సూర్య నమస్కారాలు

యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడూ. ఈ శ్లొకాలు వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో ఉన్నాయి.

సూర్య నమస్కారములు చేసే విధానము

సూర్య నమస్కారములు - ఒక పరిపూర్ణ యోగా సాధన

మీరు తక్కువ సమయములో ఒకే మాత్రముతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారా? అయితే దీనికి ఒక సమాధానము ఉంది. శక్తివంతమైన 12 అసనాల కుటామె సూర్యనమస్కారములు. గుండె కండరాలను శక్తివంతం చేయటానికి ఇధి మంచి సాధన (వర్కౌట్). సూర్యనమస్కారములు శరీరానికి చక్కని ఆకృతిని కలిగించి, మనస్సుకు శాంతి కలిగించి, శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.

సూర్యనమస్కారము సూర్యోదయముతో పరగడుపున (ఖాళీ కడుపుతో) చేయటం ఉత్తమం. ఆరోగ్యాన్ని కాపాడుకోటానికి ఈ తేలికపాటి ప్రభావంతమైన ఆసనాలను మొదలు పెడదాం!

ఒక సూర్యనమస్కారముల ఆవర్తు లో రెండు భాగాలు ఉంటాయి. ఈ పన్నెండు యోగాసనాలు కలిపి ఒక సూర్యనమస్కారముల ఆవర్తు అవుతుంది. ఎడమ కాలితో వేయాలి. (స్టెప్స్ 4 అండ్ 9 గివన్ బిలో)" ఇందులో (సూర్యనమస్కారములలో) మీకు అనేక తరహాలు ఉండొచ్చు కానీ, ఒకే పద్ధతిని వరుస క్రమంగా పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్య పరంగానే కాకుండా, మనము ఈ భూమి మీద జీవిస్తున్నందుకు సూర్య భగవానునికి కృతజ్ఞతా భావము తెలుపటానికి ఇది ఒక చక్కని అవకాశము. రాబోయే ఈ పది రోజులు కూడా మనకు సౌర శక్తిని ఇచ్చే సూర్యునికి కృతజ్ఞతా భావంతో నమస్కారము అంద చేద్దాం. 12 పర్యాయములు సూర్యనమస్కారములు, ఇంకా ఇతర ఆసనములు వేసిన తర్వాత యోగనిద్రలో దీర్ఘమైన విశ్రాంతి తీసుకోవాలి. మీకు ఈమాత్రం ధృఢంగా, సంతోషంగా ఇంకా శాంతిగా ఉండే అనుభూతి కలిగిస్తుంది. ఈ అనుభూతి రోజంతా అలాగే అనిపిస్తుంది.

Excel To HTML using codebeautify.org మంత్రాలు

సూర్య నమస్కారాలలో 12 మంత్రాలు ఉన్నాయి


మంత్రం చక్రం
బీజం వందనం
1 ఓం హ్రాం (ॐ ह्रां) ఓం మిత్రాయ నమ: (ॐ मित्रा नमः) అనహత
2 ఓం హ్రీం (ॐ ह्रीं) ఓం రవయే నమః (ॐ रवये नमः) విశుద్ది
3 ఓం హృం (ॐ ह्रूं) ఓం సూర్యాయ నమః (ॐ सूर्याय नमः) స్వాదిష్టాన
4 ఓం హ్రైం (ॐ ह्रैं) ఓం భానవే నమః (ॐ wभानवे नमः) అజ్ఞ
5 ఓం హ్రౌం (ॐ ह्रौं) ఓం ఖగాయ నమః (ॐ खगाय नमः) విశుద్ది
6 ఓం హ్రా: (ॐ ह्रः) ఓం పూష్ణే నమః (ॐ पूष्णे नमः) మణిపుర
7 ఓం హ్రాం (ॐ ह्रां) ఓం హిరణ్యగర్భాయ నమః 

(ॐ हिरण्यगर्भाय नमः)

స్వాదిష్టాన
8 ఓం హ్రీం (ॐ ह्रीं) ఓం మరీచయే నమః (ॐ मरीचये नमः) విశుద్ది
9 ఓం హృం (ॐ ह्रूं) ఓం ఆదిత్యాయ నమః (ॐ आदित्याय नमः) అజ్ఞ
10 ఓం హ్రైం (ॐ ह्रैं) ఓం సవిత్రే నమః (ॐ सवित्रे नमः) స్వాదిష్టాన
11 ఓం హ్రౌం (ॐ ह्रौं) ఓం అర్కాయ నమః (ॐ अर्काय नमः) విశుద్ది
12 ఓం హ్రా: (ॐ ह्रः) ఓం భాస్కరాయ నమః (ॐ भास्कराय नमः) అనహత
ఆసనం పేరు చేయు పద్దతి చిత్రం
ప్రణామాసనం (నమస్కారాసనం) నిటారుగా ప్రార్థనా భంగిమలో నిలుచుని ఉండాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసలను చేయాలి. ‘ఓం మిత్రాయ నమః ‘ అనే మంత్రాన్ని పఠించాలి . ఈ ఆసనం వల్ల మనస్సు సూర్యాభివందనాలకు అనువుగా మారుతుంది. 1
హస్త ఉత్తానాసనం శ్వాసలోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపు వెనుకకు వంచాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులైతే కొద్దిగాను, చాలాకాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగాను ఊపిరి పీల్చుకోవాలి. ‘ ఓం రవయే నమః’ మంత్రాన్ని ఉచ్చరించాలి. వెన్నెముకకు శక్తి ఇవ్వడం, దాని రుగ్మతలను నిరోధించేందుకు ఈ ఆసనం పని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం, మెటబాలిజం మెరుగుపరుస్తుంది. 2
పాదహస్తాసనం శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్ళను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలి. ‘ ఓం సూర్యాయ నమః ‘ మంత్రాన్ని జపించాలి. ఈ ఆసనం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది. మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది 3
ఆంజనేయాసనం (అశ్వ సంచలనాసనం) లోనికి శ్వాసిస్తూ కుడిపాదం వెనుక వైపునకు కదిలించాలి. అదే సమయంలో శరీరాన్ని కిందకు వంచుతూ చేతులను నేలమీదకు వంచాలి. కుడి మోకాలుని కూడా అదే సమయంలో వెనుకకు వంచాలి. తల ఎత్తి ఇంటి కప్పులపైకి చూడాలి. నేలపై రెండు చేతులను ఉంచాలి. ఈ భంగిమలో శరీరం అర్థ చంద్రాకృతిని కలిగి ఉంటుంది. ‘ ఓం భానవే నమః ‘ మంత్రం పఠించాలి. థైరాయిడ్ గ్రంథి చర్యను క్రమబద్ధం చేసేందుకు ఈ భంగిమ కీలకమైన పాత్రను కలిగి ఉంది. శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి 4
పర్వతాసనం (సంతులనాసనం) నాలుగవ స్థితి నుండి గాలి నెమ్మదిగా వదులుతూ కాలివేళ్లు నేలను తాకుతూ, ఎడమకాలిని వెనుకకు కదిలించాలి. ఇప్పుడు మోకాళ్ళు రెండు నేలకు దూరంగా ఉంచాలి. శరీరం మధ్య భాగం పైకి ఎత్తినట్లు బోర్లించిన v ఆకారంలో ఉంచాలి. శరీరం మొత్తం కాలివేళ్ల పైన అరచేతులపైన ఆధారపడి నిలవాలి. దృష్టిని మాత్రం ఎదురుగా నేలపై ఉన్న ఏదైనా వస్తువుపైన కేంద్రీకరించి ఉంచాలి. ‘ ఓం ఖగయే నమః’ ‘ మంత్రం జపించాలి. ఈ ఆసనం మణికట్టుకు బలం చేకూరుస్తుంది. మానసిక, శారీరక పుష్టి కలుగుతుంది. ఇది నడుముకు పటుత్వాన్ని ఇస్తుంది.  5
సాష్టాంగ నమస్కారం (అష్టాంగ నమస్కారం) అర చేతులను, కాలి వేళ్ళను కదిలించకుండా నేలపై ఉంచాలి. మొండాన్ని నేలపైకి నెమ్మదిగా వంచాలి. మొదటిగా మోకాళ్ళను నేలకు ఆనించాలి. తరువాత ఛాతీని, గడ్డాన్ని నేలకు తాకించాలి. ఈ భంగిమలో శరీరం అల ఆకారంలో కనిపిస్తుంది.‘ ఓం పూష్ణే నమః’ మంత్రాన్ని జపించాలి. కడుపు, కండరాలు వేలాడకుండా ఈ భంగిమ నిరోధిస్తుంది. మధుమేహం, మలబద్ధకం, జీర్ణ సమస్యల పరిష్కారంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.  6
సర్పాసనం (భుజంగాసనం) అష్టాంగ నమస్కారం వలె ఉదరం నేలకు తాకేలా ఉంచాలి. శ్వాస లోనికి పీలుస్తూ నేలపై నుండి గడ్డాన్ని, తలను పైకెత్తి చూస్తూ ఉండాలి. నడుము వెనుక ఒంపు వచ్చేలా మెడను పైకెత్తి చూస్తూ ఉండాలి., మోచేతులను శరీరానికి దగ్గరగా ఉంచాలి. ‘ ఓం హిరణ్యగర్భాయ నమః ‘ మంత్రాన్ని పఠించాలి. ఒత్తిడి, స్థూలకాయం, వెన్నెముక సమస్యలు, థైరాయిడ్ సమతుల్యం, యురోజెనిటల్ సమస్యలు – ముఖ్యంగా ఋతుక్రమ సంబంధమైన, ఋతువాగి పోవడం వలన వచ్చే సమస్యలకు ఈ భంగిమ అమోఘంగా పని చేస్తుంది.  7
పర్వతాసనం పద్మాసనంలో కూర్చునే విధంగా కూర్చుని రెండు చేతులను ఒక చోట చేర్చి చిత్రంలో చూపిన విధంగా చేతులను సాగదీస్తూ పైకి ఎత్తాలి. వెన్నెముకకు ఇది మంచి వ్యాయామం , ఫలితంగా వెన్నునొప్పులకి ఇది ఔషధంలా పని చేస్తుంది.  8
ఆంజనేయాసనం అశ్వసంచాలనాసనం :పై ఆసనాల నుండి నెమ్మదిగా కటిద్వయాన్ని కిందికి దించి కుడికాలిని కొంచెం ముందుకు తెచ్చి రెండు చేతులను నేలకు అదిమి ఉంచాలి. ఎడమ మోకాలును నెమ్మదిగా వెనక్కి చాచాలి. నెమ్మదిగా లోనికి శ్వాసిస్తూ పైకి చూస్తుంటే అర్థ చంద్రాకారం కలిగి గుఱ్ఱం ఆకారం వలె ఉంటుంది. ‘ ఓం ఆదిత్యాయ నమః’ మంత్రం స్మరణీయం. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది. 9
పాదహస్తాసనం అశ్వభంగిమ నుండి శ్వాసను విడుస్తూ ఎడమ పాదాన్ని ముందుకు చాచాలి. అప్పుడు రెండు పాదాలు ఒకే భంగిమలో ఉంటాయి. అదే సమయంలో శరీర భాగాన్ని పైకెత్తి ముందుకు నుంచునే విధంగా వంగాలి. చిత్రంలో చూసి అభ్యసించాలి. పై వివరాలే దీనికి వర్తిస్తాయి. ‘ ఓం పవిత్రే నమః ‘ మంత్రం ఉచ్ఛరించాలి. శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, టైమర్ ఎడ్రినల్, మరియు యూరో జెనిటల్ గ్రంథులు వంటివి ఉత్తేజితమవుతాయి.  10
హస్త ఉత్తానాసనం పై భంగిమ నుండి రెండు చేతులను తల పైకి ఎత్తి ఉంచాలి. అలా చేసేటప్పుడు గాఢంగా గాలిని పీల్చాలి. నడుం వెనుకభాగం వద్ద కొద్దిగా వంగాలి. ‘ ఓం ఆర్కాయ నమః ‘ మంత్రాన్ని జపించాలి. వెన్నెముకకు శక్తి ఇవ్వడం, దాని రుగ్మతలను నిరోధిస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేసే ఆలోచనల వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది. 11
ప్రణామాసనం (నమస్కారాసనం) శ్వాసను వదులుతూ రెండు అర చేతులను నమస్కార భంగిమలో ఉండేలా దగ్గరకు చేర్చి చాతీ వద్ద ఉంచాలి. దీనితో సూర్య నమస్కారాసనాలు పూర్తి అయినట్లే. ‘ ఓం భాస్కరాయ నమః ‘ జపం చెయ్యాలి. 12

Premium Double Bed Sheet With 2 Pillow Cover