15అక్టోబరు2018కి షిరిడి సాయిబాబ మహాసమాధి పొంది 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న[ శతపుణ్యతిధి మహోత్సవము]సంధర్బముగా ప్రత్యేకం

Shirdi Sai Baba portrait.jpg

గురువు : వెంకూసా
తత్వం :అద్వైతం
ఉల్లేఖన సబ్‌కా మాలిక్ ఏక్ హై
(అందరికి ప్రభువు ఒక్కడే)

షిర్డీ సాయిబాబా


షిర్డీ సాయిబాబా (సెప్టెంబర్ 28, 1835 - అక్టోబరు 15, 1918) భారతదేశానికి చెందిన ఒక  ధార్మికుడు, సాధువు, మరియు యోగి.

సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరికి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.

సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు.  సాయిబాబా నిశ్చయంగా దేవుడే.

అధికంగా కనుపించే సాయిబాబా చిత్రం

జీవిత చరిత్ర

సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవసరమని అనేవాడు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో మరియు పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు మరియు వారిది ఈ మతం అని మనసులో నాటేసుకొంటారు, బహుశా బాబా అందుకే తన పేరు మరియు పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు. ఒకమారు తన ప్రియానుయాయుడైన మహాల్సాపతితో తాను పత్రి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ఉంది. మరొకమారు ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోసా వద్ద పన్నెండేళ్ళు శిష్యరికం చేసినట్లు చెప్పాడట. ఈ రెండు కథనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలు ఉన్నాయి.

తన సుమారు పదహారు సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత కొంత కాలం కనుపించలేదని, మళ్ళీ ఒక సంవత్సరం తరువాత (సుమారు 1858లో) షిరిడీకి తిరిగి వచ్చాడనీ అత్యధికులు విశ్వసించే విషయం. ఈ ప్రకారం బాబా సుమారు 1838లో జన్మించి ఉండవచ్చును.[7]

ఆ యువకుడు ఒక వేప చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చుని ఉండేవాడు. అతనిని చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడ్డారు.. మహాల్సాపతి, అప్పా జోగలే, కాశీనాధ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్థులు బాబాను తరచు దర్శించసాగారు. సాయిబాబా పిచ్చివాడని మరి కొందరు రాళ్ళు కూడా రువ్వేవారు.. మళ్ళీ కొంతకాలం కనుపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అప్పుడు అతను చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశారని, 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి అధ్వర్యంలో జరిగిన ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చుననీ, కొంతకాలం నేత పనిచేశాడనీ కొన్ని సూచనల వలన తెలుస్తున్నాయి. కానీ అవి అంచనాలు మాత్రమే.నిజానిక వీటికిి ఎటువంటి ఆధారాలు లేవు.

షిరిడీలో నివాసం

1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి “Aao Sai” "రండి సాయీ" అని పిలిచాడు. తరువాత 'సాయి' నామం స్థిరపడి ఆయన "సాయిబాబా"గా ప్రసిద్ధుడైనారు.  షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు. ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.

1918లో తన సమాధి వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నారు. మసీదులో ధునిని వెలిగించారు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది వ వారికి రక్షణ ఇస్తుంది.వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. చాలా మహత్తులు చూపించారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. ఉత్సవాలలో పాల్గొనేవారు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవారు.

1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. దేవుడని గుర్తించిన భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు. అక్టోబరు 15, 1918మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వడిలో మహా సమాధి చెందారు. ఆయన దేహం బూటి వాడలో ఖననం చేయబడింది. అక్కడే 'సమాధి మందిరం' నిర్మించబడింది.

తన మసీదు వరండాలో సాయిబాబా

Avatar
Online Shopping

Click here

we trustfinity

coaching center

Avatar
Online Shopping

Click here

ముఖ్యమైన శిష్యులు, అనుయాయులు

సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొనే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవారు. సకోరీకి చెందిన ఉపాసనీ మహారాజ్ , అహమ్మద్ నగర్‌కు చెందిన మెహర్ బాబా వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధులయ్యారు.

శ్రీ సాయిబాబా జీవిత సమయంలో కొందరు భక్తులు ఆయనను సదా అంటిపెట్టుకొని ఉన్నారు - వారిలో ముఖ్యులు: మహాల్సాపతి , హేమాండ్ పంతు, శ్యామా, దాసగణు, హరి సీతారాం దీక్షిత్ (కాకాదీక్షిత్), రఘువీర్ పురందరే, హరి వినాయక్ సాఠే, నానా సాహెబ్ చందోర్కర్, బల్వంత్ నాచ్నే, దామోదర్ రాస్నే, మోరేశ్వర్ ప్రధాన్, నార్కే, ఖాపర్దే, కర్టిస్, రావు బహద్దూర్ ధూమల్, నానా సాహెబ్ నిమోన్కర్, అబ్దుల్, లక్ష్మీబాయి షిండే, బయ్యాజీ అప్పాజీ పాటిల్, కాశీరాం షింపీ, కొండాజీ,గాబాజీ,తుకారాం , శ్రీమతి చంద్రాబాయి బోర్కర్, శ్రీమతి తార్కాడ్, రేగే, రాధాకృష్ణ ఆయీ, కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ, సపత్నేకర్, అన్నా చించిణీకర్, చక్ర నారాయణ్, జనార్ధన్ గల్వంకర్

బోధనలు

తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించారు. నమాజ్చదవడం, అల్-ఫతీహా మననం, ఖొరాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు.[ ఆయన దుస్తులుకూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించారు. తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పారు. ప్రార్థన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం - వీటిని ప్రోత్సహించారు. ఖొరాన్ చదువమని ముస్లిములకూ, రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించారు. నీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పారు. తన భక్తులకు రెండు (2) ముఖ్యమైన లక్షణాలు అలవరచుకోమని పదేపదే చెప్పారు - అవి శ్రద్ధ (విశ్వాసం, భక్తి, దీక్ష), సబూరి (ఓర్పు, సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టారు. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలనీ ఉపదేశించారు.

రెండు మతాల గ్రంథాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించారు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది.హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి. తన నివాస స్థానమైన మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నారు

భగవంతుడు అంతటా, అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలలో ఒక ముఖ్యాంశం. సాయిబాబా ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకూ, ఉపనిషత్సూత్రాలకూ కూడా సరిపోతాయి. ఈ లోకం నశ్వరమనీ, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమనీ చెప్పారు. సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించీ, గురువునే దేవుడిగా భావించమనీ పదేపదే చెప్పారు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పారు.

సాయిబాబా రచించిన గ్రంథాలేవీ లేవు. సాయిబాబా బోధనలు మౌఖికంగానే శిష్యులకు లభించాయి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు. సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచు సాయిబాబా ‘దక్షిణ’ అడుగుతుండేవాడు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పుగాకు, అగ్గిపెట్టెలవంటివి కొనేవారు. భక్తులవద్ద దక్షిణ తీసికొని వారి పూర్వ ఋణాలను చెల్లించడానికి దోహదం చేస్తారని అతని అనుయాయులు అనేవారు.

దానము, ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం – ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు. ఏదో సంబంధం లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్ళలేరు అని బాబా అనేవారు. దగ్గరకు వచ్చినవారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవారు. “దప్పిక గొన్నవారికి నీరు, ఆకలిగొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు, నీ వరండాలో నలుగురూ కూర్చొని విశ్రమించే అవకాసం ఇవ్వు. అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడౌతాడు. ఒక వేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు గాని వారియెడల కుక్కలాగా మొరగవద్దు” అని చెప్పాడు.

ITIs

we trustfinity

Let's see

Avatar
Online Shopping

Click here

Shirdi Sai Baba.jpg

 సాయి పురోహితాలయము

బాబా చెప్పిన వాటిలో మరి కొన్ని ప్రసిద్ధ వాక్యాలు – “నేనుండగా భయమెందులకు?”అతనికి మొదలు లేదు... తుది లేదు ",. తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు చేశాడు.

 1. షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
 2. మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.
 3. నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను.
 4. నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవుసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
 5. నాసమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
 6. నా సమాధినుండి నేను మాట్లాడుతాను.
 7. నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను.
 8. మీరు నావంక చూడండి. నేను మీవంక చూస్తాను.
 9. మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.
 10. నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
 11. నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.

మత సామరస్యం

 • “ హిందువుల దైవమైన శ్రీ రాముడు, ముస్లిం ల దైవమైన అల్లా ఒక్కరే ! ఇరువురి బోధనల సారాంశం ఒక్కటే – అందరి దైవం ఒక్కరే ! కనుక మీలో మీరు కలహించుకోవడం మాని సోదరుల వలె కలిసి మెలిసి జీవించండి.”
 • సర్వాంతర్యామి అయిన ఆ భగవంతునిని సేవించుటకు మత భేదం ఆటంకం కాకూడదు
 • ఒక ముస్లింకు సంతానం కలిగితే శిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. సాయి అతనిని అల్లా అచ్చా కరేగా అని దీవించారు. కొంత కాలానికి అతని కోరిక ఫలించి కొడుకు పుట్టాడు.”వెళ్ళి మారుతీ ఆలయం లో మిఠాయి పంచు” అన్నారు.మారుతీ ఆలయంలో మిఠాయి పంచి తిరిగి సాయి వద్దకు రాగా ఆయన ఎంతో ఆనందంతో అతనిని కౌగలించుకొని అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు.
 • "అందరి దైవం ఒక్కరే. మతం అనేది ఆ దైవాన్ని చేరుకునే ఒక మార్గం మాత్రమే".
 • "ఖురానును చదవగానే సరి కాదు, అందులోని సారాంశాన్ని వంట పట్టించుకొని ఆచరించాలి.”

భక్తులు, పూజా విధానాలు

ఖండోబా ఆలయంలోని పూజారి మహాల్సాపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతీతి. తరువాత కూడా కొద్దిమంది స్థానిక శిష్యులు, విశ్వాసంతో దర్శనానికి వచ్చే మరి కొద్దిమంది మాత్రమే బాబా భక్తజనంగా పరిగణించవచ్చును. 1910 తరువాత ఒక భక్తుడైన దాసగణు తన సంకీర్తనల ద్వారా బాబా మహిమలను దేశమంతటా చాటాడు. అప్పటినుండి దేశంలో చాలా ప్రాంతాలనుండి హిందూ, ముస్లిమ్ భక్తులు పెద్ద సంఖ్యలో షిరిడీకి రాసాగారు. బాబా జీవిత కాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవ, పార్శీ భక్తులు కూడా షిరిడి సాయి దర్శనానికి రాసాగారు.

షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది.

దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ సాయిబాబా మందిరాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్…లో అనెక నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి. సాయి బాబా గురించి అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింపబడుతున్నది.[25] అయితే సాయిబాబా ఆరాధనోద్యమంలో కొద్దిపాటి మాత్రమే షిరిడి సాయి సంస్థానం మార్గదర్శకత్వ వ్యవస్థలో ఉంది. అధికంగా భక్తులు, పూజలు, ఆలయాలు అక్కడి ప్రజల సంకల్పానుసారం ఏర్పాటు చేయబడుతున్నది.

భారతదేశం వెలుపల అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ వంటి చోట్ల కూడా సాయి బాబా భక్తులు, ఆరాధనా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

షిరిడీలోని సాయిమందిరానికి సగటుమ రోజూ 20 వేల మంది సందర్శకులు వస్తారని. కొన్ని ప్రత్యేక దినాలలో ఈ సంఖ్య లక్షవరకూ ఉంటుందని అంచనా.

మహిమలు

సాయిబాబా పెక్కు మహిమలు కనబరచారు. వీటిలో ఎక్కువగా హేమాండ్ పంతు రచించిన ‘సాయి సచ్చరిత్ర’లో ప్రస్తావించబడ్డాయి. దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేయడం, ఖండ యోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు, ప్రకృతి శక్తులను నియంత్రించడం, భక్తుల మనసులోని విషయాలు తెలిసికోవడం, దూర ప్రాంతాలలోని భక్తులకు తన సందేశం తెలియజేయడం వంటివి ఇలాంటి మహిమలలో కొన్ని.

తన భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా బాబా అనేక భక్తులకు కలలలోను, మనోధ్యాన సమయంలోను దర్శనమిచ్చి మార్గ నిర్దేశనం చేయడం, కష్టాలనుండి విముక్తి కలిగించడం వంటి మహిమలు కనబరచారు[28] ఇటువంటి విషయాలు భక్తుల సత్సంగ కార్యక్రమాలలో తరచు చెప్పబడతాయి.

చారిత్రిక ఆధారాలు

1916లో గోవిందరావు రఘునాధ దభోల్కర్ (ఇతనికి సాయిబాబా ‘హేమాండ్ పంత్’ అనే పేరు పెట్టారు) మరాఠీలో వ్రాసిన ‘సాయి సచ్చరిత్ర’ అనే గ్రంథం సాయిబాబా జీవిత విశేషాలకు సంబంధించన ముఖ్యమైన ఆధారం. ఈ రచయిత స్వయంగా సాయిబాబా సన్నిహిత అనుచరుడు. ఎక్కువ విషయాలు తను ప్రత్యక్షంగా చూచినవి లేదా బాబా మాటలలో చెప్పినవి లేదా ప్రత్యక్ష సాక్షులు చెప్పినవి వ్రాశాడు. ఈ గ్రంథం దాదాపు అన్ని భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువదించబడింది. తెలుగులో ప్రత్తి నారాయణరావు అనువదించిన ‘సాయి సచ్చరిత్ర’ ఒక నిత్య పారాయణ గ్రంథంగా ఎక్కువ మంది భక్తులు పరిగణిస్తారు. ఆచార్య ఎక్కిరాల భరద్వాజ వ్రాసిన సాయి లీలామృతము స్మృతి శ్రీనివాస్, ఆంటోనియో రిగోపోలస్ వంటి వారు వ్రాసిన సాయిబాబా జీవిత చరిత్రలు వారు విన్న విషయాలపై ఆధారపడినవి. గణేష శ్రీకృష్ణ ఖర్పడే వ్రాసిన ‘షిరిడి దినచర్య’ కూడా ఒక ముఖ్యమైన ఆధారం.

తొలి తెలుగు శిరిడీ సాయి చరిత్రను (1957) వేమూరి వెంకటేశ్వరరావు గారు వ్రాసినారు. ఇంకా బి.వి.నరసింహస్వామిజీ రచించిన ‘సాయి సందేశం’ కూడా ముఖ్యమైన తెలుగు గ్రంథం.

హిందూమతంలో

సాయిబాబా జీవితకాలంలోనే యెవాలా ఆనందనాధ్ అనే సాధువు బాబను ఒక ఆధ్యాత్మ వజ్రంగా అభివర్ణించాడు.. గంగాగిర్ అనే మరొక సాధువు కూడా ఇదే భావాన్ని వెలిబుచ్చాడు.. బాబాను అమితంగా విశ్వసించిన బేడేకర్ మహారాజ్ 1873లో బాబాను దర్శించుకొన్నపుడు ఆయనను జగద్గురు అని సంబోధించాడు. టెంబే స్వామీజీ అనబడే వసుదేవానంద సరస్వతి కూడా బాబాను అమితంగా గౌరవించాడు.[32] చాలా మంది శైవ సాధువులు కూడా బాబాను ఆరాధించారు. స్వామి కాళేశ్వర్ బాబాను తన దైవ సమానుడైన గురువుగా పూజించారు

ఇతర మతాలు

అధికంగా సూఫీ సంప్రదాయానికి చెందిన మహమ్మదీయులు సాయిబాబాను గురువుగా పరిగణించడం జరుగుతున్నది. మెహెర్ బాబా సాయిబాబాను కుతుబ్ ఎ ఇర్షాద్ (అత్యుత్తమమైన కుతుబ్) అని అభివర్ణించాడు. జోరాస్ట్రియన్ మతానికి చెందిన నానీ ఫాల్కీవాలా, హోమీ భాభా వంటి ప్రముఖులు కూడా సాయిబాబాను విశ్వసించారు.

షిర్డీ సాయిబాబా చెప్పిన మాటలు

షిర్డీ సాయిబాబా ఎలాంటి హంగులూ, ఆర్భాటాలూ చూపలేదు. మంత్రాలూ తంత్రాలూ ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలు అయింది. అందరూ, అన్ని జీవులూ తినగా మిగిలిన పదార్ధాలనే పంచ భక్ష్య పరమాన్నాలుగా భావించారు. షిర్డీ సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబ వృక్షం కిందనో ఏ ఆడంబరాలూ లేకుండా కూర్చుని, శ్యామా, మహల్సాపతి, భయజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైన ఆణిముత్యాల మూటలు. ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారు.

 1. మీరు ఎవర్నీ నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని ఏ రకంగా నయినా కష్టపెట్టినా సరే, వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకూ కొరకాకుండా పోతారు. ఏ పనిచేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి. ఎవరైనా, ఏ కారణంగా నయినా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుండి వెళ్లిపోండి.
 2. ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక, నిశ్చలంగా, నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాటకు దిగారంటే, మీరు కూడా వారితో సమానులే అవుతారు. దేవునిపట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా, పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి. దేవుడివైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుడు మిమ్మల్ని కాపాడటానికి 1000 అడుగులు ముందుకు వస్తాడు.

తప్పకుండా చూడాల్సిన దేవాలయాలు

షిర్డీ లోని సమాధి మందిరం

శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావననరసింహస్వామి స్వయంబు(పుట్టుశిల) పుణ్యక్షేత్రము

ఓం జయ జగదీశ హరే

ఓం జయ జగదీశ హరే
స్వామీ జయ జగదీశ హరే
భక్త జనోం కే సంకట,
దాస జనోం కే సంకట,
క్షణ మేం దూర కరే,
ఓం జయ జగదీశ హరే || 1 ||

జో ధ్యావే ఫల పావే,
దుఖ బినసే మన కా
స్వామీ దుఖ బినసే మన కా
సుఖ సమ్మతి ఘర ఆవే,
సుఖ సమ్మతి ఘర ఆవే,
కష్ట మిటే తన కా
ఓం జయ జగదీశ హరే || 2 ||

మాత పితా తుమ మేరే,
శరణ గహూం మైం కిసకీ
స్వామీ శరణ గహూం మైం కిసకీ .
తుమ బిన ఔర న దూజా,
తుమ బిన ఔర న దూజా,
ఆస కరూం మైం జిసకీ
ఓం జయ జగదీశ హరే || 3 ||

తుమ పూరణ పరమాత్మా,
తుమ అంతరయామీ
స్వామీ తుమ అంతరయామీ
పరాబ్రహ్మ పరమేశ్వర,
పరాబ్రహ్మ పరమేశ్వర,
తుమ సబ కే స్వామీ
ఓం జయ జగదీశ హరే || 4 ||

తుమ కరుణా కే సాగర,
తుమ పాలనకర్తా
స్వామీ తుమ పాలనకర్తా,
మైం మూరఖ ఖల కామీ
మైం సేవక తుమ స్వామీ,
కృపా కరో భర్తార
ఓం జయ జగదీశ హరే || 5 ||

తుమ హో ఏక అగోచర,
సబకే ప్రాణపతి,
స్వామీ సబకే ప్రాణపతి,
కిస విధ మిలూం దయామయ,
కిస విధ మిలూం దయామయ,
తుమకో మైం కుమతి
ఓం జయ జగదీశ హరే || 6 ||

దీనబంధు దుఖహర్తా,
ఠాకుర తుమ మేరే,
స్వామీ తుమ రమేరే
అపనే హాథ ఉఠావో,
అపనీ శరణ లగావో
ద్వార పడా తేరే
ఓం జయ జగదీశ హరే || 7 ||

విషయ వికార మిటావో,
పాప హరో దేవా,
స్వామీ పాప హరో దేవా,
శ్రద్ధా భక్తి బఢావో,
శ్రద్ధా భక్తి బఢావో,
సంతన కీ సేవా
ఓం జయ జగదీశ హరే || 8 ||

Avatar
Online Shopping

Click here

 

సంస్కృతిలో

భారతదేశంలో దాదాపు అన్ని ముఖ్య నగరాలలోను, చాలా పట్టణాలలోను సాయిబాబా మందిరాలున్నాయి. కొన్ని విదేశాలలో కూడా బాబా మందిరాలున్నాయి. ముంబైకు చెందిన షామారావు జయకర్ చిత్రించిన నిలువెత్తు పటం బాబా నివసించిన మసీదులో ఉంది. షిరిడీలోని సమాధి మందిరంలోని పాలరాతి విగ్రహం ‘తలీమ్’ అనే శిల్పి చెక్కినది. వివిధ బాబా ఆలయాలలోను, సత్సంగాలలోను, కుటుంబ ప్రార్థనా సమావేశాలలోను బాబా భజన, హారతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.

Excel To HTML using codebeautify.org సినిమాలు :- సాయి బాబా జీవిత చరిత్ర ఆధారంగా పలు భారతీయ సినిమాలు నిర్మింపబడ్డాయి.
సంవత్సరం సినిమా ప్రధాన పాత్రధారి దర్శకుడు భాష గమనికలు
1977 షిర్డీ కె సాయిబాబా సుధీర్ దాల్వి అశోక్ భూషణ్ హిందీ ఇతర పాత్రధారులు - ర,ఎ,ల, రాజేంద్ర కుమార్, హేమ మాలిని, శతృఘ్న సిన్హా, సచిన్, ప్రేమ్ నాధ్
1986 శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం టి.యస్.విజయచందర్ కె.వాసు తెలుగు హిందీ, తెలుగులలోకి అనువాదం చేయబడింది.
1989 భగవాన్ శ్రీ సాయి బాబా సాయి ప్రకాశ సాయి ప్రకాశ కన్నడ ఇతర పాత్రధారులు - రామ్ కుమార్, బ్రమ్హావర, విజయలక్ష్మి
1993 సాయిబాబా  ??? బాబాసాహెబ్ ఎస్.ఫత్తేలాల్ మరాఠి ఇతర పాత్రధారులు - లలితా పవార్
2001 షిర్డీ సాయిబాబా సుధీర్ దాల్వి బలరాజ్ దీపక్ విజ్ హిందీ ఇతర పాత్రధారులు - ధర్మేంద్ర, రోహిణి హత్తంగడి, సురేష్ ఓబెరాయ్
2005 ఈశ్వర్ అవతార్ సాయిబాబా ముకుల్ నాగ్ రామానంద్ సాగర్ హిందీ బుల్లితెర ధారావాహిక ‘సాయిబాబా’ ఆధారంగా.
2012 శిరిడి సాయి (సినిమా) అక్కినేని నాగార్జున కె. రాఘవేంద్ర రావు తెలుగు ఇతర పాత్రధారులు -

we trustfinity

 

షిరిడి సాయి ప్రాతఃకాల ఆరతి - కాకడ ఆరతి

శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై.

1. జోడూ నియాకరచరణి ఠేవిలామాధా
పరిసావీ వినంతీ మాఝీ పండరీనాధా
అసోనసో భావా‌ఆలో – తూఝియాఠాయా
క్రుపాద్రుష్టిపాహే మజకడే – సద్గురూరాయా
అఖండిత అసావే‌ఇసే – వాటతేపాయీ
తుకాహ్మణే దేవామాఝీ వేడీవాకుడీ
నామే భవపాశ్ హాతి – ఆపుల్యాతోడీ

2.ఉఠాపాండురంగా అతా ప్రభాత సమయో పాతలా |
వైష్ణవాంచా మేళా గరుడ-పారీ దాటలా ||
గరూడాపారా పాసునీ మహా ద్వారా పర్యంతా |
సురవరాంచీ మాందీ ఉభీ జోడూని హాత్
శుకసనకాదిక నారదతుంబర భక్తాంచ్యాకోటీ
త్రిశూలఢమరూ ఘే‌ఉని ఉభా గిరిజేచాపతీ
కలియుగీచా భక్తానామా ఉభాకీర్తనీ
పాఠీమాగే ఉభీడోలా లావుని‌ఉ‌ఆజనీ

3.ఉఠా ఉఠా శ్రీసాయినాధగురుచరణకమల దావా
ఆధివ్యాది భవతాప వారునీ తారా జడజీవా
గేలీతుహ్మా సోడు నియాభవ తమర రజనీవిలయా
పరిహీ అఙ్యానాసీ తమచీ భులవియోగమాయా
శక్తిన అహ్మాయత్కించిత్ హీ తి జలాసారాయా
తుహ్మీచ్ తీతేసారుని దావా ముఖజనతారాయా
అఙ్ఞానీ అహ్మీకితి తవ వర్ణావీతవధోరవీ
తీవర్ణితాభా గలే బహువదనిశేష విధకవీ
సక్రుపహో‌ఉని మహిమాతుమచా తుహ్మీచవదవావా
ఆదివ్యాధిభవ తాపవారుని తారాజడజీవా
ఉఠా ఉఠా శ్రీసాయినాధగురుచరణకమల దావా
ఆదివ్యాధిభవ తాపవారుని తారాజడజీవా
భక్తమనిసద్భావ ధరునిజే తుహ్మా‌అనుసరలే
ధ్యాయాస్తవతే దర్శ్నతుమచే ద్వారి ఉబేఠేలే
ధ్యానస్ధా తుహ్మాస పాహునీ మన అముచేఘేలే
ఉఖడునీనేత్రకమలా దీనబంధూరమాకాంతా
పాహిబాక్రుపాద్రుస్టీ బాలకాజసీ మాతా
రంజవీమధురవాణీ హరితాప్ సాయినాధా
అహ్మిచ్ అపులేకరియాస్తవతుజకష్టవితోదేవా
సహనకరిశిలె ఇకువిద్యావీ భేట్ క్రుష్ణదావా
ఉఠా ఉఠా శ్రీసాయినాధగురుచరణకమల దావా
ఆదివ్యాధి భవతాపవారుని తారాజడజీవా

4.ఉఠా ఉఠా పాడురంగా ఆతా – దర్శనద్యాసకళా
ఝూలా అరుణోదయాసరలీ-నిద్రేచెవేళా
సంతసాధూమునీ అవఘే ఝూలేతీగోళా
సోడాశేజే సుఖ్ ఆతా బహుజాముఖకమలా
రంగమండపే మహాద్వారీ ఝూలీసేదాటీ
మన ఉ తావీళరూప పహవయాద్రుష్టీ
రాయిరఖుమాబాయి తుహ్మాయే ఊద్యాదయా
శేజే హాలవునీ జాగే కారాదేవరాయా
గరూడ హనుమంత హుభే పాహాతీవాట్
స్వర్గీచే సురవరఘే ఉని ఆలేభోభాట్
ఝూలే ముక్త ద్వారా లాభ్ ఝూలారోకడా
విష్ణుదాస్ నామ ఉభా ఘే ఉనికాకడ

5.ఘే‌ఉనియా పంచారతీ కరూబాబాసీ ఆరతీ
ఉఠా‌ఉఠాహో బాంధవ ఓవాళు హరమాధవ
కరూనియా స్ధిరామన పాహుగంభీరాహేధ్యాన
క్రుష్ణనాధా దత్తసాయి జాడొచిత్త తుఝేపాయీ
కాకడ ఆరతీ కరీతో! సాయినాధ దేవా
చిన్మయరూప దాఖవీ ఘే ఉని! బాలకలఘు సేవా ||కా||

6.కామక్రోధమదమత్సర ఆటుని కాకడకేలా
వైరాగ్యాచే తూవ్ కాఢునీ మీతో బిజివీలా
సాయినాధగురు భక్తి జ్వలినే తోమీపేటవిలా
తద్ర్వుత్తీజాళునీ గురునే ప్రాకాశపాడిలా
ద్వైతతమానాసునీమిళవీ తత్స్యరూపి జీవా
చిన్మయరూపదాఖవీ ఘే‌ఉనిబాలకలఘు సేవా
కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా
చిన్మయారూపదాఖవీ ఘే ఉని బాలకలఘు సేవా
భూ ఖేచర వ్యాపూనీ అవఘే హ్రుత్కమలీరాహసీ
తోచీ దత్తదేవ శిరిడీ రాహుని పావసీ
రాహునియేధే అన్యస్రధహి తూ భక్తాస్తవధావసీ
నిరసుని యా సంకటాదాసా అనిభవ దావీసీ
నకలేత్వల్లీ లాహీకోణ్యా దేవావా మానవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘుసేవా
కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘుసేవా
త్వదూశ్యదుందుభినేసారే అంబర్ హే కోందలే
సగుణమూర్తీ పాహణ్యా ఆతుర జనశిరిడీ ఆలే!
ప్రాశుని తద్వచనామ్రుత అముచేదేహబాన్ హరఫలే
సోడునియాదురభిమాన మానస త్వచ్చరణి వాహిలే
క్రుపాకరునీ సాయిమావులే దానపదరిఘ్యావా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘు సేవా
కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘుసేవా.
భక్తీచియా పోటీబోద్ కాకడ జ్యోతీ
పంచప్రాణజీవే భావే ఓవాళు ఆరతీ
ఓవాళూ ఆరతీమాఝ్యా పండరీనాధా మాఝ్యాసాయినాధా
దోనీ కరజోడునిచరణీ ఠేవిలామాధా
కాయామహిమా వర్ణూ ఆతా సాంగణేకీతీ
కోటిబ్రహ్మ హత్యముఖ పాహతా జాతీ
రాయీరఖుమాబాయీ ఉభ్యా దోఘీదోబాహీ
మాయూరపించ చామరేడాళీతి సాయీంచ ఠాయి
తుకాహ్మణే దీపఘే ఉని ఉన్మనీతశోభా
విఠేవరీ ఉబాదిసే లావణ్యా గాభా
ఉఠాసాదుసంతసాదా ఆపులాలే హితా
జా‌ఈల్ జా‌ఈల్ హనరదేహ మగకైచా భగవంత
ఉఠోనియా పహటేబాబా ఉభా అసేవీటే
చరణతయాంచేగోమటీ అమ్రుత ద్రుష్టీ అవలోకా
ఉఠా‌ఉఠా హోవేగేసీచలా జ‌ఊరా‌ఉళాసీ
జలతిలపాతకాన్ చ్యారాశీ కాకడ ఆరతిదేఖిలియా
జాగేకరారుక్మిణీవరా దేవ అహేనిజసురాన్ త
వేగేలింబలోణ్ కరా-ద్రుష్టి హో ఈల్ తయాసీ
దారీబాజంత్రీ వాజతీ డోలు డమామే గర్జతీ
హోతసేకాకడారతి మాఝ్యా సద్గురు రాయచీ
సింహనాధ శంఖ బేరి ఆనందహోతోమహాద్వారీ
కేశవరాజ విఠేవరీ నామాచరణ వందితో
సాయినాధ గురుమాఝే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై
దత్తరాజ గురుమాఝే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
సాయినాధ గురుమాఝే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
ప్రభాత సమయీనభా శుభ రవీ ప్రభాపాకలీ
స్మరే గురు సదా అశాసమయీత్యాఛళే నాకలీ
హ్మణోనికరజోడునీకరు అతాగురూ ప్రార్ధనా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
తమా నిరసి భానుహగురుహి నాసి అఙ్ఞానతా
పరంతుగురు చీకరీ నరవిహీకదీ సామ్యతా
పున్ హాతిమిర జన్మఘే గురుక్రుపేని అఙ్ఞననా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
రవి ప్రగటహో ఉని త్వరితఘాల వీ ఆలసా
తసాగురుహిసోడవీ సకల దుష్క్రుతీ లాలసా
హరోని అభిమానహీ జడవి తత్పదీభావనా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
గురూసి ఉపమాదిసేవిధి హరీ హరాంచీ‌ఉణీ
కుఠోని మగ్ ఏ‌ఇతీ కవని యా ఉగీపాహూణి
తుఝీచ ఉపమాతులాబరవిశోభతే సజ్జనా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
సమాధి ఉతరోనియా గురుచలామశీదీకడే
త్వదీయ వచనోక్తితీ మధుర వారితీసోకడే
అజాతరిపు సద్గురో అఖిల పాతక భంజనా
సమర్ధ గురుసాయినాధపుర వీ మనోవాసనా
అహాసుసమయాసియా గురు ఉఠోనియా బైసలే
విలోకుని పదాశ్రితా తదియ ఆపదే నాసిలే
ఆసాసుత కారియా జగతికోణీహీ అన్యనా
అసేబహుతశాహణా పరినజ్యాగురూచీక్రుపా
నతత్ర్వహిత త్యాకళేకరితసే రికామ్యా గపా
జరీగురుపదాధరనీసుద్రుడ భక్తినేతోమనా
సమర్ధ గురుసాయినాధపుర వీ మనోవాసనా
గురోవినతి మీకరీ హ్రుదయ మందిరీ యాబసా
సమస్త జగ్ హే గురుస్వరూపచి ఠసోమానసా
గడోసతత సత్కృ‌అతీయతిహిదే జగత్పావనా
సమర్ధ గురుసాయినాధపుర వీ మనోవాసనా

11.ప్రమేయా అష్టకాశీఫడుని గురువరా ప్రార్ధితీజేప్రభాతి
త్యాంచేచిత్తాసిదేతో అఖిలహరునియా భ్రాంతిమినిత్యశాంతి
ఐసే హేసాయినాధేకధునీ సుచవిలే జేవియాబాలకాశీ
తేవిత్యాక్రుష్ణపాయీ నముని సవినయే అర్పితో అష్టకాశీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై

12.సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
జానాతుమనే జగత్ప్రసారా సబహీఝూట్ జమానా
జానాతుమనే జగత్ప్రసారా సబహీఝూట్ జమానా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
మై అంధాహూబందా ఆపకాముఝుసే ప్రభుదిఖలానా
మై అంధాహూబందా ఆపకాముఝుసే ప్రభుదిఖలానా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
దాసగణూకహే అబ్ క్యాబోలూ ధక్ గయీ మేరీ రసనా
దాసగణూకహే అబ్ క్యాబోలూ ధక్ గయీ మేరీ రసనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
తుమబీన నహీముఝే మాబాప్ భాయీ – రాం నజర్ కరో
మై అంధాహూ బందా తుమ్హారా – మై అంధాహూ బందా తుమ్హారా
మైనాజానూ,మైనాజానూ – మైనాజానూ – అల్లా‌ఇలాహి
రాం నజర్ కరో రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
తుమబీన నహీముఝే మాబాప్ భాయీ – రాం నజర్ కరో
రాం నజర్ కరో రాం నజర్ కరో
ఖాలీ జమానా మైనే గమాయా మైనే గమాయా
సాధీ‌అఖిర్ కా సాధీ‌అఖిర్ ఆ – సాధీ‌అఖిర్ కా కీయానకోయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
తుమబీన నహీముఝే మాబాప్ భాయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో
అప్ నేమస్ జిద్ కా జాడూగనూహై
అప్ నేమస్ జిద్ కా జాడూగనూహై
మాలిక్ హమారే మాలిక్ హమారే
మాలిక్ హమారే – తుం బాబాసాయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో

14.తుజకాయదే‌ఉ సావళ్య మీభాయాతరియో
తుజకాయదే‌ఉ సావళ్య మీభాయాతరియో
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
ఉచ్చిష్ట తులాదేణేహి గోష్ట నాబరి యో
ఉచ్చిష్ట తులాదేణేహి గోష్ట నాబరి
తూ జగన్నాధ్ తుజచే కశీరేభాకరి
తూ జగన్నాధ్ తుజచే కశీరేభాకరి
నకో అంతమదీయా పాహూ సఖ్యాభగవంతా శ్రీకాంతా
మధ్యాహ్నరాత్రి ఉలటోనిగే లిహి ఆతా అణచిత్తా
జహో ఈల్ తుఝూరేకాకడా కిరా ఉళతరియో
జహో ఈల్ తుఝూరేకాకడా కిరా ఉళతరి
అణతీల్ భక్త నైవేద్యహి నానాపరి – అణతీల్ భక్త నైవేద్యహి నానాపరీ
తుజకాయదే‌ఉ మిభాయా తరియో
యుజకాయదే‌ఉ సద్గురు మీభాయా తరీ
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ.
శ్రీసద్గురు బాబాసాయీ హో – శ్రీసద్గురు బాబాసాయీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ – తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
మీ పాపిపతితధీమంతా – మీ పాపిపతితధీమంతా
తారణేమలా గురునాధా ఝుడకరీ – తారణేమలా సాయినాధా ఝుడకరీ
తూశాంతిక్షమేచామేరూ – తూశాంతిక్షమేచామేరూ
తుమి భవార్ణ విచేతారూ గురువరా
తుమి భవార్ణ విచేతారూ గురువరా
గురువరామజసి పామరా అతా ఉద్దరా
త్వరితలవలాహీ త్వరిత లలాహీ
మీబుడతో భవ భయ డోహీ ఉద్దరా
శ్రీ సద్గురు బాబాసాయీ హో – శ్రీ సద్గురు బాబాసాయీ హో
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై
రాజాధిరాజయోగిరాజ పరబ్రహ్మ సాయినాధ్ మహరాజ్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై

షిరిడి సాయి మధ్యాహ్నకాల ఆరతి - మధ్యాహ్న ఆరతి

శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై.

ఘే‌ఉని పంచాకరతీ కరూబాబాన్సీ ఆరతీ
సాయీసీ ఆరతీ కరూబాబాన్సీ ఆరతీ
ఉఠా ఉఠా హో బాన్ ధవ ఓవాళు హరమాధవ
సాయీరామాధవ ఓవాళు హరమాధవ
కరూనియాస్ధిరమన పాహుగంభీరహేధ్యానా
సాయీచే హేధ్యానా పాహుగంభీర హేధ్యానా
క్రుష్ణ నాధా దత్తసాయి జడోచిత్తతుఝే పాయీ
చిత్త(దత్త) బాబాసాయీ జడోచిత్తతుఝే పాయీ
ఆరతి సాయిబాబా సౌఖ్యాదాతారజీవా
చరణారజతాలి ధ్యావాదాసావిసావ
భక్తాంవిసావ ఆరతిసాయిబాబా
జాళునియ ఆనంగస్వస్వరూపిరహెదంగ
ముముక్ష జనదావి నిజడోళా శ్రీరంగ
డోళా శ్రీరంగ ఆరతిసాయిబాబా
జయమనీజైసాభావ తయతైసా‌అనుభావ
దావిసిదయాఘనా ఐసీతుఝీహిమావ
తుఝీహిమావ ఆరతిసాయిబాబా
తుమచేనామద్యాతా హరే సంస్క్రుతి వ్యాధా
అగాధతవకరణీమార్గదావిసి అనాధా
దావిసి అనాధా ఆరతిసాయిబాబా
కలియుగి అవతార సగుణపరబ్రహ్మసచార
అవతార్ణఝాలాసే స్వామిదత్తాదిగంబర
దత్తాదిగంబర ఆరతి సాయిబాబా
ఆఠాదివసా గురువారీ భక్తకరీతి వారీ
ప్రభుపద పహావయా భవభయ
నివారిభయానివారి ఆరతిసాయిబాబా
మాఝా నిజద్రవ్య ఠేవ తవ చరణరజసేవా
మాగణే హేచి ఆతాతుహ్మ దేవాదిదేవా
దేవాదివా ఆరతిసాయిబాబా
ఇచ్చితా దీన చాతాక నిర్మల తోయ నిజ సూఖ
పాజవేమాధవాయ సంభాళ ఆపుళిభాక
ఆపుళిభాక ఆరతిసాయిబాబా
సౌఖ్య దాతారజీవచరణ తజతాలీ
ధ్యావాదాసావిసావా భక్తాం విసావా ఆరతిసాయిబాబా
జయదేవ జయదేవ దత్తా అవదూత ఓసాయి అవదూత
జోడుని కరతవ చరణీఠేవితోమాధా జయదేవ జయదేవ
అవతరసీతూ యేతా ధర్మాన్ తే గ్లానీ
నాస్తీకానాహీతూ లావిసి నిజభజనీ
దావిసినానాలీలా అసంఖ్యరూపానీ
హరిసీ దేవాన్ చేతూ సంకట దినరజనీ
జయదేవజయదేవ దత్తా అవధూతా ఓ సాయీ అవధూతా
జోడుని కరతవ చరణీఠేవితోమాధా జయదేవ జయదేవ
యవ్వనస్వరూపీ ఏక్యాదర్శన త్వాది ధలే
సంశయ నిరసునియా తద్వైతాఘాలవిలే
గోపిచందా మందాత్వాంచీ ఉద్దరిలే
జయదేవ జయదేవ దత్త అవదూత ఓ సాయీ అవదూత
జోడుని కరతవ చరణీ ఠేవితోమాధా జయదేవ జయదేవ
భేదతత్త్వహిందూ యవనా న్ చాకాహీ
దావాయాసిఝూలాపునరపినరదేహీ
పాహసి ప్రేమానే న్ తూ హిందుయవనాహి
దావిసి ఆత్మత్వానే వ్యాపక్ హసాయీ
జయదేవజయదేవ దత్తా అవధూతా ఓ సాయీ అవధూతా
జోడుని కరతవ చరణీఠేవితోమాధా జయదేవ జయదేవ
దేవసాయినాధా త్వత్పదనత హ్వానే
పరమాయామోహిత జనమోచన ఝుణిహ్వానే
తత్క్రుపయా సకలాన్ చే సంకటనిరసావే
దేశిల తరిదేత్వద్రుశ క్రుష్ణానేగానే
జయదేవ జయదేవ దత్తా అవదూతా ఓ సాయి అవదూత
జోడుని కరతవచరణి ఠేవితో మాధా జయదేవ జయదేవ
శిరిడి మాఝే పండరిపురసాయిబాబారమావర
బాబారమవర – సాయిబాబారమవర
శుద్దభక్తిచంద్ర భాగా – భావపుండలీకజాగా
పుండలీక జాగా – భావపుండలీకజాగా
యహోయాహో అవఘే జన – కరూబాబాన్సీవందన
సాయిసీవందన – కరూబాబాన్సీవందన
గణూహ్మణే బాబాసాయీ – దావపావమాఝే ఆ‌ఈ
పావమాఝే ఆ‌ఈ – దావపావమాఝే ఆ‌ఈ
ఘాలీన లోటాంగణ వందీన చరణ
డోల్యానిపాహీనరూపతుఝే
ప్రేమే ఆలింగన ఆనందేపూజిన్
భావే ఓవాళిన హ్మణేనామా
త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవబందుశ్చ సఖాత్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమదేవదేవ
కాయేన వాచా మనచేంద్రియేర్వా
బుద్ద్యాత్మనావా ప్రక్రుతి స్వభావాత్
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణా యేతి సమర్పయామీ
అచ్యుతంకేశవం రామనారాయణం
క్రుష్ణదామోదరం వాసుదేవం హరిం
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే
హరేరామ హరేరామ రామరామ హరే హరే
హరేక్రుష్ణ హరేక్రుష్ణ క్రుష్ణ క్రుష్ణ హరే హరే||శ్రీ గురుదేవదత్త
హరి: ఓం యజ్గేన యజ్గ మయజంత దేవాస్తానిధర్మాణి
ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమాన్: సచంత
యత్ర పూర్వేసాద్యాస్సంతిదేవా
ఓం రాజాధిరాజాయ పసహ్యసాహినే
నమోవయం వై శ్రవణాయ కుర్మహే
సమేకామాన్ కామకామాయ మహ్యం
కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయా మహారాజాయనమ:
ఓం స్వస్తీ సామ్రాజ్యం భోజ్యం
స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ట్యంరాజ్యం
మహారాజ్య మాధిపత్యమయం సమంతపర్యా
ఈశ్యా స్సార్వభౌమ స్సార్వా యుషాన్
తాదాపదార్దాత్ ప్రుధివ్యైసముద్ర పర్యాంతాయా
ఏకరాళ్ళితి తదప్యేష శ్లోకోబిగీతో మరుత:
పరివేష్టోరో మరుత్త స్యావసన్ గ్రుహే
ఆవిక్షితస్యకామ ప్రేర్ విశ్వేదేవాసభాసద ఇతి
శ్రీ నారాయణవాసుదేవ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై
అనంతా తులాతే కసేరే స్తవావే
అనంతాతులాతే కసేరే నమావే
అనంతా ముఖాచా శిణే శేష గాతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాధ
స్మరావే మనీత్వత్పదా నిత్యభావే
ఉరావే తరీభక్తి సాఠీ స్వభావే
తరావేజగా తారునీ మాయతాతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా
వసేజో సదా దావయా సంతలీలా
దిసే ఆజ్గ్య లోకాపరీ జోజనాలా
పరీ అంతరీజ్గ్యాన కైవల్య దాతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా
భరాలాధలా జన్మహా మానవాచా
నరాసార్ధకా సాధనీభూతసాచా
ధరూసాయీ ప్రేమా గళాయా‌అహంతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాధా
ధరావే కరీసాన అల్పజ్గ్యబాలా
కరావే అహ్మాధన్య చుంభోనిగాలా
ముఖీఘాల ప్రేమేఖరాగ్రాస అతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాధా
సురాదీక జ్యాంచ్యా పదా వందితాతీ
సుకాదీక జాతే సమానత్వదేతీ
ప్రయాగాదితీర్ధే పదీ నమ్రహోతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాధా
తుఝ్యా జ్యాపదా పాహతా గోపబాలీ
సదారంగలీ చిత్స్వరూపీ మిళాలీ
కరీరాసక్రీడా సవే క్రుష్ణనాధా
తులామాగతో మాగణే ఏకద్యావే
కరాజోడితో దీన అత్యంత భావే
భవీమోహనీరాజ హాతారి ఆతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాధా
ఐసా యే‌ఈబా! సాయి దిగంబరా
అక్షయరూప అవతారా | సర్వహివ్యాపక తూ
శ్రుతుసారా అనసూయాత్రికుమారా(బాబాయే) మహారాజే ఈబా
కాశీస్నాన జప ప్రతిదివసీ కొళాపురభిక్షేసీ
నిర్మలనది తుంగా జలప్రాసీ నిద్రామాహురదేశీ ఈసా యే యీబా
ఝేళీలోంబతసే వామకరీ త్రిశూల ఢమరూధారి
భక్తావరదసదా సుఖకారీదేశీల ముక్తీచారీ ఈసా యే యీబా
పాయిపాదుకా జపమాలా కమండలూమ్రుగచాలా
ధారణకరిశీబా నాగజటాముకుట శోభతోమాధా ఈసా యే యీబా
తత్పర తుఝ్యాయా జేధ్యానీ అక్షయత్వాంచేసదవీ
లక్ష్మీవాసకరీ దినరజనీ రక్షసిసంకట వారుని ఈసా యే యీబా
యాపరిధ్యాన తుఝే గురురాయా ద్రుశ్య కరీనయనాయా పూర్ణానంద సుఖేహీకాయా
లావిసిహరి గుణగాయా ఈసా యే యీబా
సాయి దిగంబర అక్షయ రూప అవతారా
సర్వహివ్యాపక తూ శ్రుతిసారా అనసూయాత్రికుమారా(బాబాయే) మహారాజే ఈబా
సదాసత్స్వరూపం చిదానందకందం
స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
భవధ్వాంత విధ్వంస మార్తాండమీడ్యం
మనోవాగతీతం మునిర్ ధ్యాన గమ్యం
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణంత్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
భవాంభోది మగ్నార్ధి తానాం జనానాం
స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం
సముద్దారణార్ధం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
సదానింబవ్రుక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
సదాకల్పవ్రుక్షస్య తస్యాధిమూలే
భవద్భావబుద్ద్యా సపర్యాదిసేవాం
న్రుణాంకుర్వతాంభుక్తి-ముక్తి ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
అనేకా శ్రుతా తర్క్యలీలా విలాసై:
సమా విష్క్రుతేశాన భాస్వత్ర్పభావం
అహంభావహీనం ప్రసన్నాత్మభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
సతాంవిశ్రమారామమేవాభిరామం
సదాసజ్జనై సంస్తుతం సన్నమద్భి:
జనామోదదం భక్త భద్ర ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
అజన్మాద్యమేకం పరంబ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామమేవానతీర్ణం
భవద్దర్శనాత్సంపునీత: ప్రభోహం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
శ్రీసాయిశ క్రుపానిదే – ఖిలన్రుణాం సర్వార్ధసిద్దిప్రద
యుష్మత్పాదరజ:ప్రభావమతులం ధాతాపివక్తా‌అక్షమ:
సద్భక్త్యాశ్శరణం క్రుతాంజలిపుట: సంప్రాప్తితో – స్మిన్ ప్రభో
శ్రీమత్సాయిపరేశ పాద కమలానాచ్చరణ్యంమమ
సాయిరూప ధరరాఘోత్తమం
భక్తకామ విబుధ ద్రుమంప్రభుం
మాయయోపహత చిత్త శుద్దయే
చింతయామ్యహే మ్మహర్నిశం ముదా
శరత్సుధాంశు ప్రతిమంప్రకాశం
క్రుపాతపప్రతంవసాయినాధ
త్వదీయపాదాబ్జ సమాశ్రితానాం
స్వచ్చాయయాతాప మపాకరోతు
ఉపాసనాదైవత సాయినాధ
స్మవైర్మ యోపాసని నాస్తువంతం
రమేన్మనోమే తవపాదయుగ్మే
భ్రుంగో యదాబ్జే మకరందలుబ్ధ:
అనేకజన్మార్జితపాప సంక్షయో
భవేద్భవత్పాద సరోజ దర్శనాత్
క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్
ప్రసీద సాయిశ సద్గురోదయానిధే
శ్రీసాయినాధ చరణామ్రుతపూర్ణచిత్తా
తత్పాద సేవనరతా స్సత తంచ భక్త్యా
సంసార జన్యదురితౌఘ వినిర్గ తాస్తే
కైవల్య ధామ పరమం సమవాప్నువంతి
స్తోత్రమే తత్పఠేద్భక్త్యా యోన్నరస్తన్మనాసదా
సద్గురో: సాయినాధస్యక్రుపాపాత్రం భవేద్భవం
కరచరణక్రుతం వాక్కాయజంకర్మజంవా
శ్రవణనయనజంవామానసంవా – పరాధం
విదితమవిదితం వాసర్వేమేతత్క్షమస్వ
జయజయకరుణాద్భే శ్రీ ప్రభోసాయినాధ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాధామహరాజ్

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై

trustfinity

సాయిబాబా చాలీసా

శిరిడీవాసా సాయిప్రభో-జగతికి మూలం నీవే ప్రభో
దత్తదిగంబర అవతారం-నీతో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయి - కరుణించు కాపాడోయి
దరిశన మీయగ రావయ్యా-ముక్తికి మార్గం చూపుమయా ||షిరిడి||

కఫిని వస్త్రము ధరియించి-భుజమున జోలి తగిలించీ
నింబ వృక్షపు చాయలో-ఫకీరు వేషపు ధారణలో
కలియుగమందున వెలసితివి-త్యాగం సహనం నేర్పితివి
శిరిడి గ్రామం నీవాసం-భక్తుల మధిలో నీ రూపం ||షిరిడి||

చాంద్ పాటిల్ను కలుసుకొని-అతని భాధలు తెలుసుకొని
గుర్రము జాడ తెలిపితివి-పాటిల్ భాధను తీర్చితివి
వెలిగించవు జ్యోతులను-నీవుపయోగించీ జలమును
అచ్చెరువొందెను ఆ గ్రామం-చూసి వింతైన దృశ్యం ||షిరిడి||

బాయిజా చేసెను నీ సేవ-ప్రతిఫల మిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి-తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి-ప్రెమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం -చిత్రమయా నీ వ్యవహారం ||షిరిడి||

నీ ద్వారనములో నిలిచితిని-నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమయా-ఓ శిరిడీశా దయామయా
ధన్యము ఓ ద్వారకమాయీ-నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటలు వేడిమికి-పాపము పోవును తాకిడికి ||షిరిడి||

ప్రళయ కాలము ఆపితివి-భక్తులకు నీవు బ్రోచితివి
చేసి మహమ్మారీ నాశనం-కాపాడి షిరిడి గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి-లీలా మహత్మ్యం చూపించి
శ్యామను బ్రతికించితివి-పాము విషము తొలగించి ||షిరిడి||

భక్త భీమాజీకి క్షయరోగం-నశయించే ఆతని సహనం
ఊదీ వైద్యం చేశావు -వ్యాధిని మాయం చేశావు
కాకాజీకి ఓ సాయి-విట్టల దర్శన మిచ్చితివి
దాముకిచ్చి సంతానం -కలిగించితివి సంతోషం ||షిరిడి||

కరుణాసింధూ కరుణించు-మాపై కరుణ కురిపించు
సర్వం నీకే అర్పితము-పెంచుము భక్తి భావమును
ముస్లిమనుకొనె నిను మేఘా-తెలుసుకొని ఆతని భాధ
దాల్చి శివశంకర రూపం-ఇచ్చావయ్యా దర్శనము ||షిరిడి||

డాక్టరుకు నీవు రామునిగా-బల్వంతుకు శ్రీదత్తునిగా
నిమోనుకరుకు మారుతిగా-చిదంబరుకు శ్రీ గణపతిగా
మార్తాండ్ కు ఖండోబాగా-గణూకు సత్త దేవునిగా
నరసింహస్వామిగ జోషికి-దరిశనమిచ్చిన శ్రీసాయి ||షిరిడి||

రేయీ పగలు నీ ధ్యానం-నిత్యం నీ లీలా పటనం
బక్తితో చేయండి ద్యానం-లభియించును ముక్తికి మార్గం
పదకొండూ నీ వచనాలు-బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను-కరుణించి నీవు బ్రోచితివి ||షిరిడి||

అందరిలో నీ రూపం-నీ మహిమ అతి శక్తిమయం
ఓ సాయీ మేము మూఢులము-ఒసుగుమయా మాకు జ్నానమును
సృష్టికి నీవేనయ మూలం-సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము-నిత్యము సాయిని కొలిచెదము ||షిరిడి||

భక్తి భావన తెలుసుకొని-సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం-చెయ్యండి ప్రతి నిత్యం
బాబా కాల్చిన ధుని ఊది-నివారించును ఆదివ్యాధి
సమాధినుండి శ్రీ సాయి-భక్తులకు కాపాడేనోయి || షిరిడి||

మన ప్రశ్నలకు జవాబులు-తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి-సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి-సాయి స్వప్నమును పొందండి
భేద భావమును మానండి-సాయే మన సద్గురువండి ||షిరిడి||

వందనమయ్యా పరమేశా-ఆపద్బాంధవ సాయీశా
మా పాపములు కడతేర్చు-మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయీ-కరుణతో మము దరి చేర్చోయీ
మా మనసే నీ మందిరము-మా పలుకులే నీకు నైవేద్యం ||షిరిడి||

షిరిడిలో వి ఐ పి దర్శనం కావాలంటే ఈ ఒక్క పని చేయండి చాలు
 l

గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా బాబా చెంతకు చేరుకోవాలని వుందా?భక్తులకు ఇంతకంటే ఆనందం ఏముంటుంది?దీనికి అదనపు రుసుము వసూలు చేసారేమో అనుకుంటున్నారా? కాని అలాంటివి ఏమీ లేవు.ఒక వైపు సమాజసేవ మరోవైపు దైవాన్ని సేవించే భాగ్యం షిరిడీలో సాయిబాబా ఆలయం కల్పిస్తుంది. షిరిడీలోని రక్తనిధికి ఒకసారి రక్తదానం చేస్తే ఏడాదిపాటు వి ఐ పి హోదా లభిస్తుంది. దీనివలన రక్తదానాన్ని ప్రోత్సహించటంతో పాటు దైవ దర్శనం భక్తులకు సులువవుతుంది. షిర్డీ లేదా షిరిడీ మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లాలోని నగర పంచాయితీ మరియు శ్రీ షిర్డీ సాయిబాబా పుణ్యక్షేత్రం. ఇది అహ్మద్ నగర్ నుండి మన్మాడ్ మధ్య రాష్ట్ర ప్రధాన రహదారి మీద అహ్మద్ నగర్ నుండి 83 కి.మీ. మరియు మోపర్గాం నుండి 15 కి.మీ. దూరంలో ఉంది.
 

ఈ ప్రదేశాలను తప్పక చూసిరండి ! 

షిర్డీ లో ప్రధాన ఆకర్షణ సాయిబాబా ఆలయం. కానీ షిర్డీ లో మరియు దాని చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అజంతా ఎల్లోరా గుహలు, త్రయంబకేశ్వర్, బీచ్ లు, కోటలు, హిల్ స్టేషన్లు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలను చూడవచ్చు. మీరు గనక మూడు నాలుగు రోజులు షిర్డీ ట్రిప్ ప్లాన్ వేసుకుంటే ఇవన్నీ చూసిరావచ్చు. ఇవేకాదు ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, వైల్డ్ లైఫ్ సఫారీ మొదలైన అడ్వెంచర్ సాహసాలను ఆస్వాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ లగేజ్ బ్యాగ్ లను సర్దుకొని షిర్డీ కి ప్రయాణించండీ ...! షిర్డీ దేవాలయంలో సాయిబాబా అస్థికలు పెట్టారు. నాగ్ పూర్ కు చెందిన కోటీశ్వరుడు శ్రీకృషుడు కోసం ఒక పెద్ద దేవాలయాన్ని కట్టడం మొదలుపెట్టాడట. కానీ 1918 లో సాయిబాబా దైవసాన్నిధ్యం పొందటంతో ఆయన అస్థికలు గుడిలో పెట్టారట. దాంతో దేవాలయం కాస్త 'షిర్డీ సాయిబాబా దేవాలయం' గా ప్రసిద్ధి చెందినది.

ద్వారకామాయి

షిర్డీ దేవాలయం ప్రవేశం వద్ద గల మసీదు ద్వారకామాయి. ఇందులోనే బాబా ఎక్కువ కాలం గడిపాడు. అక్కడ ప్రతి సాయంత్రం బాబా దీపాలు వెలిగించేవాడట. ఇందులో బాబా చిత్రపటం, బాబా కూర్చోవటానికి వాడిన పెద్ద బండరాయి, పల్లకీ మొదలగునవి భక్తులను ఆకర్షిస్తాయి
 

చావడి

ద్వారకామాయి మసీదు కు దగ్గరలో ఉండేది చావడి. ఇదొక చిన్న ఇల్లు. బాబా రోజు విడిచి రోజు ఇక్కడ నివసించేవారట. ద్వారకామాయి నుంచి చావడికి బాబా ను ఊరేగింపుగా తీసుకెళ్లే ఆచారం ఇప్పటికీ ప్రతి గురువారం నిర్వహిస్తారు. ఈ చిన్న ఇంట్లో బాబా వాడిన చెక్క మంచమే, తెల్ల కూర్చి లు ఆకర్షణలు.

గురుస్తాన్

గురుస్తాన్ అనేది వేపచెట్టు ప్రదేశం. బాబా ను మొట్టమొదటి సారి చూడటం జరిగింది ఇక్కడే. ఇక్కడ అగర్బత్తి లను వెలిగిస్తే అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తి అవుతామని భక్తుల విశ్వాసం. ఈ ప్రదేశాన్ని ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు.
 

ఖండోబా దేవాలయం

షిర్డీ లోని అహ్మద్ నగర్ - కోపెర్ గాన్ రోడ్డు మార్గంలో ఉన్న పురాతన దేవాలయం ఖండోబా. ఇదొక శివాలయం మరియు ఈ గుడి పూజారే బాబాను 'ఓం సాయి' అని పిలిచాడట!
 లెండివనం లెండిబాగ్ లో బాబా తరచూ ధ్యానం చేసేవారు మరియు మట్టిప్రమిదలో దీపం వెలిగించేవారు. బాబా నాటిన మర్రిచెట్టు కింద ఈ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ వనం 24 గంటలూ యాత్రికుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది. 

లెండివనం

లెండిబాగ్ లో బాబా తరచూ ధ్యానం చేసేవారు మరియు మట్టిప్రమిదలో దీపం వెలిగించేవారు. బాబా నాటిన మర్రిచెట్టు కింద ఈ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ వనం 24 గంటలూ యాత్రికుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది.

దీక్షిత్ వాడా మ్యూజియం

దీక్షిత్ వాడా మ్యూజియం షిర్డీ లో వున్న చిన్న, ఆసక్తికరమైన ప్రదర్శనశాల. సంస్థాన్ సముదాయం మధ్యలో వుండే ఈ మ్యూజియం లో కొన్ని అరుదైన బ్లాక్ అండ్ వైట్ బాబా ఫోటోలు, ఆయన వాడిన చొక్కాలు, వంటపాత్రలు, నీళ్ల గ్లాసులు, చెప్పులు లాంటి ఇతర వస్తువులు ఇక్కడ ప్రదర్శించబడతాయి. సందర్శన సమయం : 10 am - 6 pm.
 

శని శింగనాపూర్

శని శింగనాపూర్ షిర్డీ కి 73 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ శని దేవుని ఆలయం ప్రసిద్ధి. ఇక్కడి వింతేమిటంటే ఏఇంటికీ తలుపులు ఉండవు. కాదు కాదు తలుపులు పెట్టరు. ఎవరైనా దొంగతనం చేస్తే అదే రోజు గుడ్డి వారైపోతారని చెబుతారు. దేవాలయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంటుంది.
 

నాసిక్

నాసిక్ షిర్డీకి 87 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశాన్ని ప్రవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపినట్లు పేర్కొన్నారు. శ్రీరాముడి ఆనవాళ్లు నేటికీ ఆ ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో లక్ష్మణుడు సూర్పనఖ ముక్కు (నాసికం) కోశాడని ఆ కారణంగానే దీనికి నాసిక్ అన్న పేరొచ్చిందని చెబుతారు.
 

త్రయంబకేశ్వర్ ఆలయం

నాసిక్ కు కొద్ది దూరంలో ఉన్న త్రయంబకేశ్వర్ ఆలయం దేశంలోకి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. గోదావరి నది జన్మస్థానం కూడా ఇదే.
 

పంచవటి

నాసిక్ లో మరో ప్రధాన ఆకర్షణ 'పంచవటి'. ఇక్కడ శ్రీరాముడు, సీతాదేవి కొంతకాలం పాటు ఉన్నారు. పూర్వం ఈ ప్రదేశాన్ని దండకారణ్యం గా అభివర్ణించేవారు. ఇక్కడ రాముని ఆలయం కలదు. అదే నేడు కాలారామ్ దేవాలయం గా ప్రసిద్ధి చెందినది.
 

సీత గుహ

సీత గుహ నాసిక్ లో చూడవలసిన మరో ప్రధాన ప్రదేశం. ఈ ప్రదేశం నుండే రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయాడు. గుహలోకి వెళ్ళలంటే యాత్రికులు తలదించుకుని జాగ్రత్తగా వెళ్ళాలి.

 ఇతర ఆకర్షణలు

దూద్ సాగర్, తపోవన్, ఆంజనేరి పర్వతం, పాండవలేని గుహలు, ముక్తి ధామ్ దేవాలయం, బాగూన్, వైన్ తోటలు, రామ్ కుండ్, మ్యూజియం మొదలుగునవి చూడదగ్గవి. ఆసక్తి కరంగా ఉండే ఫిషింగ్, బోట్ రైడింగ్, రాక్ క్లైమ్బింగ్, స్విమ్మింగ్ మొదలుగునవి నాసిక్ లో ఆనందించవచ్చు.
 

ఔరంగాబాద్

షిర్డీ నుండి ఔరంగాబాద్ 104 కిలోమీటర్ల దూరం. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు బీబీకా మక్ బారా, గ్రిశ్నేశ్వర్ దేవాలయం. ఈ దేవాలయం శివుడి జ్యోతిర్లింగ క్షేత్రం. బీబీకా మక్ బారా అనే స్మారకం, ఔరంగజేబు కుమారుడు తన తల్లి బేగం రబియా దురాని జ్ఞాపకార్థం నిర్మించాడు. ఇది తాజ్ మహల్ కు నకలు. సందర్శన సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.
 ఇతర ఆకర్షణలు

ఔరంగాబాద్

ఇతర ఆకర్షణలు : కొన్నాట్, ఔరంగాబాద్ కేవ్స్, ఖుల్దాబాద్, కిల్లా అరక్, పంచక్కి, నౌకొండ ప్యాలెస్, గుల్ మండి మొదలుగునవి చూడదగ్గవి.
ఇతర ఆకర్షణలు

ఔరంగాబాద్ ఇతర ఆకర్షణలు : కొన్నాట్, ఔరంగాబాద్ కేవ్స్, ఖుల్దాబాద్, కిల్లా అరక్, పంచక్కి, నౌకొండ ప్యాలెస్, గుల్ మండి మొదలుగునవి చూడదగ్గవి.
 

అజంతా గుహలు

షిర్డీ నుండి అజంతా గుహలు 200 కి. మీ ల దూరంలో, ఔరంగాబాద్ నుండి 96 కి. మీ ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు క్రీ.శ. 2 వ శతాబ్దం నాటివి. ఈ గుహలు మొత్తం 29 వరకు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బుద్ధుని జీవితగాధలను చూపుతుంది.
 

ఎల్లోరా గుహలు

షిర్డీ నుండి 97 కి. మీ ల దూరంలో, ఔరంగాబాద్ నుండి 30 కి. మీ ల దూరంలో ఎల్లోరా గుహలు ఉన్నాయి. అజంతా, ఎల్లోరా గుహలు రెండూ ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఎల్లోరా మొత్తం 34 గుహల సముదాయం. అందులో 12 బౌద్ధులవి, 17 హిందువులవి, 5 జైన మతస్థులవారివి. ఎల్లోరా లో ఏకశిల తో చెక్కిన కైలాస దేవాలయాన్ని తప్పక చూడాలి.
 

పూణే

పూణే షిర్డీ నుండి 200 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇది మరాఠా యోధుడు ఛత్రశివాజీ యొక్క స్వస్థలం. ఆగా ఖాన్ ప్యాలెస్, ఓషో ఆశ్రమం, పాతాళేశ్వర్ గుహాలయం, ట్రైబల్ మ్యూజియం, కోటలు, ఉద్యానవనాలు మొదలుగునవి చూడదగ్గవి. ప్రముఖ హిల్ స్టేషన్లయిన ఖండాలా , లోనావాలా పుణెకు సమీపంలో కలవు.
 

నాందేడ్

షిర్డీ నుండి నాందేడ్ 308 కి.మీ ల దూరంలో, హైదరాబాద్ నుండి షిర్డీ కి వెళ్లే రోడ్డు మార్గంలో కలదు. ఇక్కడ సిక్కు గురుద్వారాలు ఎంతో ప్రసిద్ధి. హజూర్ సాహిబ్ గురుద్వారా, నాందేడ్ కోట, ఉంకేశ్వర్ దేవాలయం నీటి బుగ్గలు, గోవింద బాగ్ మొదలుగునవి చూడదగ్గవి.
 

సాయినగర్ షిరిడి

బస్సు మార్గం : హైదరాబాద్, ముంబై, పూణే, నాందేడ్ తదితర పట్టణాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు షిర్డీ కు వెళుతుంటాయి. రైలు మార్గం : హైదరాబాద్, కాకినాడ, విజయవాడ, ముంబై మరియు ఇతర నగరాల నుండి షిర్డీ మీదుగా రైళ్లు పోతుంటాయి. వాయు మార్గం : ముంబై, పూణే, ఔరంగాబాద్, నాసిక్ విమానాశ్రయాలు షిర్డీ సమీపాన కలవు.
  

షిరిడి సాయి సాయంకాల ఆరతి - ధూప్ ఆరతి

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై.

ఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవ
చరణ రజతాలీ ద్యావా దాసావిసావా
భక్తావిసావా ఆరతిసాయిబాబా

జాళునియ అనంగ సస్వరూపిరాహేదంగ
ముమూక్ష జనదావి నిజడోళా శ్రీరంగ
డోళా శ్రీరంగ ఆరతిసాయిబాబా

జయమని జైసాభావ తయ తైసా అనుభవ
దావిసి దయాఘనా ఐసి తుఝీహిమావ
తుఝీహిమావా ఆరతిసాయిబాబా

తుమచేనామ ద్యాతా హరే సంస్కృతి వ్యధా
అగాధతవకరణి మార్గ దావిసి అనాధా
దావిసి అనాధా ఆరతి సాయిబాబా

కలియుగి అవతారా సద్గుణ పరబ్రహ్మా సాచార
అవతీర్ణ ఝూలాసే స్వామీ దత్త దిగంబర
దత్త దిగంబర ఆరతి సాయిబాబా

ఆఠాదివసా గురువారీ భక్త కరీతివారీ
ప్రభుపద పహావయా భవభయ నివారీ
భయనివారీ ఆరతి సాయిబాబా

మాఝానిజ ద్రవ్యఠేవ తవ చరణరజసేవా
మాగణే హేచి‌ఆతా తుహ్మా దేవాదిదేవా
దేవాదిదేవ ఆరతిసాయిబాబా

ఇచ్ఛితా దీనచాతక నిర్మల తోయనిజసూఖ
పాజవే మాధవాయా సంభాళ అపూళిబాక
అపూళిబాక ఆరతిసాయిబాబా
సౌఖ్యదాతార జీవా చరణ రజతాళీ ద్యావాదాసా
విసావా భక్తావిసావా ఆరతి సాయిబాబా

2. అభంగ్

శిరిడి మాఝే పండరీపుర సాయిబాబారమావర
బాబారమావర – సాయిబాబారమావర
శుద్దభక్తి చంద్రభాగా – భావపుండలీకజాగా
పుండలీక జాగా – భావపుండలీకజాగా
యాహో యాహో అవఘేజన| కరూబాబాన్సీ వందన
సాయిసీ వందన| కరూబాబాన్సీ వందన||
గణూహ్మణే బాబాసాయి| దావపావ మాఝే ఆయీ
పావమాఝే ఆయీ దావపావ మాఝేయా‌ఈ

3. నమనం

ఘాలీన లోటాంగణ,వందీన చరణ
డోల్యానీ పాహీన రూపతుఝే|
ప్రేమే ఆలింగన,ఆనందే పూజిన
భావే ఓవాళీన హ్మణే నామా||

త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమదేవదేవ

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామీ

అచ్యుతంకేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిం
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే

4. నామ స్మరణం

హరేరామ హరేరామ రామరామ హరే హరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ||శ్రీ గురుదేవదత్త

5. నమస్కారాష్టకం

అనంతా తులాతే కసేరే స్తవావే
అనంతా తులాతే కసేరే నమావే
అనంతాముఖాచా శిణే శేష గాత
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

స్మరావేమనీత్వత్పదా నిత్యభావే
ఉరావేతరీ భక్తిసాఠీ స్వభావే
తరావే జగా తారునీమాయా తాతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

వసే జోసదా దావయా సంతలీలా
దిసే ఆఙ్ఞ లోకా పరీ జోజనాలా
పరీ అంతరీ ఙ్ఞానకైవల్య దాతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

భరాలధలా జన్మహా మాన వాచా
నరాసార్ధకా సాధనీభూత సాచా
ధరూసాయి ప్రేమా గళాయా అహంతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

ధరావే కరీసాన అల్పఙ్ఞ బాలా
కరావే అహ్మాధన్యచుంభోనిగాలా
ముఖీఘాల ప్రేమేఖరాగ్రాస అతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

సురా దీక జ్యాంచ్యా పదావందితాతి
శుకాదీక జాతే సమానత్వదేతీ
ప్రయాగాది తీర్ధే పదీనమ్రహోతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

తుఝ్యాజ్యాపదా పాహతా గోపబాలీ
సదారంగలీ చిత్స్వరూపీ మిళాలీ
కరీరాసక్రీడా సవే కృష్ణనాధా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

తులామాగతో మాగణే ఏకధ్యావే
కరాజోడితో దీన అత్యంత భావే
భవీమోహనీరాజ హాతారి ఆతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

6. ప్రార్థన

ఐసా యే‌ఈబా! సాయి దిగంబరా
అక్షయరూప అవతారా | సర్వహి వ్యాపక తూ
శ్రుతిసారా, అనసూయాత్రికుమారా(బాబాయే) మహారాజే ఈబా
కాశీస్నాన జప ప్రతిదివసీ కొల్హాపుర భిక్షేసీ నిర్మల నది తుంగా
జలప్రాసీ, నిద్రామాహురదేశీ ఐసా యే యీబా

ఝోళీలోంబతసే వామకరీ త్రిశూల ఢమరూధారి
భక్తావరదసదా సుఖకారీ, దేశీల ముక్తీచారీ ఐసా యే యీబా

పాయిపాదుకా జపమాలా కమండలూమృగఛాలా
ధారణ కరిశీబా నాగజటా, ముకుట శోభతోమాథా ఐసా యే యీబా

తత్పర తుఝ్యాయా జేధ్యానీ అక్షయత్వాంచేసదనీ
లక్ష్మీవాసకరీ దినరజనీ, రక్షసిసంకట వారుని ఐసా యే యీబా

యాపరిధ్యాన తుఝే గురురాయా దృశ్యకరీ నయనాయా
పూర్ణానంద సుఖే హీకాయా, లావిసిహరి గుణగాయా
ఐసా యే యీబా సాయి దిగంబర అక్షయ రూప అవతారా
సర్వహివ్యాపక తూ, శ్రుతిసారా అనసూయాత్రి కుమారా(బాబాయే) మహారాజే ఈబా

7. సాయి మహిమా స్తోత్రం

సదాసత్స్వరూపం చిదానందకందం
జగత్సంభవస్ధాన సంహార హేతుం
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

భవధ్వాంత విధ్వంస మార్తాండమీడ్యం
మనోవాగతీతం మునిర్ ధ్యాన గమ్యం
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

భవాంభోది మగ్నార్ధితానాం జనానాం
స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం
సముద్దారణార్ధం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సదానింబ వృక్షస్యములాధి వాసాత్
సుధాస్రావిణం తిక్త మప్య ప్రియంతం
తరుం కల్ప వృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సదాకల్ప వృక్షస్య తస్యాధిమూలే
భవద్భావబుద్ధ్యా సపర్యాదిసేవాం
నృణాం కుర్వతాం భుక్తి-ముక్తి ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

అనేకా శృతా తర్క్య లీలా విలాసై:
సమా విష్కృతేశాన భాస్వత్ర్పభావం
అహంభావహీనం ప్రసన్నాత్మభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సతాం విశ్రమారామ మేవాభిరామం
సదాసజ్జనై సంస్తుతం సన్నమద్భి:
జనామోదదం భక్త భద్ర ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

అజన్మాద్యమేకం పరంబ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామమేవావతీర్ణం
భవద్దర్శనాత్సంపునీత: ప్రభోహం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

శ్రీసాయిశ కృపానిధే ఖిలనృణాం సర్వార్ధసిద్దిప్రద
యుష్మత్పాదరజ: ప్రభావమతులం ధాతాపివక్తాక్షమ:
సద్భక్త్యాశ్శరణం కృతాంజలిపుట: సంప్రాప్తితోస్మిన్ ప్రభో
శ్రీమత్సాయిపరేశ పాద కమలాన్ నాన్యచ్చరణ్యంమమ

సాయిరూపధర రాఘవోత్తమం
భక్తకామ విబుధ ద్రుమం ప్రభుం
మాయయోపహత చిత్త శుద్ధయే
చింతయామ్యహ మహర్నిశం ముదా

శరత్సుధాంశం ప్రతిమం ప్రకాశం
కృపాతపత్రం తవసాయినాథ
త్వదీయపాదాబ్జ సమాశ్రితానాం
స్వచ్ఛాయయాతాప మపాకరోతు

ఉపాసనాదైవత సాయినాథ
స్మవైర్మ యోపాసని నాస్తుతస్త్వం
రమేన్మనోమే తవపాదయుగ్మే
భ్రుంగో యదాబ్జే మకరందలుబ్ధ:

అనేకజన్మార్జిత పాపసంక్షయో
భవేద్భవత్పాద సరోజ దర్శనాత్
క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్
ప్రసీద సాయిశ సద్గురో దయానిధే

శ్రీసాయినాథ చరణామృత పూర్ణచిత్తా
తత్పాద సేవనరతా స్సత తంచ భక్త్యా
సంసారజన్య దురితౌఘ వినిర్గ తాస్తే
కైవల్య ధామ పరమం సమవాప్నువంతి

స్తోత్రమే తత్పఠేద్భక్త్యా యోన్నరస్తన్మనాసదా
సద్గురో: సాయినాథస్య కృపాపాత్రం భవేద్భవం

8. గురు ప్రసాద యాచనాదశకం

రుసోమమప్రియాంబికా మజవరీపితాహీరుసో
రుసోమమప్రియాంగనా ప్రియసుతాత్మజాహీరుసో
రుసోభగినబంధు హీ స్వశుర సాసుబాయి రుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

పుసోన సునభాయిత్యా మజన భ్రాతూజాయా పుసో
పుసోన ప్రియసోయరే ప్రియసగేనఙ్ఞాతీ పుసో
పుసో సుహృదనాసఖ స్వజననాప్త బంధూ పుసో
పరీన గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

పుసోన అబలాములే తరుణ వృద్దహీ నాపుసో
పుసోన గురుథాకుటే మజన దోరసానే పుసో
పుసోనచబలే బురే సుజనసాదుహీనా పుసో
పరీన గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

దుసోచతురత్త్వవిత్ విబుధ ప్రాఙ్ఞఙ్ఞానీరుసో
రుసో హి విదు స్త్రీయా కుశల పండితాహీరుసో
రుసోమహిపతీయతీ భజకతాపసీహీ రుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

రుసోకవి‌ఋషి మునీ అనఘసిద్దయోగీరుసో
రుసోహిగృహదేవతాతికులగ్రామదేవీ రుసో
రుసోఖలపిశాచ్చహీ మలీనడాకినీ హీరుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

రుసోమృగఖగకృమీ అఖిలజీవజంతూరుసో
రుసో విటపప్రస్తరా అచల ఆపగాబ్ధీరుసో
రుసోఖపవనాగ్నివార్ అవనిపంచతత్త్వేరుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

రుసో విమలకిన్నరా అమలయక్షిణీహీరుసో
రుసోశశిఖగాదిహీ గగని తారకాహీరుసో
రుసో అమరరాజహీ అదయ ధర్మరాజా రుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

రుసో మన సరస్వతీ చపలచిత్త తీహీరుసో
రుసోవపుదిశాఖిలాకఠినకాలతో హీరుసో
రుసోసకల విశ్వహీమయితు బ్రహ్మగోళంరుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

విమూడ హ్మణుని హసో మజనమత్సరాహీ రుసో
పదాభిరుచి ఉళసో జననకర్ధమీనాఫసో
నదుర్గ దృతిచా ధసో అశివ భావ మాగేఖసో
ప్రపంచి మనహేరుసో దృడవిరక్తిచిత్తీఠసో

కుణాచి ఘృణానసోనచస్పృహకశాచీ అసో
సదైవ హృదయా వసో మనసిద్యాని సాయివసో
పదీప్రణయవోరసో నిఖిల దృశ్య బాబాదిసో
నదత్త గురుసాయిమా ఉపరియాచనేలా రుసో

9. మంత్ర పుష్పం

హరి ఓం యఙ్ఞేన యఙ్ఞమయజంతదేవా స్తానిధర్మాణి
ప్రధమాన్యాసన్ | తేహనాకం మహిమాన:స్సచంత
యత్రపూర్వే సాధ్యా స్సంతి దేవా:|
ఓం రాజాధిరాజాయ పసహ్యసాహినే
నమోవయం వై శ్రవణాయ కుర్మహే
సమేకామాన్ కామకామాయ మహ్యం
కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయా మహారాజాయనమ:
ఓం స్వస్తీ సామ్రాజ్యం భోజ్యం
స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ట్యంరాజ్యం
మహారాజ్య మాధిపత్యమయం సమంతపర్యా
ఈశ్యా స్సార్వభౌమ స్సార్వా యుషాన్
తాదాపదార్దాత్ ప్రుధివ్యైసముద్ర పర్యాంతాయా
ఏకరాళ్ళితి తదప్యేష శ్లోకోబిగీతో మరుత:
పరివేష్టోరో మరుత్త స్యావసన్ గ్రుహే
ఆవిక్షితస్యకామ ప్రేర్ విశ్వేదేవాసభాసద ఇతి
శ్రీ నారాయణవాసుదేవ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై

కరచరణ కృతం వాక్కాయ జంకర్మజంవా
శ్రవణనయనజం వామానసంవా పరాధం
విదిత మవిదితం వా సర్వమేతత్ క్షమస్వ
జయజయ కరుణాబ్ధే శ్రీప్రభోసాయినాధ

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాధామహరాజ్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై

షిరిడి సాయి రాత్రికాల ఆరతి - షేజ్ ఆరతి

శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై.

ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|
పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతా
నిర్గుణాతీస్ధతి కైసీ ఆకారా ఆలీబాబా ఆకారా ఆలీ
సర్వాఘటి భరూనీ ఉరలీసాయిమావులీ
ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|
పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతా
రజతమ సత్త్వ తిఘే మాయాప్రసవలీబాబామాయా ప్రసవలీ
మాయేచియే పోటీకైసీ మాయా ఉద్భవలీ
ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|
పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతా
సప్తసాగరీకైసా ఖేళ్ మండీలా బాబా ఖేళ్ మండీలా
ఖేళూనియా ఖేళ అవఘా విస్తారకేలా
ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|
పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతా
బ్రహ్మాండేచీ రచనాకైసీ దాఖవిలీడోలా బాబాదాఖవిలీడోలా
తుకాహ్మణే మాఝా స్వామీ కృపాళూ భోళా
ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|
పాంచాహీ తత్త్వాంచాదీపలావిలా ఆతా
లోపలేఙ్ఞాన జగీ హితనేణతికోణి
అవతారా పాండురంగా నామఠేవిలేఙ్ఞానీ
ఆరతిఙ్ఞానరాజా మహా కైవల్య తేజ
సేవితిసాధు సంతా మనువేదలామాఝా ఆరతీఙ్ఞానరాజా..
కనకచే తాటకరీ ఉభ్యగోపికనారీ
నారద తుంబురహో సామగాయనకరీ
ఆరతీఙ్ఞానరాజా మహాకైవల్యతేజా
సేవితిసాధు సంతా మనువేదలామాఝా ఆరతీఙ్ఞానరాజా..
పగట గుహ్యబోలే విశ్వబ్రహ్మచికేలె
రామజనార్ధని (పా)సాయి మస్తకఠేవిలే
ఆరతి ఙ్ఞానరాజా మహకైవల్య తాజా
సేవితిసాధు సంతా మనువేదలామాఝా ఆరతీఙ్ఞానరాజా..
ఆరతి తుకరామా స్వామీ సద్గురు ధామా
సచ్చిదానందమూర్తీ పాయిదాఖవి ఆహ్మా
ఆరతితుకరామా…
రాఘవే సాగరాతా పాషాణతారిలే
తైసే తుకో బాచే అభంగ రక్షీలే
రతి తుకరామా స్వామీ సద్గురు ధామా
సచ్చిదానందమూర్తీ పాయిదాఖవి ఆహ్మా
ఆరతితుకరామా…
తూనేకిత తుల నేసీ బ్రహ్మతుకాసి‌ఆలే
హ్మణోని రామేశ్వరే చరణి మస్తకఠేవిలే
ఆరతి తుకరామా స్వామీ సద్గురు ధామా
సచ్చిదానందమూర్తీ పాయిదాఖవి ఆహ్మా
ఆరతితుకరామా…
జైజై సాయినాధ ఆతా పహుడావేమందిరీహో
ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘె‌ఉనికరీహో
రంజవిసీ తూ మధురబోలునీ మాయాజశీనిజ ములాహో
రంజవిసీ తూ మధురబోలునీ మాయాజశీనిజ ములాహో
భోగిసివ్యాదితూచ హరు నియానిజసేవక దు:ఖలాహో
భోగిసివ్యాదితూచ హరు నియానిజసేవక దు:ఖలాహో
దావునిభక్తవ్యసనహరిసీ దర్శన దేశీ త్యాలాహో
దావునిభక్తవ్యసనహరిసీ దర్శన దేశీ త్యాలాహో
ఝూలే అసతి కస్ట అతీశయాతుమచే యాదేహాలహో
జైజైసాయినాధ ఆతాపహుడావే మందిరీహో
ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘె‌ఉనికరీహో
జైజైసాయినాధ ఆతాపహుడావే మందిరీహో
క్షమాశయన సుందరిహిశోభా సుమనశేజత్యావరీహో
క్షమాశయన సుందరిహిశోభా సుమనశేజత్యావరీహో
ఘ్యావీ దోడీ భక్త జనాంచి పూజ అర్చాకరీహో
ఘ్యావీ దోడీ భక్త జనాంచి పూజ అర్చాకరీహో
ఓవాళితోపంచప్రాణిజ్యోతి సుమతీకరీహో
ఓవాళితోపంచప్రాణిజ్యోతి సుమతీకరీహో
సేవాకింకరభక్తి ప్రీతి అత్తరపరిమళవారిహో
జైజైసాయినాధ ఆతా పహుడావే మందిరీహో
ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘే ఉనికరీహో
జైజైసాయినాధ ఆతా పహుడావే మందిరీహో
సోడునిజాయా దు:ఖవాటతే బాబా(సాయి) త్వచ్చరణాసీహో
సోడునిజాయా దు:ఖవాటతే బాబా(సాయి) త్వచ్చరణాసీహో
ఆఙ్ఞేస్తవహో అసీప్రసాదఘే‌ఉని నిజసదనాసీహో
ఆఙ్ఞేస్తవహో అసీప్రసాదఘే‌ఉని నిజసదనాసీహో
జాతో‌ఆతా యే ఉపునరపిత్వచ్చరణాచేపాశిహో
జాతో‌ఆతా యే ఉపునరపిత్వచ్చరణాచేపాశిహో
ఉఠవూతుజల సాయిమావులే నిజహిత సాదా యాసీహో
జైజైసాయినాధ ఆతా పహుడావే మందిరీహో
ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘే ఉనికరీహో
జైజైసాయినాధ ఆతా పహుడావే మందిరీహో
ఆతాస్వామీ సుఖేనిద్రాకరా అవధూతా బాబాకరాసాయినాధా
చిన్మయహే (నిజ) సుఖదామ జావుని పహుడా‌ఏకాంత
వైరాగ్యాచా కుంచ ఘే‌ఉని చౌక ఝూడిలా బాబాచౌకఝూడిలా
తయావరీ సుప్రేమాచా శిడకావాదిదలా
ఆతాస్వామీసుఖేనిద్రాకరా అవదూతాబాబాకరా సాయినాధా
చిన్మయహే సుఖదామ జావుని పహుడా‌ఏకాంత
పాయఘడ్యా ఘాతల్య సుందర నవవిదా భక్తీ‌ఈత బాబానవవిదా భక్తీ
ఙ్ఞానాంచ్యాసమయాలావుని ఉజలళ్యాజ్యోతీ
ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ
చిన్మయహే సుఖదామ జావుని పహుడా‌ఏకాంత
భావార్ధాంచా మంచక హ్రుదయాకాశీటాంగిలా బాబా(హ్రుదయా) కాశీటాంగిలా
మనాచీ సుమనే కరునీకేలే శేజేలా
ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ
చిన్మయహే సుఖదామ జావుని పహుడా‌ఏకాంత
ద్వైతాచే కపాటలావుని ఏకత్రకేలే బాబా ఏకత్రకేలే
దుర్భుద్దీంచ్యా గాంఠీ సోడుని పడదేసోడిలే
ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ
చిన్మయహే సుఖదామ జావుని పహుడా‌ఏకాంత
ఆశాతృష్ణ కల్పనేచా సోడుని గలబలా బాబాసోడుని గలబలా
దయాక్షమా శాంతి దాసీ ఉబ్యా సేవేలా
ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ
చిన్మయహే సుఖదామ జావుని పహుడా‌ఏకాంత
అలక్ష్య ఉన్మని ఘే‌ఉని నాజుక దుశ్శాలా బాబా నాజుక దుశ్శాలా
నిరంజనే సద్గురుస్వామీ నిజవిలశేజేలా
ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ
చిన్మయహే సుఖదామ జావుని పహుడా‌ఏకాంత
శ్రీ గురుదేవద్త:
పాహేప్రసాదాచి వాటద్యావేదు‌ఓనియాతాటా
శేషాఘే‌ఉని జా ఈనతుమచే ఝూలీయాబోజన
ఝూలో ఆతా‌ఏకసవాతుహ్మ ఆళంవావోదేవా
తుకాహ్మణే ఆతా చిత్త కరునీరాహిలో నిశ్చిత్
పావలాప్రసాద‌ఆత విఠోనిజవే బాబా ఆతానిజవే
ఆపులాతో శ్రమకళోయేతసేభావే
ఆతాస్వామీ సుఖే నిద్రా కరా గోపాలా బాబాసాయిదయాళా
పురలేమనోరాధ జాతో ఆపులేస్ధళా
తుహ్మసీ జాగవూ ఆహ్మ‌ఆపుల్యా చాడా బాబా ఆపుల్యాచాడా
శుభా శుభ కర్మేదోష హరావయాపీడా
అతాస్వామీ సుఖే నిద్రాకరాగోపాలా బాబాసాయిదయాళా
పురలేమనోరాధ జాతో ఆపులేస్ధళా
తుకాహ్మణేధిదలే ఉచ్చిష్టాచేభోజన (బాబా) ఉచ్చిష్టాచే భోజన
నాహినివడిలే అహ్మ ఆపుల్యాభిన్నా
అతాస్వామీ సుఖే నిద్రాకరాగోపాలా బాబాసాయిదయాళా
పురలేమనోరధజాతో ఆపులేస్ధలా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాధామహరాజ్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై

సాయిబాబా ఎవరు?

పిలిచినంతనే పలికే దైవం షిరిడీ సాయి. ఈ కరుణామూర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కోరిన వరాలు కురిపించే ఆ దేవుడు స్వయంగా ప్రారంభించిన పర్వదినం గురుపూర్ణిమ. వ్యాసపూర్ణిమ విశిష్టతను తెలియజేస్తూ తన భక్తులకు ఈ ఉత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా సాయి సూచించారు. 

అసలు సాయిబాబా ఎవరు..? దేవుడా..? యోగీశ్వరుడా..? అవతార పురుషుడా..? ఎవరు ఎలా పిలిచినా ఆయన మాత్రం భక్తులను ఆదుకునేందుకు భువిపై వెలిసిన ప్రత్యక్ష దైవం. ఆధునిక యుగంలో మనుషుల మధ్య నడయాడి శ్రద్ధ, సబూరి అనే సన్మార్గాలను బోధించిన ఏకాదశ అవతారం. 1838 నుండి 1918వ సంవత్సరాల కాలంలో ఎంతోమంది భక్తులను కరుణించిన దైవం. షిరిడీ క్షేత్ర సందర్శనానికి ముందు ఒక్కసారి బాబా జీవిత చరిత్రను అవలోకనం చేసుకుందాం.

ఎక్కడ పుట్టాడో తెలియదు. ఎలా పెరిగాడో తెలియదు. ఎక్కడ నడయాడాడో తెలియదు. కులమేదో, మతమేదో తెలియదు. అయినా అన్ని మతాలు తనవే అన్నాడు. ఈ లోకమే తన తల్లిదండ్రులన్నాడు. ఆయనే షిరిడీలో కొలువైన ప్రత్యక్షదైవం సాయిబాబా.

1854లో 16 ఏళ్ళ ప్రాయంలో తొలిసారిగా సాయి షిరిడీకి విచ్చేశారు. కానీ, కొద్దికాలానికే అంతర్థానమయ్యారు. ఆ తరువాత 1858లో ధూప్ ఖేడ్ గ్రామానికి చెందిన చాంద్ బాయి పాటిల్ కు తొలిసారిగా దర్శనమిచ్చారు. తప్పిపోయిన పాటిల్ గుర్రాన్ని చూపి మహిమను చాటారు. అదే ఏడాదిలో చాంద్ పాటిల్ బంధువుల పెళ్లి బృందంతో కలిసి మళ్లీ షిరిడీకి వచ్చేశారు. బాబా ఆగమనాన్ని చూసిన ఖండోబా మందిర పూజారి మహల్సాపతి ‘ఆవో సాయి’ అని స్వాగతం పలికాడు. అలా మహల్సాపతి పిలుపే ఆయన నామంగా స్థిరపడింది.

1858లో షిరిడీకి విచ్చేసిన సాయి, నాటి నుంచి ఆ గ్రామంలోనే వుండిపోయారు. పాడుబడిన మసీదునే నివాస స్థానంగా ఏర్పరచుకుని, దానికి ద్వారకామాయి అని పేరుపెట్టారు. కుష్టు రోగగ్రస్తుడైన బాగోజీ షిండేకు ఉపశమనం కలిగించేుందుకు కట్టెలను పేర్చి మంటను వెలిగించారు. నాటి నుండి నిరంతరాయంగా వెలుగుతోన్న ఆ అగ్నిహోత్రానికి ధుని అని నామకరణం చేశారు. ఆ ధుని నుండి వచ్చిన బూడిదనే ఊదిగా భక్తులకు పంచిపెడుతూ ఎన్నో రోగాలను మటుమాయం చేశారు.

1886 ఏప్రిల్ లో 72 గంటలపాటు సమాధిలోకి వెళ్లి, తిరిగివచ్చి తాను సాధారణ మానవుడిని కాదని నిరూపించారు బాబా. ఇంటింటికీ వెళ్లి బిక్ష స్వీకరించి భక్తుల పాపాలు హరించారు. ‘సబ్ కా మాలిక్ ఏక్’ అంటూ రాముడికి, రహీమ్ కి బేధం లేదని నిరూపించారు. అలా ఎన్నో మహిమలను చాటిన సాయి, ప్రియభక్తుల సమక్షంలోనే 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం రెండున్నర గంటలకు, విజయదశమి రోజున సమాధి చెందారు.

సాయిబాబా సమాధి చెందిన తరువాత, నాటి భక్తులంతా కేవలం సమాధికి మాత్రమే నిత్య పూజలు చేస్తూ హారతులు ఇచ్చేవారు. ఆ తరువాత కొద్ది కాలానికి బాబా ఫొటోను ఓ వెండిపీఠంపై వుంచి నిత్యపూజలు చేయడం మొదలుపెట్టారు. భక్తులు సమాధితో పాటు, ఈ ఫొటోను కూడా దర్శించకుని సాయికి ప్రత్యక్షంగా సేవ చేసిన అనుభూతిని పొందేవారు. అయితే సాయి సమాధి మందిరం కింద అసలైన సమాధి ఉందనే వాదన కూడా ఉంది. కానీ, ఈ వాదనలో ఏమాత్రం నిజం లేదని చెబుతోంది సాయి సంస్థాన్ ట్రస్ట్.

సాయి జీవ సమాధి జరిగి 36 ఏళ్ళు గడిచిన తరువాత, అంటే 1954లో సమాధి మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ప్రతిష్టాపన వెనుక జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, సాయి మహిమ ఏ పాటిదో ఇట్టే అర్థమవుతుంది.

1954లో ముంబై ఓడరేవుకు ఇటలీ నుంచి ఓ నౌక వచ్చింది. ఆ నౌకలో నిలువెత్తు పాలరాతి ముడిపదార్థం వున్నట్టు సిబ్బంది గుర్తించారు. అది ఎవరి పేరు మీద వచ్చిందో దాన్ని నౌకలోకి ఎవరు చేర్చారో వంటి వివరాలు ఎవ్వరికీ తెలియరాలేదు. చివరికి ఓ పూణె వర్తకుడు దాన్ని వేలంలో కొని షిరిడీ సంస్థాన్ కు కానుకగా అందజేశాడు. ఆ పాలరాతి శిలతో బాబా ప్రతిమను చెక్కిస్తే ఎలా వుంటందనే ఆలోచన సంస్థాన్ కార్యవర్గ సభ్యుల మదిలో కలిగింది. వెంటనే ముంబైకి చెందిన బాలాజీ వసంత్ తాలీమ్ అనే శిల్పకారుడిని షిరిడీకి పిలిపించారు. బాబా విగ్రహాన్ని మలిచే పనిని పురమాయించారు. కానీ, విగ్రహాన్ని ఎలా మలచాలో బాబా ముఖకవలికలు, రూపు రేఖలు ఎలా ఉండాలో తాలీమ్ కు ఓ పట్టాన అర్థం కాలేదు. వాటి గురించే ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నారు. అదే రోజు రాత్రి బాబా, వసంత్ తాలీమ్ కలలో కనిపించి ‘నా ముఖాన్ని బాగా చూడు, నేనున్నట్లుగానే విగ్రహాన్ని తయారుచెయ్యి’ అంటూ ఉపదేశించారు బాబా. విభిన్న ఆకృతుల్లో తన ముఖకవలికలను తాలీమ్ కు చూపించారు. స్పృహలోకి వచ్చిన తాలీమ్, బాబా ఇచ్చిన స్వప్న సందేశం ప్రకారం, ఐదున్నర అడుగుల అతి సుందరమైన సాయిబాబా విగ్రహాన్ని తన సహాయకులతో కలిసి మలిచాడు. అలా 1954లో అక్టోబర్ 7 విజయదశమి రోజున షిరిడీ సాయినాథుడి విగ్రహ ప్రతిష్ట జరిగింది. నాటి నుండి షిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడికి బాబా ఆ విగ్రహరూపంలో దర్శనమిస్తున్నారు. ‘‘ఈ భౌతిక దేహానంతరం, నేను అప్రమత్తుడినే’ అని నిరూపిస్తున్నారు. సాయిని సజీవంగా చూడలేకపోయిన భక్తులు, ఈ మూర్తిని చూసి, బాబాను ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందుతున్నారు.

2018 నాటికి షిరిడీ సాయి సమాధి చెంది వందేళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నట్టు షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్రీ సచిన్ తాంబే తెలిపారు.

కాగా సాధువులమని చెప్పుకుంటున్న కొంతమంది మాత్రం, బాబా తమలో ఉన్నాడని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, బాబా తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా తన ఉపావతారం గురించి చెప్పలేదు. పైగా తాను ఏ ఒక్కరికో సొంతం కాదని, అన్ని వర్గాల భక్తులందరిలో ఉంటానని చెప్పారు.

షిర్డీ సాయిబాబా గురుస్థానం

బాంకుల్లో డిపాజిట్లు

బంగారు, వెండి ఆభరణాలు

సాయిబాబా ఎక్కడ పుట్టారో తెలుసా ?

సాయిబాబా ... ఈయనకు భారతదేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. భక్తులైతే ఉన్నారు గానీ ... సాయిబాబా గురించి చాలా మందికి తెలియనిది అయన ఒరిజినల్ పేరు, అయన పుట్టిన ప్రదేశం. వీటి గురించి తెలియక చాలా మంది పుస్తకాలు, పాత ఆర్టికల్స్ తిరుగేస్తుంటారు. కానీ మొన్నీమధ్యనే అయన పుట్టిన ప్రదేశం వెలుగులోకి వచ్చింది అదే పత్రి. పత్రి సాయిబాబా కాలంలో ఒక గ్రామం. కానీ నేడు ఒక సిటీగా మరియు మున్సిపల్ కౌన్సిల్ గా అవతరించింది. మహారాష్ట్ర రాష్ట్రంలోని పర్భనీ జిల్లాలో పత్రి సిటీ కలదు. ఈ సిటీ ప్రధాన ఆకర్షణ ఆయన జన్మించిన ఇంటిస్థానంలో కట్టిన శ్రీ సాయి జన్మస్థల్ టెంపుల్. ఈ మందిరాన్ని దర్శించుకోవటానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

శ్రీ సాయి జన్మస్థాన్ ఆలయం, పత్రి

శ్రీ సాయి జన్మస్థాన్ ఆలయం, పత్రి శ్రీ సాయి జన్మస్థాన్ ఆలయం (సాయిబాబా పుట్టిన ఆలయం) లో షిర్డీ సాయిబాబా జన్మించెను. ఈ ప్రదేశాన్ని మొట్టమొదట సాయిబాబా భక్తుడు మరియు రీసెర్చర్ అయిన వి.బి. ఖేర్ 1975 వ సంవత్సరంలో కనిపెట్టెను. ఈయన శ్రీ సాయి స్మారక కమిటీ (సాయి మెమోరియల్ కమిటీ) ఏర్పాటు చేసి అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించాలని అనుకొని సాయి పుట్టిన ఇంటిని కొనుగోలు చేసి 1994 లో పనులు మొదలుపెట్టి, 1999 లో దీనిని జాతికి అంకితం చేసెను. ప్రముఖ స్వామీజీలైన పుట్టపర్తి సాయిబాబా, మాధవనాథ్ లు కూడా 'పత్రి' నే సాయిబాబా జన్మస్థలంగా నిర్ధారించారు. షిర్డీ వెళ్తున్నారా ? అయితే ఈ ప్రదేశాలను చూసిరండి ! ఆలయం నిర్మించేటప్పుడు సాయిబాబా జన్మించిన ఇంట్లో దొరికిన వస్తువులు మరియు పునాదులు మరియు ఇతర పరికరాలను మందిర ప్రాంగణంలో చూడవచ్చు.
 

KRL-1

KRL-90

KRL-47E

shirdi trip

shirdi trip

దీక్షిత్ వాడా మ్యూజియం

శని శింగనాపూర్

త్రయంబకేశ్వర్ ఆలయం

పూణే

నాందేడ్

సాయినగర్ షిరిడి

సాయిబాబా ప్రబోధనలు     తగ్గించుకుని ఆధ్యాత్మిక చింతన పెంచుకోమని హితబోధ చేశాడు. ప్రేమ భావాన్ని పెంచుకోమని ప్రబోధించాడు. తోటివారితో ప్రేమగా మసలుకోమని, జంతుజాలాన్ని కూడా ఆదరించమని చెప్పేవాడు.

సాయిబాబా తన వద్దకు వచ్చే భక్తులనే కాదు, చీమ, దోమ, కుక్క, పులి అన్ని జీవరాశులనూ సమానంగా భావించేవాడు. బాబా బిక్షాటన చేసి వచ్చిన తర్వాత ఘన పదార్ధాలను ఒక పాత్రలో, ద్రవ పదార్థాలను ఇంకో పాత్రలో ఉంచేవాడు. మనుషులు మొదలు ఇతర జీవరాశుల వరకూ తమకు కావలసినది తినేందుకు వీలుగా ఉంచేవాడు. కుక్కల్లాంటివి మూతి పెట్టినా అస్సలు చీదరించుకునేవాడు కాదు. అందరూ తిన్న తర్వాత చివరికి మిగిలింది సాయిబాబా తినేవాడు.

జీవరాశులు అన్నీ సమానమే అని చెప్పడానికి, ప్రతిదానిలో తాను ఉన్నానని చాటి చెప్పడానికి భక్తులకు ఎన్నో నిదర్శనాలు చూపించేవాడు. సాయిబాబా ప్రతి మాట, ప్రతి చేష్ట మనిషిని, మహా మనిషిగా తీర్చి దిద్దేందుకు ఉపయోగపడేది. ఆయన బోధనలు ఎంత ప్రబోధాత్మకంగా ఉంటాయో, ఎంత స్పష్టంగా ఉంటాయో ఒకసారి చూడండి...

''ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే ఒకర్ని ఒకరు కలుసుకుంటారు. ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం లేకుంటే ఒకరి దగ్గరకు ఇంకొకరు రారు. కనుక అలా వచ్చిన వ్యక్తులు లేదా జంతువులు కానీ మీ వద్దకు వస్తే నిర్దాక్షిణ్యంగా వాటిని తరిమివేయొద్దు. మన వద్దకు వచ్చినవారిని ప్రేమతో ఆదరించాలి. జంతువులు అయినా అంతే. సాదరంగా దగ్గరకు తీయాలి. కనికరం చూపించాలి. ఆప్యాయంగా ఆకలి తీర్చాలి.

తోటి వ్యక్తులను, జంతుజాలాన్ని ఆదరించడం వల్ల మన సంపదలు ఏమీ కరిగిపోవు. దాహార్తితో వచ్చినవారికి తాగడానికి నీళ్ళు ఇచ్చి దాహం తీర్చు. ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా భోజనం పెట్టు. కట్టుకోడానికి బట్టలు లేక అవస్త పడుతున్నవారికి దుస్తులు ఇచ్చి ఆదుకో. అవసరమైన వారికి కాసేపు ఇంట్లోకి ఆహ్వానించి, విశ్రాంతి పొందమని చెప్పు. ఇలా నువ్వు మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్లే. నువ్వు ఇలా సహ్రుదయ౦తో ఉంటే, భగవంతుడు సంతోషిస్తాడు. నువ్వు దేవుడికి దగ్గరైనట్లే. ఇతరులకు మేలు చేసేవారికి భగవంతుని అనుగ్రహం ఉంటుంది. తన కరుణాకటాక్షాలను ప్రసరింపచేస్తాడు.

బంధుమిత్రులు లేదా పరిచయస్తులు డబ్బు అవసరం ఉండి, లేదా మరేదో సహాయం కోరి నీ వద్దకు వచ్చినప్పుడు వీలైతే సాయం చేయి. ఒకవేళ వారికి చేయి అందించడం నీకు ఇష్టం లేకుంటే, లేదా సాయం చేయలేకపోతే చేయకు. కానీ, వారిని విసుక్కోకు. ఈసడించుకోవడం, సహించలేనివిధంగా దుర్భాషలాడటం చేయకు. అవతలి వ్యక్తే నీతో దురుసుగా, పరుషంగా, నొప్పించేవిధంగా మాట్లాడినా, అనవసర నిందలు వేసినా, లేనిపోని ఆరోపణలు చేసినా ఉదారంగా ప్రవర్తించు. కఠినంగా జవాబులు చెప్పకు.

అవతలి వ్యక్తి నిందలు మోపినప్పుడు భరించడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. తిరిగి నిష్ఠూరంగా మాట్లాడ్డం వల్ల నీకు ఒనగూరే లాభమూ లేదు. అవతలి వ్యక్తి అజ్ఞానాన్ని భరించి, ఔదార్యం చూపడంవల్ల నీకు అవ్యక్తమైన ఆనందం కలుగుతుంది. నెమ్మదిగా ఉండు. జరుగుతున్నదంతా నాటకం అని భావించి, ఉదారంగా ఉండటం అలవాటు చేసుకో.

అహంకారాన్ని పోగుట్టుకోవాలి. ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో, నీకు, నాకు మధ్య అడ్డుగోడ తొలగిపోతుంది. అప్పుడు మన ఇద్దరిమీ ఒకటే అవుతాం. నీకు, నాకు బేధం ఉండి అనుకోకు. ఆ భావమే నిన్ను నాకు దూరం చేస్తోంది. ఈ బేధ భావం నీలో నెలకొని ఉంటే, నువ్వు, నేను ఒకటి కాలేము...''

సాయిబాబా బోధనలు చదివి వదిలేయకుండా ఆచరించే ప్రయత్నం చేద్దాం.

ద్వారకామాయి

గురుస్తాన్

ఖండోబా దేవాలయం

నాసిక్

పంచవటి

ఇతర ఆకర్షణలు

అజంతా గుహలు

చూడవలసిన ప్రదేశాలు

we trustfinity

Shirdi Sansthan to celebrate Sai Baba’s centenary from 2018Oct. 1

Shirdi Sansthan to celebrate Sai Baba’s centenary from Oct. 1

The Shri Saibaba Sansthan Trust has drawn up plans to celebrate the centenary year of Shri Sai Baba of Shirdi from October 1 this year to October 18, 2018, during which it will undertake several activities including prasad bhojanor free meals at a new facility at Nimgaon-Korhale village near Shirdi.

The Sansthan’s executive officer, Bajirao Shinde, said a meeting of representatives from Saibaba temples across the country has been organised on December 4 in Shirdi to plan activities through the year.

Mr. Shinde said the Sansthan Trust has recently started a prasadalaya on a seven-acre plot to distribute free meals to devotees through the year, and appealed to devotees and philanthropists to donate funds to support the activity.

The Trust plans to upgrade its mobile app and the temple’s official website,www.sai.org.into provide information to devotees on various activities and a list of religious programmes through the year. It has also decided to appoint an architect to construct a new building equipped with medical facilities and additional beds near the of Shri Sainath Hospital. Dialysis facility will be provided free of cost.

KRL-89

KRL-58E

షిర్డీకి వెళ్ళటం అనేది ప్రతి సాయి భక్తుడు యొక్క కల, వారి జీవితకాలంలో ఒకసారి అయినా ఈ దివ్య స్థలాన్ని సందర్శిస్తారు. ప్రతి ఒక్కరూ సాయి బాబా యొక్క దీవెనలను కోరుకుంటారు. ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు తరలి వస్తారు. షిర్డీ మహారాష్ట్రలో అహమ్మద్ నగర్ జిల్లాలో ఉన్నది. షిర్డీ కోపర్గావ్ నుండి 15 కి.మీ. దూరంలో ఉంది మరియు అహమ్మద్ నగర్ నుండి 83 కి.మీ. దూరంలో ఉంది. షిర్డీ ఒకప్పుడు ఒక చిన్న గ్రామం, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు దర్శించుకొనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. భక్తులు ఒక సారి షిర్డీ గడ్డపై అడుగుపెడితే వారి కర్మలన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా వారి అన్ని ప్రార్థనలు సాయిబాబాకు వినిపిస్తుంది మరియు వారి కోరికలన్నీ తీరుతాయి.

 షిర్డీలో గల వసతులు:

శ్రీ సాయిబాబా సంస్థాన్ వారు సాయిబాబా భక్తులకు అనేక వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మీరు షిర్డీ సందర్శించటానికి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారి గదులు కోసం ఎదురుచూస్తూ ఉంటే ముందుగా మీరు ఒక ప్లాన్ (ప్రణాళిక) ప్రకారంగా గదులు బుక్ చేసుకోవాలి. షిర్డీ సంస్థాన్ వారు భక్తుల కోసం ఆన్ లైన్ లో గదులు బుక్ చేసుకొనే సౌకర్యాన్ని కల్పించారు. రూములు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి మరియు షిర్డీ ఆలయానికి మీరు నడచివెళ్లేంత దూరంలో ఉన్నాయి. షిర్డీలో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు వారి సాయి ఆశ్రమం, ద్వారవటి మరియు న్యూ భక్తి నివాస్ వంటి హోటల్సే కాకుండా ఆలయం చుట్టూ పుష్కలంగా ఇతర హోటల్స్ కూడా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో మీరు బస చేసిన గదుల నుండి ప్రయాణం చేయడానికి అందుబాటులో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సేవలు ఉన్నాయి. 

షిర్డీలో ఫుడ్ :

సాయిబాబా సంస్థాన్ వారు షిర్డీ సందర్శించే ప్రతి ఒక్కరి కోసం ఆలయ ప్రాంగణంలో తినేందుకు నామమాత్రపు ధరకు ఆహారాన్ని భక్తులకు అందిస్తోంది. ఆహారంలో రొట్టెలు (రోటీస్), వెజిటబుల్ కర్రీ, దాల్ మరియు రైస్ వుంటాయి. అంతేకాకుండా మీకు అద్భుతమైన ఉత్తర-భారత, దక్షిణ-భారత ఆహార సేవలందించే ఇతర హోటళ్లు కూడా అందుబాటులో వున్నాయి.

 షిర్డిలో చేయవలసినది:

షిర్డికి వెళ్ళినప్పుడు "ద్వారకామాయి"ని తప్పక దర్శించాలి. ఇక్కడ సాయిబాబా వున్నప్పుడు ఉపయోగించిన వస్తువులు అన్నీ ప్రత్యక్షంగా చూడవచ్చు. సాయిబాబా ధరించిన కఫ్నీ, వంట చేయటానికి ఉపయోగించిన వంట పాత్రలు, మరియు సాయిబాబా వెలిగించిన ధుని (పవిత్రమైన అగ్ని) చూడవచ్చు. ఈ ధుని ఇప్పటికీ వెలుగుతూనే వుంటుంది. ధునిలోని విబూధిని బాబా భక్తులకు ప్రసాదంగా అందించేవారు. దీని వల్ల అనేక బాధలు, రోగాలు మటుమాయమయ్యేవి. సాయిబాబా చివరి రోజుల్లో విశ్రాంతి తీసుకొన్న మంచం మరియు స్నానం చేయుటకు ఉపయోగించిన బండ, ఇవన్నీ చూడాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పక "చావడి"ని దర్శించాలి.

1. షిర్డీలో పురాతన కాలం నాటి ఆంజనేయస్వామి దేవాలయం మరియు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తప్పక సందర్శించాలి.

2. సాయి ఆలయం నుంచి నడచివెళ్ళగల దూరంలో వున్న "ఖండోబా" ఆలయాన్ని సందర్శించండి. ఇక్కడ ఈశ్వరుడు ఖండోబా రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటాడు.

3. పురాణాల ప్రకారం సాయిబాబా షిర్డీలో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదట "మహాల్సాపతి" సాయిబాబాని దర్శించుకున్నాడు.

4. షిర్డీలో జరిగే హారతిని మిస్ కాకుండా హారతిలో పాల్గొనండి.

5. సాయిబాబా జీవిత చరిత్రను మరాఠీలో లయబద్ధంగా పాడే భక్తిగీతాలు చెవులకు వినటానికి శ్రావ్యంగా వుంటాయి.

6. సమాధి మందిరంలో గల సాయిబాబా యొక్క నవ్వుతూ వుండే విగ్రహాన్ని ఒక్క షిర్డీవాసులే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి దర్శించుకుంటారు. బాబా రూపం చాలా మనోహరమైన తేజస్సు కలిగి వుంటుంది. బాబాను చూసిన ఆనందంలో మీకు తెలీకుండానే మీ కాళ్ళ వెంట నీరు కారుతుంటుంది అంటే ఆశ్చర్యపడనక్కరలేదు.

7. హారతి వివరాలు ఆన్లైన్లో లభ్యమవుతాయి. భక్తులు వారి సౌలభ్యం ప్రకారం సమయం ఎంచుకొని హారతిలో పాల్గొనవచ్చును. మీరు షిర్డీలో గుర్తించుకోవలసిన

సాధారణ విషయాలు:

1. ఆలయం లోపల నడిచి వెళ్ళే ప్రతి భక్తుడు ఖచ్చితంగా "సాయి రామ్" అనే పదాన్ని ఉచ్ఛరించాలి.

2. మీరు షిర్డీ సందర్శించినప్పుడు వీధి కుక్కలకు పాలు పోస్తే మీరు చేసిన కర్మలు తీరుతాయి.

3. ఇతర నగరంలో ధరలు చాలా ఎక్కువ వున్న దానిమ్మ పండ్లు షిర్డీలో చాలా తక్కువ ధరకే అమ్ముతారు. వేల కొలదీ భక్తులు షిర్డీ వచ్చి సాయిబాబాను దర్శించుకుంటారు. షిర్డీ యాత్ర ఒక ఆధ్యాత్మిక యాత్ర.

సీత గుహ

ఔరంగాబాద్

ఎల్లోరా గుహలు

ఇతర ఆకర్షణలు