శ్రీరామనవమి

Image result for sri rama navami subhakankshalu

శ్రీ రామనవమి శుభాకాంక్షలు

శ్రీ పావన నరసింహస్వామి స్వచ్చంద సేవాదళం కొరకు దరఖాస్తు

శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావననరసింహస్వామి స్వయంవ్యక్త (పుట్టుశిల) పుణ్యక్షేత్రము

భక్తులకు విజ్ఞప్తి

ప్రతి స్వాతికి,పండగ,పర్వదినాలు,దేవాళయ వార్శికోత్సములు మరియు భక్తుల అభీష్టము మేరకు పుట్టినరోజు,వివాహపురోజులలొ భక్తుల కోరికమేరకు జరిగే అన్నదానములు,ప్రత్యేక పూజలు మొదలగు ఎన్నొ కార్యక్రమాలు ఈ దేవాళయములో నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించుటకు స్వచ్చందముగా సేవకుల అవసరము ఎంతో వున్నది.దేవళము తరపున సేవాదళము ఏర్పాటు చేస్తున్నాము. సేవాదళములో పాల్గొనదలచిన వారు www.justview.co ద్వారా మీ పేర్లు నమోదు చేసుకొనగలరు. సేవాదళములో ఎంపికైన సభ్యులకు ఉచితముగా గుర్తింపుకార్డు( Identity Card)ఏర్పాటు చేయబడును.  వివరాలకు చూడండి

 Image result for srirama navami greetings in telugu

శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

Image result for రామరక్షా స్తోత్రం

ITIs

చరిత్ర

రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

ఉత్సవం

ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం(ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.[1][2]

ఉత్సవంలో విశేషాలు

  • ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
  • బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.
  • ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.
  • ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.
  • దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.
  • భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.
  • ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.

రామ రాజ్యం

దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది .

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.

"ర" అక్షరం ప్రాముఖ్యత : చారిత్రికంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు.ముఖ్యంగా రామాయణం, రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది."రవి" అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "Amon Ra" లేదా "Ra" అనేవారు. లాటిన్ భాషలో కూడా "Ra" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. (ఉదా: Radiance, Radium). కడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట ఆలయము కూడా ప్రాచీనమైనది.

ప్రశస్తం

‘రామ’ యనగా రమించుట అని అర్ధం. కాన మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న ఆ 'శ్రీరాముని’ కనుగొనుచుండవలె.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.

దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట! శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు

శ్రీ రామరక్షా స్తోత్రం

Image result for రామరక్షా స్తోత్రం

ఇది శ్రీ బుధకౌశికముని రచించిన శ్రీ రామరక్షా స్తోత్రం పూర్తిపాఠం :


ఓం శ్రీ గణేశాయ నమః, అస్య శ్రీ రామరక్షాస్తోత్ర మంత్రస్య, బుధకౌశిక ఋషిః, శ్రీ సీతారామచంద్రో దేవతా, అనుష్టుప్ ఛందః, సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం, శ్రీరామచంద్ర ప్రీత్యర్ధే, రామరక్షా స్తోత్ర జపే వినియోగః


ధ్యానం:

ధ్యాయే దాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థమ్

పీతం వాసో వసానం, నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నమ్

వామాంకారూఢ సీతా ముఖకమల మిలల్లోచనం నీరదాభమ్

నానాలంకార దీప్తం దధత మురుజటామండలం రామచంద్రమ్.

శ్రీ రామరక్షా స్తోత్రం :

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్

ఏకైన మక్షరం పుంసాం మహపాతక నాశనమ్.
ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్

జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్.
సా సితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్

స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్.
రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్

శిరో మే రాఘవః పాతు భాలం దశరథాత్మజః
కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రః ప్రియః శృతీ

ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః
జిహ్వాం విద్యా నిధిః పాతు కంఠం భరత వందితః

స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్

మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః
సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః

ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్.
జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః

పాదౌ విభీషణ శ్రీదః పాతు రామో ఖిలం వపుః
ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్

స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్.పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మ చారిణః

న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్ రామనామభిః
రామేతి రామభద్రేతి రామ చంద్రేతి వా స్మరన్

నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి.
జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్

యఃకంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః
వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్

అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం.
ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిమాం హరః

తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః
ఆరామః కల్పవృక్షాణాం విరామస్సకలాపదామ్

అభిరామ స్త్రిలోకానామ్ రామః శ్రీమాన్సనః ప్రభుః
తరుణౌ రూపసంపన్నౌ సుమారౌ మహాబలౌ

పుండరీక విశాలాక్షా చీర కృష్ణాజినాంబరౌ
ఫలమూలసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ

పుత్రౌ దశారథ స్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ
శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్

రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘోత్తమౌ
ఆత్తసజ్యధనుషా విషుస్పృశావక్షయాశుగ నిషంగసంగినౌ

రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్.
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా

గచ్చన్ మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః
రామో దాశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ

కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘోత్తమః
వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః

జానకీ వల్లభః శ్రీమా నప్రమేయ పరాక్రమః
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః

అశ్వమేథధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః
రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం సీతావాససమ్

స్తువంతి నామభిర్ది వైర్నతే సంసారిణో నరాః
రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్

కకుత్థ్స్యం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలమ్ శాంతమూర్తిమ్

వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీరామ రామ రఘునందన రామరామ

శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ

శ్రీరామ రామ రణకర్కశ రామ రామ

శ్రీరామ రామ శరణం భవ రామ రామ
శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి

శ్రీరామ చంద్ర చరణౌ వచ సాగ్రణామి

శ్రీరమ చంద్ర చరణౌ శిరసా నమామి

శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే


మాతా రామో మత్పితా రామచంద్రః

స్వామీ రామో మత్సఖా రామచంద్రః

సర్వస్వం మే రామచంద్రో దయాళు

ర్నాన్యం జానే నైవ జానే న జానే.


దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా

పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్.


లోకాభిరామం రణరంగధీరం

రాజీవనేత్రం రఘువంశనాథమ్

కారుణ్యరూపం కరుణాకరం తం

శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే


మనోజవం మారుతతుల్య వేగమ్

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్

వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్

శ్రీరామదూతం శరణం ప్రపద్యే.
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్

ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం
ఆపదా మపర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.
భర్జనం భవబీజానా మర్జనం సుఖసంపదామ్

తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్
రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే

రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః

రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం

రామే చిత్తలయ స్సదా భవతు మే భో రామ మాముద్ధర
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

|| ఇతి శ్రీ బుధకౌశిక ముని విరచితం రామరక్షాస్తోత్రం సంపూర్ణం ||
|| సీతాపతి శ్రీరామచంద్రార్పణమస్తు ||

శ్రీరామ రక్షా స్తోత్రం

శ్రీరామచంద్రుడు యుగపురుషుడు. మానవరూపంలో జన్మించి, మానవుల జీవితాలలో ఉన్న కష్టాలనన్నిటిని అనుభవిస్తూ కూడా ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో, ప్రతి మనిషిని తన జీవితంలో సత్యవాక్పాలన, పెద్దలను గౌరవించడం, తన కన్నా చిన్నవారైనవారిపై ఎలా అనురాగము చూపించాలో, ఎటువంటి పరిస్థితులలో ఎలా ప్రవర్తించాలో, ఒక కొడుకుగా, భర్తగా, అన్నగా, రాజు గా, మిత్రునిగా మరియు తండ్రిగా తన బాధ్యతను, కర్తవ్యాన్ని ఎలా పాటించాలో మానవ జాతికి తెలియజెప్పిన సాక్షాత్ విష్ణుస్వరూపుడు. అటువంటి శ్రీరాముని ఎన్నో రకాలుగా స్తుతిస్తాము. ఈ స్తోత్రాలన్నింటిలో రామరక్షా స్తోత్రానికి ఒక ప్రత్యేక స్థానం కలదు. ఈ రామ రక్షా స్తోత్రాన్ని బుధ కౌశిక ముని రచించారు. ఈ స్తోత్రంలో 38 శ్లోకాలు ఉన్నాయి. శ్రీరాముని మనసారా భక్తి యుక్తులతో ధ్యానించి పూజించేవారు, తమకు రక్షణ నివ్వమని కోరుకునే ఈ స్తోత్రం మనస్ఫూర్తిగా నమ్మి పఠించినవారు, ఆ శ్రీరాముని కృపకు పాత్రులవుతారు. రామరక్షా స్తోత్ర జపం భక్తి శ్రద్ధలతో చేసిన వారికి పాపాలు నశించడమే గాక, శరణాగతి వేడుకొన్న వారికి శ్రీరామ రక్ష ఎల్లవేళలా వెన్నంటి ఉంటుంది. ఈ స్తోత్రం చేసిన వారికి మానసిక ప్రశాంతత, జీవితంలో సుఖశాంతులు మరియు సంతోషము కలుగుననుటలో ఏమాత్రము సందేహము లేదు. మానవ జీవితంలోని ఎన్నో సమస్యలను అధిగమించడానికి తగు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించే అత్యంత సులువైన భక్తి మార్గం రామరక్షా స్తోత్రం. ఎవరికైతే సమస్యలను అధిగమించాలనే సంకల్పం కలుగుతుందో, వారు నిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో పదకొండు సార్లు ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చేయాలి. నిరుద్యోగులు, శత్రుభయం కలిగినవారు, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు, కోర్టు వ్యాజ్యాలు నడుస్తున్నవారు, ఏదైనా ఉద్యోగ లేదా వ్యాపార పరమైన సమస్యలలో చిక్కుకుని సతమతమవుతున్నవారు, మానసిక ఒత్తిడులకు గురవుతున్నవారు ఇలా ఒకటేమిటి జీవితంలో ఇబ్బంది పడే ఎటువంటి సమస్యనుండైనా బయటపడాలంటే సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చేసి, రాముని శరణు వేడితే తప్పక బయట పడి జీవితము సాఫల్యత వెంపు నడుచుటకు తగు మార్గము కనపడుతుంది. ఈ రామ రక్షా స్తోత్రం లోని ఆఖరి శ్లోకమైన, “శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే” జపించడం చేత విష్ణు సహస్ర నామం జపించిన ఫలితం కలుగుతుందని సాక్షాత్తూ ఆ పార్వతీ దేవి శివునితో పలికెను.


శ్రీరామ నవమిన పానకం-వడపప్పు తినడంలో పరమార్థం - Sindu

శ్రీ మహా విష్ణువు అవతారం అయినటువంటి శ్రీరామచంద్రుని జననమును మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటున్నాము. రామనామం రాముని కంటే శక్తివంతమైనది. రామనామం మనల్ని సకల సముద్రాలు దాటించగలదు. రాముణ్ణి స్మరించే పెదాలకు వేరే పానకం ఎందుకు?రాముణ్ణి ప్రతిష్ఠించుకున్న హృదయానికి వేరే కోవెలెందుకు?రాముడి మార్గంలో నడిచేవారికి వేరే దారి ఎందుకు?రాముడి ధర్మాన్ని ఆచరించేవారికి వేరే ధర్మం ఎందుకు?శ్రీరామనవమికి తెలుగువారి లోగిళ్లు కళకళలాడతాయి.
తెలుగు వీధులకు చలువపందిళ్లు గొడుగు పడతాయి. హరికథలు... బుర్రకథలు... పాటలు... శ్రీరామ నీ నామమెంతో రుచిరా...పండగ పూట...ఈ వడపప్పు... పానకం... ఇంకొంత తీపి. ఈ శ్రీరామనవమి రోజు ముఖ్యంగా పానకం వడపప్పును ప్రసాదంగా తీసుకుంటారు. పానకం - వడపప్పు ప్రాముఖ్యత ఏంటి? శ్రీరామ నవమి రోజున అందరిల్లలోనూ పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది ఎండాకాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్యాభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద శాస్త్రజ్ఞుల అభివూపాయం. సీతారాముల కళ్యాణోత్సవం నాటి వివాహ మంగళాక్షతలు అతి పవిత్రం. వాటిని మన ఇంట్లో బియ్యంలో కలుపుకోవాలి. అలా అవి ఆ సంవత్సరమంతా మనింటనే ఉం టాయి. తత్ ఫలితంగా కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది వేదపండితుల భావన. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, దేహారోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. 1. పానకం కావలసిన పదార్ధాలు : బెల్లం : రెండు కప్పులు, మంచి నీళ్ళు : ఆరు కప్పులు, మిరియాల పొడి : రెండు టీ స్పూన్లు, ఉప్పు : చిటికెడు, శొంటిపొడి : టీ స్పూన్, నిమ్మరసం : రెండు టీ స్పూన్లు, (కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు), యాలుకల పొడి : టీ స్పూన్ తయారుచేయు విధానం : 1) బెల్లం మెత్తగా కొట్టి, నీళ్ళలో కలపాలి. 2) బెల్లం మొత్తం కరిగాక, పలుచని క్లాత్ లో వడకట్టాలి. (టీ ఫిల్టర్ తో వడపోయ్యోచ్చు).3) ఇప్పుడు దీనిలో మిరియాలపొడి, శొంటి పొడి, ఉప్పు, యాలుకల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. 2. వడపప్పు: కావలసిన పదార్థాలు: పెసరపప్పు - అర కప్పు, కీరా - ఒక ముక్క, పచ్చిమిర్చి - 1 (తరగాలి), కొత్తిమీర తరుగు- టీ స్పూన్, కొబ్బరి తురుము -టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత తయారు చేయు విధానం: పెసరపప్పును నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో కీరా తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపాలి.


we trustfinity

పరమేశ్వరుడు జపించే శ్రీరామ మంత్రం

పరమేశ్వరుడు, ముక్కంటి అయిన శివుడే విష్ణు స్తోత్రమునకు శ్రీరామ మంత్రాన్ని జపించినట్లు శాస్త్రాలు చెబుతున్నారు. దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ద దశమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటా 

'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని' కనుగొంటూ వుండాలని పండితులు అంటున్నారు. 

ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | 
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు 'రా' అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని విశ్వాసం. అలాగనే 'మ' అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందుచేత శ్రీరామనవమి నాడు శ్రీరాముని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్క మంత్రముతో జపిస్తే చాలునని పండితులు అంటున్నారు.

శ్రీ రామ ధ్యాన శ్లోకాలు

శ్రీ రామ ధ్యాన శ్లోకాలు .....
శ్రీరాముడిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. కింద పేర్కొనబడిన శ్లోకాలను రోజుకోసారైనా పఠించినట్లైతే సకల సంపదలు, శుభ ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. 
*కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||
*ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ | 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
*దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ || 
*రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||
*మనోజవం మారుతతుల్యవేగం 
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం 
వాతాత్మజం వానరయూథ ముఖ్యం 
శ్రీరామదూతం శరణం ప్రపద్యే||
*శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||

Image may contain: 5 people, people standing and people on stage

Girl in a jacket