తెలుగు కవులు - బిరుదులు

తెలుగు కవులు, రచయితలు తమ రచనల ద్వారా వివిధ బిరుదులను పొందారు. రచనలు చేసిన విధానం ద్వారా, ఇతరులను అనుసరించిన విధానం ద్వారా, రచనలోని గొప్పదనం ద్వారా పలువురు పలురకాల బిరుదులను పొందారు. వీటిలో కొన్ని రాజులు, సాహితీ పోషకులు, సాహిత్య సంస్థలు ఇచ్చినవి కొన్ని. కొందరు కవులు, రచయితలు తమకు తామే చలామణి చేసుకున్నవి కొన్ని ఉన్నవి. కొందరు కవులు, రచయితలు తమ సొంత పేర్లకన్న బిరుదులతోనే విశేష ప్రాచుర్యం పొందినవారూ ఉన్నారు. కొందరు కవులు వారి బిరుదులు...

తెలుగు కవులు - బిరుదులు

 సాయి పురోహితాలయము

ప్రాచీన తెలుగు కవుల కవితా తత్త్వము

తెలుగు సాహిత్యానుశీలనకు విమర్శ సిద్ధాంతాలుగా ఇంతవరకు సంస్కృతాలంకారికుల సిద్ధాంతాలే ఆధారమయ్యాయి. కావ్యాన్ని, కవిత్వ తత్వాన్ని, కావ్య హేతువులను, కావ్య ప్రయోజనాలను సంస్కృతాలంకారికుల దృష్టితోనే పరిశిలించే దశ ఇప్పుడు కూడా ఉంది. దీనికి కారణం తెలుగులో సమగ్రమైన కావ్య తత్వ శాస్త్రాలు లేకపోవడమే. ప్రసిద్దులైన తెలుగు సాహిత్య విమర్శకులు కూడా సంస్కృత లక్షణ గ్రంథాలమీదే ఆధారపడి విమర్శ సిద్దాంతాలను వెలయించారు. దీనికి కారణం దాదాపుగా ఆధునిక యుగం వచ్చే వరకు తెలుగు సాహిత్యం సంస్కృత సాహిత్యం మీదనే ఆధారపడి ఉండడమే. ప్రతి కావ్యము మార్గ రీతిలో రచింపబడడమే. సంస్కృత భాషా సాహిత్యాలు తెలుగు భాషా సాహిత్యాలపైన గాఢమైన ప్రభావాన్ని చూపడమే.

తెలుగు కవులు తమ కావ్య అవతారికలలో తమ కవిత్వాన్ని గురించి వివరించే దశలో కొన్ని సిద్ధాంతాలను చేశారు. వీటిని సమగ్రంగా పరిశిలించి తెలుగు కవుల కవిత్వ తత్వాన్ని గురించిన సిద్ధాంతాలను వివరించడమే ఈ వ్యాస ఉద్దేశం. ప్రాచీన తెలుగు కవులు-కవిత్వ తత్వము

మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు

ఈ వ్యాసాన్ని కొన్ని కథలతో మొదలు పెడతాను. మనం ఆదికావ్యం అనుకునే రామాయణాన్ని గురించి, ఆదికవి అనుకునే వాల్మీకిని గురించి చాలామందికి తెలిసిన కథ ఒకటుంది. ఇప్పుడు వాల్మీకి రామాయణం అనే పేరుతో సంస్కృతంలో అచ్చయే రామాయణ పుస్తకాలు అన్నింటి లోను ఈ కథ వుంటుంది. ఈ రామాయణం రెండవసర్గలో వాల్మీకి తమసా నదిలో స్నానం చేయడానికి వెళ్తాడు. ఆయనతో పాటు ఆయన శిష్యుడు భరద్వాజుడు కూడా వెళ్తాడు. ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయం ప్రశాంతమనస్కుడైన వాల్మీకి హాయిగా ఉన్న రెండుపక్షులను చూస్తాడు. అవి క్రౌంచపక్షులు. ఒకటి ఆడ, ఇంకొకటి మగ. ఆ పక్షులు రెండూ హాయిగా మైథునానందంలో మైమరచి వున్నాయి. ఆ సమయంలో ఒక బోయవాడు (నిషాదుడు) ఆ రెండింటిలో మగపక్షిని చంపుతాడు. చచ్చిపోతున్న మగపక్షిని చూసి ఆడపక్షి ఏడుస్తూ వుంటుంది. ఆ విషాద దృశ్యాన్ని చూసి అప్రయత్నంగా వాల్మీకి నోటి నుంచి శాపరూపమైన ఈవాక్యం1 వినిపిస్తుంది.

మా నిషాద ప్రతిష్టామ్ త్వమగమశ్శాశ్వతీస్సమాః
యత్క్రౌంచమిథునాదేక మవధీః కామమోహితమ్

  పదండి ముందుకు

తాళ్ళపాక కవుల వివిధసాహితి పక్రియలు

విజయనగర తెలుగు వాజ్మయముపై దాని ప్రభావము; అది తాళ్ళపాక కవుల. విస్తృత రచనలయందు స్నిగ్ధ గంభీర ఘోషము చేసిన విధానము, ఈయన్ని. టిని డాక్టరు ఆనందమూర్తిగారు బహుళ శ్రమతో, విపుల భావనా బలముతో,. పరిశోధనాసక్తితో , రచనా నైపుణ్యముతో ఆ సిద్ధాంత వ్యాసమునందు. పొందు పరచిరి.

పదండి ముందుకు

we trustfinity

ఆధునిక యుగం-సాహితీకారులు

కొందరు సాహితీకారులు బహుముఖ ప్రజ్ఞాశాలురు (ఉదాహరణ: కందుకూరి వీరేశలింగం, విశ్వనాధ సత్యనారాయణ). అనేక రంగాలలో ఖ్యాతి వహించినవారు. అటువంటివారి పేర్లను కేవలం వర్గీకరణ కోసం ఈ క్రింద ఏదో ఒక ప్రధాన శీర్షికలో చేర్చవచ్చును. (కాని ఒకే వ్యక్తి పేరును ఇక్కడ ఒకటికంటె ఎక్కువ శీర్షికలలో చేరిస్తే గందరగోళంగా ఉండవచ్చును. అయితే ఆ వ్యక్తి గురించిన వ్యాసంలో అన్ని వర్గాలనూ పేర్కొనవచ్చును.) 

ఆధునిక యుగం సాహితీకారుల జాబితా

Let's see

 
 

తెలుగు సాహితీకారుల జాబితాలు 

ఎందరో మహాను భావులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. వారి గురించి తెలుసుకొనడానికి ఇది ఒక వేదికగా, ఒక సూచికగా ఉపయుక్తమయ్యే జాబితా.

ఒక్కొక్క కాలానికి చెందిన రచయితలను ఒక్కో వ్యాసం (జాబితా)లో ఉంచాలి. జాబితాల పేర్లు దిగువన ఇవ్వబడ్డాయి. ఆధునిక యుగంలో వివిధ సాహితీ ప్రక్రియలు పరిఢవిల్లినందున ఆధునిక యుగంలో ఒక్కో విభాగానికి ఒక్కో జాబితా ఏర్పరచబడింది. కొందరు (ఉదాహరణ: గురజాడ, విశ్వనాధ) చాలా జాబితాలలోకి వస్తారు. అన్ని జాబితాలలోనూ వారి పేర్లు వ్రాయవచ్చును.

రచయితలతో బాటు వారి రచనలను కూడా వ్రాయాలి. ఒక్కో రచయితకూ ఒక్కో వ్యాసం, ఒక్కో (ముఖ్య)రచనకూ ఒక్కో వ్యాసం వికీలో ఉండాలని ఆకాంక్ష. విశ్వనాధ వంటివారి రచనలు పెద్ద జాబితా అవ్వవచ్చును. అటువంటి చోట వారి రచనల జాబితాకు (లేదా వారి గురించిన వ్యాసానికి) లింకు ఇవ్వవచ్చును.

తెలంగాణ ఆధునిక కవులు

అక్షరశిల్పులు

ఈ పుస్తకంలో మొత్తం 333 కవులు, రచయితలు, అనువాదకుల వివరాలను పొందుపర్చారు. ఈ ప్రముఖుల విశేషాలను పొందుపర్చడానికి మార్చి 2008 లో ఒక ప్రకటన చేసారు. అందులో భాగంగా 242 మంది రచయితలు వారి వివరాలను పుస్తక రచయితకు నేరుగా పంపారు. వీటితో పాటు అనేక పుస్తకాలలో గల వారి వివరాలను కూడా చేర్చి "కవులు రచయితల జాబితా"ను తయారుచేసారు. ఆ కవుల సాధారణ నామాలను పరిగణనలోకి తీసుకొని వారి జాబితాను ఆంగ్ల అక్షరక్రమంలో పొందుపర్చారు. ఈ కవుల జీవిత విశేషాల కోసం వివిధ గ్రంథాలను మూలాలుగా తీసుకొని ఆయా మూలాల జాబితాను పుస్తక చివరి పుటలలో పొందుపర్చారు. 

పుస్తకంలో గల కవుల,రచయితల జాబితా