Norway

we trustfinity

వేదిక మీకు ఆహ్వానము పలుకుతొంది.

మీలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ వేదిక (platform) మీకు అండగా వుంటుండి. కవితలు,వ్యాసాలు, సందేశత్మకమైన విషయాలు, ఆద్యాత్మికము ఏదైనా సరే పంపండి. భాగస్వాములు కండి. ఈ క్రింది దరఖాస్తు ద్వారా పంపగలరు

వేదిక కు పంపే అన్ని విషయాలు ఈ లింకు ద్వారా పంపండి.

బాల్యాన్ని బ్రతకనిద్దాం!

కె.లక్ష్మీవెంకటేష్
తెలుగు పండిట్,. 94405 02732

పలక బలపం పట్టే వయసులో పిల్లలు పలుగు పారా పడుతున్నారు.మనకు పనికి రావనుకున్న వాటిని అపురూపంగా తీసుకొని, వాటి మీదనే జీవనాధారం చేసే పిల్లలెందరో మనకు తారసపడుతుంటారు.
పాలకవర్ల వేటలో మునుగుతూ వాటినే అమూల్యమైన వాటిగా
ఆకలితో ఉన్నవారు భావిస్తే..ఇక ఉన్న వాళ్ళ పరిస్థితి చూద్దాం!
అంతర్జాలానికి అతుక్కుపోయిన
బా‌ల్యాన్ని బాహ్య ప్రపంచంలోకి తిరిగి స్వాగతిద్దాం!
ఆటస్థలాలను ఆదమరుస్తున్న పిల్లలకు
దేహధారుఢ్యాన్ని పెంచే
గ్రామీణ క్రీడలను పరిచయం చేద్దాం!
మది గదిలో కమ్ముకున్న చీకట్లను ఛేదించేందుకు చేయూత నిచ్చి చెడుభావాలను చెరిపేద్దాం!
విజ్ఞానపు వెతుకులాటలో
అజ్ఞానపు దారిపడుతున్న చిన్నారుల జ్ఞాన నేత్రాలను తెరిపిద్దాం!విష సంస్కృతి విస్తరిస్తున్న కాలంలో
పశు సంస్కృతి దరిచేరనీయని
బోధనలకు బాటలు వేద్దాం!
బంధాలను,బాధ్యతలను విస్మరిస్తున్న నేటి తరానికి దేశభక్తిని రంగరించి పోసి
మానవత్వాన్ని ప్రబోధిద్దాం!
పలక బలపం పట్టకముందే పసి మనస్సుల్లో
నూరి పోస్తున్న కులజాఢ్యాలను,మత మౌఢ్యాలను
కూకటి వేళ్ళతో పెకలిద్దాం!
నిండు మనసుతో పెద్దలను,గురువులను
గౌరవిస్తూ నీరాజనాలు పట్టే
యువతను దేశానికి అందిద్దాం!అందరం గర్విద్దాం!దిగజారిపోతున్న సమాజ విలువలను,
శిథిలమైపోతున్న శీల సంస్కారాలను
పతనంకాకుండా కట్టడి చేద్దాం!నిండు మనసుతో నీరాజనాలను పడుతూ
పేదలను,పెద్దలను గౌరవించే యువతను
దేశానికి అందిద్దాం!అందరం గర్విద్దాం!
వయసు మళ్లినవారు,సోమరులు కాదు దేశాన్ని నడిపేవారు?
మంచికోసం,కుటుంబం కోసం,దేశంకోసం ఎవరైతే ఆత్మార్పణం చేస్తారో వారే నిజమైన సేవకులు.
అమ్మా భరతమాతా!నీ బిడ్డలకు ఎవరికైతే ఈ గుణాలు ఉంటాయో వారందరికి నా జోహార్లు!నా జోహార్లు!నా జోహార్లు!
(అన్ని సుఖాలను వదలుకొని దేశ రక్షణ కోసం కాపు కాసే మీరందరికి నా సెల్యూట్!సెల్యూట్!

వ్యక్తిత్వాలు - ఆరు రకాలు

జి. పురుషోత్తం

మనసస్తత్వం కలిగిన వ్యక్తులతో ఎప్పటికి జాగ్రత్తగా ఉండాలి . ఇంకా వీలైతే వారినుండి సాద్యమైనంత దూరంగాను వుండాలి . దీనిని విస్మరిస్తే వారినుండి మనకు కస్టాలు , నష్టాలు కలిగే ప్రమాదాలే ఎక్కువ . దీంతో మన జీవితంలో వున్న కొద్దిపాటి సంతోషం కుడా ఆవిరైపోతుంది .

1. ఇతరుల కష్టాలను చూసి ఆనందించేవారు : ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తుల నుంచి వీలైనంత దూరంగా ఉండటమే బెటర్ . ఎందుకంటే ఇటువంటి వారు ఇతరులు బాధ పడుతుంటే లోలోపల ఆనందిస్తారు . కొన్నిసార్లు అయితే వారి ఆనందం బయటకు కూడా కనిపిస్తుంది . ఇక అందులోనే మహా క్రూయల్ నేచర్ కొందరుంటారు . వీరైతే చుట్టు పక్కల వారికి ఎప్పడు కస్టాలు , నష్టాలు కలిగిస్తూ వారు బాధ పడుతుంటే రాక్షస ఆనందం పొందుతారు . కాబట్టి ఇలాంటి వారికి ఎంత వీలైతే అంత దూరంగా వుండాలి .

2.ఇగో వున్నవారు ; ఇలాంటి వారు మనకు ఎలాంటి హాని కలిగించకున్నా వారివల్ల మనకు ఒక్కోసారి నష్టం కలిగే అవకాశమే ఎక్కువగా వుంటుంది . వీరు మన సక్సెస్ ను చూసి ఓర్వలేరు . ఆ క్రమంలో మనకు ఏదైనా నష్టం తలపెట్టవచ్చు. ఇలాంటి వారు ఎక్కువగా తాము చేసే తప్పులను అంత సులబంగా అంగీకరించరు . వీరికి కుడా దూరంగానే వుండాలి .

3.మోసకారులు : మోసకారులు ఎల్లప్పుడూ తమ స్వార్ధం కోసమే పనిచేస్తారు . తమకు ఏదైనా లబ్ది జరుగుతుందనుకుంటే ఎదుటి వారికి ఏదైనా చేసేందుకు వెనుకాడరు . వీరి సహజ నైజం కారణంగా వీరు ఇతరులతో ఎప్పటికి కలిసి ఉండలేరు . ఇటువంటి వారికి దూరంగానే వుండాలి . నమ్మి మొసపొకూడదు.

4; స్రిలోలురు; ఎల్లప్పుడూ శ్రీల వెంట తిరిగే వారు . వీరినుండి దూరంగానే వుండాలి . వారితో ఎప్పటికైనా ప్రమాదమే . ఇలాంటి వారికి తన , పరాయి అనే బేధం ఉందదు , దీంతో వారు హాని కుడా కలిగించవచ్చు .

5; అత్యాసాపరులు : అతిగా ఆశపడేవారు, స్వార్ధపరుల నుంచి దూరంగా వుండాలి . వారు ఎప్పటికైనా మనకు నష్టం కలిగిస్తారు . ఇలాంటి వారు ఇతరుల నమ్మకాలను , పట్టుదలను , ఆత్మవిశ్వాసాలను తగ్గిస్తారు . ఇతరులు సంతోషపడితే చూడలేరు .

6; ఇతరులను చూసి అసుయపడేవారు : ఇతరులను చూసి ఎక్కువగా ఎక్కువగా ఈర్ష , అసూయలకు లోనయ్యేవారి నుంచి కుడా మనం దూరంగానే వుండాలి . వారితో ఎప్పటికి ప్రమాదాలే పొంచి ఉంటాయి . వారు ఒకరి ఉన్నతిని చూసి ఓర్వలేరు

వేదం ఇలా చెబుతోంది.


“స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయ్యేవ మార్గేణ
మహిం మహీశాః | గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినోభవంతు | అపుత్రాః పుత్రిణః పంతు |
పుత్రిణ స్సంతుపౌత్రిణః | లోకావుయం క్షోభారహితః |
అధనాః సాధనాః సంతు | జీవస్తు శరీదశ్శతమ్||”

“పాలకులు ప్రజలను న్యాయమార్గమున ధర్మబద్ధంగా పరిపాలించుగాక! గోసంతతికి పండితులకు శుభం కలుగుగాక! సంతతి లేనివారికి సంతతి కల్గుగాక! సంతతి వున్నవారికి మానుమ సంతతి కల్గుగాక! ప్రపంచం శాంతితో నిండియుండుగాక! దరిద్రులు ధనమూ పొందుదురుగాక! అందరూ ఏ ఆపదలు కల్గియుండక నూరు సంవత్సరాలు జీవించుదురు గాక!” అని చెబుతుంది వేదం.

పూర్వకాలం ‘దానధర్మం’ ఒక కర్తవ్యంగా ఉండేది. బ్రాహ్మణ వర్ణం వారికి ఇల్లు తప్ప, స్థిరాస్థులు ఉండేవికాదు. విద్యార్జన చేయటం సమాజానికి హితాన్ని బోధించటం, ప్రజలకు విద్య బోధించటం వారి పని. బ్రాహ్మణ బ్రహ్మచారులు ఇంటింటికీ భిక్షమెత్తుకొని వచ్చి గురువుకి సమర్పించేవారు. ఆ విధంగా యాచకం చేస్తూ చదువుకోవాలి. విద్య నేర్పుతున్నందుకు గురువు ఏ విధమైన ప్రతిఫలం ఆశించటం తప్పుగా ఉండేది. అప్పటి ఆ కాలంలో మనకు అల్లోపతి వైద్యంలేదు. ఆయుర్వేద వైద్యం అందరికీ ఉచితంగా అందుతుండేది. బ్రాహ్మణులే ఈ పనిని చేస్తూ ఉండాలి. విద్య, వైద్యం, జ్ఞానం ఎవరూ అమ్మకూడదు. ఎవరూ కొనకూడదు. పొరపాటు జరిగితే శిక్షకు గురికావలసిందే!

ఈనాటికీ బౌద్ధమత ప్రచారకులు “దానధర్మం”తో జీవిస్తూ ధర్మప్రచారం చేస్తున్నారు. బౌద్ధసూక్తి మీకు తెల్సుగదా!

“ధర్మం శరణం గచ్ఛామి !
సంఘం శరణం గచ్ఛామి!
బుద్ధం శరణం గచ్ఛామి!”

ధర్మాన్ని శరణు పొందుతున్నాను! సంఘాన్ని శరణు పొందుతున్నాను.బుద్ధుని (జ్ఞానాన్ని) శరణు పొందుతున్నాను. అంటూ ‘ధర్మయానం’ చేస్తుంటారు.

‘ధర్మోరక్షతి రక్షితః’

“ధర్మాన్ని నీవు రక్షించితే ధర్మం నిన్ను సర్వదా రక్షిస్తూ వుంటుంది.” నీవు ఎపుడు ధర్మాన్ని నిర్లక్షం చేస్తావో ధర్మం నిన్నేపుడూ రక్షించదు.”

ధర్మాన్ని నమ్మాలి – ధర్మాన్ని ఆచరించాలి.

ధర్మాన్ని ఆశ్రయించాలి – ధర్మమార్గాననే నడవాలి. ధర్మాన్ని గౌరవించాలి. శ్రీరాముడు ప్రభుధర్మం కోసమే సీతా పరిత్యాగం చేయవలసి వచ్చింది. ధర్మ మార్గాన నడవటం వల్లనే యుధిష్ఠిరుని ధర్మరాజు అని పిలుస్తున్నాం.

“యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా!
అభ్యుత్దాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్||”

– అని చెప్పాడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్ముడు. పాండవులు ధర్మపరాయణులు కాబట్టే కృష్ణుడు పాండవపక్షాన నిలిచి వారికి సహకరించాడు. అధర్మంతోనే త్రొక్కివేశాడు.

అధర్మపరులను అధర్మంతో ఎదుర్కొనవచ్చు. తప్పుగాదు. ధర్మపరులను అధర్మంతో దెబ్బతీయకూడదు. ఇది పాపకార్యం. ఋతుధర్మంవల్లనే వర్షాలు వస్తున్నాయి. చెట్లు పండ్లు ఫలాలను ఇస్తున్నాయి. కాలధర్మం వల్లనే మనిషి మరణిస్తున్నాడు. సంయోగ ధర్మంవల్లనే మళ్ళీ జన్మిస్తున్నాడు. ‘ధర్మోరక్షతి రక్షితః’


🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
*రెడ్డేరి ఆదం శేఖర్ రెడ్డి* - తిరుమల.

ॐ *హనుమజ్జయంతి ప్రత్యేకం* ॐ
*హనుమజ్జయంతి శుభాకాంక్షలు*

హనుమ - జననం - పొందిన వివరాలు

హనుమంతుని తండ్రి పేరు కేసరి.
అంజన ఆ కేసరి యొక్క భార్య.
అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు.
ఈయన వాయుదేవుని వర ప్రభావమున జన్మించాడు.

హనుమ పొందిన వరాలు:

సూర్యుని ఫలమనుకొని, పొందుటకు ఎగురడం,
సూర్యనివద్డ చూచి రాహువు ఇంద్రునికి ఫిర్యాదు,
ఇంద్రుడు వచ్చి వజ్రాయుధ ప్రయోగం,
ఆంజనేయుని దౌడ(హనుమ)కు తగిలి నిర్జీవుడై పడిపోవడం జరిగింది.
అదిచూసి, వాయుదేవుడు సకల జీవరాశి నుంచి బయటకు వచ్చి సమ్మె చేశాడు.

అప్పుడు బ్రహ్మ దేవతలతో వచ్చి, ఆంజనేయుని పునర్జీవితుని చేశాడు.
వాయువుకి సంతోషం కలిగించడానికీ,
భవిష్యత్తులో దేవతల గొప్పకార్యాన్ని మారుతి నిర్వహించడానికీ, దేవతలందఱినీ మారుతికి వరాలిమ్మన్నాడు.

1. ఇంద్రుడు:
బంగారు పద్మహారమునిచ్చి,
హనుమ అని నామమిడి,
తన వజ్రాయుధము వలన ఏ హానీ కలుగదన్నాడు.

2. సూర్యుడు:
తన తేజస్సులో నూఱోవంతు ఇస్తున్నాననీ,
శైశవ దశనించీ విద్యార్జన స్థితి రాగానే, సకల శాస్త్ర జ్ఞానాన్నీ కలిగిస్తాననీ,
తద్వారా వాక్చతురుడు కాగలడనీ,
శాస్త్రజ్ఞానమందు హనుమతో సరితూగగలవాడు మరొకడుండడనీ అన్నాడు.

3. వరుణుడు:
తన పాశము వలనగానీ, జలములవలనగానీ,
లక్షలకొలది సంవత్రరాల వరకూ మృత్యుభయం ఉండకుండా వరమిచ్చాడు.

4. యముడు:
తన దండము వలన మృత్యువు కలగదనీ,
ఎల్లప్పుడూ ఆరోగ్యభాగ్యాలతో వర్ధిల్లుతాడనీ,
యుద్ధమునందు విషాదగ్రస్తుడు కాడనీ మారుతికి వరాలొసగాడు.

5. కుబేరుడు:
సమరమునందు తన గద ఆంజనేయునికి ఎట్టి ఆపదను కలిగించదన్నాడు.

6. శంకరుడు:
తన వలన గానీ, శూల పాశుపతాస్త్రాది తన ఆయుధాల వలనగానీ హనుమ వధ్యుడు కాడని వరమనుగ్రహించాడు.

7. విశ్వకర్మ:
తాను నిర్మించిన దివ్యశస్త్రములలో ఏ ఒక్కటైననూ రణమందు వధింపజాలదనీ,
చిరంజీవి అవుతాడనీ హనుమకి వరాలిచ్చాడు.

8. బ్రహ్మ:
ఏ బ్రహ్మదండంచేతనూ వధ్యుడు కాడనీ,
దీర్ఘాయువనీ మారుతికి వరాలిచ్చి,

వాయుదేవునితో మారుతిని గూర్చి
శత్రువులను గడగడలాడించగలడనీ,
మిత్రులకు అభయప్రదాత అవుతాడనీ,
యుద్ధంలో శత్రువులకు అజేయుడై వర్ధిల్లుతాడనీ,
కోరుకొన్న రూపాలను పొందగలడనీ,
ఇష్టానుసారంగా అంతటా - వేగంగానూ, నెమ్మదిగానూ సంచరింపగలడనీ,
చిరస్థిరకీర్తితో వర్ధిల్లగలడనీ,
యుద్ధమునందు అతడొనర్చే వీరోచిత సాహసాద్భుతకృత్యాలన్నీ రావణ సంహారానికి కారకాలవుతూ, అవి రామునకు ప్రియము గూర్చుననీ,
లోకాలకు రోమాంచమునూ సంతోషాన్నీ కలిగిస్తాయనీ పేర్కొన్నాడు.

ఆ విధంగా సకల వరాలూ పొందిన శిశువైన మారుతిని అంజనాదేవి వద్దకు తీసుకువచ్చి, ఆమెకు అప్పగించి, వరాలగూర్చి వివరించి వెళ్ళాడు వాయుదేవుడు.

జాంబవంతుడు హనుమ శక్తిని పొగిడి సముద్రలంఘనం చేయించాడు.

మనం కూడా స్వామిని స్తుతిస్తే సకల శుభాలూ కలిగిస్తాడు.
హనుమజ్జయంతి అయిన ఈరోజు ప్రత్యేకంగా
సకల శాస్త్ర పారంగతుడూ, సర్వశక్తిమంతుడూ అయిన హనుమని సేవిద్దాం. మన జీవిత లక్ష్యాలు నెరవేర్చుకొందాం.

*జై శ్రీరామ్ జై జై శ్రీరామ్*
*జై హనుమాన్ జై జై హనుమాన్*

భీష్ముడు ఇచ్చిన అయిదు బాణాల కథ

సేకరణ:సొంటేల ధనుంజయ

మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. ఇంతచేసినా కూడా వారికి వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దుర్యోధనుడు ఒప్పుకోలేదు. కనీసం ఐదు ఊళ్లన్నా ఇప్పించమన్న కృష్ణుని రాయబారమూ చెల్లలేదు. దాంతో కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది. కౌరవులు యుద్ధానికి మంచి సందడిగా సన్నద్ధమయ్యారే కానీ, ఒకో రోజూ గడిచే కొద్దీ పాండవులదే పైచేయిగా కనిపించసాగింది.

యుద్ధంలో తగులుతున్న ఎదురుదెబ్బలకి దుర్యోధనుడి దిమ్మ తిరిగిపోయింది. మనసులో కసి పెరిగిపోయింది. ఓ రోజు రాత్రి ఆ కోపంలో భీష్ముని శిబిరంలోకి అడుగుపెట్టాడు. ‘తాతా! నువ్వు ఈ ప్రపంచంలోనే గొప్ప యోధుడివి. కానీ ఐదుగురు పాండవులని చంపలేకపోతున్నావంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు మా పక్షాన ఉంటూనే వారికి సాయపడుతున్నావేమో అని అనుమానంగా ఉంది,’ అంటూ భీష్ముని తూలనాడాడు.

దుర్యోధనుడు తన విశ్వాసాన్ని శంకించడంతో భీష్ముని మనసు గాయపడింది. పాండవులని ఓడించేందుకు తాను శాయశక్తులా పోరాడుతున్నానని ఎంతగా చెప్పినా లాభం లేకపోయింది. దాంతో తన విల్లంబులోంచి ఓ ఐదు బాణాలు బయటకి తీశాడు భీష్ముడు. వాటిని తన చేత పట్టుకుని ఏవో మంత్రాలు జపించాడు. ఆ తర్వాత వాటిని దుర్యోధనునికి చూపిస్తూ- ‘నా శక్తి యావత్తూ ఈ ఐదు బాణాలకీ ధారపోశాను. వీటితో నువ్వు ఆ పంచపాండవులనీ సంహరించగలవు. రేపు ఉదయం యుద్ధభూమిలో నేను నీకు ఈ బాణాలను అందిస్తాను,’ అని చెప్పాడు.

భీష్ముని చేతిలో ఉన్న ఐదు బాణాలని చూడగానే దుర్యోధనుడి ప్రాణం లేచి వచ్చింది. కానీ వాటిని ఆ రాత్రి భీష్ముని దగ్గర ఉంచేందుకు మాత్రం మనసు ఒప్పలేదు. భీష్ముడు అసలే పాండవుల పక్షపాతి అని అతని అనుమానం. తెల్లవారేసరికి అతని మనసు మారిపోతే ఇంకేమన్నా ఉందా! ఆ బాణాలను పాడుచేసినా ఫర్వాలేదు... పోయిపోయి ఆ పాండవుల చేతికి ఇస్తే తన ప్రాణాలకే ముప్పు కదా! అందుకనే భీష్ముడు వద్దంటున్నా వినకుండా ఆ బాణాలను తనతో పాటు తీసుకుని బయల్దేరాడు.

దుర్యోధనుడికీ, భీష్ముడికీ మధ్య జరిగినదంతా గూఢచారుల ద్వారా శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. రేపు యుద్ధభూమిలో దుర్యోధనుడు ఆ ఐదు బాణాలనీ ప్రయోగిస్తే ఇంకేమన్నా ఉందా! అనుకున్నాడు. ఈ ఆపాయానికి విరుగుడా ఉపాయం ఏమిటా అని ఆలోచించాడు. వెంటనే అతనికి అర్జునుడు గుర్తుకువచ్చాడు. పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకసారి దుర్యోధనుడు వారుండే ప్రాంతానికి దగ్గరలోనే విడిది చేశాడు. ఆ సమయంలో దుర్యోధనుడికీ, గంధర్వులకీ మధ్య ఓ తగాదా చోటు చేసుకుంది. ఆ పోరులో అర్జునుడు, దుర్యోధనుడిని రక్షించాడు. అర్జునుడి సాయానికి ప్రతిఫలంగా దుర్యోధనుడు, తనని ఎప్పుడైనా ఓ వరం కోరుకోవచ్చునని చెప్పాడు. ఆ తతంగమంతా ఇప్పుడు కృష్ణుడికి జ్ఞప్తికి వచ్చింది. వెంటనే అర్జునుడిని పిలిచి తన మనసులోని మాటని చెప్పాడు.

అక్కడ తన శిబిరంలో ఆసీనుడై ఉన్న దుర్యోధనుడు సంతోషాన్ని పట్టలేకపోతున్నాడు. ఈ క్షణంలోనే కురుక్షేత్ర యుద్ధాన్ని జయించినంత సంబరంగా ఉంది అతనికి. ఇంతలో అతని శిబిరంలోకి ఎవరో ప్రవేశించిన అలికిడి వినిపించింది. ఎదురుగా చూస్తే.... అర్జునుడు! ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు సిద్ధంగా ఉండే వారిద్దరూ ఎదురుబొదురుగా ఉన్నారు. కానీ మర్యాద కోసం ‘ఏ పని మీద వచ్చావు?’ అంటూ అర్జునుడిని ప్రశ్నించాడు దుర్యోధనుడు.

‘ఒకనాడు నేను నీ ప్రాణాలను కాపాడినందుకు, ఎప్పటికైనా నేను కోరుకున్న వరం ఒకటి ఇస్తానని మాట ఇచ్చావు గుర్తుందా? ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. నీ చేతిలో ఉన్న అయిదు బాణాలనీ నాకు ఇచ్చెయ్యి!’ అని అడిగాడు అర్జునుడు.

అర్జునుడి మాటలకు దుర్యోధనుడు హతాశుడయ్యాడు. కానీ ఒక క్షత్రియుడిగా ఇచ్చిన మాటకి కట్టుబడక తప్పదు. లేకపోతే తన దృష్టిలో తనే దిగజారిపోతాడు. అందుకని నిశ్శబ్దంగా తన చేతిలోని బాణాలను అర్జునుడి చేతిలో ఉంచాడు. భీష్ముడు రేపు ఉదయం యుద్ధభూమిలో ఇస్తానన్నా వినకుండా వాటిని తన దగ్గరే ఉంచుకున్నందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అలా పాండవుల ప్రాణాలను ఎలాగైనా తీయాలన్న దుర్యోధనుడి ఆశ మరోసారి వమ్మైంది. ఈ కథ మూలభారతంలో ఉందో లేదో కానీ జానపద కథల్లో మాత్రం బాగానే వినిపిస్తుంది.

*రెడ్డేరి ఆదం శేఖర్ రెడ్డి* - తిరుమల.

మూడు విధాలుగా కర్మాచరణ
కర్మచేయకుండా ఒక్క క్షణం కూడా మనము ఉండలేం. మన కర్మ ఉద్దేశాలు కూడా మూడు రకాలుగా ఉంటాయి.

అవి

🌺 *1) లోకకల్యాణ కర్మలు*

లోకళ్యాణార్ధం కర్మలు చేసే వారికి స్వార్ధ సంకల్పాలు ఉండవు. వ్యక్తి గత ఇష్టాలు ఉండవు. వారి సంకల్పాలు దైవ సంకల్పంకి లోబడి ఉంటాయి.

దైవేచ్చ ప్రకారం వారి కర్మలు సాగుతాయి.
కొన్ని సందర్భాలలో శాపాలు కూడా తగలచ్చు.

ఉదాహరణకి, దేవతల్ని కాపాడవల్సిన సమయంలో మహావిష్ణువుకి భృగు మహర్షి శాపము తగిలి ఆ శాపము శ్రీరామావతారంలో అనుభవించారు.

అలానే విశ్వకళ్యాణం కోసం మన కర్మలు సాగుతాయి కనక ఆ కర్మఫలాలు మనకి చెందవు. అలాంటి భావము కూడా అంతరంగంలో రాకూడదు. అలాగే ఆ కర్మలు లోకకల్యాణం కోసం కావడం వల్ల వాటికి గుర్తింపు రాదు. అలా గుర్తింపు రాలేదని ఏడవడం ఈ సంప్రదయమునకు విరుద్ధమైనది.

🌷 *2) నిష్కామ కర్మలు లేదా నిస్వార్థ కర్మలు*

కర్మ ఫలాలు ఈశ్వరుడికి సమర్పించడం వల్ల అంతరంగ శుద్ధి ఏర్పడి, ఆ పరమాత్మ మన ఎదురుగా సద్గురు రూపంలో దర్శనమిచ్చి, సాధన చేయించి లోకకల్యాణం కోసం కర్మలు చేసే అర్హత మనకి కలుగచేస్తారు. ఇది ఉన్నత స్థితికి చేరే మార్గం.

🌹 *3) స్వార్ధకర్మలు*

పై రెండు విధాలుగా కాకుండా కేవలం మన స్వార్ధం కోసం (ఇప్పుడు మన మనందరం చేసే కర్మ విధానం) చేసే కర్మల వల్ల మన ఆధ్యాత్మిక ప్రగతికి కానీ లొకానికి కానీ ఎటువంటి ఉపయోగము లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనట్టు ఎన్ని జన్మలెన అలాగే మార్పు లేకుండా ఉంటాము. అంటే ప్రతి జన్మలో జంతువులు లాగా పుడతాం, తింటాము, పిల్లను కంటాం, నిదరుస్తాము, చివరికి చస్తాం, మళ్ళీ పుడతాం. ఇంతే ఇంకేమి ఉండదు మన బ్రతుకులలో.

మూడవరకము గానే ఉందామా? ఎదుగుదామా?

పైవన్ని నిత్యకర్మలకి, నైమీత్తిక కర్మలకి, పూజలకి, యజ్ఞాలకి, యాగాలకి, తీర్ధయాత్రలకి, ఒక్కటి ఏమిటి మనం చేసే సర్వ కర్మలకి ఇది వర్తిస్తుంది.

🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏:
🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
*రెడ్డేరి ఆదం శేఖర్ రెడ్డి* - తిరుమల.
*స్పెషల్ స్టోరీ*
*తిరుమల పుణ్య తీర్ధాలు*

తిరుమలలో ప్రాచీన ముఖ్యతీర్థాలు ?

*1. పాండవ తీర్థము :*
కురుక్షేత్ర సంగ్రామం సమాప్తం అయిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాపాలు పోగొట్టుకోడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్రపాలకుని పూజించి శ్రీనివాసుని దర్శించుకున్నారు. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడంవల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు కలిగింది. ఈ తీర్థం దేవాలయానికి ఉత్తరదిశలో ఉంది.

*2. సనకసనందన తీర్థము :*
సనకసనందనాదులు ఇక్కడ తపం ఆచరించి సిద్ధి పొందిన స్థలం. ఈ తీర్థంలో మార్గశిర శుక్లపక్ష ద్వాదశిరోజున స్నానం చేసినట్లయితే సిద్ధి పొందుతారు. ఈ తీర్థం పాపవినాశనం ఉత్తరభాగంలో ఒక మైలు దూరంలో ఉంది.

*3. కుమారధారా తీర్థము :*
మాఘపౌర్ణమి రోజు ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతానప్రాప్తి కలగటమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ తీర్థం దేవాలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది.

*4. తుంబుర తీర్థము :*
ఈ తీర్థంలో తుంబుర నారదమహర్షి తపస్సు చేసి తరించిన స్థలం. కాబాట్టి ఈ తీర్థంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిరోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానాలు కలిగి సర్వపాపాలు నశిస్తాయి. ఈ తీర్థం ఆలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది. ఈ తీర్థానికి వెళ్ళే దారి మధ్యలో క్షేత్రపురోహితులు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు యాత్రికులకు చలిపందిళ్ళు వేయించి నీరు, మజ్జిగ, పానకాలు ఇస్తారు.

*5. నాగతీర్థం :*
ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలు ఉత్తమ పురుషుని పొందుతారు. శ్రీహరి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.

*6. చక్ర తీర్థం :*
భారత యుద్ధం ముగిసిన తరువాత శ్రీహరి చక్రం పంచ మహాపాతకాలకు గురి అవడం వలన ఈ తీర్థంలో తన సుదర్శన చక్రాన్ని స్నానం చేయించారు. ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మ హత్య, శిశు హత్య దోషాలు తొలగి పవిత్రులు అవుతారు. శ్రీహరి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

*7. జాబాలి తీర్థము :*
ఈ తీర్థంలో జాబాలి అనే మహర్షి తాపం ఆచరించి తరిచారు. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూతప్రేత పిశాచాలు తొలగటమే కాక మనోవాంఛ సిద్ధిస్తుంది. ఇక్కడ ఆంజనేయస్వామివారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి హథీరాంజీ మఠాధిపతులు నిత్య నైవేద్య ఆరాధనలు స్వామివారికి యిస్తారు. ఈ ఆలయం మఠాధిపతుల ఆధీనంలో ఉంది.

*8. బాల తీర్థము :*
నాగతీర్థం నుండి రెండువందల గజాల దూరంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వృద్ధులు సహితం బాలురు అవుతారు. సృష్టికి అవరోధం కలుగుతుందని ఈ తీర్థం శిలలతో మూసివేయబడింది. జలం కనిపించదు.

*9. వైకుంఠ తీర్థము :*
ఈ తీర్థంలో స్నానం చేసినవారికీ వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ఈ తీర్థం కోవెలకు తూర్పు దిశలో ఒక కిలోమీటరు దూరంలో ఉంది. పురజనులు ఇక్కడ వైకుంఠసమారాధన అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు.

*10. శేష తీర్థము :*
ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వారికి మరుజన్మ ఉండదు. ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. జాగ్రత్తగా దాటాలి. ఈ తీర్థం యొక్క విశేషం ఏమిటంటే ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదే కాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది.

*11. సీతమ్మ తీర్థము :*
ఈ తీర్థంలో సీతాదేవి కుశవులకు కరం నూరిపోసింది. బండ అరగటం నేటికీ చూడవచ్చు. ఇక్కడ ఒక బిలం ఉంది. జలం బయటికి కనిపించదు. పొడుగాటి వెదురుకు కొబ్బరి పీచుకట్టి బిలంలో ఉంచి తోడితే నీరు ప్రవహిస్తుంది. ఈ తీర్థంలో స్త్రీలు భక్తితో స్నానం చేసినట్లయితే ముక్తిని పొందుతారు.

*12. యుద్ధగళ తీర్థము :*
ఈ తీర్థంలో రాముడు రావణుని సంహరించిన తరువాత బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశాడు.

*13. విరజానది :*
ఈ నది శ్రీస్వామివారి పాదాల క్రింది భాగంలో ప్రవహిస్తున్నది. ఈ నది పైభాగంలో శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. స్వామివారి రెండవ ప్రాకారంలో పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు ఉంది. ఇది ఒక చిన్న బావిలా కనబడుతుంది. ఈ తీర్థాన్ని తలపై ప్రోక్షించుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది.

*14. పద్మసరోవరము :*
ఈ సరోవరంలో స్నానం చేసినట్లయితే వారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకుండా భూతప్రేతపిశాచాలు వదిలిపోతాయి. ఈ సరోవరం పద్మావతి మందిరం దగ్గర ఉంది. తిరుపతి నుండి ఈ సరోవరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరోవరంలోని జలం స్వర్ణముఖి నదిలో కలుస్తుంది.

*ఇవే కాక*

బ్రహ్మతీర్థము,
కటాహ తీర్థము,
ఫల్గుణి తీర్థము,
వరాహ తీర్థము,
విష్వక్సేన తీర్థము,
సప్తముని తీర్థము,
కాయరసాయ తీర్థం,
పంచాయుధ తీర్థము,
దేవ తీర్థము, లు
వంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.


తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం

❄️ *ఓం నమో వేంకటేశ