బనగానపల్లె

వైకుంఠ ఏకాదశి

     సేకరణ

శ్రీశ్రీ బాలిశెట్టి పావన నరసింహమూర్తి

ఆలయ కార్యనిర్వాహకులు

శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావననరసింహస్వామి స్వయంభూ పుణ్యక్షేత్రము

 రవ్వలకొండ,బనగానపల్లె

Mobile No: 9703379198

బ్రహ్మగారు కాలజ్ఞానము రాసిన రవ్వలకొండపై వెలసిన స్వయంవ్యక్త(పుట్టుసిల) శ్రీ శ్రీ శ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామిని దర్శించి తరించండి.

ఆలయ అభివృధ్ది , అన్నధానము,పూజకార్యక్రమము కొరకు మీ వంతు సహాయసహకారములు కోరుతున్నాము.

వైకుంఠ ఏకాదశి

Web hosting

భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బనగానపల్లె (ఆంగ్లం: Banaganapalle) ఒక చిన్న పట్టణం మరియు మండలము.. కర్నూలు జిల్లాలో నున్న బనగానపల్లె 1790 నుండి 1948 వరకు అదే పేరు కలిగిన సంస్థానంగా ఉండేది.

చరిత్ర

1601లో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా బనగానపల్లె కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్‌ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్‌ బేగ్‌ ఖాన్‌-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన ఫైజ్‌ ఆలీ ఖాన్‌ బహదూరుకు ధారాదత్తమైంది. మొగలు చక్రవర్తిఔరంగజేబు1686లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్‌ ఆలీ మేనమామ, ముబారిజ్‌ ఖాన్‌దయవల్ల ఫైజ్‌ ఆలీ ఖాన్‌ స్థానం పదిలంగానే ఉంది 

బనగానపల్లె సంస్థాన పటము

అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులుగా కొన్నాళ్ళు, ఆ తరువాత 1724లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్‌ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్‌ ఆలీ ఖాన్‌ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో మైసూరు రాజు హైదరాలీ సామ్రాజ్య‌ విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. 1783లోహుసేను మరణించాక, అతని కుమారుడు, చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన టిప్పు సుల్తాను వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు హైదరాబాదులోతలదాచుకున్నారు. మళ్ళీ 1789లో బనగానపల్లెకు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని చెంచెలిమల జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.

1800 తొలినాళ్ళలో బనగానపల్లె బ్రిటిషు ఇండియాలో ఒక సంస్థానంగా మారిపోయింది. ఆర్థిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి, 1905లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. 1901లో బనగానపల్లె సంస్థానం 660 చకి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది, మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి. 

1948లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; మద్రాసు రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో భాగమయింది. 1953లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి.

రవ్వలకొండ0

 రవ్వలకొండ
 
బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువులకాపరి గా ఉంటూ రవ్వలకొండ లో కాలజ్ఞానం వ్రాసారు. ఆవుల చుట్టూ గీతగీసి రవ్వలకొండ లో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లె కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఈ కొండ గుహాలలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసారు కనుక కొండలను 'బ్రహ్మంగారి కొండలు' అని కూడా పిలుస్తారు.

కాపరిగా ..

తల్లిని వదిలి పుణ్యక్షేత్రాల యాత్రకై బయలుదేరిన బ్రహ్మంగారు బనగానపల్లె చేరుకున్నారు. పగలంతా ప్రయాణం చేయటంతో బాగా అలిసిపోయిన స్వామి వారు అక్కడ కనిపించిన అరుగు మీద పడుకున్నారు. ఆ అరుగు గరిమిరెడ్డి అచ్చమాంబ ఇంటిది

ఉదయాన్నే అచ్చమ్మ, తన ఇంటి అరుగు మీద నిద్రిస్తున్న బ్రహ్మంగారిని చూసి, ఆయన వివరాలను అడిగి తెలుసుకుంది. తాను బతుకుతెరువు కోసం వచ్చానని, తనకేదైనా పనప్పజెప్పమని కోరగా ... తన దగ్గర ఉన్న పశువులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ.
అలా పశువుల కాపరిగా మారిన బ్రహ్మంగారు రోజూ రవ్వలకొండపైకి పశువులను తోలుకెళ్లేవారు. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో ఇక్కడే కాలజ్ఞానం వ్రాయాలని నిశ్చయించుకొన్నారు. అక్కడే ఒక తాటిచెట్టు ఆకులను తెంచుకొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెబుతారు.

తాను వెళ్ళి కాలజ్ఞానం రాసుకుంటూ కూర్చుంటే పశువుల సంగతి ఏంకాను? అని గ్రహించిన బ్రహ్మగారు ... వాటిని ఒక మైదానంలో వదిలేసి వాటి చుట్టూ గీత గీశారు. గోవులు ఆ గీతను దాటకుండా మేతమేసేవి.
 ఒకనాడు ఈ విషయాన్ని గ్రహించిన కొంత మంది కాపరులు అచ్చమ్మకు తెలిపారు (కొందరు అచ్చమ్మనే అయన పనిని గ్రహించటానికి వెళ్ళింది అంటారు). అచ్చమ్మ కొండ పైకి వెళ్ళి చూస్తే పశువులు ఏకాగ్రతతో మేత మేయటం గ్రహించింది.
 గుహలో వెళ్ళి చూస్తే, బ్రహ్మంగారు ధ్యాన ముద్రలో ఉంటూ ఆకుల మీద కాలజ్ఞానం వ్రాస్తూ కనిపించారు. అది చూసిన ఆవిడ ఆయన్ను ఒక జ్ఞానిగా భావించింది. తానూ ఇన్నాళ్ళు సేవలు చేయించుకుంది ఒక జ్ఞానితోనా ?? అని బాధపడిన అచ్చమ్మ, స్వామిని క్షమించమని వేడుకుంది. తనకు జ్ఞాన బోధ చేయమని కోరింది.
 పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది.
 ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు.
అచ్చమ్మ ఇంట్లో యధాప్రకారం కాలజ్ఞానాన్ని వ్రాసి, ఒక చోట పాతిపెడుతూ ఉండేవారు పోతులూరి. ఆ పత్రాలను పాతిన చోట ఒక చింతచెట్టు ను నాటారు. ఆ గ్రామానికి ఏదైనా ప్రమాదం, ఆపద వస్తే సూచనగా ఆ చెట్టు యొక్క పుష్పాలు రాలిపోతాయని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం.
 బ్రహ్మం గారు నివసించిన గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇల్లు. ఇక్కడ చెట్టు కిందే కాలజ్ఞాన తాళపత్రాలు నిక్షిప్తం చేశారు. ఇంటిని మ్యూజియంగా మార్చారు.
 బ్రహ్మం గారి జీవితానికి సంబందించిన విశేషాలు ఇక్కడ చూడొచ్చు. బ్రహ్మం గారు ఇక్కడ నుంచే రోజు రవ్వలకొండకు ఆవులను తోలుకు వెళ్ళి అక్కడ వాటిని కట్టి, అక్కడి గుహలో కాలజ్ఞానం రాసేవారు.
 

రవ్వలకొండ

చింతమాను మఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

నేలమఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం,బనగానపల్లె

స్వామివారిని చూసిన ప్రదేశం

గుహలో వివిధ ప్రాంతాలకు వెళ్ళవచ్చు

రవ్వలకొండ