మహాభారతం

తెలుగు ప్రజలకు నన్నయ్య, తిక్కన, ఎర్రన్న రచించిన మహాభారతాన్ని.. 18 పర్వాలను వ్యాఖ్యానింపజెసి 15 పుస్తకాలుగా టీటీడీ ఉచితంగా అందిస్తుంది. ఈ అవకాన్ని ఉపయోగించుకుని అందరు డౌన్లోడ్ చేస్కోండి.

మీకు కావాల్సిన సమాచారం పైన క్లిక్ చేస్తే క్షణాలలో సమాచారం ఓపెన్ అవుతుంది . మీకు ఎంతగానో ఈ సమాచారం ఉపయోగపడగలదు

తిరుమల శ్రీవారి మెట్టు నడక దారి
ఇకపై అలిపిరి మెట్లమార్గం సులువు
తిరుమల చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి
తిరుమల కొండపైన ఏమేమి చూడాలి
అంగప్రదిక్షణ వివరాలు
తులాభారం ఎలా వెయ్యాలి
తిరుమల సేవకు ఎలా వెళ్ళాలి
వెంకన్న అప్పు లక్ష్మి దేవి తీర్చలేదా
తిరుమల లడ్డు మొదటి నుంచి లేదు
తిరుపతి విమానం లో వెళ్లే రోజులు వచ్చాయి
తిరుమల మొదటి సారి వెళ్తున్నారా ?
తిరుమల గురించి ఈ నిజాలు మీకు తెలుసా
తిరుమల రూమ్స్ నెట్ లో బుక్ చేస్కునే సమయం లో ఇవి గుర్తుపెట్టుకోండి
తిరుమలలో మీరు అదే తప్పు చేస్తున్నారా
కపిలతీర్థం ఎలా చేరుకోవాలి
స్వామి వారి పుష్కరిణి ఎలా ఏర్పడింది
తిరుమల లో గుండు ఎందుకు చేయించుకుంటాం
శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఎక్కడికి వెళ్లకూడదా ?
కొత్త జంటకు శుభవార్త
తిరుమల సమగ్ర సమాచారం :
తిరుమల దర్శనం ముందుగా ఎవరు చెయ్యాలి
ఈ నెంబర్ లు సేవ్ చేస్కోండి
కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు
తిరుమల వెళ్లేవారికి నా సలహా
తిరుమల చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు
అరుణాచలం గురించి సమగ్ర సమాచారం
ఏడూ కొండల పరమార్ధం ఏమిటి
తిరుమల వెళ్లే చంటి పిల్లల తల్లిదండ్రులకు
గోవింద రాజుల ఆలయ చరిత్ర

 
*తిరుమల పుణ్య తీర్ధాలు*

తిరుమలలో ప్రాచీన ముఖ్యతీర్థాలు ?

*1. పాండవ తీర్థము :*
కురుక్షేత్ర సంగ్రామం సమాప్తం అయిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాపాలు పోగొట్టుకోడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్రపాలకుని పూజించి శ్రీనివాసుని దర్శించుకున్నారు. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడంవల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు కలిగింది. ఈ తీర్థం దేవాలయానికి ఉత్తరదిశలో ఉంది.

*2. సనకసనందన తీర్థము :*
సనకసనందనాదులు ఇక్కడ తపం ఆచరించి సిద్ధి పొందిన స్థలం. ఈ తీర్థంలో మార్గశిర శుక్లపక్ష ద్వాదశిరోజున స్నానం చేసినట్లయితే సిద్ధి పొందుతారు. ఈ తీర్థం పాపవినాశనం ఉత్తరభాగంలో ఒక మైలు దూరంలో ఉంది.

*3. కుమారధారా తీర్థము :*
మాఘపౌర్ణమి రోజు ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతానప్రాప్తి కలగటమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ తీర్థం దేవాలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది.

*4. తుంబుర తీర్థము :*
ఈ తీర్థంలో తుంబుర నారదమహర్షి తపస్సు చేసి తరించిన స్థలం. కాబాట్టి ఈ తీర్థంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిరోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానాలు కలిగి సర్వపాపాలు నశిస్తాయి. ఈ తీర్థం ఆలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది. ఈ తీర్థానికి వెళ్ళే దారి మధ్యలో క్షేత్రపురోహితులు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు యాత్రికులకు చలిపందిళ్ళు వేయించి నీరు, మజ్జిగ, పానకాలు ఇస్తారు.

*5. నాగతీర్థం :*
ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలు ఉత్తమ పురుషుని పొందుతారు. శ్రీహరి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.

*6. చక్ర తీర్థం :*
భారత యుద్ధం ముగిసిన తరువాత శ్రీహరి చక్రం పంచ మహాపాతకాలకు గురి అవడం వలన ఈ తీర్థంలో తన సుదర్శన చక్రాన్ని స్నానం చేయించారు. ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మ హత్య, శిశు హత్య దోషాలు తొలగి పవిత్రులు అవుతారు. శ్రీహరి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

*7. జాబాలి తీర్థము :*
ఈ తీర్థంలో జాబాలి అనే మహర్షి తాపం ఆచరించి తరిచారు. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూతప్రేత పిశాచాలు తొలగటమే కాక మనోవాంఛ సిద్ధిస్తుంది. ఇక్కడ ఆంజనేయస్వామివారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి హథీరాంజీ మఠాధిపతులు నిత్య నైవేద్య ఆరాధనలు స్వామివారికి యిస్తారు. ఈ ఆలయం మఠాధిపతుల ఆధీనంలో ఉంది.

*8. బాల తీర్థము :*
నాగతీర్థం నుండి రెండువందల గజాల దూరంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వృద్ధులు సహితం బాలురు అవుతారు. సృష్టికి అవరోధం కలుగుతుందని ఈ తీర్థం శిలలతో మూసివేయబడింది. జలం కనిపించదు.

*9. వైకుంఠ తీర్థము :*
ఈ తీర్థంలో స్నానం చేసినవారికీ వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ఈ తీర్థం కోవెలకు తూర్పు దిశలో ఒక కిలోమీటరు దూరంలో ఉంది. పురజనులు ఇక్కడ వైకుంఠసమారాధన అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు.

*10. శేష తీర్థము :*
ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వారికి మరుజన్మ ఉండదు. ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. జాగ్రత్తగా దాటాలి. ఈ తీర్థం యొక్క విశేషం ఏమిటంటే ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదే కాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది.

*11. సీతమ్మ తీర్థము :*
ఈ తీర్థంలో సీతాదేవి కుశవులకు కరం నూరిపోసింది. బండ అరగటం నేటికీ చూడవచ్చు. ఇక్కడ ఒక బిలం ఉంది. జలం బయటికి కనిపించదు. పొడుగాటి వెదురుకు కొబ్బరి పీచుకట్టి బిలంలో ఉంచి తోడితే నీరు ప్రవహిస్తుంది. ఈ తీర్థంలో స్త్రీలు భక్తితో స్నానం చేసినట్లయితే ముక్తిని పొందుతారు.

*12. యుద్ధగళ తీర్థము :*
ఈ తీర్థంలో రాముడు రావణుని సంహరించిన తరువాత బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశాడు.

*13. విరజానది :*
ఈ నది శ్రీస్వామివారి పాదాల క్రింది భాగంలో ప్రవహిస్తున్నది. ఈ నది పైభాగంలో శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. స్వామివారి రెండవ ప్రాకారంలో పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు ఉంది. ఇది ఒక చిన్న బావిలా కనబడుతుంది. ఈ తీర్థాన్ని తలపై ప్రోక్షించుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది.

*14. పద్మసరోవరము :*
ఈ సరోవరంలో స్నానం చేసినట్లయితే వారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకుండా భూతప్రేతపిశాచాలు వదిలిపోతాయి. ఈ సరోవరం పద్మావతి మందిరం దగ్గర ఉంది. తిరుపతి నుండి ఈ సరోవరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరోవరంలోని జలం స్వర్ణముఖి నదిలో కలుస్తుంది.

*ఇవే కాక*

బ్రహ్మతీర్థము,
కటాహ తీర్థము,
ఫల్గుణి తీర్థము,
వరాహ తీర్థము,
విష్వక్సేన తీర్థము,
సప్తముని తీర్థము,
కాయరసాయ తీర్థం,
పంచాయుధ తీర్థము,
దేవ తీర్థము, లు
వంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.

వేంకటాచల వైభవం - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్ర‌వ‌చ‌నం

వేంకటాచల వైభవం- బాగం-1
వేంకటాచల వైభవం- బాగం-2
వేంకటాచల వైభవం- బాగం-3
వేంకటాచల వైభవం- బాగం-4
ఓం నమో వేంకటేశాయ కలియుగ ... శ్రీ నివాసుడి దివ్యలీలా విశేషాల గురించి, వేంకటాచల మహాత్యం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్ర‌వ‌చ‌నం

శ్రీ వేంకటేశ్వర మహాత్యం - బాగం-1
శ్రీ వేంకటేశ్వర మహాత్యం - బాగం-2
శ్రీ వేంకటేశ్వర మహాత్యం - బాగం-3
శ్రీ వేంకటేశ్వర మహాత్యం - బాగం-4
శ్రీ వేంకటేశ్వర మహాత్యం - బాగం-5
శ్రీ వేంకటేశ్వర మహాత్యం - బాగం-6
*శ్రీవారికి సమర్పించే నైవేద్యం*
వాటి వివరాలను తెలుసుకుందాం...

 తిరుమల అంటే అందరికీ *లడ్డూ* ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి... చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి...

*వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా ?*

*ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా ?*

*ఇవి మాత్రమే కాదు... ఏడుకొండల వాడికి పూట పూటకూ ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం!*

*స్వామి వారికి సకల విధమైన నైవేద్యం గురించి ఎంతమందికి తెలుసు. ...?*

సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి?
ఏమి పెట్టాలి?
ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి? ఎవరు వండాలి,?
ఎలా పెట్టాలి,?
ఎవరు పెట్టాలి?
వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు.

అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది.

ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించరు.

ప్రసాదం వండేవారు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక...

శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు.

*నేవైద్యం పెట్టేది ఇలా...*

ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు.

గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు.

స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు.

విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు.

కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. (స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.) పవిత్ర మంత్రాలు ఉచ్ఛరిస్తూ అన్నసూక్తం నిర్వర్తిస్తారు.

చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే.

ఈ విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు.

నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు.

రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు.

ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు.

పది, పదకొండు గంటల మధ్య రాజభోగం, రాత్రి ఏడు - ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు.

తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు.

నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు.

ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.

*ఉదయం బాలభోగం*

మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి

*మధ్యాహ్నం రాజభోగం*

శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం

*రాత్రి శయనభోగం*

మరీచ్యఅన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం(వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం)

*అల్పాహారాలు*

లడ్డు, వడ, అప్పం, దోసె.. స్వామి మెనూ ఇదీ...

ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవుపాలు సమర్పిస్తారు.

తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు.

ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది.

అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది.

సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి... స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు.

అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు!

అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గూడాన్నం) పెడతారు.

ఇక పవళించే సమయం దగ్గరపడుతుంది.
ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేంచిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.

Web hosting