పంచపాండవులు

యుధిష్ఠిరుడు (ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు)

భీముడు లేదా భీమసేనుడు- వృకోదరుడు

అర్జునుడు- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు

నకులుడు

సహదేవుడు

ధృతరాష్ట్రునకు నూటవొక్క (౧౦౧) మంది సంతానము.

ఇతని కుమారులు అయినటువంటి కౌరవుల సంఖ్య శతము (౧౦౦).

వీరికి ఒక సోదరి కూడా వున్నది. ఆమె పేరు దుస్సల.

కౌరవుల పేర్లు :

1.దుర్యోధన

2.దుశ్శాసన

3.దుస్సహ

4.దుశ్శల

5.జలగంధ

6.సామ

7.సహ

8.వింద

9.అనువింద

10.దుర్దర్శ

11 సుబాహు

12 దుష్ప్రదర్శన

13 దుర్మర్శన

14 దుర్ముఖ

15 దుష్కర్ణ

16 కర్ణ

17 వికర్ణ

18 శాల

19 సత్వ

20 సులోచన

21 చిత్ర

22 ఉపచిత్ర

23 చిత్రాక్ష

24 చారుచిత్ర

25 శరాసన

26 దుర్మద

దుర్విగాహ

వివిత్సు

వికటాసన

ఊర్ణనాభ

సునాభ

నంద

ఉపనంద

చిత్రభాను

చిత్రవర్మ

సువర్మ

దుర్విమోచ

అయోబాహు

మహాబాహు

చిత్రాంగ

చిత్రకుండల

భీమవేగ

భీమబల

బలాకి

బలవర్ధన

ఉగ్రాయుధ

సుసేన

కుండధార

మహోదర

చిత్రాయుధ

నిశాంగి

పాశి

బృందారక

దృఢవర్మ

దృడక్షత్ర

సోమకీర్తి

అనుదార

దృఢసంధ

జరాసంధ

సత్యసంధ

సదాసువాక్

ఉగ్రశ్రవస

ఉగ్రసేన

సేనాని

దుష్పరాజయ

అపరాజిత

కుండశాయి

విశాలాక్ష

దురాధర

దృఢహస్త

సుహస్త

వాతవేగ

సువర్చస

ఆదిత్యకేతు

బహ్వాశి

నాగదత్త

అగ్రయాయి

కవచి

క్రధన

భీమవిక్రమ

ధనుర్ధర

వీరబాహు

ఆలోలుప

అభయ

దృఢకర్మణ

దృఢరథాశ్రయ

అనాధృష్య

కుండాభేది

విరావి

చిత్రకుండల

ప్రమథ

అప్రమథ

దీర్ఘరోమ

వీర్యవంత

దీర్ఘబాహు

సువర్మ

కనకధ్వజ

కుండాశి

విరజ

యుయుత్సు

ఋషి చరితం

భరత ఖండం పుణ్యతపోభూమి. భారతీయ ఆదిమ సాహిత్యమైన చతుర్వేదములు. వేదవ్యాఖ్యానాలైన బాహ్మణాలు, వేద జ్ఞానమును సుబోధకం చేయుట కోసం దోహదపడు ఆరణ్యకాలు, వేదాల్లోని ఆధ్యాత్మిక తత్తమునూ, వేదాంతంగా అభివర్ణించబడే ఉపనిషత్తులు మహర్షులచే బోధించబడి ఆర్షములనబడినవి. భారతీయ ఆర్ష సంస్కృతిని కాపాడి, వేద పురాణేతిహాసములలోని ఈశ్వరీయ జ్ఞానమును, మానవావశ్యకమైన విషయ సంపదను మంత్రదృష్టలైన ఋషిపుంగవులు మానవులకు అందించారు. అనాదిగా భారతీయత ప్రపంచంలో పూజించబడుతుందంటే దానికి మన ప్రాచీన ఋషుల విజ్ఞానమిశ్రిత ఆధ్యాత్మికతత్తం, సంస్కృతి సంప్రదాయాలే కారణం. ఋషతి గచ్ఛతి ప్రాప్నోతి జానాతీతి వాస ఋషిః అన్నది ఆమ్నాయం ధర్మసాక్షాత్కారమొందిన విజ్ఞులు ఋషులు.

సకల జగతిలో వ్యాపించి అవిచ్ఛిన్నమై ఉన్న పరమాత్మను తెలియజెప్పే జ్ఞానమైన ఆత్మవిద్యా తత్తం సనాతనమైదనీ, సకల చరాచరములలో వ్యాప్తమై ఉన్నదనీ తెలుసుకొని సమదర్శనం చూపించడమే సనాతనధర్మం, అదే ఋషిమతం ఋషులు తమ శక్తియుక్తులనూ, జీవితాలనూ సంపూర్ణంగా దేశక్షేమానికీ, లోక కళ్యాణానికీ వినియోగించిన మహనీయులు.

మహాఋషులు నిరంతరాభ్యాసం ద్వారా వైరాగ్య జీవనం ద్వారా పవిత్ర స్వభావులై వేదవేదాంతాలు అన్వేషించి పరమాత్మయందే సుస్థిరులైన సాధకులు. ఆత్మసాక్షాత్కర సమయంలో అమరులై బ్రాహ్మీభూతలయ్యారు. అన్నివిధాలా ముక్తులయ్యారు. అవాజ్ఞానస గోచరమైన పరిపూర్ణ బ్రహ్మమును మౌనముద్రచే ప్రకటించి, అధ్యాత్మిక విషయం వాస్తవానుభూతితో దర్శించి మానవజాతికి మోక్షమార్గమును చూపించిన ఋషిపుంగవులు జాతి గర్వించదగిన మహోన్నతులు.

ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్ని బోధత-లెమ్ము, మేల్కొనుము, అనుభవపరులను సమీపించి ఆత్మజ్ఞానమును పొందుమని జాతిని జాగృతపరచి సనాతన ధర్మయుత భారతీయ సంస్కృతిని ప్రపంచానికి ప్రేరణగా నిలిపిన ఋషిచరితం ఆదర్శప్రాయమైంది, ఆదరణయోగ్యమైనది.

సప్తర్షులు

హిందూ సంప్రదాయములోను, పురాణ గ్రంథాలలోను ఏడుగురు దివ్యశక్తి గల తపస్సంపన్నులను సప్తర్షులు అని ప్రస్తావించారు.

భారత సాంప్రదాయిక ఖగోళ విజ్ఞానంలో ఏడు నక్షత్రాలను కూడా సప్తర్షులు అంటారు. ఈ నక్షత్రాలను ఆంగ్లంలో (ఖగోళశాస్త్రంలో) "Big Dipper" లేదా "Ursa Major" అంటారు.

సప్తర్షులు ఎవరు

మన సంప్రదాయం ప్రకారం పైన చెప్పబడిన ఏడుగురు ఋషులే ఏడు నక్షత్రాలుగా ఆకాశంలో వెలుగుతున్నారు. ఆ సప్తర్షులు...

  1. మరీచి
  2. అత్రి
  3. అంగిరసు
  4. పులస్త్యుడు
  5. పులహుడు
  6. క్రతువు
  7. వశిష్ఠుడు

ఇందుకు మహాభారతంలోని ప్రామాణిక శ్లోకం (శాంతిపర్వం 340-69,70)

మరీచిరంగిరాస్చాత్రిః పులస్త్యః పులహః క్రతుఃవశిష్ఠ ఇతి సప్తైతే మానసా నిర్మితాహి తేఏతే వేదవిదో ముఖ్యా వేదాచార్యాశ్చ కల్పితాఃప్రవృత్తి ధర్మణశ్చైవ ప్రాజాపత్యే చ కల్పితాః

సప్తర్షుల పేర్లు వివిధ గ్రంథాలలో స్వల్పమార్పులతో కనుపిస్తాయి. "శతపధ బ్రాహ్మణము", "బృహదారణ్యకోపనిషత్తు" (2.2.4) లలో అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు సప్తర్షులని చెప్పబడింది. కృష్ణ యజుర్వేదం (సంధ్యావందన మంత్రం) లో అంగీరసుడు, అత్రి, భృగువు, గౌతముడు, కశ్యపుడు, కుత్సుడు, వశిష్ఠుడు సప్తర్షులని చెప్పబడింది.

సప్తర్షుల లక్షణాలు

సప్తర్షుల లక్షణాలు వాయు పురాణము (16-13,14) లో ఇలా చెప్పబడినవి - దీర్ఘాయువులు, వేద మంత్రకర్తలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్యదృష్టి గలవారు, సద్గుణ సముపేతులు, వేదశాస్త్రాది వివిధ విద్యా సమంచితులు, వయోవృద్ధులు, సర్వ ధర్మ మర్మజ్ఞులు, ధర్మ స్వరూపులు, గోత్ర ప్రవర్తకులు ఈ ఏడు గుణములు గల మహర్షులు "సప్తర్షులు"గా ప్రసిద్ధి వహించిరి. వీరినుండియే వంశములు వృద్ధి చెందినవి, ధర్మ వ్యవస్థ సుప్రతిష్ఠమై సాగుచున్నది.

వీరి జీవన విధానము, భావములను వాయుపురాణంలో (61/95-97) ఇలా చెప్పారు.- అధ్యయనము, అధ్యాపనము, యజ్ఞములు చేయుట, యజ్ఞములు చేయించుట, దానములను ఇచ్చుట, దానములు తీసికొనుట అనే ఈ ఆరు కర్మలను నిత్యము ఆచరించేవారు, విద్యాబోధనకు గురుకులములు నడిపేవారు, సంతాన ప్రాప్తికే గృహస్థాశ్రమమును స్వీకరించిన వారు, అగ్నికార్యములు నిర్వహించేవారు, వర్ణాశ్రమ ధర్మాలననుసరించి వ్యవహారములను నడిపేవారు, స్వయముగా సంపాదించుకొనిన అనింద్య భోగ్య వస్తువులనే అనుభవించేవారు, సంతానము గలిగి గోధనాది సంపదలచే ఒప్పువారు, ప్రాపంచిక విషయాలపట్ల నిరాసక్తులు.

మరీచి

ఇతడు భగవంతుని అంశావతారము అంటాఱు. ఇతనికి అనేకమంది భార్యలున్నారు. వారిలో "సంభూతి" అనే ఆమె ముఖ్యురాలు. ఆమె దక్ష ప్రజాపతికి అతని భార్య ధర్మవ్రత యందు జన్మించింది. మరీచి మహర్షి అధిక సంతానవంతుడు. కశ్యప మహర్షి ఈయన కుమారుడే.

అంగిరసుడు

ఇతడు అసాధారణ ఆధ్యాత్మిక తేజో సంపన్నుడు. ఇతనికి పెక్కురు భార్యలున్నారు. వారిలో ముఖ్యులు సురూప (మరీచి కుమార్తె), స్వరాట్టు (కర్దముని కూతురు), పథ్య (మను పుత్రిక). సురూపకు బృహస్పతి (కొన్ని చోట్ల శుభ అనే భార్యయందు అని ఉంది), స్వరాట్టుకు గౌతముడు, వామదేవుడు మొదలగు ఐదుగురు పుత్రులు, పథ్యకు విష్ణు మొదలగు మువ్వురు పుత్రులు జన్మించారు. అగ్ని పుత్రిక యైన ఆత్రేయ యందు అంగిరసులు జన్మించారు.

అత్రి

ఇతను దక్షిణ దిశకు చెందినవాడు. మహాపతివ్రతయైన అనసూయ (కర్దమ, దేవహూతుల కూతురు, కపిలుని చెల్లెలు) ఇతని ధర్మపత్ని. సీతారాములు తమ వనవాస కాలంలో అనసూయ, అత్రిల ఆతిథ్యం స్వీకరించారు. ఈ దంపతులకు త్రిమూర్తుల అంశతో ముగ్గురు పుత్రులు - దత్తాత్రేయుడు, చంద్రుడు, దుర్వాసుడు - జన్మించారు.

పులస్త్యుడు

ఇతడు మహాధర్మపరుడు, తపస్వి, తేజస్వి, యోగశాస్త్ర నిష్ణాతుడు. ఒకమాఱు పులస్త్యుని అభ్యర్ధన మేరకు పరాశరుడు రాక్షస సంహారార్ధం చేసే యాగం ఆపేశాడు. అందుకు ప్రసన్నుడై పులస్త్యుడు పరాశరుని సకల శాస్త్రప్రవీణునిగా చేశాడు. పులస్త్యుని భార్యలు సంధ్య, ప్రతీచి, ప్రీతి, హవిర్భువు. దత్తోలి, నిదాఘుడు, విశ్వ వసు బ్రహ్మమొదలగువారు పులస్త్యుని కుమారులు. దత్తోలి అగస్త్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనువారు విశ్రవసుబ్రహ్మ కుమారులు.

(కుబేరుడు, రావణుడు, కుంభకర్ణుడు, మరియు విభీషణుడు విశ్రవసుని కుమారులని ఆంటారు. ఒకసారి సరిచూడవలసినది)

పులహుడు

ఇతడు మహా ప్రభావశాలి, జ్ఞాని. సనందన మహర్షి వద్ద దివ్యజ్ఞానము పొంది, దానిని గౌతమునికి అందించెను. దక్ష ప్రజాపతి కుమార్తె క్షమ, కర్దముని కుమార్తె గతి అనువారు పులహుని భార్యలు.

క్రతువు

ఇతడు గొప్ప ఆధ్యాత్మిక తేజస్సంపన్నుడు. కర్దముని పుత్తిక క్రియ, దక్షుని పుత్రిక సన్నతి ఇతని భార్యలు. ఇతనివలన వాలఖిల్యులు అని పేరు పొందిన 60 వేల మంది ఋషులు జన్మించారు. వీరు సూర్యుని రథమునకు అభిముఖంగా నడచుచుందురు.

వసిష్ఠుడు

ఇతడు సూర్యవంశ ప్రభువుల పురోహితుడు. అష్టసిద్ధులు గలవాడు. సనాతన ధర్మమునెరిగినవారిలో ముఖ్యుడు. మహాసాధ్వి అరుంధతి ఇతని ధర్మపత్ని. వసిష్ఠుడు శ్రీరామునకు బోధించిన తత్వజ్ఞాననము యోగవాసిష్ఠము అని ప్రసిద్ధి పొందినది.

Excel To HTML using codebeautify.org పాండవుల :- భార్యలు <
1. పాండవులు - భార్యలు కుమారులు
1. ధర్మరాజు -      ద్రౌపది ప్రతివింద్యుడు
   రేవతి   యౌధేయుడు
     పౌరవతి దేవకుడు
2. భీముడు  -    ద్రౌపది శ్రుతసోముడు
జలంధర  సర్వగుడు
కాళి సర్వగతుడు
  హిడింబ ఘటోత్కచుడు
3. అర్జునుడు  ద్రౌపది శ్రుతకీర్తి
  ఉలూచి ఇరావంతుడు
చిత్రాంగద ఇరావంతుడు
       సుభద్ర  అభిమన్యుడు
 ప్రమీల
4. నకులుడు  ద్రౌపది శతానీకుడు
రేణుమతి నిరమిత్రుడు
 (కరేణుక)
5.సహదేవుడు ద్రౌపది శతానీకుడు
విజయ సుహోత్రుడు
భానుమతి  

శ్రీకృష్ణుడు అష్ట భార్యల పేర్లు మరియు పెళ్లి చేసుకోవడానికి కారణాలు..!!

1. రుక్మిణి:- విదర్భరాజు భీష్మకుని కూతురు రుక్మిణీదేవి సందేశాన్ని అందకొని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకొన్నాడు అన్యాయంగా, బలవంతంగా లాక్కువెళ్ళి పెళ్ళి చేసుకొన్నాడని శిశుపాలుడు ఆరోపించాడు ప్రేమవివాహం.


2. సత్యభామ:- సత్రాజిత్తు కూతురు కృష్ణుణ్ణి అపనిందలకి గురిచేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కూతుర్నిచ్చి పెళ్ళిచేస్తాడు ఈమె భూదేవి అవతారం. గోదాదేవి సత్యభామ అవతారం అని అంటారు.

3. జాంబవతి:- సాధారణంగా రుక్హిణి తర్వాత సత్యభామని గౌరవిస్తున్నాం జాంబవంతుడికి అడవిలో ఒక పాప దొరికితే తెచ్చుకొని పెంచుకున్నాడు ఆమె పేరే జాంబవతి జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు వీణా విద్వాంసురాలు.

4. మిత్రవింద:- కృష్ణుడికి ఐదుగురు మేనత్తలు వాళ్ళపేర్లు పృథ (కుంతి), శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాథిదేవి పృథని శూరసేనుని దగ్గరచుట్టం కుంతిభోజుడు దత్తత చేసుకోవడం వలన కుంతి అని పిలువబడింది పాండవుల తల్లి శృతదేవ కరూశదేశపురాజు వృద్ధశర్ముని భార్య దంతవక్త్ర, విదూరథుల తల్లి శృతకీర్తి (శృతసేన) కేకయరాజు భార్య ఈవిడకి సంతర్థనుడూ మొదలైన కొడుకులూ, భద్ర అనే కూతురూ ఉన్నారు.

ఈమె ఇంకో కొడుకే ఏకలవ్యుడు. ఎందుచేతనో నిషాథరాజు హిరణ్యధన్వుడి దగ్గర పెరుగుతాడు ద్రోణుడికి కుడిచేతి బొటనవేలు గురుదక్షిణగా ఇస్తాడు తర్వాత జరాసంథుడి తరఫున కృష్ణుడితో యుద్ధంచేసి ఆయనచేతిలో మరణిస్తాడు శృతశ్రవ చేదిదేశపురాజు దమఘోషుడి భార్య శిశుపాలుని తల్లి. ఈ శిశుపాలుడు, దంతవక్త్రులే ఒకప్పుడు వైకుంఠంలో కాపలాభటులైన జయవిజయులు సనకసనందుల (సనక,సనంద, సనత్కుమార, సనత్సుజాతులు) శాపంవల్ల మొదటిజన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా,రెండవజన్మలో రావణ కుంభకర్ణులుగా, ఆఖరిజన్మలో శిశుపాల దంతవక్త్రులుగా పుడతారు రాజాథిదేవి అవంతీదేశపు రాజు జయశేనుడి భార్య ఈవిడ కొడుకులు విందానువిందులు, కూతురు మిత్రవింద విందానువిందులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడతారు వీళ్ళ చెల్లెలు మిత్రవింద అన్నల కోరికకి వ్యతిరేకంగా స్వయంవరంలో కృష్ణుని వరించి పెళ్ళిచేసుకుంటుంది ఆమె కోరిక మేరకే బహిరంగంగా స్వయం వరానికొచ్చి అందులోనే ఇతర రాజకుమారులందరినీ ఓడించి చేపట్టాడు పై విషయాలబట్టి తెలుస్తున్నదేమిటంటే, పాండవులు తప్ప, మిగతా మేనత్తల కొడుకులంతా కృష్ణుని శత్రువులే.

5. భద్ర:- మేనత్త కేకయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె ఈమె సలక్షణ సమన్విత జాత్రత్త గల నడవడిక కలది కృష్ణుడికి మేనమరదలి వరుస శ్రీకృష్ణఉనికి ఇద్దరు భార్యలు మేరికం పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.

6. నాగ్నజిత్తి:- అసలుపేరు సత్య. కోసలరాజు నగ్నజిత్తు కుమార్తె నగ్నజిత్తు కృష్ణుడు ఏడు రూపాలను ధరించి ఏడు ఎద్దులను ఒక్కొక్క గుద్దు గుద్ది లొంగదీసుకుని వాటిని తాళ్ళతో బంధించి పెళ్ళి చేసుకున్నాడు నాగ్నజితి కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె ఈ రాజు నగరంలోని ఏడు వృషభములు ప్రజలకు అపాయము చేయుచున్నవి రాజ్యంలో ఎవ్వరును వీటిని పట్టలేకపోతారు రాజు వీటిని పట్టగలవానిని తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని కౌసల్యకు వెళ్ళి ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయమాడెను.

7. కాళింది:- సూర్యుని కుమార్తె. విష్ణువుని భర్తగా కోరి తపస్సుచేస్తే ఈ అవతారంలో ఆమె కోరిక తీర్చాడు కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయటానికి వెళితే ఆవిడ కామవాంచతో కృష్ణున్ని చూచిచినప్పుడు, అర్జునుడు ఆమె వివరగాలు అడిగి ఆమె మనోగతాభిప్రాయం కృష్ణునికి చెప్పి ఇద్దరికి సంధానం చేశాడు గోపాలు ఆమె భక్తికి మెచ్చి ద్వారకకు తీసుకెళ్ళి పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.

8. లక్షణ:- మద్రదేశ రాకుమారి బ్రుహత్సేనుని ముద్దుల కూతురు లక్షణ ఆమె శ్రీకృష్ణుని గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్థ్యం, నారదుని వల్ల విని అతనినే పెండ్లాడ గోరింది దాంతో ఆమె తండ్రి ఏర్పాటు చేసిన స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఛేదించి పెళ్ళాడతాడు స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడు.

భీష్ముడు

మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది.

భీష్ముని జననం

ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు.

ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళతారు. వశిష్ఠుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుగురు వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామధేనువుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు.

వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి, పుట్టిన వెంటనే నదిలో పారవేయ వలసిందిగా కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది.

భీష్మ ఏకాదశి

శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి

మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.

భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.

మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?

ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇత్రులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పాడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.

భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను'అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.

భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మెఘ వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉంది.

ముఖ్యంగా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తీ పూర్వకంగా స్మరించి తదుపరి, ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదాం.

జై శ్రీమన్నారాయణ

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం. ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు, కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్ళాడవచ్చునని సూచిస్తాడు. అది విని ఆమె అంతర్ధానమైపోతుంది.

కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగాతీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్ళి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు. ఆక్షేపించ కూడదు. అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానమైపోతుంది. శంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు.

కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమై పోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలవబడ్డాడు. శంతనుడి కుమారుడు కాబట్టి శాంతనవుడు అయ్యాడు.

భీష్మ ప్రతిజ్ఞ

సంసార జీవితంపైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహమాడాలని నిశ్చయించుకుని శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు. అప్పటికే భీష్ముడిని పుత్రుడిగా కలిగిన శంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి వారు నిరాకరించారు. దానితో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించి, మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకుని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు. ఈ వివాహంకోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి, తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణా బాధ్యతను స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు, అసలు వివాహమే చేసుకోనని భీష్మించి, తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు. ఈ భీషణ ప్రతినకు గాను అతడు భీష్ముడు అని ప్రసిద్ధుడయ్యాడు. తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి, తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణ వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు శంతనుడు.తన తండ్రి కోసం అతను బ్రహ్మచారి గా ఉంచానని ప్రతిఞ చేసిన గొప్ప వాడు.

పరశురామునితో యుద్ధం

తన పినతల్లికి కలిగిన సంతానం చిత్రాంగదుడు, విచిత్రవీర్యులకు తగిన కన్యల కోసం, యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీ రాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలను తెచ్చాడు. పెద్ద కుమార్తె అంబ మాత్రం తాను సాళ్వుని వరించానని చెప్పింది. భీష్ముడు ఆమెను సాళ్వుని వద్దకు పంపించేసాడు. సాళ్వుడు, తాను భీష్మునితో యద్ధంలో ఓడిపోయినందున ఆమెను స్వీకరించనని చెప్పాడు. ఆమె తిరిగి భీష్ముని వద్దకు వచ్చి యుద్ధంలో తనను గెలిచి తెచ్చాడు కాబట్టి వివాహం చేసుకోమని కోరింది. తాను ఆజన్మ బ్రప్మచారిగా ఉంటానని ప్రమాణం చేసి ఉన్నందున భీష్ముడు అందుకు అంగీకరించలేదు.

ఆమె కోపంతో, భీష్ముడి గురువైన పరశురాముణ్ణి శరణు వేడుకుంది. పరశురాముడు తన శిష్యుణ్ణి పిలిచి ఆమెను పెళ్ళి చేసుకోమన్నాడు. ఆడినమాట తప్పనన్నాడు భీష్ముడు. అయితే యుద్ధం తప్పదన్నాడు పరశురాముడు. హోరాహోరీగా సాగిన పోరులో తన శస్త్రాస్త్రాలతో పరశురామునే నిలువరించాడు, భీష్ముడు. చివరకు పరశురాముడు తన గండ్రగొడ్డలిని ప్రయోగించగా, భీష్ముడు పరశురాముడే అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయాగించాడు. రెండూ ఢీకొంటే జగత్ప్రళయం తప్పదని భూదేవివేడుకొనగా ఇద్దరూ తమ అస్త్రాలను ఉపసంహరించుకున్నారు. గురువును మించిన శిష్యుడివయ్యావంటూ పరుశురాముడు భీష్ముణ్ణి ప్రశంసించాడు.

కురు వంశం

విశ్వామిత్రుడు మేనక సంభోగం వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా , దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారలతో ఆహ్వానిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల భరతుడిని ప్రసవిస్తుంది. కణ్వ మహర్షి దివ్య దృష్టితో జరిగింది గ్రహించి శకుంతలని దుష్యంతుడి రాజ్యానికి పంపుతాడు. మెదట శకుంతల తన భార్య కాదు భరతుడు తన కుమారుడు కాదు అని అన్న దుష్యంతుడు, ఆకాశవాణి పలుకులతో జరిగిన వృత్తంతం గుర్తు తెచ్చుకొని భరతుడిని కుమారుడిగా అంగీకరిస్తాడు.

భరతుడి తరువాత వంశం

భరతుడి కుమారుడు భుమన్యుడు, భుమన్యుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు హస్తి , హస్తి పేరు తోనే ఉన్నదే అప్పటి కురురాజుల రాజధాని, ఇప్పటి ఢిల్లీ నగరమైన హస్తినాపురం. హస్తి కుమారుడు వికంఠనుడు, వికంఠనుడి కుమారుడు అజమేఢుడు. అజమేఢుడికి 124 కుమారులు. వాని కుమారులలో ఒకడైన సంవరణుడికి సూర్యుని కుమార్తె అయిన తపతికి వివాహం జరిగింది. వారి కుమారుడు కురు. కురు పేరు తోనే కురువంశం వృద్ధి చెందింది. కురు కుమారుడు విదూరధుడు. విదూరధుడి కుమారుడు అనశ్వుడు. అనశ్వడి కుమారుడు పరిక్షిత్తు , పరిక్షిత్తు కుమారుడు భీమసేనుడు. భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుడి కుమారుడు శంతనుడు

శంతనుడి తరువాతి వంశం

శంతనుడి భార్య గంగ శంతనుడికి గంగ వలన కలిగిన వాడు భీష్ముడు. శంతనుడికి సత్యవతి కి జన్మించినవారు చిత్రాంగదుగు మరియు విచిత్రవీరుడు. వీరికి దేవరన్యాయం ప్రకారం వ్యాసుని వల్ల జన్మించిన వారు దృతరాష్ట్ర, పాండు రాజులు జన్మించారు. దృతరాష్ట్ర కుమారులు కౌరవులు, పాండురాజు కుమారులు పాండవులు . కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు మరియు ఉపపాండవులు అంతమొందగా ఉత్తర గర్భంలో అభిమన్యుడి వలన భ్రూణం గా ఉన్న పరిక్షిత్తు ని రక్షించాడు శ్రీకృష్ణుడు. పరిక్షిత్తు కుమారుడు జనమేజయుడు