదావరి నది జన్మస్థానం కూడా ఇదే.
 

పంచవటి

నాసిక్ లో మరో ప్రధాన ఆకర్షణ 'పంచవటి'. ఇక్కడ శ్రీరాముడు, సీతాదేవి కొంతకాలం పాటు ఉన్నారు. పూర్వం ఈ ప్రదేశాన్ని దండకారణ్యం గా అభివర్ణించేవారు. ఇక్కడ రాముని ఆలయం కలదు. అదే నేడు కాలారామ్ దేవాలయం గా ప్రసిద్ధి చెందినది.
 

సీత గుహ

సీత గుహ నాసిక్ లో చూడవలసిన మరో ప్రధాన ప్రదేశం. ఈ ప్రదేశం నుండే రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయాడు. గుహలోకి వెళ్ళలంటే యాత్రికులు తలదించుకుని జాగ్రత్తగా వెళ్ళాలి.

 ఇతర ఆకర్షణలు

దూద్ సాగర్, తపోవన్, ఆంజనేరి పర్వతం, పాండవలేని గుహలు, ముక్తి ధామ్ దేవాలయం, బాగూన్, వైన్ తోటలు, రామ్ కుండ్, మ్యూజియం మొదలుగునవి చూడదగ్గవి. ఆసక్తి కరంగా ఉండే ఫిషింగ్, బోట్ రైడింగ్, రాక్ క్లైమ్బింగ్, స్విమ్మింగ్ మొదలుగునవి నాసిక్ లో ఆనందించవచ్చు.
 

ఔరంగాబాద్

షిర్డీ నుండి ఔరంగాబాద్ 104 కిలోమీటర్ల దూరం. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు బీబీకా మక్ బారా, గ్రిశ్నేశ్వర్ దేవాలయం. ఈ దేవాలయం శివుడి జ్యోతిర్లింగ క్షేత్రం. బీబీకా మక్ బారా అనే స్మారకం, ఔరంగజేబు కుమారుడు తన తల్లి బేగం రబియా దురాని జ్ఞాపకార్థం నిర్మించాడు. ఇది తాజ్ మహల్ కు నకలు. సందర్శన సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.
 ఇతర ఆకర్షణలు

ఔరంగాబాద్

ఇతర ఆకర్షణలు : కొన్నాట్, ఔరంగాబాద్ కేవ్స్, ఖుల్దాబాద్, కిల్లా అరక్, పంచక్కి, నౌకొండ ప్యాలెస్, గుల్ మండి మొదలుగునవి చూడదగ్గవి.
ఇతర ఆకర్షణలు

ఔరంగాబాద్ ఇతర ఆకర్షణలు : కొన్నాట్, ఔరంగాబాద్ కేవ్స్, ఖుల్దాబాద్, కిల్లా అరక్, పంచక్కి, నౌకొండ ప్యాలెస్, గుల్ మండి మొదలుగునవి చూడదగ్గవి.
 

అజంతా గుహలు

షిర్డీ నుండి అజంతా గుహలు 200 కి. మీ ల దూరంలో, ఔరంగాబాద్ నుండి 96 కి. మీ ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు క్రీ.శ. 2 వ శతాబ్దం నాటివి. ఈ గుహలు మొత్తం 29 వరకు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బుద్ధుని జీవితగాధలను చూపుతుంది.
 

ఎల్లోరా గుహలు

షిర్డీ నుండి 97 కి. మీ ల దూరంలో, ఔరంగాబాద్ నుండి 30 కి. మీ ల దూరంలో ఎల్లోరా గుహలు ఉన్నాయి. అజంతా, ఎల్లోరా గుహలు రెండూ ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఎల్లోరా మొత్తం 34 గుహల సముదాయం. అందులో 12 బౌద్ధులవి, 17 హిందువులవి, 5 జైన మతస్థులవారివి. ఎల్లోరా లో ఏకశిల తో చెక్కిన కైలాస దేవాలయాన్ని తప్పక చూడాలి.
 

పూణే

పూణే షిర్డీ నుండి 200 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇది మరాఠా యోధుడు ఛత్రశివాజీ యొక్క స్వస్థలం. ఆగా ఖాన్ ప్యాలెస్, ఓషో ఆశ్రమం, పాతాళేశ్వర్ గుహాలయం, ట్రైబల్ మ్యూజియం, కోటలు, ఉద్యానవనాలు మొదలుగునవి చూడదగ్గవి. ప్రముఖ హిల్ స్టేషన్లయిన ఖండాలా , లోనావాలా పుణెకు సమీపంలో కలవు.
 

నాందేడ్

షిర్డీ నుండి నాందేడ్ 308 కి.మీ ల దూరంలో, హైదరాబాద్ నుండి షిర్డీ కి వెళ్లే రోడ్డు మార్గంలో కలదు. ఇక్కడ సిక్కు గురుద్వారాలు ఎంతో ప్రసిద్ధి. హజూర్ సాహిబ్ గురుద్వారా, నాందేడ్ కోట, ఉంకేశ్వర్ దేవాలయం నీటి బుగ్గలు, గోవింద బాగ్ మొదలుగునవి చూడదగ్గవి.
 

సాయినగర్ షిరిడి

బస్సు మార్గం : హైదరాబాద్, ముంబై, పూణే, నాందేడ్ తదితర పట్టణాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు షిర్డీ కు వెళుతుంటాయి. రైలు మార్గం : హైదరాబాద్, కాకినాడ, విజయవాడ, ముంబై మరియు ఇతర నగరాల నుండి షిర్డీ మీదుగా రైళ్లు పోతుంటాయి. వాయు మార్గం : ముంబై, పూణే, ఔరంగాబాద్, నాసిక్ విమానాశ్రయాలు షిర్డీ సమీపాన కలవు.

శ్రి షిరిడి సేవాశ్రమం, షిరిడి

శ్రి షిరిడి సేవాశ్రమం షిరిడిలో శ్రీ అమ్ముల సాంబశివరావు గారిచే ఏర్పాటుచేయబడినది. తప్పక దర్శించండి

Map of shiridi saibaba sevasramam

trustfinity