పూజల చందా వివరములు

వ.నం పూజ పేరు కాలం రుసుము చెల్లించుటకు లింకు
1

ఈ దేవాళయములో నిత్యధీపారాధన అవకాసము భక్తులకు కల్పిస్తున్నము. సంవత్సరముపాటు నూనెకు అయ్యే ఖర్చును రు 516/- గా నిర్ణయించాము. ఎవరైతే ఈ రుసుము చెల్లిస్తారో వారి గోత్రనామములు స్వామివారికి సంవత్సరముపాటు వినిపించబడును.

ఒక సంవత్సరం
చందాదారుల వివరాలు
Rs 516/- Pay here
2

ప్రతి నెలలో వచ్చు స్వాతికి స్వామి వారికి ప్రత్యేక పూజ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. భక్తులు ఆ కార్యక్రమాన్ని తమ గొత్రనామాలపై జరిపించుకొనుటకు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అందుకు గాను ఒక రోజు స్వాతికి కేవలము రు 2516/- లు చెల్లించవలెను. లేదా మిరే అన్ని వస్తువులు తీసుకురావలెను.

ఒక స్వాతి రోజుకు మాత్రమే

చందాదారుల వివరాలు

Rs 2516/- Pay here
3

ప్రత్యేక పూజ - అన్నదానము భక్తుల అభీష్టము ప్రకారము వారు కోరుకున్న ప్రత్యేక రోజులలొ అనగా జన్మ,వివాహ,ఉద్యోగ,గృహ ఇంకా అనేక శుభప్రదమైన రోజులలో స్వామి వారికి పూజ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడును.

సంవత్సరములో ఒక్కసారిమాత్రమే

చందాదారుల వివరాలు

Rs 2516/- Pay here
4
5

చందాదారుల వివరాలు

6

విరాళములు
ఈ దేవాళయములో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందివున్నది. అవి
1. భక్తులు ఉండుటకు వసతి భవనము
2. అన్నదానము జరిపించుటకు వంట గది
3. స్నానపు గదులు మొదలగునవి.
కావున పై నిర్మాణములకు సహకరించవలసిందిగా కోరుతున్నాము.

చందాదారుల వివరాలు

మీ అభీష్టము (No Limit) Pay here

నిత్యధీపారాధన

దాతల వివరాలు

Name & Family details start Date Renewal Date Pay link
Y Lakshmi Narayana Reddy
Padmavathi

Amarnatha Reddy
Gotram: veyyi gadapala

01-04-2018 31-03-2019 Pay here to renewal
Get Receipt here
Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

 

Norway

రావి చెట్టును పూజించుట వలన కలుగు ఫలితములు ఏమిటి? 

రావి చెట్టును పూజించుట వలన కలుగు ఫలితములు ఏమిటి? అని గ్రంధ పఠనం చేస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుస్తున్నాయి.అశ్వత్ధ వృక్షం అని దేవనాగరిక భాషలో పిలుస్తారు , హిందీలో పీపల్ జాడ్ అంటారు. దీనికే బోది వృక్షం అని పేరు కూడా ఉంది.ఈ రావి చెట్టులో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణములో నారదుడు వివరించాడు. అశ్వత్ధమే శ్రీమన్నారాయణ స్వరూపము.ఈ వృక్షం యొక్క మూలము భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు,చివరి భాగములో శివుడు ఉంటారు.
త్రిమూర్థుల స్వరూపమైన ఈ చ్జెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించుకున్నట్లే అవుతుంది.ఈ చెట్టు చిరకాలం జీవించునది కాబట్టి దీనిని బోదిదృవు అంటారు.అనగా ఈ చెట్టు క్రింద యోగ సమాధి స్థితిలో కూర్చుని తపస్సు చేస్తే మోక్షం కలుతుందని పూర్వం ఋషులు తపస్సు చేసేవారు.బుద్ధునికి జ్ఞానోదయం కలిగింది ఈ చెట్టు క్రిందనే.ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో కూడ నెలవై ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాది దేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోవులు, నాలుగువేదాలు ఉంటాయి.
అశ్వత్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు.అశ్వత్ధ వృక్షం మూలములో 'అ' కారము, మానులో 'ఉ ' కారము, అది ఇచ్చే పళ్ళలో 'మ' కరము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమే .అశ్వత్ధ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.
ప్రదక్షిణలు మరియు పూజించు విధానము :రాగి చెంబులో నీళ్ళను పోసుకుని అందులో చిటికెడు పసుపు,కుంకుమ ఒక పువ్వు వేసుకుని అవకాశం ఉంటే కొన్ని పచ్చిపాలు పోయాలి.అగర్బత్తి,చక్కర,పూలు మొదలగు పూజ వస్తువులను తీసుకుని వెళ్ళి ఆ చెంబులోని నీళ్ళను చెట్టు మొదల్లలో(వేర్లకు) పోస్తూ నీ మనస్సులో ఏ కోరిక ఉందో మనసులో స్మరించు కోవాలి.ఆ తర్వత తీసుకు వెళ్లిన చక్కరను చెట్టు చుట్టూ చల్లాలి.దీపం,అగర్బత్తి మొదలగునవి వెలిగించిన తర్వతప్రదక్షిణలు చేయాలి ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.ఎట్టి పరిస్థితులలో కూడా చెట్టును తాక కూడదు, కేవలం శనివారం మాత్రమే తాకాలి ప్రదక్షిణలు అనేవి 11 సార్లు చేయాలి. ఈ క్రింది అశ్వత్ధ వృక్ష స్తోత్రమును పఠించాలి.
మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతో విష్ణురూపిణే
అగ్రత శ్శివరూపాయ
వృక్షరాజయతే నమః
ఈ మంత్రాన్ని చదవలేము అనుకున్నవాళ్లు "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనుకుంటూ ప్రదక్షిణలు చేసినను మంచి ఫలితం దక్కుతుంది.లేదా చదువు వచ్చిన వాళ్లు మౌనంగా నిధానంగా నడుస్తూ విష్ణు సహస్ర నామాలను చదువుతూ నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు అలాగే చివర అశ్వత్ధ వృక్షానికి నమస్కారించాలి.
అశ్వత్ధ వృక్ష పూజా ఫలము వలన సంతాన సమస్య ఉన్నవారుబిడ్డలు కలగాలనే సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితోతాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే ఆపద్ మృత్యు భయం పోతుంది.ఇక్కడ కొట్టిన కొబ్బరికాయను తప్పక అక్కడే భక్తులకు పంచాలి.ఇంటికి తీసుకపోకూడదు.ఎన్నో దివ్వ్య ఔషదగుణములు కలిగిన ఈ చెట్టు ఆనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది.కంచుక అనే ఒక భయంకర వ్యాధికి ఈ ప్రపంచంలో ఎక్కడైన ఏ చికిత్సకు తగ్గని ఈ వ్యాది కేవలం నిష్టాగరిష్టులైన విశ్వబ్రాహ్మణుల పూజాతత్రంచే తగ్గుతుంది.రోగి వ్యాధి నివారణ కొరకు వారు చెట్టునకు పూజించి ఎవరి కంట కనపడకుండా ఆ చెట్టు ఒకే కొమ్మకు ఏడు ఆకులు ఉన్నదానిని తెంపుకుని జాగ్రత్తగా ఇంటికి తెచ్చి దానికి ప్రత్యేక పూజచేసి ఆ ఏడు ఆకులకు జాజుతో దోష నివారణగల యంత్రాన్ని గీసి ధూపం వేసి రోగి శరీరానికి పై నుండి క్రిందకు ఏడు సార్లు దిగతుడుస్తారు.ఇలా ఏడు మంగళవారాలు చేయడంతో అదోక మాయలాగ రోగి రోగం తగ్గిపోతుంది.విచిత్రం ఏమిటంటే దీనికి ఏ మేడిసిన్ కూడా పనిచేయవు.డాక్టర్లకు అంతుపట్టదు.ఇలా అనేక రోగ, గ్రహాదోషాల నుండి విముక్తులను చేస్తుంది.అర్ధాష్టమ శని,అష్టమ శని,ఏలినాటిశని నడుస్తున్నవారు శనివారంనాడు అశ్వత్ధ ( రావి ) వృక్షాన్ని చేతితోతాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించిన శనిదోషం తొలగిపోతుంది.
అశ్వత్ధ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం
కోణస్థ: పింగళో బభ్రు:కృష్ణో రౌద్రాంతకోయమః
శౌరీ శ్శనైశ్చరో మందఃపిప్పిల దేవ సంస్తుతః
రావి ఆకులను మేకలు ఇష్టపడి తింటాయి ఇది మీరు ఎప్పుడైన గమనించారా ? ఈ ఆకులలో అనేక ఔషదగుణాలు ఉండడంచేత మేక కడుపులో ఆయుర్వేద వైద్యమునకు పనికి వచ్చే మేకరాళ్లు తయారు అవుతాయి.ఈ మేకరాళ్లు ఎంతో విలువైనవి.ఈ చెట్టులో విద్యుత్తు ఉంటుంది, అందుకే మనల్ని తాకకూడదు అని చెప్పారు.మీకు ఒక సందేహం కలగవచ్చు చెట్టులో విద్యుత్తు ఉంటే మనం ముట్టుకుంటే షాక్ రావడం లేదు కదా అనిపించ వచ్చు.ఆ మద్య కాలంలో న్యూస్ పేపర్లో ఈ చెట్టు ప్రత్యేకత సైంటిఫిక్ ఆధారలు తెలుపుతూ ఆర్టికల్ వచ్చింది.రావి ఆకుతో సెల్ ఫోన్ చార్జ్ చేయవచ్చు అని (దీనిలో విద్యుత్తు ఉందని ఋజువు చేసారు).
దీనిని సూక్ష్మంగా గమనిస్తే అర్ధం అవుతుంది.చెట్టువిద్యుత్తును ప్రసారంచేస్తుంది.సప్తధాతువులతో కూడినది మానవ శరీరం కాబట్టి మనం చెట్టును తాకితే దానిలో ఉండే విద్యుత్తు వలన మనలో ఉండే దాతువులు షాకునకు గురు అయ్యి కొంత శక్తిని కోల్పోతాయి కాబట్టి సైంటిఫిక్ గా ఆలోచిస్తే అర్ధం అవుతుంది.నార్త్ ఇండియన్స్ ఈ చెట్టు ఎక్కడ ఉన్న ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
ఈ చెట్టునకు ఇంకో పురాణ కధకూడ ఉండి. లక్ష్మిదేవి అక్క జేష్టాదేవి ఈ చేట్టు మొదల్లలో అంటే వేరులలో విష్ణుదేవుని ఆజ్ఞ ప్రకారం నివాసమై ఉంది.ఈ దేవతనే దరిద్రలక్ష్మి అని అంటారు.చెట్టును తాకుతే జ్యేష్టాదేవి పట్టుకుంటుంది అని ఒక గ్రామీనులు విశ్వస్తారు.దీనికి సైంటిఫిక్ కారణం పైన తెలుసుకున్నాం.ఆధ్యాత్మీకంగా చూసినా,వైజ్ఞానికంగా చూసిన అసలు చెట్టును తాకరాదనే తెలుస్తుంది.విజ్ఞతతో ఆలోచించి ప్రవర్తిసే ఆరోగ్యంతో కూడిన సౌఖ్యం కలుగుతుంది.
మహిమాన్వీతమైన ఈ చెట్టు లేనిదే దేశంలో ఆంజనేయ స్వామి గుడి ఎక్కడా ఉండదు. మన పూర్వీకులన ఋషులు వారి తప: శక్తితో అనుభవపూర్వకమైన ప్రయోగాల ద్వారా గ్రహించి మనకు వారి అమూల్యమైన సూచనలు ఇచ్చారు.అర్ధం చేసుకుని ఆచరించిన వారికి అన్ని మంచే జరుగుతాయి.

Image may contain: plant, nature and outdoor


Image result for online shop images

శివ శబ్దం….

శివ సహస్రనామంలో వేయి నామాలున్నాయి. శివ శబ్దానికి 48 పర్యాయపదలున్నాయి. అవి:

శంభు రీశ: పశుపతి: శివ: శూలీ: మహేశ్వర: భూతేశ: ఖండ పరశు: గిరీశో గిరిశోమృడ: ఈశ్వర: శర్వ ఈశాన: శంకర: చంద్రశేఖర: మృత్యుంజయ: కృత్తివాసా; పినాకీ ప్రమధాదిప: ఉగ్ర: కపర్దీ శ్రీకంఘ: శితి కంఠ: కపాలభృత్
వామదేవో మహాదేవ: విరూపాక్ష: త్రిలోచన:
కృతానురేతా: సర్వజ్ఞో ధూర్జటి: నీలలోహిత
స్మరహరో, భర్గ: త్ర్యబకం త్రిపురాంతక:
గంగాధరోంధకరిపు: క్రతుధ్వంసీవృషధ్వజ:
వ్యోమకేశ: భవోభీమ: స్థాణు: రుద్ర ఉమాపతి:

శివుడు ఎప్పుడు మంగళకారుడుగా ఉంటాడో, అప్పుడు ‘శంకరుడు’ అనబడుతున్నాడు. ప్రాణులకు రక్షణ కలిగించేటపుడు రక్షకుడు అనబడుతున్నాడు. ఎప్పుడు పర్వతేశుడో అప్పుడు గిరీశాఅని, కైలాసంలో ఉన్నప్పుడు గిరీశ: అని పిలుస్తారు. సంహారం కావిస్తున్నప్పుడు రుద్రుడని పిలువబడుతున్నాడు. ఇలా శివ నామానికి పర్యాయపదాలు ఉన్నాయి. ఆ స్వామిని ఏ పేరుతో పిలిచినా తన భక్తులను కాపాడుతుంటాడు.

Image may contain: 1 person

కనక మహాలక్ష్మి అమ్మవారు:
====================
విశాఖపట్నం లోని బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు కోవెల చాల ప్రసిద్ధమైనది. ఈ అమ్మవారు స్వయంభువు. ఈ అమ్మవారు స్థానికంగా ఉన్న ఒక బావిలో దొరికిందని, ఆ విగ్రహానికి 1912లొ స్థానిక రాజులు కోవెల కట్టించారని ప్రతీతి.

ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే, భక్తులు తము స్వయంగా మూలవిరాట్టుకు పూజలు చేసుకోవచ్చు. అభిషేకాలు చేసుకోవచ్చు. ఇక్కడ మార్గశిర మాసంలో పూజలు చాల విశేషంగా జరుగుతాయి. మొత్తం మాసం లో దాదాపు 10 లక్షల మంది భక్తులు వైజాగ్, చుట్టుపక్కల ప్రాంతాలనుండి, పక్క రాష్ట్రాల నుండి కూడా విచ్చేసి అమ్మవారి పూజలు చేసుకుంటారు. ఈ అమ్మవారిని, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, సత్యమైన తల్లిగా, స్త్రీలకూ సౌభాగ్యం ప్రసాదించే తల్లిగా నమ్ముతారు.

మార్గశిర మాసం ప్రత్యేకించి లక్ష్మివారం, అంటే గురువారం ఈ తల్లికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో ఇందులో పాల్గొంటారు.

ఇక్కడ జరిగే అన్నదానంలో పాల్గొనడాన్ని అన్నదాన ప్రసాదం స్వీకరించడాన్ని భక్తులు తమ పుణ్యంగా భావిస్తారు. మార్గశిర మాసంలో ప్రతిరోజూ అన్నదానం జరుగుతుంది. లక్ష్మివారం నాడు విశేషించి భక్తులు అన్నదానంలో పాల్గొంటారు.

మార్గశిర లక్ష్మివారమ్ సాధారణ రోజువారీ పూజలే కాక, విశేష పూజలు, విశేష అభిషేకాలు, లలిత సహస్ర పారాయణ, భగవద్గిత పారాయణ, హరికథ కాలక్షేపం వంటివి కూడా నిర్వహించబడతాయి.

Image may contain: 1 person, indoor