శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావననరసింహస్వామి స్వయంభూ పుణ్యక్షేత్రము

108 Om Namo Narayanaya Chanting Powerful Mantra 108 repetitions.mp3

ఆహ్వానము
17-08-2018-శుక్రవారం


భక్తులకు,ప్రజలకు తెలియ జేయడమేమనగా
బనగానపల్లె రవ్వలకొండపై వెలసిన శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత నరసింహస్వామి వారి ప్రథమ వార్షికొత్సవాన్ని పురష్కరించుకొని - ధ్వజ స్థంభ స్థిరప్రతిష్ఠ మరియు శ్రీవారి కళ్యాణోత్సవము 17 ఆగస్జ్టు 2018 న నిర్వహించబడుచున్నాయి.
దర్శించండి-తరించండి
ఈ భక్తి కార్యక్రమములో పాల్గొనండి!
నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు పొందండి. ఈ కార్యక్రమము సందర్భముగా జరుగు కార్యక్రమములకు కుల,మత తారతమ్యాలు,పేద,గొప్ప తేడాలు మరి ఏ ఇతర తారతమ్యాలు లేవు. అందరూ పాల్గొనవచ్చును. నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు పొందవచ్చును.

కార్యక్రమ వివరాలు
17-08-2018-శుక్రవారము


ఉదయం 06-00 గంటలకు : గణపతి పూజ,పుణ్యాహవాచానము,అంకురాహాపణం
ఉదయం 07-00 గంటలకు : ప్రధాన కళశస్థాపన,వాస్తు,నవగ్రహ మండల ఆరాధన
ఉదయం 08-00 గంటలకు : జలాధివాసము,ధాన్యాధివాసము మహాన్నాపనము మొదలగు పూజలు
ఉదయం 09-00 గంటలకు : వాస్తు,నవగ్రహ జపహోమములు,స్థిరయంత్ర ప్రతిష్ఠాపన
ఉదయం 10-15 గంటలకు : స్థిర ధ్వజ స్థంభ ప్రతిష్ఠ,నేత్రోన్మిళనము,కుంభావహనము,మహా మంగళహారతి,పూర్ణాహుతి
ఉదయం 11-30 గంటలకు : శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత నరసింహస్వామి వారి కళ్యాణము తదుపరి అన్నప్రసాధ వితరణ కలదు
విరివిగా పాల్గొనండి - స్వామి వారి కృపాకటాక్షములు పొందండి
ఈ దేవాళయములో ప్రతి నెల ప్రతి స్వాతికి ప్రత్యేక పూజ-అన్నప్రసాద వితరణ కలదు. దర్శించండి-తరించండి
పూర్తి సమాచారము కొరకు www.justview.co చూడండి లేదా క్రింది వారిని సంప్రదించండి
ఆహ్వానించువారు
బాలిశెట్టి పావన నరసింహమూర్తి
ఆలయ వ్యవస్థాపకులు & కార్యనిర్వాహకులు
మరియు
ఆలయ కమిటి
Contact Nos: 6301918160,9951773665
wwww.justview.co Email: pavananarasimhaswamy@gmail.com
Facebook : https://www.facebook.com/narasimhamurthy.balisettypavana
శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామి భక్తులకు విన్నపము ఏమనగా!
స్వామి మరియు అమ్మవారికి పూజలు నిర్వహించుటకు ఒక అర్చకున్ని నియమించుటకు కమిటి తీర్మానించినది. ఇందుకు గాను భక్తుల సహాకారము కోరుతున్నాము. అర్చకుని నిర్వహణ కొరకు ప్రతినెల మీకు తోచినంత రు25/-కు తక్కువకాకుండ ఆపైన ఎంతైన ఇవ్వవచ్చును.లేదా సంవత్సరమొత్తము ఒకేసారికూడచెల్లించవచ్చును. ఈ లింకు ద్వారా Pay చెల్లించండి. లేదా బ్యంకు ఖాతాకు నేరుగా కూడ చెల్లించవచ్చును. వివరాలు websiteలో ప్రచురించబడును
Account Details
Sri pavana chenchu lakshmi sametha
narasimhaswamy temple,
ravvalakonda,Banaganapalli-518360
Andhra Bank BANAGANAPALLI
A/C NO: 005911100002643
IFSC :ANDB0000059
Balisetty Pavana narasimha murthy
State Bank of India,Banaganapalli
A/c No.: 20356859752
IFSC: SBIN0001179

అర్చకుని కొరకు చందా

మీరు ఎంచుకున్న తేదికి లింకు ద్వారా చెల్లించగలరు.

S NO NAME PERIOD AMOUNT TOTAL AMOUNT
PAID ON TODAY
DATE
TO BE PAID
PAY LINK
1 Y L NARAYANA REDDY
YEMMIGANUR
9885526478
MONTHLY Rs25/- Rs125/- EVERY MONTH
22ND
PAY HERE
2 Y PADMAVATHI
YEMMIGANUR
9885626478
MONTHLY Rs25/- Rs100/- EVERY MONTH
22ND
PAY HERE
3 Y AMARANATHA REDDY
CHENNAI
MONTHLY Rs50/- Rs200/- EVERY MONTH
22ND
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE

పూజల చందా వివరములు

వ.నం పూజ పేరు కాలం రుసుము చెల్లించుటకు లింకు
1

ఈ దేవాళయములో నిత్యధీపారాధన అవకాసము భక్తులకు కల్పిస్తున్నము. సంవత్సరముపాటు నూనెకు అయ్యే ఖర్చును రు 516/- గా నిర్ణయించాము. ఎవరైతే ఈ రుసుము చెల్లిస్తారో వారి గోత్రనామములు స్వామివారికి సంవత్సరముపాటు వినిపించబడును.

ఒక సంవత్సరం
చందాదారుల వివరాలు
Rs 516/- Pay here
2

ప్రతి నెలలో వచ్చు స్వాతికి స్వామి వారికి ప్రత్యేక పూజ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. భక్తులు ఆ కార్యక్రమాన్ని తమ గొత్రనామాలపై జరిపించుకొనుటకు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అందుకు గాను ఒక రోజు స్వాతికి కేవలము రు 2516/- లు చెల్లించవలెను. లేదా మిరే అన్ని వస్తువులు తీసుకురావలెను.

ఒక స్వాతి రోజుకు మాత్రమే

చందాదారుల వివరాలు

Rs 2516/- Pay here
3

ప్రత్యేక పూజ - అన్నదానము భక్తుల అభీష్టము ప్రకారము వారు కోరుకున్న ప్రత్యేక రోజులలొ అనగా జన్మ,వివాహ,ఉద్యోగ,గృహ ఇంకా అనేక శుభప్రదమైన రోజులలో స్వామి వారికి పూజ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడును.

సంవత్సరములో ఒక్కసారిమాత్రమే

చందాదారుల వివరాలు

Rs 2516/- Pay here
4
5

చందాదారుల వివరాలు

6

విరాళములు
ఈ దేవాళయములో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందివున్నది. అవి
1. భక్తులు ఉండుటకు వసతి భవనము
2. అన్నదానము జరిపించుటకు వంట గది
3. స్నానపు గదులు మొదలగునవి.
కావున పై నిర్మాణములకు సహకరించవలసిందిగా కోరుతున్నాము.

చందాదారుల వివరాలు

మీ అభీష్టము (No Limit) Pay here

శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి ఆలయ అభివృద్ది కమిటి

Sri Sri Sri Chenchu Laxmi Sametha Pavana Narasimha Swami Temple Development Committeee
S NO NAME OF THE MEMBER DESIGNATION CONTACT NO PHOTO
1 Sri Balisetty Narasimha murthy Founder and Chairman 9951773665  narasimha
2 Sri Balisetty Hari Prasad Honorable President  narasimha
3 Smt M Usha Rani Joint Secretary 90325 88315  narasimha
4 Sri M Subbarayudu Treasurer 9966853355  narasimha
5 Smt A Sujathamma Excuitive Member 6281441856  narasimha
6 Sri B Sri Hari Excuitive Member 97909 12464  narasimha
7 Sri Y L Narayana Reddy Excuitive Member 9110333597  narasimha
8 Sri M Tharun Kumar Excuitive Member 7406016644  narasimha
9 Sri M V S S Narayana Excuitive Member 77990 01066  narasimha

*తిరుమల శ్రీవారి దర్శన సమాచారం*

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల దర్శనానికి టిటిడి ప్రాధాన్యం

ప్రపంచప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన *తిరుమల తిరుపతి దేవస్థానం* భక్తుల సేవే పరమావధిగా అనేక వసతులు కల్పిస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులు ఏమాత్రం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉచితంగా దర్శనం, అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తోంది. వయసు పైబడిన(65 సం||ల పైన)వారు, శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారు, ఏడాదిలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టిటిడి మరింత జాగ్రత్తగా వ్యవహరించి దర్శనం విషయంలో ప్రాధాన్యం కల్పిస్తోంది.

తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా వృద్ధులు, దివ్యాంగులకు టోకెన్లు ఇచ్చేందుకు 7 కౌంటర్లను టిటిడి ఏర్పాటుచేసింది. ఇక్కడ
*ఉదయం 10 గంటల స్లాట్‌కు 700 మందికి,*
*మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌కు 700 మందికి టోకెన్లు జారీ చేస్తారు.*

ఉదయం 7 గంటల నుండి టోకెన్ల జారీ మొదలవుతుంది. రెండు స్లాట్లకు కలిపి ఉదయం నుండే టోకెన్లు మంజూరుచేస్తారు. శుక్రవారం, కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం రోజుల్లో మాత్రం ఉదయం 10 గంటల స్లాట్‌ ఉండదు. మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో *700 మందిని మాత్రమే అనుమతిస్తారు.*

ఇక్కడ వ్యక్తిగతంగా ఫొటో తీసుకోవడంతోపాటు ఆధార్‌ లేదా ఓటర్‌ గుర్తింపుకార్డును నమోదు చేసుకుంటారు. *రాయితీపై రూ.20/-కి రెండు లడ్డూలు లేదా రూ.70/-కి నాలుగు లడ్డూలు కొనుగోలు చేయవచ్చు.* ఈ కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటుచేశారు. ఇక్కడినుండి 2 బ్యాటరీ వాహనాలు, ఒక వ్యాన్‌ ద్వారా వృద్ధులు, దివ్యాంగులను దక్షిణ మాడ వీధి వద్దగల వేచి ఉండే హాళ్లకు తీసుకెళతారు. మొత్తం 3 హాళ్లలో వెయ్యి మందికిపైగా కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటుచేశారు. మరుగుదొడ్ల వసతి ఉంది. ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఈ హాళ్లలో టివి ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. సెల్‌ఫోన్లు, లగేజి డిపాజిట్‌ చేసే సౌకర్యం కూడా ఉంది. దర్శనం తరువాత తిరిగి ఇక్కడే వీటిని పొందొచ్చు. వేచి ఉండే హాళ్ల నుండి ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనానికి పంపుతారు. నడవలేనివారికి శ్రీవారి సేవకులను సహాయకులుగా పంపుతారు.

*ఏడాదిలోపు చంటిపిల్లల దర్శనం :*

ఒక సంవత్సరంలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఉదయం 9 నుండి రాత్రి 7 గంటల వరకు ఈ మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. చంటిపిల్లల తల్లిదండ్రులకు ఇద్దరికి కలిపి నాలుగు లడ్డూలను రాయితీపై రూ.40/-కి అందిస్తారు.

*అదనపు ప్రత్యేక దర్శనాలు రద్దు :*

గత ఏడాది ఆగస్టు నెల నుండి టిటిడి ప్రతినెలా రెండు సాధారణ రోజుల్లో 4 వేల మంది వృద్ధులు, దివ్యాంగులకు, అదేవిధంగా 5 సంవత్సరాలలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే.

*వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మే, జూన్‌ నెలల్లో వయోవృద్ధులు, దివ్యాంగులు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు కల్పించే రెండు రోజుల ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.*

ప్రతిరోజూ వృద్ధులు, దివ్యాంగులు, ఏడాది లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు కల్పించే దర్శన విధానాన్ని యధావిధిగా టిటిడి అమలుచేస్తోంది.

Avatar
Online Shopping

Click here

శ్రీ పావన నరసింహస్వామి స్వచ్చంద సేవాదళం కొరకు దరఖాస్తు

శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావననరసింహస్వామి స్వయంవ్యక్త (పుట్టుశిల) పుణ్యక్షేత్రము

భక్తులకు విజ్ఞప్తి

ప్రతి స్వాతికి,పండగ,పర్వదినాలు,దేవాళయ వార్శికోత్సములు మరియు భక్తుల అభీష్టము మేరకు పుట్టినరోజు,వివాహపురోజులలొ భక్తుల కోరికమేరకు జరిగే అన్నదానములు,ప్రత్యేక పూజలు మొదలగు ఎన్నొ కార్యక్రమాలు ఈ దేవాళయములో నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించుటకు స్వచ్చందముగా సేవకుల అవసరము ఎంతో వున్నది.దేవళము తరపున సేవాదళము ఏర్పాటు చేస్తున్నాము. సేవాదళములో పాల్గొనదలచిన వారు www.justview.co ద్వారా మీ పేర్లు నమోదు చేసుకొనగలరు. సేవాదళములో ఎంపికైన సభ్యులకు ఉచితముగా గుర్తింపుకార్డు( Identity Card)ఏర్పాటు చేయబడును వివరాలకు చూడండి

we trustfinity

we trustfinity

బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసిన రవ్వలకొండ ప్రదేశం

బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువులకాపరి గా ఉంటూ రవ్వలకొండ లో కాలజ్ఞానం వ్రాసారు. ఆవుల చుట్టూ గీతగీసి రవ్వలకొండ లో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లె కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఈ కొండ గుహాలలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసారు కనుక కొండలను 'బ్రహ్మంగారి కొండలు' అని కూడా పిలుస్తారు. 

కార్యనిర్వాహకులు శ్రీ బాలిశెట్టి పావన నరసింహస్వామి గారి గురించి

వైకుంఠ ఏకాదశి27-10-2011 వ తేది 165వ స్వాతి వెడుకలో

శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన (పాములేటి) నరసింహస్వామి వెండి విగ్రహము (రు 1,64,366/- విలువ గల 2.5కిలోగ్రాముల వెండి)ను

దిగువ అహోబిలంలో E.O శ్రీ నరసయ్య గారికి, శ్రీ బాలిశెట్టి పావన నరసింహమూర్తి గారు అందజేసారు.

( పోటోలో వున్నవారు; E.O శ్రీ నరసయ్య గారు, శ్రీ బాలిశెట్టి పావన నరసింహమూర్తి గారు,శ్రీ కృష్ణయ్య గారు మరియు పురొహితులు)

Bridge Course for ITI Trainees

ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి యే నమః . బనగానపల్లె మండలము లో రవ్వల కొండ పై స్వయం వ్యక్త శ్రీ పావన లక్ష్మీ నరసింహ స్వామి పుట్టుశిల వెలసిన ప్రాంతము లో గుడి నిర్మాణము వెనుక కొంత చరిత్ర ఉన్నది. ఎక్కడో కడప లో నివసించు చున్న సుబ్బ నరసమ్మ, నరసింహులు గారి రెండవ సంతానమైన పావన నరసింహ మూర్తి గారు తన విద్యా భ్యాసం SSC మరియు ITI వరకు కడప లో ముగించుకొని తరువాత ఉద్యో గా ర్థి యై బనగానపల్లె కు వచ్చి అక్కడి ITI యందు ఇన్స్ట్రక్టర్ గా 1986 నుండి 1995 వరకు పని చేసి అక్కడి అప్పటి ప్రిన్సిపాల్ గా రైన శ్రీ Y LN Reddy గారికి ఆప్త మిత్రుడి గా ఉంటూ రంగయ్య శెట్టి గారి తో మరియు ప్రసాద్ రావ్ గారి తో కలిసి మెలిసి తిరుగుతూ,ముక్కు సూటి వాడిగా నలుగురీ లో పేరు తెచ్చుకొని కూడా పెళ్ళాం పిల్లలను దూరం చేసుకొని తిరిగి పెళ్ళి చేసుకోన కుండా ,తల్లి తండ్రి,గురువు,దైవం, అని నమ్మిన వాడై తల్లిని సేవించు చూ తరువాత తల్లి సేవ లోనే గడిపి ఆమె తరువాత దైవం మీద దృష్టి మరల్చి ఆ దైవ సేవ లో భాగం గా నే 2011 లో ఒక వెండి విగ్రహం (2.5 kg Rs 1.64 lakshs ) దిగువ అహోబిలం లోనీ అప్పటి EO గారైన నరసయ్య గారికి అందజేయడం జరిగింది .తరువాత ఎగువ అహోబిలం లో గుడి వెనుక భాగంలో ఒక చిన్న విగ్రహం ప్రతిష్టించడం జరిగింది. ఆ విగ్రహం ఇప్పుడు రోజూ కొన్ని వందల మంది తో పూజలందుకుంటున్నది.

స్థల పురాణము

బనగానపల్లె మండలము రవ్వ ల కొండ పై వెలసిన స్వయం వ్యక్త (పుట్టు శిల ) శ్రీ శ్రీ శ్రీ చెంచులక్ష్మి సమేత పావన లక్ష్మీ నరసింహ స్వామి వారి చరణార విందములకు నమస్కరించి, గుడి నిర్మాణ కర్త ,అర్చకులు, అయిన శ్రీ పావన నరసింహ మూర్తి గారి ఆత్మావలోకనం వారి మాటల లోనే ,....... నా బాల్యము అంతయు కడప,పులివెందుల లోనే గడిపి నాను కడప లో ఆరు నుండి పది వరకు చదివాను అప్పుడు హరినాథ్ ( ప్రస్తుత జిల్లా జడ్జి, హైదరాబాద్) అను మిత్రునితో కలిసి మెలసి చదువంటే ప్రాణ మంటూ పోటీపడి చదివే వాళ్ళం.ఆ వయసు లోనే మహా భారతము ,శివాజీ చరిత్ర విని తల్లి యొక్క ప్రాధాన్యత ను తెలుసు కున్నాను.తల్లిని మించిన దైవం లేదు అని దృఢం గా నమ్మాను . తరువాత పులివెందుల లో గూడూరు వెంకట చల మయ్య అను నతని తో పరిచయ మైంది .నా తల్లి సేవ లో అతను కూడా చాలా సహాయ సహకారాలు అందించారు .అపుడను కొన్నాను దేవుడు ఎక్కడో లేడు,మానవత్వము ఉన్న తల్లి లోనూ నా మిత్రుల లోనూ దాగి ఉన్నాడ ని.అందుకే బనగానపల్లె యందు తల్లి సేవలోనే గడిపాను .ఆమె తరువాత మిత్రులలో దైవాన్ని వేదక్కుంటు ప్రతి స్వాతి కి అహోబిలం వెళ్ళడం, మిగిలిన కాలమంతా మానవ సేవయే మాధవ సేవ అంటూ గడుపు తున్నపుడు ,ఒక సారి స్వాతి కై పాములేటీ నుండి తిరుగు ప్రయాణం లో ఒక్క సాధువు వెంట రావడం గుడి కట్టమంటు
[ నాకు గట్టిగా చెప్పి అంతర్ధానం అవ్వడం తో దిక్కు తోచని స్థితిలో ఉండి చివరకు గుడి నిర్మాణము నకే పూనుకు న్నాను .అప్పుడు కూడా మిత్రులు ప్రోత్స హించడం తో 06-02-2014 న రథ సప్తమి నాడు డాక్టర్ వై.వి. సూర్య ప్రకాష్ రెడ్డి గారు మరియు డాక్టర్ సి.శ్రీనివాసులు గారు,శ్రీ. జి.వెంకట కృష్ణ య్య ,మరియు వారి ధర్మ పత్ని శ్రీమతి సుశీల గారు ,మరియు శ్రీ వి.హరి హర ప్రసాద్ వారి ధర్మ పత్ని శ్రీమతి అరుణ గార్లు ,శ్రీ గోపాల్ దాస్ గారు , శ్రీ పెరుసోముల రామమోహన్ స్వామి గారి సమక్షం లో రాజేష్ బ్రదర్స్ గారి చే భూమి పూజ చేయడం జరిగింది .అప్పటి నుండి ఆ స్థలములో ఎన్నో విశేషములు కనిపిస్తూ ఉండినవి .సుజాతమ్మ గారి సమక్షములో,పుట్టు శిల బయట పడటం,పాము పుట్ట,అందులో ఎనిమిది అడుగుల పాము, మూడు అడుగుల పాము, కనిపించడం, నిర్మాణం మొదలవగానే రాళ్ళు తోలు ట్రాక్టర్ డ్రైవర్ మొదట భగవానుని చేత సురక్షితముగా అనుగ్రహి హింప బడటం , తక్కువ లోతు లోనే బోరు లో నీరు పడటం ,పుట్టుశిల ను దర్శించు కొను వారికి వారి వారి ఇష్ట దైవం లా వారికి కనిపించడం, అంధు రాలికి చూపు రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, సంతాన భాగ్యం కల్పించడం భూమి పూజ నుండే అఖండ జ్యోతి తో పూజ లందు కొంటూ ప్రతిష్టకు ముందే ఎందరికో ఎన్నో విధములు గా స్వామి వారు మహిమలు చూపి అనుగ్రహించారు.19-08-2017 న స్థిర ప్రతి ష్టు లైనారు 

ఫ్రత్యెక పూజ కార్యక్రమాలకు సంబందించిన విడియోలు మరియు పోటోలు.

బ్రహ్మగారు కాలజ్ఞానము రాసిన రవ్వలకొండపై వెలసిన స్వయంవ్యక్త(పుట్టుసిల) శ్రీ శ్రీ శ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామిని దర్శించి తరించండి.

ఆలయ అభివృధ్ది , అన్నధానము,పూజకార్యక్రమము కొరకు మీ వంతు సహాయసహకారములు కోరుతున్నాము.

సంప్రదించవలసిన వారు

contact person

బ్యాంకు వివరములు

Bank details

pay All your offerings
and Donations
to this link
బాలిశెట్టి నరసింహమూర్తి

Balisetty Pavana narasimha murthy
ఆలయ కార్యనిర్వాహకులు
Mobile No: 9951773665

Sri pavana chenchu lakshmi sametha
narasimhaswamy temple
Andhra Bank
BANAGANAPALLI
A/C NO: 005911100002643
IFSC :ANDB0000059
Pay here
Balisetty Pavana narasimha murthy
State Bank of India,Banaganapalli
A/c No.: 20356859752
IFSC: SBIN0001179
Pay here

 narasimha

ఈమె ఆలయ కార్యనిర్వాకులైన బాలిశెట్టి పావాన నరసింహమూర్తి గారి మాతృమూర్తి కీర్తిశేషులు శ్రీమతి బాలిశెట్టి సుబ్బనరసమ్మ గారు. వీరి పేరుమీదుగానే ఈ ఆలయ నిర్మాణము చేసినారు. మరియు "అమ్మ" ట్రస్టు ఏర్పాటు చేసి,ఎన్నో ధర్మకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

ITIs

నరసింహక్షేత్రాలు

అహోబిలమ నరసింహ స్వామి దేవాలయం -అహోబిలం 
-------------------------
నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్క్కటైన అహోబిలమ నరసింహ స్వామి దేవాలయం కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కి మీ దూరం లో ఉంది . నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశాపుని చిలిచి చెండాడిన క్షెత్రమిదెనని స్థల పురాణం చెబుతుంది . హిరణ్యకశాపుని చిలిచి చెండాడిన నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం ,అహో బలం అని ఆశ్చర్యంతో పొగడరటా అందుకీ ఈ క్షేత్రానికి అహోబిలమ నరసింహ స్వామి దేవాలయం గా పేరు వచ్చింది అని చెబుతారు . 
బ్రహ్మాండ పురాణం లో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది . 
శ్రీ మహావిష్ణువు ఉగ్రనారసింహ అవతారం లో స్థంబం నుంచి ఉద్బవిన్చినట్లు చెప్పే స్థంబాన్ని కూడా అహోబిలం లో చూడవచ్చు . 
దిగువ అహోబిలం : లక్ష్మి నరసింహ స్వామి శాంతి మూర్తి ఆయె వెలసిన క్షేత్రం ఇది 
ఎనిమిది కి మీ ఎత్తున కొండ పైన ఎగువ అహోబిల నరసింహుని చుడవొచ్చు . హిరణ్య కసపుడిని సంవరించి వికట హట్ట్ హాసాలు చేస్తూ అహోబిలమ కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి . 
(1) భార్గవ నరసింహ స్వామి 
(2) యోగానంద నరసింహ స్వామి 
(3) చత్రపట నరసింహ స్వామి 
(4) ఉగ్ర నరసింహ స్వామి 
(5) వరాహ నరసింహ స్వామి 
(6) మాలోల నరసింహ స్వామి 
(7) జ్వాల నరసింహ స్వామి 
(8) పావన నరసింహ స్వామి 
(9) కారంజ నరసింహ స్వామి 
నవ నరసింహ క్షేత్రాలు . ఫాల్గుణ మాసం లో ఇక్కడ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి . 

2.యాదగిరిగుట్ట ,నల్గొండ జిల్లా,తెలంగాన - జ్వాలా నరసింహ స్వామి
నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహ స్వామి కి ఘనమైన చరిత్ర ఉంది . పూర్వం ఋష్య శ్రున్గుని కుమారుడైన యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహా విష్ణ్వు ప్రత్యక్షమవ్వగా తనకు నరసిమ్హును మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసిమ్హుండు,యోగానంద నరసిమ్హుండు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొన్దపిఅన వెలసాడట . స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.ఇప్పుదు ఈ ప్రదేశాన్ని తొలచి ఇంకా విశాలంగా తిర్చిదిద్దరట. లోనికి దిగేముందు పంచముఖ ఆంజనేయ స్వామి కోవెల ఉంది . ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ పై గండబేరుండ నరసింహమూర్తి ఉంది గర్బ గుడి లో జ్వాల నరసింహ,యోగానంద నరసింహ మూర్తులు ఉన్నాయి . కొండపైన స్వామి వారి పుష్కరాని కూడా ఉంది . ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు, రోగాలు నాయమయిపోతాయని బక్తుల నమ్మకం . " నమో నరసింహయనంహ"

వైద్యో నారాయణో హరిః అన్నారు. అంటే వైద్యుడు ఆ నారాయణుడితో సమానమని అర్థం. అవును నారాయణుడు కూడా వైద్యుడే. అందరికన్నా పెద్ద వైద్యుడు. తనలోని వైద్యుడిని నరసింహావతారంలో నిక్షిప్తం చేశాడు. యాదగిరి గుట్టలో కొలువై వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన వారికి కుదరని రోగం వుండదని భక్తుల నమ్మకం. యాదగిరిగుట్ట నరసింహస్వామి భక్తుల కలలో కూడా కనిపించి వ్యాధులు నయం చేస్తారన్న నమ్మకం భక్తులో బలంగా వుంది. యాదగిరి గుట్ట కొండ మీద వున్న నృసింహ పుష్కరిణిని యాదవ మహర్షి తవ్వించాడని, ఈ పుష్కరిణికి వ్యాధులను నయం చేసే శక్తి వుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. యాదవ మహర్షి ఎవరో కాదు... ఋష్యశృంగ మహర్షి కుమారుడే యాదవ మహర్షి. ఆయనకు విష్ణువు ప్రత్యక్షం కాగా తనకు మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని వేడుకోన్నా డట. అప్పుడు స్వామి గండ భేరుండ నరసింహ స్వామి, జ్వాలా నరసింహ స్వామి, యోగానంద నరసింహ స్వామి రూపాలు ధరించి కనిపించాడు.

అప్పుడు యాదవ మహర్షి స్వామిని ఎప్పుడూ తన కళ్ళ ఎదుటే ఉండి  పొమ్మని కారాడు. దాంతో స్వామి ఇక్కడే ఉండి  పోయాడు. ఇక్కడి  ఆంజనేయ స్వామికి  ఐదు ముఖాలున్నాయి. అందులో ఒకటి సింహరూపం. ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ మీద గండభేరుండ నరసింహమూర్తి, గర్భగుడిలో జ్వాలానరసింహ, యోగానంద నరసింహమూర్తులు ఉండటం విశేషం నరసింహస్వామి దేవాలయాలకు ఒక ప్రత్యేకత వుంటుంది. దేశంలో ఎక్కడ నరసింహస్వామి దేవాలయం వున్నా, మూల విరాట్ కొండ గుహలోనే వుంటుంది. ఎందుకంటే సింహం కొండ గుహల్లో వుంటుంది కాబట్టి నరసింహస్వామి విగ్రహం కూడా కొండ గుహలోనే వుంటుందని చెబుతారు. ఈ పద్ధతి ప్రకారం యాదగిరిగుట్ట నరసింహస్వామి విగ్రహం కూడా కొండగుహలోనే వుంటుంది.


3.  మాలకొండ(మాల్యాధ్రి)ప్రకాశం - మాల్యాధ్రి లక్ష్మి నరసింహ స్వామి  

అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి పైన తపమాచరించగా లక్ష్మి నారసింహుడు జ్వాల రూపుడై దర్శనమిన్చ్చాదని ,జ్వాల నరసిమున్హి గ కొండ పైన వెలిసారు అని పురాణం గాథ . మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కందుకూరు - పామూరు రోడ్డు లో వలేటివారిపాలెం మండల పరిధి లో ఉండే ఈ ఆలయం ఉన్న కొండలు పూలమాల ఆకారం లో ఉండటం తో ఈ ప్రాంతానికి మాలకొండ ,మాల్యాద్రి అని పేరు వచ్చాయి . ప్రకృతి శోబకు నిలయమైన మాలకొండ ఏకశిలా నిర్మితం కావడం విశేషం . జ్వాల నరసింహుని పూజించిన మారకందేయ ముని సమీపం లోని యేరు లో స్నానం ఆచరించారని అదే మార్కండేయ నది అని చెబుతారు . 

4.సింహాచలం విశాక - క్రొధాకర వరాహ లక్ష్మి నరసింహ స్వామి 

విశాకపట్టననికి 16 కి మీ దూరం లో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున గల కొండ పైన వెలసిన నరసింహ క్షేత్రం ఇది . నవ నరసింహ క్షేత్రాల్లో ఇది ఒకటి . ఈ దేవాలయాన్ని సుమారు 9 వ శతాబ్దమ లో నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి . గర్భాలయం లో స్వామీ వారు వరాహ ముఖం , మానవాకారం ,సింహపు తోక కలిగి ఉంటారు . వరాహ -నరసింహ మూర్తుల సమ్మేళనం లో వెలసిన ఈ స్వామి ని సింహాద్రి అని పిలుస్తారు . ఈ గుడి ముఖ మండపం లో ఒక స్థంబం ఉంది . దానిని కౌగిలించుకొని భక్తులు వరాలు కోరుకుంటే తప్పక నేరువేరుతాయని భక్తుల విశ్వాసం . అద్బుతమైన శిల్ప సంపద ,అందమైన చెక్కడాలు ఎంతో రమణీయంగా ఉంటాయి . "ఓం నమో నరశిమ్హయనంహ " వరాహ పుష్కరాని ---------------------- ఈ పుష్కరాని కొండ క్రింద ఆడవి వరం గ్రామం లో ఉంది . ప్రతి సంవత్సరం పుష్యమాసం లో స్వామి వారు తన దేవేరుల సమేతంగా కొండ దిగి వచ్చి పుష్కరాని లో ఉన్న భైరవ స్వామి ని దర్శించి అనంతరం కొండ కి చేరి స్వామిని దర్శనం చేసుకోవాలని చరిత్ర చెబుతుంది . 

5. ధర్మపురి కరీం నగర్ భార్గవ నరసింహ స్వామి  


ధర్మపురి కి పొతే యమపురి ఉండదు అని చెబుతుంటారు . రాష్ట్రము లో ప్రసిద్ది గాంచిన నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కరీంనగర్ పట్టాన కేంద్రానికి 75 కి మీ దూరం లో ఉంది . పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం , శ్రీ రామలింగేస్వరలయం , మసీదులు ప్రక్క ప్రక్కనే ఉంది అనాది నుంచి శైవ,వైష్ణవ ,ముసిలం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉంది . ఇక్కడ స్వామి వారు యోగానంద నారసింహ స్వామి గ భక్తుల అభిస్తములు నేరవేరుస్తున్నాడు . యమలోకం లో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరి లో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయం నివాసం ఎర్పర్చుకున్నట్లు పురాణం గాథలు చెబుతున్నాయి . ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది . యమ ధర్మరాజు ని దర్శించుకొని నృసింహుడిని దర్శించుకోవడం ఆనవైతి . పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గం లో నడిపించి నలుగు పాదముల ధర్మం తో ఈ క్షేత్రాన్ని పరిపలించినందుకు ధర్మపురి ని పేరు వచ్చింది అని పురాణాలూ చేబుతునంయి

6. వేధాధ్రి కృష్ణా - యోగ నరసింహ స్వామి 

నవ నరసింహ క్షేత్రాలల లో ఒకటైన నరసింహ క్షేత్రం కృష్ణ నది ఒడ్డున చిలకల్లు కి 10 కి మీ దూరం లో విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారి లో ఉంది . ఈ క్షేత్రం లో నరసింహ స్వామి వారు 5 అవతారాల్లో కనిపిస్తాడు . జ్వాల నరసింహ స్వామి వ, సలిగ్రంహ నరసింహ స్వామి,యోగ నంద నరసింహ స్వామి , లక్ష్మి నరసింహ స్వామి , వీర నరసింహ స్వామి అవతారాల్లో దర్శనమిస్తారు . అద్బుతమైన కట్టడాలు,యోగముద్రలో ఉన్న నరస్మిహర్ స్వామి వారు భక్తులకు కనువిందు చేస్తారు . ఇక్కడ జరిగే స్వామి వారి ఉత్సవాలు ఎంతో రమణీయంగా ,కనుల పండుగగా జరుగుతాయి . 

7. ఆంతర్వేధి ఠూర్పు గోదావరి - ఆనంధ నరసింహ స్వామి 
 


పరవళ్ళు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అన్త్రవేది చేరుకోవొచ్చు . చాల పురాతనమైన ఆలయం లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వెలసిన ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . త్రేతా యుగం లో రావణ బ్రహ్మ ను సంహరించి శ్రీ రాముడు బ్రహ్మ హత్య పాతకం నుంచి విముక్తి ని పొందడానికి ఈ క్షేత్రాన్ని ధర్సించాడని పురాణాలూ చెబుతున్నాయి . అలాగే ద్వాపర యుగం లో అర్జనుడు తీర్థ్ యాత్రకు వెళ్తూ ఆగిన తీర్థం అన్త్రవేది . మాగా మాసం లో స్వామి వారికి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగ గ జరుగుతాయి . 

8.మంగలగిరి గుంటూరు పానకాల నరసింహ స్వామి  

నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహ స్వామి దేవాలయం గుంటు జిల్లా మంగళగిరి లో ఉంది .చాల పురాతనమైన దేవాలయం ..దెవలయ గురుంచి మనకు బ్రహమైథ వార్త పురాణం లో వివరించాదం జరిగింది . కొండ మీద వెలసిన పానకాల నరసింహ స్వామి ఎంత పాత్రా తో పానకం పోసిన అందులో సగం త్రాగి సగం వేలకి క్రక్కటం జరుగుతుంది . కొండ గిగువన లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఉంది . దీని ముందు ఎత్తైన గాలి గోపురం ఉంటుంది . 

9.పెంచలకోన నెల్లూరు చత్రవతి నరసింహ స్వామి 
 

నెల్లూరు జిల్లా లోని రాపూర్ మండల కేంద్రం లో గల పెంచల కోన క్షేత్రం లో లక్ష్మి నరసింహ స్వామి స్వయం భు గ వెలసిన క్షేత్రం . నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటి ఆయన పెంచలకోన లో స్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై స్వయం భు గా వెలసిన్ ఉన్నాడు . బక్తుల పాలిట ఇలవేల్పు అయి బక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంమయాడు . హిరణ్యకస్యపున్ని సంహరించి మహౌగ్ర రూపం తో వెళ్తుంటే దేవతలు అందరు బయపదిపోయారు . అల శేష చలం కొండల్లో సంచరిస్తుండగా ఆయనకు చెంచు రాజు కుమార్తె ఆయన చెంచు లక్ష్మి కనిపించింది . ఆమె జగన్మోహన్ సౌందర్యం స్వామిని శాంతింప చేసింది . ఆ తరువాత ఆమెని వివాహం చేసుకొని పెంచలకోన ప్రాంతం లో వెలిసాడు అని స్థల పురాణం చెబుతుంది . 

నెల్లూరు జిల్లాలోని రాపూరు మండల పరిధిలోని పెంచలకోన క్షేత్రములో స్వయంభువుగా వెలసి ఉన్న శ్రీలక్ష్మీసమేత నరసింహస్వామిని భక్తులు తమ పాలిట పెన్నిధిగా ఆరాధిస్తారు. ఇక్కడ దేవదేవేరులు భక్తాభీష్ట ఫలప్రభుదులై కోరిన వరాలు ఇస్తారన్నది భక్తుల విశ్వాసం. కృతయుగమున అవతరించిన విష్ణుమూర్తి నాల్గవ అవతారమే నరసింహ అవతారం. ఈ అవతారంలో స్వామి వారు దుష్టశిక్షణ, శిష్టరక్షణలు చేసేందుకు భూమిపై నవనారసింహులుగా అవతరించినట్లు పురాణ కథనం.

-శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిధిలోని పెంచలకోన క్షేత్రములో స్వయంభువుగా వెలసి ఉన్న శ్రీలక్ష్మీసమేత నరసింహస్వామిని భక్తులు తమ పాలిట పెన్నిధిగా ఆరాధిస్తారు. శ్రీస్వామి వారు లోక కళ్యాణార్ధం కోసం కోన క్షేత్రంలో స్వయంభువుగా వెలిసినట్లు స్థలపురాణం చెబుతోంది. భక్తుల పాలిట ఇలవేల్పు ఆరాధ్యదైవంగా స్వామివారు వెలుగొందుతూ దినదిన వ్రపర్ధమానం చెందుతున్నారు. ఇక్కడ శ్రీస్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై స్వయంభవుగా వెలసి ఉన్నారు. అల్లంత దూరమున ఆదిలక్ష్మి అమ్మవారున్నూ స్వయంభువుగా వెలసింది. ఈ దేవదేవేరులు భక్తాభీష్ట ఫలప్రభుదులై కోరిన వరాలు ఇస్తారన్నది భక్తుల విశ్వాసం.

-దశావతారంలో మేటిగా నరసింహావతారం అంటారు. కృతయుగమున అవతరించిన విష్ణుమూర్తి నాల్గవ అవతారమే నరసింహ అవతారం. ఈ అవతారంలో శ్రీస్వామి వారు దుష్టశిక్షణ, శిష్టరక్షణలు చేసి ముక్త జీవులను తరింపచేయుటకు భూమిపై నవనారసింహులుగా అవతరించినట్లు పురాణ కథనం. ఈ క్షేత్రం చెంచురాజులకు నిలయమైనందున ఉగ్రరూపుడైన నారసింహుడు సుందరాంగి అయిన చెంచువనిత చెలిమితో పెనవేసుకొని శిలారూపమున ఇక్కడ వెలసినట్లు స్థల చరిత్ర చెబుతోంది. ఈ స్వయంభువు వెనుక భాగమున మహా శిల ఉన్నది. ఈ గిరిశిఖరముల నుండి జాలువారు వర్షపునీటి ధార వెండి కరిగించి మూసలో పోయురీతిన స్వచ్ఛంగా ప్రవహించి దిగువ గ్రామాలకు వరప్రసాదియై కండలేరు జలాశయమున కలుస్తున్నది.

ఈ స్వామి చెంచు వనితైన లక్ష్మీదేవిని పెనవేసుకొని అవతరించినందున ఈ ప్రాంతానికి పెనుశిల క్షేత్రమని పేరు వచ్చినట్లుగా చెబుతారు. ఆ పేరు రూపాంతరం చెంది పెంచలకోనగా మారిపోయిందని చెబుతారు. ఈ ప్రాంతం వారు నేటికీ తమ పిల్లలకు పెంచలయ్య, పెంచలమ్మ అని స్వామివారి పేరు పెట్టుకోవడం పరిపాటిగా మారింది. ఈ ఛత్రవటి నారసింహుడు గొల్లబోయను శిలారూపమున అనుగ్రహంచినాడని చెబుతారు.

-ఈ గొల్లపోయిన ఆలయము గోనుపల్లి గ్రామ సమీపాన ఉన్నది. శకుంతలా దుష్యంత చవ్రర్తుల పరిణయం, భరతుని బాల్యక్రీడలతో ఈ పవిత్ర క్షేత్రం పునీతమైందని చెబుతారు. ప్రతి శనివారం ఇక్కడ ఘనంగా పూజలు జరుగుతాయి. శ్రీవారికి జరుగు బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమవుతాయి. శుద్ధ చతుర్ధశి నాడుగరుడసేవ నిర్వహిస్తారు. పూజలు పాంచరాత్ర అగనానుసారం పంచాహ్నికముగా జరుగుతాయి. శ్రీవారి మహోత్సవ పూర్వోత్తర కాలమందు సుమారు ఒక నెల స్వామివారు స్నానాద్యష్టానములను కావించుకొందురని ఈ సమయాన నప్తరుషులు స్వామివారికి దివ్యఛత్రము పట్టెదరని నానుడి. ఈ కారణం చేత స్వామివారికి ఛత్రవటి నారసింహస్వామికి ఆ పేరు సార్థకమైంది.

ఈ ఆలయములో జరిగిన కార్యక్రమాల పోటోలు, వీడియోల కొరకు

స్వర్గప్రాప్తి పుణ్యఫలం

కృష్ణ నిర్యాణం తర్వాత ధర్మరాజు పరీక్షిత్తుకు పట్టం కట్టి విరక్తుడై సర్వం త్యజించి సశరీర స్వర్గప్రాప్తికై ఉత్తర దిశగా పయనమయ్యాడు.
ఆహార పానీయాలు వదలి నిర్మోహియైు దిక్కులు చూడక, ఎక్కడా నిలవక హిమాలయంలో బదరీనాథం దాటి అవిశ్రాంతంగా ముందుకు సాగిపోతున్నాడు. నలుగురు సోదరులు, ద్రౌపది కూడా ఆయన్ను అనుసరిస్తున్నారు. అందరూ స్వర్గారోహణ దివ్యభూమిని సమీపించారు.

అక్కడ ద్రౌపది క్రిందకు పడిపోవడం చూచి భీముడు ఆతురుడై అన్నగార్కి నివేదించాడు. ధర్మారాజు వెనుకకు చూడకనే.. ‘పడిపోనీ, పాంచాలి ప్రవర్తన పక్షపాతమయం. ఆమెకు మన నల్గురికంటే అర్జునుని మీద మక్కువ ఎక్కువ’ అంటూ నిర్లిప్తంగా ముందుకు నడిచాడు. కొద్దిసేపట్లోనే సహదేవుడు పడిపోవడం చూచి భీముడు హెచ్చరించగా - ‘సోదరా! మాద్రీ పుత్రుడు పాండిత్య మద పూర్ణుడు’.. అని పల్కి ధర్మరాజు వెనక్కి చూడక మిగిలిన వారితో ముందుకు సాగాడు. తర్వాత నకులుని పతనం తెలపగా ధర్మరాజు - ‘భీమా! అతనికి తాను అందరికంటే అందగాడిననే అహంకారం. అందుకే పడిపోయాడు’ అని వెనుతిరుగకనే వివరించాడు.

ఇంతలోనే పాండవ మధ్యముని పతనం ప్రారంభమవగా భీముడు భయం-భయంగా, అన్నా! మన ప్రియతమ సోదరుడు గాండీవధారి పార్థుడు కూడా పడిపోతున్నాడని చెప్పగా యుధిష్ఠిరుడు.. ‘పడనీ. నేను గొప్ప విలుకాడినని, విజయుడు ఎప్పుడూ విర్రవీగేవాడు’ అంటూ ముందుకు సాగాడు.

చివరకు ‘అన్నా! నేనూ పడిపోతున్నా అడ్డుపడమ’ని భీముడు ఆక్రోశించగా.. ‘భీమా! నువ్వొక పెద్ద తిండిపోతువి. ఈ లోకంలో నాకన్నా బలవంతుడు లేడని నీకూ అహంకారం. దురభిమానికి పతనం తప్పదు’ అంటూ ఆగక సాగిపోయాడు. అందుకే ‘అభిమానం సురాపానం’.. అంటే అహంకారం మద్యపానంతో సమానమని శాస్త్రం హెచ్చరించింది.

స్వర్గారోహణ శిఖరానికి చేరువౌతున్న ధర్మరాజు, తాను ఒంటరి వాణ్ణి కానని, ఆది నుంచి తనను అనుసరిస్తూన్న ఒక కుక్క తన వెంట ఉన్నదని గుర్తించాడు. శిఖరానికి చేరగానే ఇంద్రుడు ప్రత్యక్షమై ధర్మసుతుని సశరీరంగా స్వర్గానికి ఆహ్వానిస్తూ దివ్యరథాన్ని అధిరోహించాలని కోరగా ధర్మరాజు ‘మహేంద్రా! మొదట నన్నాశ్రయించి వచ్చిన కుక్కను రథమెక్కనివ్వండి, ఆ తర్వాత నేను ఎక్కుతాను’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు.. ‘ధర్మరాజా! శునకానికి స్వర్గలోక ప్రవేశార్హత లేదు. కుక్కను పెంచే వారికీ స్వర్గంలో స్థానం లేదు. ‘స్వర్గే లోకే శ్వవతాం నాస్తి ధిష్ణ్యం’. ఈ క్షుద్ర జీవి నన్ను చూడగల్గటమే గొప్ప.

స్వర్గప్రాప్తి పుణ్యఫలం. ఈ జీవి పుణ్యాత్ముడైతే కుక్కగా ఎందుకు పడతాడు?’ అన్నాడు. ఐతే స్వర్గంతో నాకూ పనిలేదన్నాడు ధర్మజుడు.

‘ఇంద్రా! నా వారంతా నన్ను వదిలివెళ్లిపోయినా వదలక వెంట వచ్చిందీ ఈ శునకం.

నేను దీన్ని పెంచలేదు. ఇదే నన్నాశ్రయించింది. ఆశ్రితుని (శరణాగతుని) త్యజించడం అధర్మం. నేను నా పుణ్యంలో సగభాగం దీనికి ధారపోస్తున్నా.

ఇదీ నాకు తోడుగా వస్తుంది’ అన్నాడు ధర్మరాజు. వెంటనే శునక రూపంలో ఉన్న ధర్మదేవత సాక్షాత్కరించి ప్రసన్నుడై ధర్మస్థిరుడైన యుధిష్ఠిరుని ముందు నిలిచి, నాయనా! ధర్మపరీక్షలో నీవు నెగ్గావు. సశరీర స్వర్గప్రాప్తికి అర్హుడయ్యావని ఆశీర్వదించాడు. కనుక, మృతదేహాన్ని ఏదో కొయ్య ముక్కో, మట్టిగడ్డో పారేసినట్లుగ నేల మీద పడేసి బంధుమిత్రులంతా విముఖులై వెళ్లిపోతారు, ఆ వ్యక్తి చేసిన ధర్మమొక్కటే అనగా పాప పుణ్యాలు మాత్రమే వెంట వెళుతాయి. మృతునికి ధర్మమే మిత్రము.

ధనాన్ని భూమి ,బీరువాలు, బ్యాంకులలోను,
పశువుల్ని గొడ్ల పాకల్లోను,
భార్యను ఇంటి గుమ్మంలోను,
బంధుమిత్రులను శ్మశానంలోను,
దేహాన్ని చితి మీదను, గోతిలోను,
వదలి జీవుడు పరలోక మార్గంలో పోయేటప్పుడు
ధర్మమొక్కటే అతని వెంట ఉంటుంది.

‘ధర్మస్య విజయో భూయాత్‌ అధర్మస్య పరాభవః’-ధర్మము జయించుగాక, అధర్మము నశించు.
సర్వేజనా సుఖినో భవంతు..

నరసింహావతారము

శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు(Nrisimha, Narasimha, Narahari incarnation)- ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలుఅంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ"పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.      .............. ఇక్కడ నొక్కండి

కదిరి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం

కదిరి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం నవ నారసింహ స్వామి దేవాలయాలలో ఒకటి. ఇక్కడి విశేషమేమిటంటే మరే ఇతర దేవాలయాలలో లేనివిధంగా నరసింహస్వామి ప్రహ్లాదుని సమేతంగా దర్శనమిస్తాడు. కాటమరాయుడిగా భక్తులచే కొనియాడబడే ఈ నరసింహస్వామి విశిష్టత చాలా గొప్పది. ... ఇక్కడ నొక్కండి
 

ఆగిరిపల్లి శ్రీ వ్యాఘ్ర లక్ష్మి నరసింహస్వామి దేవాలయం 

దక్షిణాన హిందూ దేవాలయాల్లో ప్రసిద్ధిగాంచినది ఆగిరిపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడి. ఈ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ - నూజివీడు మధ్యన కలదు. ఇదొక ప్రాచీన దివ్య క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులు ఆధ్యాత్మికానికి లోనవుతూ పరవశించిపోతారు. దీనికి శివ కేశవుల క్షేత్రం అనే పేరుకూడా ఉంది. ఇక్కడ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం తో పాటు పరమశివుని గుడి కూడా ఉన్నది. శివరాత్రి పర్వదినం అక్కడ వైభవంగా జరుపుతారు. రాత్రుళ్ళు భక్తులు గుడి ప్రాంగణంలో జాగరణ చేస్తారు. ప్రస్తుతం ఈ గ్రామం సి ఆర్ డి ఏ పరిధిలోకి వెళ్ళింది.
                                                                       .............. ఇక్కడ నొక్కండి

ఆదిశంకరాచార్య గురించి కొన్ని కథలు చదివుంటాము.కాపాలికులు బలి ఇచ్చే సమయంలో,మరోసారి మండనమిశ్రుడు,ఉభయభారతి కథల్లో పరకాయప్రవేశం చేసిన సమయంలో శరీరాన్ని దహనం చెయ్యబోయినప్పుడూ నరసింహస్వామి రక్షించాడని.ఆదిశంకరులు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చెప్పారని చదివాము.

ఇక పదకవితా పితామహుడు అన్నమయ్య విద్యాభ్యాసమంతా అహోబిలం లో జరిగింది,ఇక్కడ కొలువైన నవ నరసింహుల మీదే కాకుండా,కదిరి నరసింహస్వామి మీదా ఎన్నో కీర్తనలను రాసాడు.దశావతారాల్లో ఈ అవతారమూర్తి మీదే ఎక్కువ పాటలు రాసాడనీ అంటారు.  .................................. ఇక్కడ నొక్కండి