పూజల చందా వివరములు

వ.నం పూజ పేరు కాలం రుసుము చెల్లించుటకు లింకు
1

ఈ దేవాళయములో నిత్యధీపారాధన అవకాసము భక్తులకు కల్పిస్తున్నము. సంవత్సరముపాటు నూనెకు అయ్యే ఖర్చును రు 516/- గా నిర్ణయించాము. ఎవరైతే ఈ రుసుము చెల్లిస్తారో వారి గోత్రనామములు స్వామివారికి సంవత్సరముపాటు వినిపించబడును.

ఒక సంవత్సరం
చందాదారుల వివరాలు
Rs 516/- Pay here
2

ప్రతి నెలలో వచ్చు స్వాతికి స్వామి వారికి ప్రత్యేక పూజ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. భక్తులు ఆ కార్యక్రమాన్ని తమ గొత్రనామాలపై జరిపించుకొనుటకు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అందుకు గాను ఒక రోజు స్వాతికి కేవలము రు 2516/- లు చెల్లించవలెను. లేదా మిరే అన్ని వస్తువులు తీసుకురావలెను.

ఒక స్వాతి రోజుకు మాత్రమే

చందాదారుల వివరాలు

Rs 2516/- Pay here
3

ప్రత్యేక పూజ - అన్నదానము భక్తుల అభీష్టము ప్రకారము వారు కోరుకున్న ప్రత్యేక రోజులలొ అనగా జన్మ,వివాహ,ఉద్యోగ,గృహ ఇంకా అనేక శుభప్రదమైన రోజులలో స్వామి వారికి పూజ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడును.

సంవత్సరములో ఒక్కసారిమాత్రమే

చందాదారుల వివరాలు

Rs 2516/- Pay here
4
5

చందాదారుల వివరాలు

6

విరాళములు
ఈ దేవాళయములో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందివున్నది. అవి
1. భక్తులు ఉండుటకు వసతి భవనము
2. అన్నదానము జరిపించుటకు వంట గది
3. స్నానపు గదులు మొదలగునవి.
కావున పై నిర్మాణములకు సహకరించవలసిందిగా కోరుతున్నాము.

చందాదారుల వివరాలు

మీ అభీష్టము (No Limit) Pay here

స్వాతి ప్రత్యేక పూజ - అన్నదానము

దాతల వివరాలు

Name & Family details Event Date sponcers Pay link
Anchala
Bhaskar kumar
Deepika
Namish kumar
Gotram: Janakala
02-04-2018 Usha and Family Pay here to renewal

Get Receipt here

Smt Modam Usha
Sri Subbarayudu
Tharun Kumar
30-04-2018 Smt Modam Usha
Sri Subbarayudu
Tharun Kumar
Pay here to renewal

Get Receipt here

Smt Sridevi
PV Narasimhulu
Arundhathi
Prudviteja
27-05-2018 Smt Sridevi
PV Narasimhulu
Arundhathi
Prudviteja
Pay here to renewal

Get Receipt here

క్రీ.శే. కొట్టాల లక్ష్మిదేవి జ్ఞాపకార్థం -
కొట్టాల రామచంద్రుడు,
బనగానపల్లె
23-06-2018 కొట్టాల రామచంద్రుడు,
బనగానపల్లె
Pay here to renewal

Get Receipt here

Siddam Laxmi Devamma W/o S Subbarayudu
Correspondent
Balavikash High School
Kadapa
1-07-2018 Siddam Laxmi Devamma W/o S Subbarayudu Pay here to renewal

Get Receipt here

17-08-2018 Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

మీ గ్రామములో ఉన్న విశేషములైన కట్టడములు,కోటలు గుళ్ళు లేదా ఆశ్రమాలు మొదలగు అనేక వాటిని గురించిన సమాచారము justview.co ద్వారా అందించాలని సంకల్పించాము. కావున మీ ఊరి విశేషాలు ఈ క్రింది వివరాలతో పంపండి.

1. మీ పేరు,మొబైల్ నం.,అడ్రసు మరియు పోటొ
2. ఊరులోని విశేషము పేరు
3. వాటి పోటోలు
4. చరిత్ర-ఆధారాలు
మొదలగు అనేక వివరాలతో ఈమెయిలు లేదా వాట్సాప్ ద్వారా పంపండి.

Email : justview.co@gmail.com
Whatsapp No; 9110333597
website: www.justview.co

ఆహ్వానము
17-08-2018-శుక్రవారం


భక్తులకు,ప్రజలకు తెలియ జేయడమేమనగా
బనగానపల్లె రవ్వలకొండపై వెలసిన శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత నరసింహస్వామి వారి ప్రథమ వార్షికొత్సవాన్ని పురష్కరించుకొని - ధ్వజ స్థంభ స్థిరప్రతిష్ఠ మరియు శ్రీవారి కళ్యాణోత్సవము 17 ఆగస్జ్టు 2018 న నిర్వహించబడుచున్నాయి.
దర్శించండి-తరించండి
ఈ భక్తి కార్యక్రమములో పాల్గొనండి!
నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు పొందండి. ఈ కార్యక్రమము సందర్భముగా జరుగు కార్యక్రమములకు కుల,మత తారతమ్యాలు,పేద,గొప్ప తేడాలు మరి ఏ ఇతర తారతమ్యాలు లేవు. అందరూ పాల్గొనవచ్చును. నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు పొందవచ్చును.

కార్యక్రమ వివరాలు
17-08-2018-శుక్రవారము


ఉదయం 06-00 గంటలకు : గణపతి పూజ,పుణ్యాహవాచానము,అంకురాహాపణం
ఉదయం 07-00 గంటలకు : ప్రధాన కళశస్థాపన,వాస్తు,నవగ్రహ మండల ఆరాధన
ఉదయం 08-00 గంటలకు : జలాధివాసము,ధాన్యాధివాసము మహాన్నాపనము మొదలగు పూజలు
ఉదయం 09-00 గంటలకు : వాస్తు,నవగ్రహ జపహోమములు,స్థిరయంత్ర ప్రతిష్ఠాపన
ఉదయం 10-15 గంటలకు : స్థిర ధ్వజ స్థంభ ప్రతిష్ఠ,నేత్రోన్మిళనము,కుంభావహనము,మహా మంగళహారతి,పూర్ణాహుతి
ఉదయం 11-30 గంటలకు : శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత నరసింహస్వామి వారి కళ్యాణము తదుపరి అన్నప్రసాధ వితరణ కలదు
విరివిగా పాల్గొనండి - స్వామి వారి కృపాకటాక్షములు పొందండి
ఈ దేవాళయములో ప్రతి నెల ప్రతి స్వాతికి ప్రత్యేక పూజ-అన్నప్రసాద వితరణ కలదు. దర్శించండి-తరించండి
పూర్తి సమాచారము కొరకు www.justview.co చూడండి లేదా క్రింది వారిని సంప్రదించండి
ఆహ్వానించువారు
బాలిశెట్టి పావన నరసింహమూర్తి
ఆలయ వ్యవస్థాపకులు & కార్యనిర్వాహకులు
మరియు
ఆలయ కమిటి
Contact Nos: 6301918160,9951773665
wwww.justview.co Email: pavananarasimhaswamy@gmail.com
Facebook : https://www.facebook.com/narasimhamurthy.balisettypavana

నారాయణ తత్వాన్ని దర్శించిన మొదటి ముగ్గురు ఆళ్వారులు (ముదల్ ఆళ్వార్లు)
💫💫🌏🌙🌞💫💫
🕉ఓం శ్రీమాత్రే నమః 🕉
అద్వైత చైతన్య జాగృతి
💫💫🌞🌙🌏💫💫

మనకు నాలుగు వేల దివ్య ప్రబంధాలను పాడి అందించిన వాళ్ళు పన్నెండు మంది ఆళ్వారులు. ఆందులో మొదటి ముగ్గురు ఆళ్వార్లు కలియుగానికి ముందు జన్మించిన వారు. వారు అందమైన రీతిలో తత్వాన్ని దర్శించినవారు. అందుకు ఒక చరిత్ర ఉంది. అందులో ఒక ఆళ్వార్ సరస్సులో లభించారు. అందుకు ఆయనకు సరోయోగి అని పేరు. పొయ్-గై  అంటే ద్రవిడ భాషలో సరస్సు అని అర్థం.  మరోక ఆయన పుష్పంలో పుట్టారు అందుకే ఆయనకు పూదత్త, క్రమేపి భూత యోగి లేక భూదత్తాళ్వార్ అని పేరు వచ్చింది. మరొకాయనకు భగవంతుడు అంటే పిచ్చి వ్యామోహం, అందుకే ఆయనకు మహాయోగి అని పేరు. పేయ్ ఆళ్వార్ అని అంటారు. పేయ్ అంటే ద్రవిడ భాషలో పిచ్చి అని అర్థం.

ఈ ముగ్గురూ ఒక నాడు అందమైన రీతిలో ఒక దగ్గరికి చేరారు. ఒక నాడు వానా కాలంలో ఒక ఆళ్వార్ ప్రయాణం చేస్తున్నాడు, వర్షం బాగా పెరిగి పోయింది, చీకటిగా ఉండటంతో ఒక ఇంటి తలుపు తట్టి అక్కడే ఇంటికి ముందు ఉన్న చిన్న గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ గది చాలా చిన్నదిగా ఉంది, ఒక్కరు మాత్రం పడుకొని విశ్రాంతి తీసుకోవచ్చు. కొంత సమయానికి మరోక ఆళ్వార్ అదే ఊరికి వచ్చాడు. వర్షం ఉండటంతో ఆశ్చర్యం అదే ఇంటి తలుపు తట్టాడు. అప్పుడు మొదట వచ్చిన ఆళ్వార్ లేచి ఆయనకీ అశ్రయం ఇచ్చాడు. అప్పుడు ఇద్దరు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. మరి కొంత సమయానికి మరొక ఆళ్వారు అక్కడికే వచ్చి తలుపు తట్టాడు. ఇద్దరు కూర్చొనే వద్ద ముగ్గురు నిలుచొని సర్దుకోవచ్చుకదా అని ఆయనకి ఆశ్రయం ఇచ్చారు.

కొంత సమయానికి ఒకరిని ఒకరు తోసుకుంటున్నట్లు అని పించింది. చీకటిలో ఎవరు ఎవరిని తోస్తున్నారో కనిపించటంలేదు. ముగ్గురూ నేను కాదు తోసేది అని చెప్పారు. మరి ఎవ్వరో నాలుగో వ్యక్తి వాళ్ళని తోస్తున్నాడు, అది కనిపెట్టాలి అని అనుకున్నారు. వాళ్ళ దగ్గర దీపం కూడా లేదు.  అందులో ఒకాయనకి ఆలోచన తట్టింది. మాములుగా మనం వెలిగించే మామూలు దీపంలా కాకుండా, "వైయ్యంతగనయా వార్కడలే నెయ్యాగ" భూమండలం అంతా ఒక ప్రమిద అన్నాడు, ఈ సాగరాన్నే నెయ్యిగా పోస్తున్నాను. మరి దీపమో "వెయ్యకదిరోన్ విళక్కాగ" సూర్యుడే దీపం ఇదిగో చూడండి అన్నాడు. "సెయ్య శుడరాయానడిర్కే సూటినేన్ సొన్మాలై" చీకటి అంతా తొలగించడానికి ఇదిగో దీపం అని ఎత్తిపట్టాడు.ఆశ్చర్యం! మనం వెలిగించగలమా ఇట్లాంటి దీపాన్ని! వారు భగవత్ తత్వ సందర్శన చేయగల విశాల హృదయం కల మహనీయులు. ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం కూడా భగవన్మయమే. మనకు కనిపించే చేతన అచేతనమైన అన్నింటినీ ఆక్రమించినవాడు పరమాత్మ. 'ఈసావాస్యం ఇదగుం సర్వం ఎత్ కించ్య జగత్యాం జగత్' పరిణామశీలమైన ఈ భాహ్య ప్రకృతిలో ఉన్న ప్రతు వస్తువూ పరమాత్మచే వ్యాపింపబడే ఉంది అని ఉపనిషత్ చెబుతుంది. ఈ విషయం తెలిసిన వారు ఆయన, అందుకే ఈ భాహ్యమైన ప్రతి వస్తువూ భగవన్మయం అని చెప్పారు. భూమి ప్రమిదగా, నీల్లు నెయ్యిగా, దీపకాంతి సూర్యుడు అని మూడు తత్వాలని చెప్పాడు. భూమి, నీరు మరియూ తేజస్సు ఈ మూడింటి నుండే ఏర్పడింది ఈ విశ్వమంతా అని మనకు చందోగ్య ఉపనిషత్ చెబుతుంది. ఆ మూడింటితో దీపం వెలిగించి, భాహ్య మైన ప్రతి వస్తువూ పరమాత్మాత్మకం అని గుర్తించాడు ఒకాయన.

ఆ కాంతి సరి పోలేదు. కేవలం బయటకి కనించేవేనా పరమాత్మ సంబంధం కలవి. మనలోని జీవుడెవరు ? జ్ఞానం ఎవరు ? రెండో ఆళ్వార్ మరొక దీపం నేను వెలిగిస్తా అన్నాడు. 'అన్బే తగళయా ఆర్వమే నెయ్యాగ ఇన్బురుహు సిందయిడు తిరియా నన్బురుహు జ్ఞాన చుడర్ విళక్కేతినేన్ మాన నర్కునన్ జ్ఞాన తమిళ్పురిందనాళ్' మనలోని ప్రపంచాన్ని చూసి ఇది నాది అనే అహంకారం మనకు ఉంటుంది. ఇది పరమాత్మకు చెందినది అని చెబితేగాని ఈ అహం అణగదు. ఆందుకే 'అన్బే తగళయా' నాలోని ప్రేమనే ప్రమిదగా చేస్తున్నాను, ఆప్రేమ ఎవరిమీద అయితే పుట్టిందో వారిని పొందాలనే త్వర ఉండాలి. 'ఆర్వమే నెయ్యాగ' ఆ ఆర్తియే నెయ్యి పొస్తున్నా. ఇదివరకు స్వామి గురించి విని చేసిన చింతననే ఒత్తులుగా పెట్టి, జ్ఞానమనే దీపాన్ని వెలిగిస్తున్నా నారాయణ అనే తత్వాని కోసం అని అన్నాడు.  విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఒకే తత్వం దాని పేరు నారాయణ. మనకు నారములు అని పేరు. చేతన అచేతనమైన వస్తువులన్నింటికీ నారములు అని పేరు. 'ర' అంటే నశించేది అని అర్థం. 'నర' అంటే నశించనివి అని అర్థం. ఇవి ఎప్పటికీ నశించవు, వాటి ఆకృతి మారుతుంది తప్ప. ఈ నారములన్నింటికి లోన బయట ఉండి ఆధారం అయిన తత్వమే నారాయణ అని అంటాం. మంత్ర పుష్పం ఇదే చెబుతుంది 'అంతర్ బహిశ్య తత్ సర్వం వ్యాప్య నారాయణ స్తితః'
  

ఈ ఇద్దరు లోన బయట వ్యాపించి ఉండే నారాయణ తత్వాన్ని చూపే దీపాలని వెలిగించగానే మూడో ఆయనకి ఆ తత్వం స్పష్టంగా కనిపించింది. ఇలా ఒక్కొక్కారూ ఆ తత్వాన్ని దర్శించి ఒక్కో ధివ్య ప్రభందాన్ని అందించారు. తత్వమే వీరికోసం దిగివచ్చింది కనక వాళ్ళు చూడగలిగారు, ఆందుకే వారు ఆళ్వారులు అయ్యారు.        

శ్లో॥ భూప్రదక్షిణ షట్కేన|
కాశీయాత్రాయుతేనచ॥
సేతుస్నాన శతైర్యచ్చ|
తత్ఫలం మాతృవందనే...॥

భావం:

ఆరు పర్యాయములు భూమిని ప్రదక్షణం చేయుట, పదివేల పర్యాయములు గంగాస్నానం చేయుట, అనేక శతపర్యాయములు సేతుస్నానం చేయుటవలన కలుగు ఫలం ఒక్కసారి తల్లికి నమస్కరించడం వలన కల్గును. తల్లికి వందనం చేసిన కల్గు పుణ్యం అనంతమైనది. అందుకే "తల్లిని మించిన దైవం లేదు"అన్నారు.

THIS SPACE FOR RENT 

Rs800/- per 3years


।।మాతృస్తోత్రమ్।।

పితురప్యధికా మాతా గర్భధారణ పోషణాత్।
అతో హి త్రిషులోకేషు నాస్తి మాతృసమో గురుః।।

నవమాసాలు కని, పెంచటం వలన తండ్రి కంటే తల్లి శ్రేష్ఠమైనది.
అందువలనమూడులోకములందూకూడా తల్లిని మించిన గురువు లేదు.

నాస్తి గంగాసమం తీర్థం నాస్తి విష్ణుసమః ప్రభుః।
నాస్తి శంభుసమః పూజ్యో నాస్తి మాతృసమో గురుః।।

గంగ తో సమానమైన తీర్థము, విష్ణువుతో సమానమైన ప్రభువు,శివునితో
సమానమైనపూజ్యుడు, తల్లితో సమానమైన గురువు లేరు.

నాస్తిచైకాదశీ తుల్యం వ్రతం త్రైలోక్యవిశ్రుతమ్।
తపో నానశనాత్తుల్యం నాస్తి మాతృసమో గురుః।।

మూడులోకములందూకూడాఏకాదశీవ్రతంతో సమానమైన వ్రతం లేదు.ఉపవాసమునకు మించినతపస్సు,తల్లిని మించిన గురువు లేదు.

నాస్తి భార్యాసమం మిత్రం నాస్తి పుత్రసమః ప్రియః।
నాస్తి భగినీసమా మాన్యా నాస్తి మాత్రుసమో గురుః।।

భార్యతో సమానమైన స్నేహితురాలు, పుత్రునితో సమానమున ఇష్టుడు,సోదరితో
సమానమైన మాన్యురాలు,తల్లితో సమానమున గురువు లేరు.

న జామాత్రుసమం పాత్రం న దానం కన్యయా సమమ్।
న భ్రాత్రుసదృశోబన్ధుర్నచ మాత్రుసమో గురుః।।

అల్లునితో సమానమైన పాత్రత గలవాడు, కన్యాదానంతో సమానమైన దానము
సోదరునితో సమానమైన బంధువు, తల్లితో సమానమైన గురువు లేరు.

దేశో గంగాన్తికశ్రేష్ఠో దళేషు తులసీదళమ్।
వర్ణేషు బ్రాహ్మణః శ్రేష్ఠో గురుర్మాతా గురుష్వపి।।

గంగాతీరము, తులసీదళము,వర్ణములలో బ్రాహ్మణుడు,గురువులలో తల్లి
గొప్పవైనవి.

పురుషః పుత్రరూపేణ భార్యామాశ్రిత్య జాయతే।
పూర్వభావాశ్రయా మాతా తేన సైవ గురుః స్మృతః।।

పురుషుడు భార్యని ఆశ్రయించి పుత్రరూపంలో పుడ్తున్నాడు.తల్లియందే తండ్రి కూడా ఉంటున్నాడు కాబట్టి తల్లి శ్రేష్ఠమునది అవుతున్నది.

మాతరం పితరం చోభౌ దృష్ట్వా పుత్రస్తు ధర్మవిత్।
ప్రణమ్య మాతరం పశ్చాత్ప్రణమేత్పితరం గురుమ్।।

ధర్మముతెలిసిపుత్రుడు మదట తల్లికీ,తరువాత తండ్రికీ నమస్కరించవలెన.

మాతా ధరిత్రీ జననీ దయార్ద్రహృదయా శివా।
దేవీ త్రిభువనశ్రేష్ఠా నిర్దోషా సర్వదుఃఖహా।।

మాతా, ధరిత్రీ, జననీ, దయార్ద్రహృదయా, శివా, దేవీ, త్రిభువనశ్రేష్ఠా, నిర్దోషా,
సర్వదుఃఖహా.

ఆరాధనీయా పరమా దయా శాంతిక్షమా ధృతిః।
స్వాహా స్వధా చ గౌరీ చ పద్మా చ విజయా జయా।।

ఆరాధనీయా,వరమా,దయా,శాంతిః,క్షమా,ధృతిః,స్వాహా,స్వధా,గౌరీ,పద్మా,
విజయా, జయా.

దుఃఖహంత్రీతి నామాని మాతురేవైకవింశతిమ్।
శ్రుణుయాచ్ఛ్రావయేన్మర్త్యః సర్వదుఃఖాత్ విముచ్యతే।।

దుఃఖహంత్రీ అనేటటువంటిఇరువదిఒకటి మాత్రునామాలను ఎవరైతేవినటంగానీ,
స్తుతించటం గానీ చేస్తారో వారు అన్ని దుఃఖములనుండీ విముక్తిని పొందుతారు.

దుఃఖైర్మహద్భిర్దూనోపి దృష్ట్వా మాతరమీశ్వరమ్।
యమానందం లభేన్మర్త్యః స కిం వాచోపపద్యతే।।

ఎక్కువ కష్టాలను అనుభవిస్త్తున్న లేక సుఖంగా ఉన్నప్పటికీ ఈశ్వరస్వరూపమైన తల్లినిచూస్తే కలిగే ఆనందము వర్ణనాతీతము.

ఇతి తే కథితం విప్ర మాత్రుస్తోత్రం మహాగుణమ్।
పరాశరముఖాత్ పూర్వం ఆశ్రౌషం మాత్రు సంస్తవమ్।।

ఓ విప్రా! ఈ మాత్రుస్తోత్రాన్ని నా తండ్రియైన పరాశరుని వలన విన్నాను

సేవిత్వా పితరౌ కశ్చిత్ వ్యాధః పరమధర్మవిత్।
లేభే సర్వఙ్ఞతాం యా తు సాధ్యతే న తపస్విభిః।।

పూర్వము ధర్మవ్యాధుడు తలిదండ్రులను సేవించి తపస్సుచేత కూడా సాధ్యం కాని సర్వఙ్ఞత్వాన్ని పొందాడు.

తస్మాత్సర్వప్రయత్నేన భక్తిః కార్యాతు మాతరి।
పితర్యపీతి చోక్తం వై పిత్రా శక్తిసుతేన మే।।

అందువలన గట్టి ప్రయత్నముతోనైనా సరే తలిదండ్రులయందు భక్తిని కలిగి ఉండుము.శక్తిపుత్రుడైన పరాశరనివలన దీనిని ఉపదేశము పొందాను.

---ఇతి వ్యాసప్రోక్తం మాత్రుస్తోత్రం సంపూర్ణం.

Norway

హనుమంతుని గంధ, సింధూర విశేషం

శ్రీ రామ పాద సేవా దురంధరుడు, రామ భక్తీ సామ్రాజ్యాధిపతి అయిన శ్రీ  హనుమంతుడు అయోధ్యలో శ్రీ రామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరి పించాడు. రామ ప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు. తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారో అర్ధంకావటం లేదు. తన కంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవటానికి కారణమేమిటో ఆ ఆజన్మబ్రహ్మచారికి ఏమీ తెలియక తల్లడిల్లుతున్నాడు. జానకీ దేవి పాపిడిలో యెర్రని సిందూరపు బొట్టు కనిపిస్తోంది. ఆ యెర్రబొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమోనని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంపముంచి శ్రీరాముడిని సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతోందని భ్రమపడ్డాడు. శ్రీ రామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీ రాముడి దగ్గరకే, వెళ్లి చేతులు జోడించి "రామయ్య తండ్రీ! మా తల్లి సీతా మాత శిరస్సు మీద ఉన్న పాపిట లో సింధూరం ఉంది. దానికి కారణం ఏమిటో వివరించండి'' అని ప్రార్ధించాడు .
శ్రీ రామప్రభువు చిరునవ్వు నవ్వి, భక్త హనుమాన్ ను సమీపానికి రమ్మని "భక్తా ఆంజనేయా! సీతా దేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవటానికి కారణం ఉంది. శివ ధనుర్భంగం చేసి, జానకిని వివాహ మాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద  సింధూరాన్ని నేను ఉంచాను. అప్పటి నుండి ఆమె సింధూరాన్ని పాపిటలో ధరిస్తోంది. దాని వల్ల నేను సీతకు వశుడను అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం'' అని వివరించి చెప్పాడు .
ఆంజనేయుడు శ్రీ రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చెయ్య లేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్లి గంధ సింధూరాన్ని తీసుకొని, నువ్వుల నూనెతో కలిపి, తన ఒళ్లంతా పూసేసుకొన్నాడు. ఇలా చేస్తే  ఆ సింధూరం ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని భావించాడు. వెంటనే హుటాహుటిన శ్రీ రామ దర్శనం చేసి నమస్కరించి "ప్రభూసీతారామా! చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్లంతా సింధూరం పూసుకొన్నాను. మరి నాకు మీరు ఎప్పుడూ వశులై ఉంటారు కదా?''అని అమాయకంగా అయినా మనసులోని మాటను ధైర్యంగానే చెప్పాడు. సీతా రాముడు నవ్వి ఆనందం తో ''హనుమా! ఈ రోజు మంగళ వారం. నాకు ప్రీతీ కలిగించాలని శరీరం అంతా సింధూరాన్ని ధరించావు కనుక, నీకు మంగళవారం భక్తీతో గంధ, సింధూరంతో పూజ చేసి, దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు.'' అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పటి నుండి శ్రీ హనుమంతునికి మంగళవారం నాడు గంధ, సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకొనే ఆచారం లోకంలో ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరం అంతా పూసి ఉంచటం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాతా ఈ లేపనాన్ని పూస్తారు. సిందూర పూజ హనుమకు అత్యంత ప్రీతీకరం. అందులోను మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇదీ సింధూరం కధా విశేషం.THIS SPACE FOR RENT 

Rs800/- per 3years


THIS SPACE FOR RENT 

Rs800/- per 3years