*"స్త్రీ" అను పదమునకు 220 పర్యాయ పదములివి. దాదాపుగా ఒక పదమునకు ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉండవేమో ...!!!*
1. అంగన
2. అంచయాన
3. అంబుజాలోచన
4. అంబుజవదన
5. అంబుజాక్షి
6. అంబుజనయన
7. అంబురుహాక్షి
8. అక్క
9. అతివ
10. అన్ను
11. అన్నువ
12. అన్నువు
13. అబల
14. అబ్జనయన
15. అబ్జముఖి
16. అలరుబోడి
17. అలివేణి
18. అవ్వ
19. ఆటది
20. ఆడది
21. ఆడగూతూరు
22. ఆడుబుట్టువు
23. ఇంచుబోడి
24. ఇంతి
25. ఇదీవరాక్షి
26. ఇందునిభాష్య
27. ఇందుముఖి
28. ఇందువదన
29. ఇగురాకుబోణి
30. ఇగురాకుబోడి
31. ఇభయాన
32. ఉగ్మలి
33. ఉజ్జ్వలాంగి
34. ఉవిధ
35. ఎలతీగబోడి
36. ఎలనాగ
37. ఏతుల
38. కంజముఖి
39. కంబుకంఠ
40. కంబుగ్రీవ
41. కనకాంగి
42. కన్నులకలికి
43. కప్పురగంధి
44. కమలాక్షి
45. కరబోరువు
46. కర్పూరగంది
47. కలకంఠి
48. కలశస్తిని
49. కలికి
50. కలువకంటి
51. కళింగ
52. కాంత
53. కించిద్విలగ్న
54. కిన్నెరకంఠి
55. కురంగానయన
56. కురంగాక్షి
57. కువలయాక్షి
58. కూచి
59. కృషమధ్యమ
60. కేశిని
61. కొమ
62. కొమరాలు
63. కొమిరె
64. కొమ్మ
65. కోమ
66. కోమలాంగి
67. కొమలి
68. క్రాలుగంటి
69. గజయాన
70. గరిత
71. గర్త
72. గుబ్బలాడి
73. గుబ్బెత
74. గుమ్మ
75. గోతి
76. గోల
77. చంచరీకచికుర
78. చంచలాక్షి
79. చంద్రముఖి
80. చంద్రవదన
81. చక్కనమ్మ
82. చక్కెరబొమ్మ
83. చక్కెర
84. ముద్దుగుమ్మ
85. చాన
86. చామ
87. చారులోన
88. చిగురుంటాకుబోడి
89. చిగురుబోడి
90. చిలుకలకొలోకి
91. చెలి
92. చెలియ
93. చెలువ
94. చేడి(డియ)
95. చోఱుబుడత
96. జక్కవచంటి
97. జని
98. జలజనేత్ర
99. జోటి
100. ఝషలోచన
101. తనుమధ్య
102. తన్వంగి
103. తన్వి
104. తమ్మికింటి
105. తరళలోచన
106. తరళేక్షణ
107. తరుణి
108. తలిరుబోడి
109. తలోదరి
110. తాటంకావతి
111. తాటంకిని
112. తామరకంటి
113. తామరసనేత్ర
114. తియ్యబోడి
115. తీగ(వ)బోడి
116. తెఱువ
117. తెలిగంటి
118. తొగవకంటి
119. తొయ్యలి
120. తోయజలోచన
121. తోయజాక్షి
122. తోయలి
123. దుండి
124. ధవలాక్షి
125. ననబోడి
126. నళినలోచన
127. నళినాక్షి
128. నవల(లా)
129. నాంచారు
130. నాచారు
131. నాచి
132. నాతి
133. నాతుక
134. నారి
135. నితంబవతి
136. నితంబిని
137. నీరజాక్షి
138. నీలవేణి
139. నెచ్చెలి
140. నెలత
141. నెలతుక
142. పంకజాక్షి
143. పడతి
144. పడతుక
145. పద్మముఖి
146. పద్మాక్షి
147. పర్వందుముఖి
148. పల్లవాధర
149. పల్లవోష్ఠి
150. పాటలగంధి
151. పుచ్చడిక
152. పుత్తడిబొమ్మ
153. పువు(వ్వు)బోడి
154. పువ్వారుబోడి
155. పుష్కరాక్షి
156. పూబోడి
157. పైదలి
158. పొల్తి(లతి)
159. పొల్తు(లతు)క
160. త్రీదర్శిని
161. ప్రమద
162. ప్రియ
163. ప్రోడ
164. ప్రోయాలు
165. బంగారుకోడి
166. బాగరి
167. బాగులాడి
168. బింబాధర
169. బింబోష్ఠి
170. బోటి
171. భగిని
172. భామ
173. భామిని
174. భావిని
175. భీరువు
176. మండయంతి
177. మగువ
178. మచ్చెకంటి
179. మడతి
180. మడతుక
181. మత్తకాశిని
182. మదిరనయన
183. మదిరాక్షి
184. మసలాడి
185. మహిళ
186. మానవతి
187. మానిని
188. మించుగంటి
189. మించుబోడి
190.మీనసేత్రి
191. మీనాక్షి
192. ముగుద
193. ముదిత
194. ముదిర
195. ముద్దరాలు
196. ముద్దియ
197. ముద్దుగుమ్మ
198. ముద్దులగుమ్మ
199. ముద్దులాడి
200. ముష్ఠిమధ్య
201. మృగలోచన
202. మృగాక్షి
203. మృగీవిలోకన
204. మెచ్చులాడి
205. మెఱుగారుబోడి
206. మెఱుగుబోడి(ణి)
207. మెలుత
208. మెళ్త(లత)మెల్లు(లతు)
209. యోష
210. యోషిత
211. యోషిత్తు
212. రమణి
213. రామ
214. రుచిరాంగి
215. రూపరి
216. రూపసి
217. రోచన
218. లతకూన
219.లతాంగి
220. లతాతన్వి

*తెలుగు భాషలో ఒక్క "స్త్రీ"👵 అనే పదానికి ఇన్ని పర్యాయ పదాలున్నాయంటే "తెలుగు నా మాతృభాష, నాకు మొత్తం తెలుగొచ్చు" అనిచెప్పడం నిజం కాదేమో కదా!*

*👌దశభాషలందు తెలుగు లెస్స.👍🏾*


కాశి ఖండం మిగతా బాగములు

01 to 10

11 to 20

21 to 30

31 to 40

41 to 50

51 to 60

61 to 70

కాశీ ఖండం 31

జ్ఞాన వాపి (బావి )మహాత్మ్యం
అగస్త్యునికి కుమారస్వామి కాశీ లోని జ్ఞాన వాపి మహాత్మ్యాన్ని వివరించాడు .పూర్వం దేవ యుగం లో ఈశానుడు స్వేచ్చగా తాండవ నృత్యం చేస్తున్నప్పుడు దాహం బాగా వేసి నీటి కోసం వెతి కాడు .అప్పటి స్తితిలో మేఘాలు వర్షిమ్చటం లేదు .నదుల్లో ,బావుల్లో నీరే లేదు .దొరికిన నీరైనా ఉప్పు కషాయం .నరసంచారం తగ్గింది .ఆనంద కాననం అని పిలువా బడే కాశీ క్షేత్రం ఊసర క్షేత్రమయింది .మరణాల సంఖ్య పెరిగి పోతోంది ..ఈశానుడు కాశీ నగరం చేరాడు .అక్కడ జ్యోతిర్లిన్గాన్ని చూసి ఆశ్చర్యపోయాడు .ఆ లింగానికి అభిషేకం చేసి ,ఆ తీర్ధాన్ని త్రాగాలను కొన్నాడు .తన చేతిలోని త్రిశూలాన్ని శివాలయం దగ్గర భూమి పై గుచ్చాడు .అక్కడ ఒక కుండం ఏర్పడింది .అది పూర్తిగా నీటి తొ నిండి పోయి,చుట్ట ప్రక్కల ప్రదేశం కూడా నీటి తొ నిండింది .ఆ మహోదకం తోఈశానుడు జ్యోతిర్లిన్గాన్ని అభి షెకించాడు .
ఆ కుండం లోనీ నీరు ఉత్తమ హృదయం లా స్వచ్చం గా ,వెన్నెలలా తేటగా ,శంఖం లా శివుని నామం లా పవిత్రం గా ఉంది .అమ్రుతోపమానం గా ఉంది పంచామృతాలతో ఈశానుడు ఆ జలం తొ జ్యోతిర్లిన్గాన్ని తనివి తీర వెయ్యి ఘటాల జలం తొ .అభి షెకించాడు.సంప్రీతి చెందిన రుద్రుడు ప్రత్యక్ష మైనాడు .’’నీ సహస్ర ఘటాభి షెకానికి సంతోషించాను .నువ్వు కోరిన యే వరమైనా ఇస్తాను కోరుకో ‘’అన్నాడు .అప్పుడు ఈశానుడు ఆ తీర్ధం ఆయన పేరు తొ పిలువ బడాలని కోరాడు విశ్వేశుడు ‘’అన్ని లోకాలలోనూ ఉన్న తీర్దా లన్నిటిలో ఇది ప్రసిద్ధమవుతుంది .దీన్ని శివ తీర్ధం అని పిలుస్తారు .శివం అంటే జ్ఞానం కనుక జ్ఞాన తీర్ధం ఇది .ఈ జ్ఞాన వాపి మహా ప్రసిద్ధి చెందుతుంది .తాకితేనే పాపాలను నశింప జేస్తుంది .అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది .ఈ జలం తొ పిండ ప్రదానం చేస్తే కల్పాంతం వర కు శివలోకం లోనే ఉంటారు . .జ్వరం మొదలైన అపస్మారకాలు శివ తీర్ధం చేత పొగొట్ట బడుతాయి .ఇక్కడ శివుడు ద్రవ రూప మైన జ్ఞాన స్వరూపుడు గా ఉండి అలసత్వం మొదలైన వాటిని తొలగిస్తాడు .జ్ఞానాన్ని బోధిస్తాడు .
స్కందుడు అగస్త్యునికి ఒక కధ చెప్పాడు .పూర్వం కాశి లో హరి స్వామి అనే బ్రాహ్మణుడు ఉండే వాడు .ఆయన కు అతి లోక సౌందర్య వతి అయిన సుశీల అనే కూతురుంది .ఆమె సూర్యుడికి భయ పడి చీకటి లో దాగుకోనేది .రోజు జ్ఞాన వాపి దగ్గర స్నానం చేసి శివుడిని ఆరాధించేది .ఒక రోజు ఆమె ఇంటి బయట నిద్రిస్తుంటే ఆమె అందానికి ముగ్దు డైన ఒక విద్యా ధరుడు ఆమెను ఎత్తుకొని పోయాడు అప్పుడు విద్యున్మాలి అనే రాక్షసుడు అతడిని అడ్డ గించాడు త్రిశూలం తొ విద్యాధరుడిని పొడిచాడు .అతను ఒక్క పిడికిలి పోటుతో రాక్షసుడిని చంపేశాడు .సుశీల ఆ విద్యాధరుడే తన పతి అని అతని శవం మీద పడి ఏడిచింది .సుశీలను తాకటం చేత ఆమె పుణ్య వశం తొ విద్యున్మాలి రాక్షసుడు స్వర్గం చేరాడు .విద్యాధరుడు చని పోయే ముందు సుశీలను స్మరించటం చేత మలయ కేతువు అనే పర్వత రాజుకు కుమారుడు గా పుట్టాడు .సుశీల కర్నాటక దేశం లో పుట్టింది .ఆమె పేరు కళా వతి .ఆమెకు పూర్వజన్మ వాసన వల్ల చిన్న తనం నుండే రుద్రార్చన చేసింది ఒక ఉత్తరాది వాడు ఒక రోజు రాజు గారికి ఒక చిత్రాన్ని చూపాడు దాన్ని ఆయన కళా వతికి చూపించాడు .అంతే ఆమె లో చాలా మార్పు వచ్చింది
కాశీ క్షేత్రాన్ని జ్యోతిర్లిన్గాన్ని ,జ్ఞాన కూపిని గంగా నదిని స్మరించింది .ఆ ప్రదేశాలలో తిరిగిన అనుభూతి పొందింది‘’ఇది కాల భైరవుడు క్షేత్ర పాలకుడు గా ఉన్న చోటు .ఇది కాల భైరవుని చేతి నుండి నేల బడిన బ్రహ్మ కపాల క్షేత్రం ,ఇది రుణ విమోచన క్షేత్రం ,ఇదుగో ఓంకారేశ్వరుడు ,ఇది ప్రణవాక్ష్య క్షేత్రం ,ఇది మత్సోదరి తీర్ధం ఈయన కామేశ్వరుడు ఇక్కడ ఈశ్వరుడు స్వలని (స్వలీన )పేరు తొ ఉన్నాడు స్కందేశ్వరుడు సర్వ సిద్ధి దాయకుడు .ఈయన వినాయకుడు విఘ్నాలను హరిస్తాడు ,ఈ జ్యోతిర్లిన్గాన్ని దర్శిస్తే భ్రున్గీశ్వరుడు జీవన్ముక్తు డయాడు .యజ్ఞేశ్వర ,సర్వ తీర్దేశ్వర లింగాలను సేవిస్తే అన్నీ లభిస్తాయి సారస్వత సర్వ తీర్దేశ్వర లింగాలకు అభిషేకం చేస్తే తీరని కోరిక ఉండదు .మంత్రేశ్వరుడు అన్ని మంత్రాలకు అది పతి .బాణాసురుడు పూజించిన బాణేశ్వర లింగం ఇది .ఇది ప్రహ్లాదుడు స్తాపించిన వైరోచన లింగం దీన్ని బలి కేశవుడని ,నారద కేశవుడని అంటారు .
దత్తాత్రేయుని దత్తాత్రేయ లింగం ఇదిగో ఆదికేశావుడు మొదట దీన్ని స్తాపించాడు ఇది గదాధర లింగం దీనికి భ్రుగు కేశవుడని ,వామన కేశవుడని పేరు .ఇవి నారాయణ లింగాలు వీటికి యజ్న వరాహ కేశవులని పేరు .వీటినే నరసింహ లింగమని ,గోపీ గోవింద లింగాలని పేర్లు .ఈ నరసింహుని అనుగ్రహం తోనే ప్రహ్లాదుడు ఇంద్ర పదవి పొందాడు .ఈ ఖర్ప వినాయకుడిని శేష మాధవుడు అంటారు .ఇదే శంఖ మాధవ లింగం .ఇక్కడే శంకుడు అనే రాక్షసుడు చంప బడ్డాడు .ఇది సరస్వతి నదీ ప్రవాహం.ఇది పర బ్రహ్మ రసాయనం ఇక్కడ సరస్వతి గంగా నది సంగమిస్తాయి .ఈయన బిందు మాధవుడు .సాక్షాత్తు లక్ష్మీ పతి .ఇక్కడ స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు .బిందు నాధుడు ప్రణవ స్వరూపుడు ఈమె మంగళ గౌరీ ఇది గభస్తేశ్వర లింగం .దీనికి మయూఖాదిత్యుడని పేరు .మ్రుకండుని కుమారుడు మార్కండేయుడు స్తాపించిన మార్కండేయ లింగమిది .ఇది కిరణేశ్వర లింగం ,ఇది దౌత పాపెశ్వర లింగం ,ఈయన మణి ప్రదీప నాగుడు ఇది కపీశ్వరలింగం కోతులకు కూడా మొక్షాన్నిస్తుంది .ఇది ప్రియ వ్రాతెశ్వర లింగం .ఈయన కాల రాజు .కలికాలపు పాపాలన్నీ పోగొట్టు తాడు ఇది దివ్య మందాకినీ నది .ఇది రత్నేశ్వర లింగం .ఇదే కృత్తి వాస లింగం ,ఇదే ఓంకారేశ్వర లింగం శివుని కన్ను వంటిది .ఇది గోకర్నేశ్వర లింగం శివుని చెవుల వంటిది ,ఈ రెండు లింగాలు విశ్వేసుని చేతులు .ధర్మేశ ,మణి కర్నేశులు విశ్వేషుని హస్తాలు .కాళేశ్వర కపర్దేశ్వర లింగాలు ఆయన పదాలు .జ్యేష్టేశ్వరుడు అయన పిరుదు .మధ్యేశ్వరుడు ఆయన నాభి .శ్రుతీశ్వర లింగం శివ జటా జూతం చంద్రేశుడు ఆయన హృదయం .వీరేశ్వరుడు ఆత్మ ,ఆయన లింగమే కేదారేశ్వరుడు .ఇక్కడున్న కోటాను కోట్ల లింగాలు ఆయన గోళ్ళు ,రోమాలు ఆభరణాలు విశ్వేషుని దక్షిణ హస్తం మోక్ష దాయిని .భగవతి దుర్గా దేవి పితృ లింగం .ఈమె చిత్ర ఘంటేశ్వారి .ఇది ఘంటా కర్ణుని మడుగు .ఈ విశాలాక్షి లలితా గౌరీ స్వరూపు రాలు ఇతడు అవినాశుడు .ఇది ధర్మ కూపం ఈమె విశ్వ భుజా దేవి .లోకాలనేలే చల్లని తల్లి .ఈమె బందీ మహాదేవి త్రైలోక్య వందిత .ఇది దశాశ్వ మేధ తీర్ధం ఇది ప్రయాగ తీర్ధం. తీర్ధరాజం అంటారు ఇదే గంగా కేశవా తీర్ధం మోక్ష ద్వారం స్వర్గ ధామం అంటూ ఆమె ఆ చిత్రం లో కాశీ లో ఉన్న సకల దేవతా గణాన్ని తీర్ధాలను చూస్తూ పులకించి పోయింది

కాశీ ఖండం 32

జ్ఞాన వాపీ ప్రశంస
స్కందుడు అగస్త్యర్షికి జ్ఞాన వాపి ప్రశస్తిని తెలియ జేశాడు ..కాశి లో మణి కర్ణిక ఉత్తమ మైన తీర్ధం .అది స్నానం సకల పుణ్య ప్రదం .యతీశ్వరులు కూడా మణి కర్ణిక కు వస్తారు ముక్తి కోసం .ఇక్కడి స్నానం ముక్తి దాయకం .గంగా నది మధ్య నుండి హరిశ్చంద్ర ఘాట్ వరకు గంగ నుంచి బిందు మాధవం వరకు స్వర్గ ధామంమణి కర్ణిక .కళా వతి చిత్రాన్ని మాటి మాటికీ చూస్తోంది .జ్ఞాన వాపిని కాల భైరవుడు నిరంతరం రక్షిస్తూ ఉంటాడు .అష్ట మూర్తి అయిన మహాదేవుడు జ్ఞాన వాపి లో ఉన్నాడు ఆయన్ను చూసి సంభ్రమాశ్చర్యాన్ని పొందింది .కళా వతి శరీరం కంపించి చిత్ర పటం జారి కింద పడింది .చెలి కత్తేలు గమనించి ,ఆమె విరహ వేదన గ్రహించి శైత్యోప చారాలు చేశారు .ఆమెకు పూర్వజన్మ జ్ఞానం జ్ఞాన వాపి వల్ల కలిగింది .ఆ విషయాన్ని చెల్లి కత్తేలకు చెప్పింది
పూర్వజన్మ లో తాను హరిస్వామి కుమార్తె సుశీలనని తనను విద్యాధరుడు ఎత్తుకొని పోతుంటే రాక్షసుడొకడు అడ్డు తగిలి అతని చేత చచ్చాడని ,తాను మరణించి కర్నాటక లో మలయ కేతునికి కలా వతి అనే కుమార్తె గా జన్మించానని వివరం గా చెప్పింది .అందరు జ్ఞాన వాపి గొప్ప దనాన్ని పొగిడారు .భర్త మలయ కేతుని చూసి ఇలా అన్నది ‘’మీరు నా మీద చూపుతున్న ప్రేమ ,ఆదరణ మిగిలిన వారి మీద చూపటం లేదు కాశీ వెళ్లి విశ్వేశ్వర దర్శనం చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి‘’అన్నది .అప్పుడాతడు ఆమె ను వదిలి ఉండలేనని చెప్పి పుత్రులకు అన్నీ అప్పగించి భార్య తొ కాశీ చేరుకున్నాడు . .అక్కడ గంగా స్నానం చేసి విశ్వేశ్వరుడిని సందర్శించి పులకించి పోయాడు .రాణి తొ కలిసి జ్ఞాన వాపి లో స్నానం చేశాడు .
ఇంతలో ఒక యోగి వచ్చి వారి చేతిలో కొంత విభూతి పెట్టి ,ఆశీర్వదిస్తూ ‘’ఈ రోజు మహా నేపధ్యం .ఒక్క క్షణం లో నక్షత్రాలు ఉదయిస్తాయి ‘’అన్నాడు .ఇంతలో ఘంటా నాదాలు చేస్తూ ఒక విమానం అక్కడికి చేరింది .దాని నుండి చంద్ర మౌళి దిగాడు వెంటనే చెవిలో ఏదో బోధించాడు .అప్పుడొక మహా జ్యోతి అక్కడ ప్రజ్వ రిల్లింది .తర్వాతా చంద్ర మౌళీశ్వరుడు తన ఆలయానికి వెళ్లి పోయాడు .జ్ఞాన వాపి ప్రత్యక్షం గా జ్ఞానాన్నిస్తుంది .అది సర్వ జ్ఞాన మయం సర్వ లింగ మయం .అప్పటికప్పుడు పవిత్రం చేస్తుంది .మరణ కాలం లో కూడా మహా జ్ఞానం నశించదు .ఈ కధ విన్నా ,చదివినా అందరికి పుణ్యం లభిస్తుంది అని కుమారస్వామి అగస్త్య మహర్షికి తెలియ జేశాడు .
కాశీ ఖండం మొదటి అధ్యాయం సమాప్తం

కాశీ ఖండం 33

కాశీ ఖండం 34

కాశీ ఖండం 35

కాశీ ఖండం 36

కాశీ ఖండం 37

కాశీ ఖండం 38

కాశీ ఖండం 39

కాశీ ఖండం 40

28

29

30