పూజల చందా వివరములు

వ.నం పూజ పేరు కాలం రుసుము చెల్లించుటకు లింకు
1

ఈ దేవాళయములో నిత్యధీపారాధన అవకాసము భక్తులకు కల్పిస్తున్నము. సంవత్సరముపాటు నూనెకు అయ్యే ఖర్చును రు 516/- గా నిర్ణయించాము. ఎవరైతే ఈ రుసుము చెల్లిస్తారో వారి గోత్రనామములు స్వామివారికి సంవత్సరముపాటు వినిపించబడును.

ఒక సంవత్సరం
చందాదారుల వివరాలు
Rs 516/- Pay here
2

ప్రతి నెలలో వచ్చు స్వాతికి స్వామి వారికి ప్రత్యేక పూజ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. భక్తులు ఆ కార్యక్రమాన్ని తమ గొత్రనామాలపై జరిపించుకొనుటకు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అందుకు గాను ఒక రోజు స్వాతికి కేవలము రు 2516/- లు చెల్లించవలెను. లేదా మిరే అన్ని వస్తువులు తీసుకురావలెను.

ఒక స్వాతి రోజుకు మాత్రమే

చందాదారుల వివరాలు

Rs 2516/- Pay here
3

ప్రత్యేక పూజ - అన్నదానము భక్తుల అభీష్టము ప్రకారము వారు కోరుకున్న ప్రత్యేక రోజులలొ అనగా జన్మ,వివాహ,ఉద్యోగ,గృహ ఇంకా అనేక శుభప్రదమైన రోజులలో స్వామి వారికి పూజ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడును.

సంవత్సరములో ఒక్కసారిమాత్రమే

చందాదారుల వివరాలు

Rs 2516/- Pay here
4
5

చందాదారుల వివరాలు

6

విరాళములు
ఈ దేవాళయములో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందివున్నది. అవి
1. భక్తులు ఉండుటకు వసతి భవనము
2. అన్నదానము జరిపించుటకు వంట గది
3. స్నానపు గదులు మొదలగునవి.
కావున పై నిర్మాణములకు సహకరించవలసిందిగా కోరుతున్నాము.

చందాదారుల వివరాలు

మీ అభీష్టము (No Limit) Pay here

విరాళములు

దాతల వివరాలు

**ఆలయం నిర్మాణములో ఉన్నది. విరాలములు ఇవ్వగోరు దాతలు ఆలయ కార్యనిర్వాహకులను సంప్రదించండి-పోన్ నం. 9951773665

Name & Family details Donation name Amount Pay link
Y Lakshmi Narayana Reddy
Padmavathi

Amarnatha Reddy
Gotram: veyyi gadapala

kitchen room Rs 1000/- Pay here to renewal

Get Receipt here

శ్రిమతి భారతి & శ్రీ బాలిశెట్టి నరసింహ ప్రసాదు
కుటుంబం.
వజ స్థంభ దాతలు : Rs25000 Pay here to renewal

Get Receipt here

శ్రమతి యం.ఉషా & యం సుబ్బరాయుడు
కుటుంబము
ఆగష్టు2018లో జరుగు
స్వామి కళ్యాణోత్సవ
పూజా సామాగ్రి ధాతలు:
Pay here to renewal

Get Receipt here

ఎ.సుజాతమ్మగారు
మరియు కుటుంబసభ్యులు.
స్వామివారి మరియు అమ్మవారికి పట్టు వస్త్రాలు
,తలంబ్రాల బియ్యం మరియు
అమ్మవారికి మంగళసూత్రం ఆగష్టు2018లో
జరుగు స్వామివారి కళ్యాణోత్సమునకు
Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

[✍🏼 నేటి కథ ✍🏼


సికామోర చెట్టు


ఇద్దరు మిత్రుల ప్రయాణం చేస్తున్నారు. ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా వుంది. ఉక్క పోస్తోంది. ఇద్దరు మిట్ట మధ్యాహ్నం ఎండలో బాగా అలిసిపోయారు.

కొంత సేపు అలసట తీర్చుకుని ప్రయాణం కొనసాగిద్దామని నిశ్చయించుకున్నారు.

దారిలో ఒక సికామోర చెట్టు (అశ్వత్ధ వృక్షము) కనిపించింది. ఆ చెట్టు విశాలంగా వుంది. పెద్ద పెద్ద శాఖలు, వాటికి ఒత్తుగా ఆకులు, ఆ చేట్టుకింద మంచి నీడ. ఎండ లోంచి ఆ చెట్టు నీడలోకి రాగాని హాయిగా, చల్లగా, ప్రశాంతంగా అనిపించింది.

ఇద్దరు మిత్రులు చెట్టుకింద ఒక దుప్పటి వేసుకుని వారితో తెచ్చుకున్న భోజనం తిని, కాస్సేపు హాయిగా కునుకు పాట్లు పట్టారు. సాయంత్రానికి కొంచం ఎండ తగ్గి చల్లారాక, వారి దారిని బయలుదేరుతూ, “ఈ చెట్టుకి అస్సలు పూలు కాని, పళ్ళు కాని ఏమి లేవు. అసలు ఇలాంటి చెట్టు దేనికి పనికొస్తుంది” అనుకుంటూ వెళ్ళిపోయారు.

ఇది విన్న చెట్టు బాధ పడింది. ఇంత సేపు ఆశ్రయము, నీడని ఇచ్చి, తన ఆకులతో గాలి అందించినా ఆ ఇద్దరికీ కృతజ్ఞత లేదు అనుకుంది చెట్టు.

మనకి మేలు చేసిన వారిని మెచ్చుకో గలగడం కూడా ఒక గుణం. అది అందరిలో వుండదు.

 💐💐💐గౌతమ బుద్ధుడు చెప్పిన 10 ఆసక్తికరమైన సూక్తులు 🙏🙏🙏

1."ధ్యానాన్ని ఒక పనిపగా చెయ్యకు. ప్రతి పనినీ ఒక ధ్యానం గా చెయ్యి."

2."కాలాన్ని వృధా చేయడమంటే, నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే."

3."మన లోపల శత్రువు లేనంత వరకు మన బయటి శత్రువు మనను భయపెట్టలేడు."

4."మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనల్లోనే."

5."ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే, మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి."

6."మీరు వెయ్యి యుద్ధాల్లో వెయ్యి మందిపై విజయం సాధించి ఉండొచ్చు. కానీ, తనపై తాను విజయం సాధించినవారే అసలైన విజేత."

7."నిజం మాట్లాడండి. కోపాన్ని దరిచేరనీయకండి. ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంతలో కొంత సాయం చేయండి."

8."చెడును దూరం పెట్టండి, మంచిని పెంచండి. మనసును శుద్ధి చేసుకోండి."

9."ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు."


10."మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి."
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు.

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116. కందకు కత్తి పీట లోకువ
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118. కీడెంచి మేలెంచమన్నారు
119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124. కూటికి పేదైతే కులానికి పేదా
125. కొరివితో తల గోక్కున్నట్లే
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127. కొత్తొక వింత పాతొక రోత
128. కోటిి విద్యలు కూటి కొరకే
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
131. కృషితో నాస్తి దుర్భిక్షం
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
137. మెరిసేదంతా బంగారం కాదు
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
141. మనిషి మర్మము.. మాను చేవ...
బయటకు తెలియవు
142. మనిషి పేద అయితే మాటకు పేదా
143. మనిషికి మాటే అలంకారం
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
149. మొక్కై వంగనిది మానై వంగునా
150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
151. మొసేవానికి తెలుసు కావడి బరువు
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు
157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159. నవ్వు నాలుగు విధాలా చేటు
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
161. నిదానమే ప్రధానము
162. నిజం నిప్పు లాంటిది
163. నిమ్మకు నీరెత్తినట్లు
164. నిండు కుండ తొణకదు
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172. ఊరు మొహం గోడలు చెపుతాయి
173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174. పాము కాళ్ళు పామునకెరుక
175. పానకంలో పుడక
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
178. పండిత పుత్రః పరమశుంఠః
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188. పిచ్చోడి చేతిలో రాయిలా
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191. పిండి కొద్దీ రొట్టె
192. పిట్ట కొంచెము కూత ఘనము
193. పోరు నష్టము పొందు లాభము
194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199. రామాయణంలో పిడకల వేట
200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204. రౌతు కొద్దీ గుర్రము
205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207. సంతొషమే సగం బలం
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు.🙏

గొప్ప నీతి కథ..

అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని.

దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. 40 ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్ర భవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.

అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు.
🍃🍃🍃
అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది.

నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, 'నేను వెళ్తున్నా' అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.

ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.

నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా' ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.💓

అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా! కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.

అవును! ప్రతిధ్వనించింది ఆత్మ.

వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.

అనుభవించాలా? ఎలా?

నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపు కున్నాను.

ఇవి కాక గ్యాస్, అల్సర్ ఉండనే వున్నాయి కదా!ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి.

నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట

అడుగు తీసి అడుగు వేయ డానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు.

నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను?

ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా?

నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం?

నేనుండేది నీ శరీరంలో. అదే నా అసలైన ఇల్లు కదా! నా ఇంటికి ఉన్న 9-ద్వారాలకూ సమస్యలే.

నాకు రక్షణ లేదు. సుఖం లేదు.

అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు .. డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా?

నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా?

ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు.

ఇంకొకడిని అణగతొక్కడానికి నాతో కుట్రలు చేయించావు.

ఎన్నిసార్లు నన్ను పగ, ద్వేషంతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా, చేసావో గుర్తు తెచ్చుకో.

రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా?
ఇక నేనుండలేను వెళ్తున్నా!

👪 ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువ య్యింది.
దాంతో ఈ రోజు, ఈక్షణాన్ని ఆనందించడం మరచి పోతున్నాడు.
దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?🙇