*వేదం ఇలా చెబుతోంది.?*

“స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయ్యేవ మార్గేణ
మహిం మహీశాః | గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినోభవంతు | అపుత్రాః పుత్రిణః పంతు |
పుత్రిణ స్సంతుపౌత్రిణః | లోకావుయం క్షోభారహితః |
అధనాః సాధనాః సంతు | జీవస్తు శరీదశ్శతమ్||”

“పాలకులు ప్రజలను న్యాయమార్గమున ధర్మబద్ధంగా పరిపాలించుగాక! గోసంతతికి పండితులకు శుభం కలుగుగాక! సంతతి లేనివారికి సంతతి కల్గుగాక! సంతతి వున్నవారికి మానుమ సంతతి కల్గుగాక! ప్రపంచం శాంతితో నిండియుండుగాక! దరిద్రులు ధనమూ పొందుదురుగాక! అందరూ ఏ ఆపదలు కల్గియుండక నూరు సంవత్సరాలు జీవించుదురు గాక!” అని చెబుతుంది వేదం.

పూర్వకాలం ‘దానధర్మం’ ఒక కర్తవ్యంగా ఉండేది. బ్రాహ్మణ వర్ణం వారికి ఇల్లు తప్ప, స్థిరాస్థులు ఉండేవికాదు. విద్యార్జన చేయటం సమాజానికి హితాన్ని బోధించటం, ప్రజలకు విద్య బోధించటం వారి పని. బ్రాహ్మణ బ్రహ్మచారులు ఇంటింటికీ భిక్షమెత్తుకొని వచ్చి గురువుకి సమర్పించేవారు. ఆ విధంగా యాచకం చేస్తూ చదువుకోవాలి. విద్య నేర్పుతున్నందుకు గురువు ఏ విధమైన ప్రతిఫలం ఆశించటం తప్పుగా ఉండేది. అప్పటి ఆ కాలంలో మనకు అల్లోపతి వైద్యంలేదు. ఆయుర్వేద వైద్యం అందరికీ ఉచితంగా అందుతుండేది. బ్రాహ్మణులే ఈ పనిని చేస్తూ ఉండాలి. విద్య, వైద్యం, జ్ఞానం ఎవరూ అమ్మకూడదు. ఎవరూ కొనకూడదు. పొరపాటు జరిగితే శిక్షకు గురికావలసిందే!

ఈనాటికీ బౌద్ధమత ప్రచారకులు “దానధర్మం”తో జీవిస్తూ ధర్మప్రచారం చేస్తున్నారు. బౌద్ధసూక్తి మీకు తెల్సుగదా!

*“ధర్మం శరణం గచ్ఛామి !*
*సంఘం శరణం గచ్ఛామి!*
*బుద్ధం శరణం గచ్ఛామి!”*

ధర్మాన్ని శరణు పొందుతున్నాను! సంఘాన్ని శరణు పొందుతున్నాను.బుద్ధుని (జ్ఞానాన్ని) శరణు పొందుతున్నాను. అంటూ ‘ధర్మయానం’ చేస్తుంటారు.

*‘ధర్మోరక్షతి రక్షితః’*

“ధర్మాన్ని నీవు రక్షించితే ధర్మం నిన్ను సర్వదా రక్షిస్తూ వుంటుంది.” నీవు ఎపుడు ధర్మాన్ని నిర్లక్షం చేస్తావో ధర్మం నిన్నేపుడూ రక్షించదు.”

*ధర్మాన్ని నమ్మాలి – ధర్మాన్ని ఆచరించాలి.*

*ధర్మాన్ని ఆశ్రయించాలి –* ధర్మమార్గాననే నడవాలి. ధర్మాన్ని గౌరవించాలి. శ్రీరాముడు ప్రభుధర్మం కోసమే సీతా పరిత్యాగం చేయవలసి వచ్చింది. ధర్మ మార్గాన నడవటం వల్లనే యుధిష్ఠిరుని ధర్మరాజు అని పిలుస్తున్నాం.

*“యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా!*

*అభ్యుత్దాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్||”*

– అని చెప్పాడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్ముడు. పాండవులు ధర్మపరాయణులు కాబట్టే కృష్ణుడు పాండవపక్షాన నిలిచి వారికి సహకరించాడు. అధర్మంతోనే త్రొక్కివేశాడు.

అధర్మపరులను అధర్మంతో ఎదుర్కొనవచ్చు. తప్పుగాదు. ధర్మపరులను అధర్మంతో దెబ్బతీయకూడదు. ఇది పాపకార్యం. ఋతుధర్మంవల్లనే వర్షాలు వస్తున్నాయి. చెట్లు పండ్లు ఫలాలను ఇస్తున్నాయి. కాలధర్మం వల్లనే మనిషి మరణిస్తున్నాడు. సంయోగ ధర్మంవల్లనే మళ్ళీ జన్మిస్తున్నాడు.

*‘ధర్మోరక్షతి రక్షితః’*

కాశి ఖండం మిగతా బాగములు

01 to 10

11 to 20

21 to 30

31 to 40

41 to 50

51 to 60

61 to 70

కాశీ ఖండం –21

బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ
శివ శర్మ ను విష్ణు దూతలు స్వర్గ లోకం నుండి మహార్లోకానికి తీసుకొని వెళ్లారు ..అక్కడ విష్ణు స్మరణ చేసి ,కల్పాయువు కలిగిన వారు ఉంటారు .ఇక్కడ దేవతా ప్రముఖులు నమస్కార యోగం తొ ఎప్పుడూ తపో సమాధి లో ఉంటారు .అక్కడి నుండి జనో లోకం చేరాడు .ఇక్కడ బ్రహ్మ కుమారులు సనకస నందనాది మహర్షులు ఊర్ధ్వ రేతస్కులయి ఉంటారు .తర్వాత తపో లోకానికి వెళ్లాడు .ఇక్కడి వారు సదా వాసు దేవుని స్మరిస్తూ ,అన్నీ ఆయనకే అర్పించి ,దాహాదులు కూడా లేకుండా ఉంటారు .రోళ్ళ దగ్గర దంచు తున్నప్పుడు యెగిరి పడిన గింజలను మాత్రమె ఏరుకొని తింటారు .రాళ్ళు తిని ,ఎండిన ఆకులను తిని జీవిస్తారు .వేసవిలో పంచాగ్ని మధ్యమ లో నిల బడి మహా తపస్సు చేస్తారు .చాతుర్మాస్య వ్రతాన్ని అవలంబిస్తారు .రెప్ప పాటు లేకుండా జీవిస్తారు .రుతువు అవగానే జలాన్ని మాత్రమె త్రాగుతారు .ఆరు మాసాలు ఉపవాసమే .వర్ష ధారల తొ తడుస్తున్నా రాయి లాగా నిశ్చలం గా ఉంటారు .ఇక్కడికి వచ్చిన వారు మృగాల దురదను గోకి తీర్చిన వారు ,అడవిలో ఉన్న తమ జాడలలో పక్షి గూడులు కట్టిన వారు ,శరీరాలనుంచి సస్యాలు ఉద్భవించిన వారు .వీరికి బ్రహ్మాయుస్సు ఉంటుంది .
శివ శర్మ సత్య లోకం చేరుకొన్నాడు .బ్రహ్మ అతడిని చూసి ‘’ఇక్కడి నుండి త్వరగా వెళ్ళు .నిత్యం నేను ఇక్కడ ప్రళయాన్ని సృష్టిస్తాను .విరాట్ పురుషుని వరకు ఉన్న సృష్టిని అంతటిని హరుడు రోజు సంహరిస్తాడు .అలాంటప్పుడు మరణ ధర్మం ఉన్న మానవుల గురించి చెప్పాల్సిన్దేముంది ?కృత ,త్రేతాది యుగాలకు మనుష్యులకు తగినది ఒక్కటే యుగం .ఆ యుగం లో భారత వర్షం లో మానవులు వికశిస్తారు .మనసు లో కూడా ఇంద్రియాలను జయించి, కామ క్రోధాదులను వదిలి ,తపస్సు చేత యశో సంపద పొంది,తమో గుణాన్ని విసర్జించి ,సంపద మీద ఆసక్తి లేకుండా ,అహంకారాన్ని వదిలి నవారు ,స్మృతులను సమగ్రం గా తెలుసుకొన్న వారు ,స్నేహం తొ ధర్మ సోపాన్ని అధిరోహించిన వారు ,భారత దేశం లో మళ్ళీ మళ్ళీ పుట్టి ,మానవులు అని పించుకొంటారు .
‘’ఈ బ్రహ్మాండం లో స్వర్గానికి మించినది లేదు .తపస్సు ,దానము ,వ్రతాలు చేసిన వారు స్వర్గం చేరతారు .స్వర్గం కంటే పాతాళలోకం రమ్యం గా ఉంటుందని నారదుడు చెప్పాడు .దైత్య ,దానవ కన్యల చేత పాతాళలోకం శోభిల్లు తుంది మోక్షాన్ని పొందిన వారు కూడా పాతాళ లోకం లో జన్మిస్తారు .పాతాళం లో పగటి పూట సూర్యుడు ప్రకాశిస్తే ,రాత్రిళ్ళు చంద్రుడు వెలుగు లను చిమ్ముతాడు .చంద్ర కిరణాలలో చల్లదనం ఉండదు .ఇక్కడ విద్యలు కోకిల స్వరాల్లా విని పిస్తుంటాయి .వీణా వేణు మృదంగ ధ్వనులు చెవులకు ఇంపు చేకూరుస్తాయి .ఇక్కడ హా ట కేశ్వర మహా లింగమున్నది .అన్ని కోర్కెలను తీరుస్తుంది .దానవులకు భోగ భూమి ఇది .
‘’ పాతాళం కంటే రమ్య మైనది ద్విజ వర్షము .ఇది ఇలా వృతం .ఇక్కడ రత్న సానువు లున్నాయి .పుణ్యాత్ములకు దివ్య భూమి .సత్యం భాషణులు ,పుత్రులున్నవారు ,ఉత్తమ క్షేత్రాలను సందర్శించిన వారు ఇక్కడకు వస్తారు .ఇందులో ద్వీపాలు చాలా ఉన్నాయి .వాటిని సముద్రం చుట్టి ఉంటుంది .
‘’జంబూ ద్వీపానికి మించిన ద్వీపం లేదు .ఇక్కడ నవ వర్షాలు దేవతల భోగ భూములు .దేవతలు స్వర్గం నుండి దిగి వచ్చి ఇక్కడ ఉంటారు .ఇది తొమ్మిదివేల యోజనాల విస్తీర్ణం కలది .దీనిలో మేరు పర్వతానికి దక్షిణం గా ఉన్న భారత వర్షం మొట్ట మొదటిది .హిమవత్ ,వింధ్య పర్వతాల మధ్య ఉన్న ప్రదేశం అత్యంత పవిత్ర మైనది .ఉత్తమ పుణ్య క్షేత్రాలెన్నో ఉన్న భూమి .అందులో కురుక్షేత్రం చాలా గొప్పది .దాని కంటే నైమిశారణ్యం ,గొప్పది దీన్ని తీర్ధ రాజం అంటారు .అన్ని ఒర్కేలను తీర్చేది .నిరంతరం యజ్న యాగాదుల తొ అలరారు తు ఉంటుంది .
‘’ సప్త ధాతు మయ మైన మహా పాపాలు శరీరం లోని కేశాలను ఆశ్రయించుకొని గట్టిగా పట్టుకొని ,వదల కుండా ఉంటాయి .కనుక ప్రయాగ లాంటి తీర్ధాలలో ముమ్దనం అంటే గుండు కొట్టించు కొంటె ,పాపాలన్నీ వదిలి పోతాయి .త్రివేణీ సంగమ స్నానం దోషాలన్నిటిని హరించి పుణ్య లోక ప్రాప్తి కల్గిస్తుంది .ఇక్కడ పుణ్యవిధి నిర్వహించిన వారంతా సత్య లోకానికి చేరుకొంటారు .
‘’ కాశీ అన్ని టి కంటే గొప్ప ముక్తి క్షేత్రం .ఈ క్షేత్రం ఈశ్వరుని త్రిశూలాగ్రం లో ,భూమికి ,ఆకాశానికి మధ్య ఉన్నది .ఇక్కడ ఎప్పుడూ కృత యుగమే .నిత్యం మహా పర్వదినమే .ఎప్పుడూ ఉత్తరాయణమే .ఎల్లప్పుడు మహోదయమే .కాశిని సృష్టించిన వాడు సాక్షాత్తు మహా శివుడు .కాశీ లో పాపం చేయరాదు ఇక్కడ తులా పురుష దానం లాంటివి చేసిన వారు సత్య లోక వాసులవుతారు .జప ,తప ,ధ్యానదుల వల్ల రాని మోక్షం కాశీ నివాసం తొ ,కాశీలో మరణం తొ కలుగు తుంది .అని బ్రహ్మ దేవుడు కాశీ క్షేత్ర మహాత్మ్యాన్ని వివరించాడు శివ శర్మకు

కాశీ ఖండం –22

వివిధ లోక స్తితి వర్ణన
శివ శర్మ బ్రహ్మ దేవుని ఏదో ప్రశ్నించాలను కొన్న విషయాన్ని బ్రహ్మ కనీ పెట్టి అతనికి మోక్ష కాంక్ష ఉన్నాదని గ్రహించాడు .బ్రహ్మ విష్ణు దూతలను సత్కరించి పంపాడు .విమానం లో వెడుతూ విష్ణు దూతల తొ తాను అడిగిన వాటి కన్నిటికి కి చక్కని వివరణలు ఇచ్చి నందుకు కృతజ్ఞత తెలిపాడు .వారికి భూత భవిష్యత్తు లన్నీ తెలుసు నని మెచ్చుకొన్నాడు .వారు అతనికి మరి కొన్ని విశేషాలను తెలియ జేశారు .భూమండలం అడవులు ,సముద్రాలు పర్వతాల తొ విస్తరించి ఉంది .ఆకాశం భూ మండలం అంతటా పైన వ్యాపించి ఉన్నది .భూమికి పది వేల ఆమడల దూరం లో సూర్య మండలం ,దానికి లక్ష యోజనాల దూరం లో చంద్ర మండలం ,దానికి లక్ష యోజనాల దూరం లో నక్షత్ర మండలం ,దానికి రెండు లక్షల యోజనాల దూరం లో బుధ లోకం ,దానికి రెండు లక్షల యోజనాలలో శుక్ర లోకం ,దానికి రెండు లక్షల ఆమడల దూరం లో కుజ లోకం ,దీనికి ఇంతే దూరం లో బృహస్పతి లోకం ,దానికి అంతే దూరం లో శని లోకం ,దానికి పది లక్షల ఆమడల దూరం లో సప్తర్షి మండలం ,దానికి నూరు వేల ఆమడల దూరం లో ధ్రువ మండలం ఉంది .
భూమి పై పాదాల తొ నడి చేది ఏదైనా భూలోకమే .దీనిపై సముద్ర పర్వత అరణ్యాలుంటాయి భూలోకం నుండి సూర్య మండలం వరకు సువర్లోకము అంటారు .భూమికి కోటి యోజలాల లో మహర్లోకం ,రెండుకోట్ల ఆమడలలో జనోలోకం ,నాలుగు కోట్ల ఆమడలలో తపో లోకం ఉన్నాయి .భూమికి ఎనిమిది కోట్ల యోజనాల దూరం లో సత్య లోకం ఉంది .భూమికి పదహారు కోట్ల యోజన దూరం లో వైకుం ఠంఉంది.ఇక్కడ అందరికి అభయ మిచ్చే లక్ష్మీ పతి ఉంటాడు .దీనికి పడ హారు కోట్ల యోజనాలలో కైలాసం ఉంది .మహేశ్వరుడు పార్వతీ సమేతం గా ప్రమధ గణ పరి వేష్టితుడై ఉంటాడు .ఈయనను ‘’పరుడు ‘’అంటారు .జగత్తు అంతా ఆయన శాసనం తోనే నడుస్తోంది .అతి స్వతంత్రుడు .ఆయనే పరబ్రహ్మ అని వేదాలు ఘోషిస్తాయి .అతడు పరాత్పరుడు .అతడే ఆనందం .సంవిత్తు .స్వయం వేద్యుడు .పరం జ్యోతి స్వరూపుడు .యోగి రమ్యుడు .నామ రూప రహితుడు .సర్వత్రా వ్యాపించి ఉన్న వాడు .సర్వ కర్మ వివర్జితుడు .చంద్ర రేఖ నుశిరసు పై దాల్చిన వాడు .వామ భాగం లో పార్వతీ దేవిని కలిగి అర్ధ నారీశ్వరుడైన వాడు .ఆది శేషుని సదా ఆభరణం గా ధరించే వాడు .వృషభ వాహనుడు .గజ చర్మ దారి .మన్మధ భస్మాన్ని ఒళ్లంతా పూసుకొని ఉంటాడు రూపా తీతుడై ,రుద్ర రూపి గా ,సర్వ వ్యాపిగా ఉంటాడు .ఆయనే శివుడు .నిరాకారు డైన సాకారుడు .సమస్త జగత్తు ఆయనచే సృష్టింప బడి క్రీడింప బడుతున్నాయి .
మహా దేవుడు తన తొ సమాన మైన సింహా సనం పై విష్ణు మూర్తిని కూర్చో బెట్టి ,సర్వ రత్న మయ చత్రాన్ని పట్టించాడు .ఓషధీ జలం తొ అభి షెకింప జేశాడు .స్వర్ణ కిరీటాన్ని ఆయన మస్తకం పై అలంకరించి అభి షెకించాడు .ఎవరికి ఇవ్వని భోగమంతా విష్ణువుకు ఇచ్చాడు .అప్పుడు శివుడు బ్రహ్మ తొ /’’..విష్ణువు నాకు నమస్కరింప దగిన వాడు .మీరందరూ నమస్కరించండి’’అని చెప్పి శివుడు తాను విష్ణు మూర్తికి నమస్కరించి, అందరి చేతా చేయించాడు .అప్పుడు శివుడు విష్ణువు తొ ‘’మహా విష్ణూ !నీవు కర్తవు .సర్వ భూతాలను రక్షిస్తావు .హరించే వాడివి ,పూజింప బడే వాడివి ఇచ్చా ,జ్ఞాన ,క్రియా శక్తులను నీకు ఇస్తున్నాను .గ్రహించు.నీ భక్తులకు నేను ఉత్తమ మైన మోక్షాన్ని స్తాను .ఈ మాయా శక్తిని కూడా గ్రహించు .నా ఎడమ చేతివి నువ్వు .నా కుడి చేయి పితా మహుడైన బ్రహ్మ దేవుడు .ఈ బ్రహ్మను కూడా నువ్వే సృష్టిస్తావు .’’అని చెప్పి వీడ్కోల్పాడు .’’అని విష్ణు దూతలు శివ శర్మ కు బోధించారు .ఈ విష్ణు చరిత్ర విన్న వాడు స్వర్గాన్ని పొందుతాడు .కాశీ లో మోక్షం పొందిన వాడవుతాడు .ఆరోగ్య భోగ భాగ్యాలన్ని సమ కూడుతాయి .బంధవిముక్తు డవుతాడు .ఈకద హరికి, హరునికి కూడా చాల ప్రియ మైనది .

కాశీ ఖండం –23

విశ్వ కర్మ నిర్వాణ ప్రయాణం
విష్ణు దూతలైన సుశీల ,బహు శీలలు శివ శర్మ తొ ‘’నువ్వు ఈ విష్ణు లోకం లో భోగాలను అనుభ వించు .నువ్వు పుణ్య తీర్ధ మైన హరిద్వారం లో మరణించటం వల్ల నంది వర్ధన నగరం లో మహా రాజు వై జన్మిస్తావు .నీ రాజ్యం లో విద్యా విహీనులు ఉండ రాదు .స్త్రీలు తమ ధర్మాలను నిర్వర్తించాలి .ఎవరికీ దుఖం ఉండ కూడదు .వేద అనేది రత్నాలకు మాత్రమె .శూలం దేవతా మూర్తుల చేతి లోనే .కంపం అనేది సాత్విక భావోద్వేగం లోనే ,జ్వరం భయం వల్లనే దరిద్రం వల్ల కాదు ,ప్రమత్తఅనేది ఏనుగు ల యందు మాత్రమె .కంటకత్వం చెట్ల లోనే ,విహారాలు జనం లోనే ,దండం సన్యాసం లోనే ,గుణ వంత మైన పాలన నీ రాజ్యం లో ఉంటుంది. రాజ్య ధర్మజ్నుడవు అని పేరు పొందుతావు . .శ్రీ హరి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకో .అజ్ఞానం లేని దివ్య జ్ఞానాన్ని కాశీ విశ్వేశ్వరుడు నీకు ప్రసాదిస్తాడు ‘’
మోక్ష కారక మైన శివ లింగాన్నికాశీ లో స్తాపించి దేవాలయం కట్టి నిత్య ము అభిషేక పూజాదులతో శివుడిని ప్రసన్నం చేసుకో .ఒక రోజు నీ దగ్గరకు వ్రతోప వాసాల తొ క్షీణించిన ఒక తపోధనుడు వస్తాడు .అతడు బాగా బక్క చిక్కి ఉంటాడు .నీ దగ్గర కూర్చుంది నీయోగా క్షేమాలను అడుగుతాడు .అతడు నిన్ను ‘’నువ్వెవరివి /ఎక్కడి నుండి వచ్చావు ?రెండవ ఆమె లాగా ఉన్న ఆమె ఎవరు ?ఈ గుడిని ఎవరు ఎప్పుడు నిర్మించారు ?అదంతా నేకు తెలుసా /దాని వల్ల ఏ ప్రయోజనం నీకు కలుగు తుంది ?’’అని ప్రశ్నిస్తాడు .దానికి నువ్వు నేను చెప్పి నట్లు సమాధానాలు చెప్పు ‘’నేను వృద్ధ కాలుడను .అనే మహా రాజును .దక్షిణ దేశం వాడిని .నా భార్య తొ ఇక్కడికి వచ్చాను .ఈ లింగాన్ని ప్రార్ధించటం తప్ప నాకేం తెలీదు .శివుడే ఈ ఆలయాన్ని నిర్మించుకొన్నాడు .దీని పేరు ,దాని విశేషం నాకేమీ తెలీదు .’’అని చెప్పమని చెప్పాడు .
అప్పుడు ఆ వృద్ధుడు నీతో ‘’ఈ లింగము పేరు నీకు తెలియదు .లింగం వంక తదేక దృష్టి తొ చూడు .ఈ గుడి ఎవరు కట్టిందీ విన బడుతుంది .అది విన్న తరువాత నాకు చెప్పు ‘’అన్నాడు అప్పుడు ‘’నీవు కర్తవు ,కారయితావు .సాక్షాత్తు స్వయం భువుడవు .నేను అబద్ధం ఎందుకు చెబుతాను ?’’అను. వృద్ధ తపస్వి ‘’నాకు దాహం గా ఉంది నీళ్ళు తీసుకొని రా’’అని చెప్తాడు ..అప్పుడు వెంటనే బావి నుండి నీరు తోడి అతనికివ్వు .అతడు త్రాగుతాడు .అప్పుడు వెంటనే అతడు దేవతా స్వరూపం పొందుతాడు .యవ్వన ,రూప వంతుడు అవుతాడు .కుబుసం విడిచిన త్రాచు పాములా మెరుస్తాడు .అప్పుడు నువ్వు ‘’స్వామీ !ఏ ప్రభావం వల్ల మీరు ఈ వృద్ధ రూపం పొందారు ?మళ్ళీ ఈసుందర రూపం ఎలా వచ్చింది ?అని అడుగు .అప్పుడా తాపసి ఇలా చెప్తాడు ‘’వృద్ధ కాల మహా రాజా !నువ్వు బుద్ధి మంతుడివి .నీ భార్య అనుకూల వతి .ఈమె తుర్వసుడు అనే బ్రాహ్మణుని కూతురు .తండ్రి ఈమె ను నైద్రుతుడు అనే మహాత్ముని కిచ్చి వివాహం చేశాడు .భర్త చని పోయాడు .ఆమె పుణ్య వ్రతాల వల్ల పాండ్య రాజు కుమార్తె గా జన్మించింది .నిన్ను వివాహం చేసుకొని సుఖాలను భావిస్తోంది .
‘’పూర్వ జన్మ లో నువ్వు శివ శర్మ వు .వైకుంఠాన్ని పొంది పుణ్య వశం చేత నంది వర్ధన పురం లో వృద్ధ కాలుడు అనే రాజుగా పుట్టావు .ఈ మోక్ష క్షేత్రం లో నీ వు శివ పూజా దురంధరుడివై మోక్షాన్ని పొందుతున్నావు .నువ్వు చెప్పిన కర్తా ,కారయితా శంభుడే వేరేవరుకాదు.ఈ ఆలయాన్ని ఆయనే నిర్మించుకొన్నాడు .నీ పుణ్యాన్ని జాగ్రత్త గా కాపాడుకో .ఈ లింగం వృద్ధ కాల లింగం అని పిలువబడుతుంది .దీన్ని అర్చిస్తే కోరికలు తీరుతాయి ఈ వృద్ధ కాళేశ్వర లింగాన్ని పూజిస్తే సంవత్సరం లోపే సిద్ధి పొందుతారు .ఈ బావి నీరు త్రాగితే అంటువ్యాధులు రావు ..’’అని పలికి తన తొ ఉన్న అనంగ లేఖ చేయి పట్టుకొని వృద్ధ కాళేశ్వర లింగం లో అంతర్హితుడయాడు తాపసి .’’మహా కాలళా !మహా కాళా! అని ఎవరు స్మరిస్తారో వారు విష్ణు దర్శనం పొంది మోక్షానికి పోతారు .
ఈ విషయాలన్నీ భార్య లోపా ముద్రా దేవికి ముని అగస్త్యుడు వివరించాడు .శివ శర్మ వైకుంఠ వాసం చేసి తిరిగి భూమి పై నంది వర్ధన పట్టణం లో జన్మించి ఇహ లోక భోగాలు అనుభ వించాడు వారసులకు రాజ్యం అప్పగించి కాశీ చేరి విశ్వేశ్వరుని పూజించి మోక్షాన్ని పొందాడు .ఈ శివ శర్మ కధ విన్న వారికి ఉత్తమ జ్ఞానం కలుగు తుంది అని మహర్షి ఫల శ్రుతి చెప్పారు

కాశీ ఖండం –24

స్కంధ అగస్త్య సమాగమం
వ్యాస మహర్షి సూత మహామునికి అగస్త్య వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు .కలశోద్భవు డైన అగస్త్యుడు శ్రీ గిరి ప్రదక్షిణం చేసి స్కంద వనాన్ని సందర్శించాడు .అక్కడ తపోధనులు చాలా మంది ఉన్నారు . మనోహర మైన పర్వతం ఒకటి తపస్సు చేసుకోవటానికి అనువైన ప్రదేశం ఇదే అన్నట్లు గా కన్పించింది .అక్కడ షడానను డైన కుమారస్వామిని దర్శించాడు .ఆయనకు భార్య లోపాముద్ర తొ సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయనను స్తోత్రాల తొ తృప్తి పరచాడు .’’స్వామీ !తారకాసురుని సంహరించి లోకాలను రక్షించావు .మూర్తి సహితుడివి ,మూర్తి రహితుడివి కూడా .సహస్ర మూర్తివి ,సహస్ర గుణాధికుడవు .బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠుడవు .తపో ధనుడవు .మన్మధ సంహారకుడివి .ఐశ్వర్య విరాగివి .శరవణ జన్ముడవు నీకు నమస్కారం ‘’అని స్తుతించాడు .ప్రీతి చెందినకుమారస్వామి ‘’మహర్షీ !కుంభ సంభవుడవు .వింధ్య గర్వాపహారివి .కుశలమే కదా .మోక్షమిచ్చే విరూపాక్షుని అనుగ్రహం కోసం నేనిక్కడ తపస్సు చేస్తున్నాను .తీర్ధ స్నానాల చేత ,తపస్సు వల్లా .,,పరోపకారం వలన ధర్మం లభిస్తుంది .ధర్మం వల్ల అర్ధం దొరుకు తుంది .ధనా పేక్ష లేకుండా ధర్మా చరణం చేస్తే ధనం అదే వస్తుంది .దానికోసం వేమ్పర్లాడక్కర లేదు .ధర్మం వల్ల స్వర్గ ప్రాప్తి కల్గుతుంది .కానీ కాశీ పట్నం మాత్రం లభించదు .కాశీ ప్రాప్తికి శివుడు పార్వతీ దేవి తొ మూడు ఉపాయాలు చెప్పాడు .అందులో పాశు పత యోగం ఒకటి .రెండోది గంగా యమునా సంగమ లో స్నానం .మూడోది కాశీ పట్నం లో మృతి చెందటం .శ్రీ శైల ,హిమవత్పర్వతాల సందర్శనం ,దేవాలయ దర్శనం ,త్రిదండ ధారణం ,సర్వ కర్మ సన్యాసం ,అనేక రకాల తపస్సులు ,యమ నియమాది వ్రతాలు ,సముద్ర స్నానం ,అరణ్య వాసం ,మానస సరోవరతీర్ధ సందర్శనం ,గురుపీఠములను చూడటం ,అగ్నిలో హవనం చేయటం,సంకల్ప పూర్వకం గా చేసే యోగాలు శ్రీ మహా విష్ణు పూజన ,కీర్తన అనేవి ముక్తికి మార్గాలు అందుకే నేను నిన్ను కాశీ కుశలమా అని ప్రశ్నించాను .నా దగ్గరకు వచ్చి నన్ను స్పృశించు .నీ పుణ్యం కొంత నాకు దక్క నివ్వు .
‘’కాశీ లో మూడు రాత్రులున్న వారి పాద రేణువు లను తాకినా చాలు పవిత్రు లవుతారు .అక్కడ ఉత్తర వాహిని అయిన గంగా నదిలో స్నానం చేసి నీ జుట్టు అంతా పింగళ వర్ణం గా మారింది .నీపేర ఉన్న అగస్త్యేశ్వర లింగాన్ని అర్చించిన వారి పితృదేవతలు సంతృప్తి చెందుతారు ‘’అని కార్తికేయుడు పరమానందం తొ అగస్త్య మహర్షి శరీరాన్నంతా స్పృశించి ,అమృత సరో వరం లో స్నానం చేసిన వాడి ,సుఖాన్ని పొందాడు .కళ్ళు మూసికొని ‘’సర్వేశా !జయం ‘’అని మూడు సార్లు అన్నాడు .
అగస్త్యుడు కుమారస్వామితో ‘’స్వామీ !నీ తల్లి పార్వతీ దేవికి నీ తండ్రి పరమేశ్వరుడు వారణాసి మహిమను వర్ణించి చెప్పినప్పుడు నీవు ఆమె ఒడిలో కూర్చుని సమస్తము విన్నావు .అదంతా నాకు సవిస్త రం గా చెప్పమని అర్ధిస్తున్నాను ‘’అని అడిగాడు .దానికి స్కందుడు ‘’అదంతా చెబుతాను .విను .కాశీ క్షేత్రం లో ఉన్నా, గంగ నీరు త్రాగినా ,విశ్వేశ దర్శనం చేసినా ,అక్కడి గాలి పీల్చినా పుణ్యం వస్తుంది .ఇక్కడ తపస్సు చేసిన వారికి వేరొక చోట వెయ్యి తపస్సులు చేసినప్పుడు వచ్చే ఫలితం లభిస్తుంది .ఇక్కడ యావజ్జీవితం నివశించే వాడు మృత్యు ,భయ రహితుడవుతాడు ..పునర్జనం లేకుండా ఉండా లంటే ,కాశీ నివాసం తప్పని సరి .అవి ముక్త క్షేత్ర మైన కాశి ని వదల రాదు .ప్రాణము మర్మ స్థానాన్ని చేదించుకొని వెళ్ళే వరకు కాశీ లో స్మృతి ఉంటుంది .ప్రాణం ఉత్క్రమణం చెందే టప్పుడు సాక్షాత్తు విశ్వేశ్వరుడే వచ్చి చెవిలో రామ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు దాని తొ ప్రాణి బ్రహ్మ స్వరూపుడవుతాడు .’’అని ఆరుమొగాల కుమారస్వామి చెప్పాడని లోపాముద్రకు ముని చెప్పాడు .

కాశీ ఖండం –25

మణి కర్ణికాఖ్యానం
అగస్త్యుడు కుమార స్వామిని అవి ముక్త క్షేత్ర మైన కాశి ఎప్పటి నుంచి ఉన్నది ,మోక్ష కారణం ఎలా అయింది ,అంతకు ముందు అక్కదేముంది గంగా నది లేనప్పుడు కూడా కాశి ఉన్నదా ,రుద్ర నివాసం అనే పెరేట్లా వచ్చిందో వివ రించమని వేడాడు .అప్పుడు స్కందుడు ఇలా చెప్పాడు .ప్రళయ కాలం లో స్తావర ,జంగమా లన్ని నశించి సూర్యుడు ,గ్రహ నక్షత్రాలు లేక సమస్త బ్రహ్మాండం చీకటి గా ఉండేది .శూన్య మైన ఆకాశం ఇతర తేజస్సు చేత వృద్ధి పొందేది .ద్రష్ట లెవరూ లేని సమయం లో శబ్ద స్పర్శ రస గందాదులు లేని కాలం లో దిక్కులు కూడా తెలియని స్తితి ఉండేది .అప్పుడు‘’తత్వత్ బ్రహ్మ ‘’అని వేదం ఎవరి గురించి చెప్పిందో ,నామ రూపాలు ఎవరికి లేవో, స్తూల సూక్ష్మ రూపాలు ఎవరికి లేవో, ఆనంద స్వరూపుడేవ్వడో ,నిర్వికల్పం ,మాయా రహితం ,అది అసం విత్తు అని పిలువ బడుతుంది .ఈ అద్వితీయుడు సృష్టి చేయాలని సంకల్పించాడు .దీని నిర్వహణకు ఇంకోరు తోడు కావాలని అనుకొన్నాడు .
అప్పుడు ‘’మాయా శక్తి ‘’ని సృష్టించాడు .అది సర్వైజ్ఞాత్వం ,సర్వ జ్ఞానం కలది .అంతట నిండి ఉండేది ,అన్నిటిని చూసేది అన్నిటిని సృష్టించేది అది .దానినే ‘’పర ‘’అన్నారు .ఆ తర్వాతా బ్రహ్మ ను సృష్టించాడు . సృష్టికి ఆద్యుడను .మాయ ఆయననేప్పుడు విడిచి ఉండదు .ఆ మాయనే ప్రకృతి అంటారు .మాయ కాల స్వరూపిణి .ఈశ్వర శక్తి యేప్రకృతి .ఆ పరాశక్తిని ఈశ్వరుడు రమించాడు .వారి ఆనంద ఫలితమే ఈ కాశి పట్టణం .ప్రళయ కాల మందు కూడా శివా శివులు దీన్ని వదలి పెట్టరు .మహా ప్రళయం లో సముద్రాలు ,భూమి వికలం అయి నప్పుడు తాను విహరించటానికి ఈశ్వరుడు కాశి ని నిర్మించాడు .ఆనందాన్నిస్తుంది కనుక ఇది ఆనంద వనం అనే పేరు తెచ్చు కొన్నది .
పార్వతీ పరమేశ్వరులకు ఇంకా ఏమి సృష్టించాలి అన్న ఆలోచన వచ్చింది .పార్వతి దేవి వైపు సాభి ప్రాయం గా చూశాడు .వెంటనే ఆమె శరీరం నుండి సత్వ గుణో పెతుడైన అచ్యుతుడుద్భ వించాడు .అప్పుడు శివుడు అతని తొ‘’నువ్వు విష్ణువు అనే పేరు తొ పిలువబడుతావు .నా ఉచ్చ్వాస నిస్శ్వాసాల వల్ల వేదాలు ఉద్భవిస్తాయి అని చెప్పి విష్ణువుకు బుద్ధిత్వానికి అది పతిని చేశాడు .శివుడు ఆనంద కాననానికి పార్వతి తొ సహా వెళ్లి పోయాడు .
విష్ణువు శివుని గురించి తపస్సు చేయ సంకల్పించాడు .సుదర్శన చక్రం తొ భూమిని త్రవ్వి ఒక పుష్కరిణి ఏర్పాటు చేశాడు .అందులో ఆయన చెమట బిందువులు పడి నీటి తొ నిండిపోయింది .దాని ఒడ్డున తీవ్ర తపస్సును కదలకుండా చేసి స్తాణువే అయ్యాడు .ఈశ్వరుడు సతీ సమేతం గా వచ్చి మెచ్చాడు ఎల్లప్పుడు శివ పార్వతులను దర్శించే భాగ్యం ప్రసాదించమని విష్ణువు వరం అడిగాడు .సరేనన్నాడు .విష్ణువు కఠోర తపస్సుకు ఇంకో వరం ఇచ్చాడు .విష్ణువు తపస్సు చూసి ఆనందం తొ శిరస్సు ఊపుతుంటే ఆయన మణి కర్ణిక అనే కర్ణ భూషణం ఒకటి జారి పుష్కరిణి లో పడింది .అది ఇక నుంచిఆ ప్రదేశం అంటే విష్ణువు తవ్విన పుష్కరిణి మణి కర్ణికఅని పిలువబడుతుందని చెప్పాడు .
అప్పుడు విష్ణువు ‘’శివా !నీ వల్ల ఈ పుష్కరిణి మణి కర్ణిక అవటం ఆనందం గా ఉంది.ఇది ఉత్తమొత్తమమైనది అవాలి ఇక్కడ ఎప్పుడు మహోదయం కావాలి ‘అని కోరాడు సరే నన్నాడు భవుడు.శివుని పరి పరి విధాల స్తోత్రం చేశాడు .ఎక్కడ యముని భయం ఉండదో ,ఎక్కడ గర్భ నరకం ఉండదో అదే కాశి ..అని స్కందుడు అగస్త్య ర్శి కి చెప్పాడు .’’నేను యువకుడిని .నాకు మరణం చాలా దూరం ఉంది .మృత్యువు గురించి నాకు ఇప్పుడే విచారం ఎందుకు ?/అను కొనే వాడికి యముడి దున్న పోతు ఘంటా రావం విని పిస్తుంది .శరీరం మీద ఆసక్తి దూరం చేసుకొన్న వాడికి, శివుని పై దృఢ చిత్తం తొ ఉన్న వాడికి శివ పురి నివాసం కల్గుతుంది ..

కాశీ ఖండం –26

గంగా మహిమ –దశహార స్తోత్రం
కాశీ కి ఆనంద కాననం అనే పేరెలా వచ్చిందో కుమార స్వామి అగస్తునికి ఇలా వివ రించాడు .సాగర పుత్రులు అశ్వ మేదాశ్వం వెంట వెళ్లి కపిల మహర్షిని అవమానించి ఆయన క్రోధాగ్నికి దగ్దులైనారు .భగీరధుడు ఈ వృత్తాంతాన్ని విని ,వారికి ముక్తి కల్గించే ఉద్దేశ్యం తొ తపస్సు చేసి గంగను తీసుకు రావాలని నిశ్చయించుకొన్నాడు .హిమాలయాలకు వెళ్లి తపస్సు ప్రారంభించాడు .త్రిపద గామిని అయిన గంగ నుభూమికి తెచ్చి తన తన పితామహు లందర్నీ ఉత్తమ లోకాలకు పంపాలని ఆయన సంకల్పం గంగ సమస్త బ్రహ్మాం డాలకు ఆధారమైనది .శుద్ధ విద్యా స్వరూపిణి ,త్రిశక్తి .కరుణాంతరంగ .పరబ్రహ్మ స్వరూపిణి .చతుర్విధ పురుషార్ధాలు గంగా నదిలో ఉన్నాయి .గంగా దర్శనం చేతనే సకల పాపాలు నశిస్తాయి .గంగను స్మరిస్తే సంసార బంధ విముక్తి కలుగు తుంది .భక్తీ తొ తేనె ,నువ్వులు ,తొ కూడిన పిండాలను గంగోదకాల లో సమర్పించిన వాడి పితరులునూరేళ్ళు పరి తృప్తి పొందుతారు .
గంగా నది లో స్నానం సర్వ తీర్ధ ఫలదం .వ్రతాలలో సత్య వ్రతం ,దానాల్లో అభయ దానం ,పర్వతాలలో హిమవత్పర్వతం ఎంత గొప్పవో గంగ అంత గొప్పది .గంగా పానం ఎన్నో జన్మల పాపాన్ని హరిస్తుంది .గంగ లో అమా వాస్య నాడు స్నానం చేస్తే నూరు రెట్లు అధిక పుణ్యాన్నిస్తుంది .జ్యేష్ట శుద్ధ నవమి హస్తా నక్షత్రం లో స్నానం ,రాత్రి జాగరణ చేస్తే ,దీపాలను వెలిగించి హారతిస్తే ,దానం చేస్తే ఉత్తమ లోక ప్రాప్తి కలుగు తుంది .
గంగను పూజిస్తూ ‘’శుభకరీ అగు గంగ కు నమస్కారం .రుద్ర రూపిణి సకల దేవత స్వరూపిణి ,నమస్కారం .ప్రాణి కోటి విశాహారిణీ నమోస్తుతే ,ముక్తి భుక్తి ఇచ్చే నీకు నమో నమః .స్వర్గ లోక ప్రాప్తి కల్గించు నీ కిదే నమస్కారం .మంగళ స్వరూపిణివి .పరాపరాలకు ఆధారం నీవే .నిర్వాణ సుఖాన్నిచ్చే నీకు వందనం .మూల ప్రకృతివి ,పరబ్రహ్మ స్వరూపిణివి నీకు ప్రణామం ‘’అని గంగా స్తవం ఎవరు జ్యేష్ట శుక్ల దశమీ హస్తా నక్షత్రం లో ప ఠిస్తారో వారి జోలికి దరిద్రం రానే రాదు .శ్రీ మహా విష్ణువు ఎంతో శివుడు అంతే .ఉమకు గంగకు భేదం లేదు .శివ కేశవులకు లక్ష్మీ పార్వతులకు గంగా గౌరీ లకు భేదం ఉందని భావించే వాడు మూర్ఖుడు .

కాశీ ఖండం –27

గంగా మహాత్మ్యం
పార్వతీ దేవి శివుడిని భాగీరధ వృత్తాంతాన్ని,గంగకు భాగీరధి అనే పేరు ఎలా వచ్చింది ఆ విషయాన్ని ఆమె కు చెప్పిన వైనాన్ని అగస్తునికి స్కందుడు చెబుతున్నాడు . గంగ లో పితృ దేవతలు ఎల్లప్పుడు ఉంటారు కనుక వారికి ఆవాహన ,విసర్జన అక్కర లేదు .పితృ ,మాత్రు వంశాలలో మరణించిన వారు ,అగ్ని ప్రమాదం లో చని పోయిన వారు ,విద్యుత్తు ,పులి వల్లా ,పక్షి మృగ క్రిమి కీటకాలను హింసించి చంపినవారు ,ఉరి వేసుకొని చని పోయిన వారు ,విషం చేత ,చచ్చిన వారు ,కుంభీపాక ,రౌరవాది నరకాలలో ఉన్న వారు ,యమ లోకం లో ఉన్న వారు పుత్రులు లేకుండా మరణించే వారు,క్రుతఘ్నులు మిత్రద్రోహులు ,డబ్బు దోచే వారు ,అనాధలు దీనులు మొదలైన వారికి గంగా జలం తొ తర్పణం విడిస్తే వారంతా స్వర్గాన్ని పొంది ,భోగాలను భ విస్తారు .
మూడు లోకాల్లో ఉన్న తీర్ధాలన్నీ కాశి లో ని గంగా జలం లో ఉన్నాయి .ఇక్కడి ఉత్తర వాహిని అయిన గంగా నది ని ‘’స్వర్గ సముద్రం ‘’అంటారు .బ్రహ్మ హత్యా పాతక దోషాన్ని కూడా పరి హరించే సమర్ధత ఉన్నది .ముక్తి క్షేత్రం . .విశ్వ నాధుని అనుగ్రహం తొ అమృతత్వాన్ని పొందుతారు .మహా పాపి కూడా అంత్య కాలం లో గంగా స్నానం చేస్తే పాపం నుండి విముక్తు డవుతాడు .
పూర్వం కళింగ దేశం లో ఒక బ్రాహ్మనుడుందే వాడు ఉప్పు అమ్ముకొని జీవించే వాడు .స్నానం ,సంధ్యా అంటే ఏమిటో అతడికి తెలియదు .అతని పేరు ‘’వాహికుడు ‘’యజ్ఞోప వీతం మాత్రం ఉండేది .ఒక శూద్ర విధవా స్త్రీ ని పెళ్లి చేసుకొన్నాడు .ఆ దేశం లో విప రీతమైన కరువు వచ్చింది .అంతా దేశం వదిలి పోతున్నారు .వీరిద్దరూ కూడా వెళ్లారు దారిలో ఒక పెద్ద పులి అతడిని చంపి తినేసింది . అతడి ఎడమకాలి ని మాత్రం ఒక గ్రద్ద తన్నుకొని పోయింది .ఇంకో గ్రద్ద ఈ మాంసం కోసం దానితో యుద్ధం చేసింది .ఆ గ్రద్ద నోటి నుండి జారిన వాహికుని ఎడమకాలు అదృష్ట వశాత్తు గంగా నదిలో పడింది .యమదూతలు అతన్ని చేరి చరణా కోలు తొ కొట్టి బాధించటం ప్రారంభించారు .అతడి నోరు ,ముక్కుల నుండి రక్తం కారుతోంది .అలాగే వాడిని యమ ధర్మ రాజు వద్దకు తీసుకొని పోయి నిల బెట్టారు .చిత్ర గుప్తుని పిలిచి అతడి పుణ్య ,పాప విశేషాలు చెప్పా మన్నాడు యమధర్మ రాజు .
చిత్ర గుప్తుడు చిట్టా విప్పి చెప్పాడు .అతడు జన్మించిన దగ్గర్నుంచి జాత కర్మ జరగ లేదని ,ఆయుర్బలం వల్ల గర్భ దోశాలేమీ అంతలేదని ,పదకొండో రోజు న నామ కరణం జరగ లేదని ,నాల్గవ నెలలో బయటికి తీసుకొని వెళ్ళ లేదని ,శుభ తిధులలో తండ్రిఅతడిని తన వెంట తీసుకొని వెళ్ళే వాడని ,అన్నప్రాసనా చేయ బడ లేదని తండ్రి మి ఠాయి కొని సూర్యుడికి చూపించి కొడుక్కి పెట్టె వాడని ,చూడా కర్మ ,కర్ణ వేద విధి విధానం లో జరుగ లేదని,స్వర్ణ కారుడేవరో చెవులు కుట్టాడని ,ఎనిమిదో ఏట మౌన్జీ ధారణా జరిగిందని ,దాని విసర్జన శాస్త్ర ప్రకారం చేయ లేదని ,శూద్ర స్త్రీని పెళ్లి చేసుకొన్నాడని ,చిన్నప్పటి నుండి దొంగ గా బతికాడని ,జూదం అదే వాడని ఉప్పు అమ్ముకొనే వాడని ఒక ఆవుదూడ వచ్చి ఉప్పు నాకు తుంటే దాన్ని కొడితే అది మరణించిందని ,తల్లిని చాలా సార్లు కాలితో తన్నాడని ,తండ్రి మాట వినే వాడుకాడని ,చాలా సార్లు ఇతరులతో పోట్లాదాడని, విషం తాగుతానని బెది రించే వాడని ,ఒకప్పుడు అగ్ని చేత దగ్ధ మయాడని ,జంతువులనేక సార్లు కొమ్ములతో ఇతన్ని కుమ్మేశాయని ,కర్రలు పెట్టి అఘాయిత్యం గా తల పగలకొట్టుకొనే వాడని ,చర్మం ,మాంసం ,గోళ్ళు అమ్మే వాడని పగలే స్త్రీ లతో వ్యభిచరించే వాడని కాసే ,పూసే చట్లను నిష్కారణం గా నరికేసె వాడని ఇంతెందుకు వీడు మూర్తీభవించిన పాపమే అని ఏకరువు పెట్టాడు చిత్ర గుప్తుడు . అతడిని చిత్ర హింసల పాలు చేయమని యముడు ఆజ్న జారీ చేశాడు .ఇంతలో అతని ఎడమ కాలు గంగా నదిలో పడటం వల్ల స్వర్గం నుండి విమానం వచ్చి అప్సరసలు సేవిస్తుండ గా వాహికుడిని స్వర్గానికి తీసుకొని పోయారు .కనుక గంగా నది పుణ్య ప్రదమైంది అని స్కందుడు చెప్పాడు .సదా శివ సంబంధ మైన ఒకానొక శివ సంబంధ శక్తి ఎప్పుడూ గంగ లో ప్రవహిస్తూ ఉంటుంది .దేవదేవుడే జగద్రక్షణ కోసం గంగ రూపాన్ని పొందాడు .శంభుని చే వేదాక్షరాలు వడ కట్ట బడి ఆ గంగా ధరుని చే గంగా జలం గా చేయ బడింది .యోగా ,సాంఖ్య ఉపనిషత్ సారం గంగా జలం ..గరుత్మంతుని చూస్తె పాములు పారి పోయి నట్లు భాగీరధిని చూస్తేనే పాపాలన్నీ పారి పోతాయి .గంగ మట్టిని శిరస్సు న ధరిస్తే సూర్య సమాన తేజం కలుగుతుంది .గంగా స్తుతి ,దర్శనం, స్పర్శనం, పానం, స్నానం సర్వ కామాలను తీరుస్తాయి .నదులలో ఉత్తమ మైనది .చంద్రుని కూడా శోభా వంతుని చేసే లక్షణం ఉంది .గంగయే సర్వ తీర్ధం .అదే తపోవనం .;గంగను మించిన దేదీ లేదు ఇది సత్యం ,పునస్సత్యం .

కాశీ ఖండం –28

వారణాసి మహిమ
అగసత్యు నికి కుమారస్వామి వారణాసి మహిమ ను వివరిస్తున్నాడు .ఇక్కడ ప్రయత్న,అప్రయత్న మరణం సంభ వీస్తే ముక్తియే . .ఈ మణి కర్ణిక లోకి గంగ చేరింది .ఇది శ్రీ విష్ణువుకు చక్ర పుష్కరిణి .పరబ్రహ్మ నివాస క్షేత్రం భగీరధుడు రాజర్షి బాగీరధిని భూమి పైకి తెచ్చి తన పితా మహు లందరికి ఉత్తమ లోకాలను కల్గించాడు .ఇక్కడ బంగారం ఉద్భ వించింది .చక్ర పుష్కరిణి మణి శ్రవణం అనే పేరు తొ పిలువా బడుతుంది .మణి కర్ణిక లో గంగ చేరిన దగ్గర్నుంచి ఇది దేవతలకు నిత్య ఆవాసం అయింది .ఇక్కడ జ్ఞానం తొ పని లేదు .గంగా స్నానం విశ్వనాధ దర్శనమే ముక్తి నిస్తుంది .యముడు మొదలైన వారు కూడా ఇక్కడి వారినేమీ చేయలేరు .అన్ని విఘ్నాలను పోగొట్టే వరుణా నది ఉంది..కాశీ కి దక్షిణం గా అసి నదికి ఉత్తరం గా వరుణా నదిని దేవతలు నిల్పి మోక్ష నిక్షేపం గా కాపాడు తున్నారు .
ఈ క్షేత్రం లో పడమరన వినాయకుడున్నాడు .ఈయన విశ్వనాదునికి రక్షకుడు .వినాయకుని అను మతి లేని వారికి ప్రవేశం లేదు .పూర్వం దక్షిణ సముద్ర తీరాన సేతు బంధనం దగ్గర మాత్రు భక్తీ కల ధనుంజయుడు అనే వాడుండే వాడు .సన్మార్గం లో ధనం సంపాదించే వాడు .అర్ధులను సంతోష పెట్టె వాడు .వినయ సంపన్నుడు .విష్ణు పూజా దురంధరుడు గుణ సంపన్నుడు .సదాచార సంపన్నుడు .తల్లి ని విశేషం గా పూజించి సేవించే వాడు .శివ యోగి బోధ వల్ల అతనికి జ్ఞానం కలిగింది .తల్లి చని పోయింది ఆమె అస్తికలను భద్రం గా ఒక పెట్టె లోరాగి పెట్టి పూజలు చేసి కావడిలో దాన్ని కాశీ కి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు .ఇతరు లెవ్వరు పెట్టె ను ముట్టుకో కుండా జాగ్రత్త పడ్డాడు .దారిలోఒక అరణ్యం లో జ్వరం వచ్చి బాధ పడ్డాడు .కూలి వాడిని ఏర్పాటు చేసుకొని అతని తొ పెట్టె మోయించాడు .
కాశీ కి చేరాడు .మోసే వాడినే కాపలా ఉంచి కావలసినవి కొనుక్కో వటానికి బజారు వెళ్లాడు .ఆ రాగి పెట్టె లో డబ్బు ఉంటుందని వాడు ఆశ పడ్డాడు .దాన్ని ఎత్తుకు పోయాడు .ధనుంజయుడు తిరిగి వచ్చి తెలుసుకొని బాధ పడ్డాడు .గంగా స్నానం విశ్వ నాద దర్శనం లేకుండా ఆ మోత గాడి ఇంటికి వెళ్లాడు .వాడు ఆ పెట్టె ను దారిలోనే బద్దలు కొట్టి అందులో అస్తికలే ఉన్నందున అక్కడ పారేసి పారి పోయాడు ఇంటికి వెళ్లి అతని భార్యను నిజం చెప్పమని ధనుంజయుడు కోరాడు ఆమె ఇంట్లో దాగి ఉన్న భర్తకు ఈ సంగతి చెప్పింది .ధనుంజయుడు అతడిని తీసుకొని ఆ ప్రదేశానికి చేరాడు .ఆ చోటును అంత పెద్ద అరణ్యం లో కని పెట్ట లేక హతాశుడై ఇంటికి తిరిగి వెళ్లి పోయాడు .
అందరికి చెప్పి ,వారు చెప్పిన ప్రకారం గయ కు వెళ్లి తల్లి శ్రాద్ధం పెట్టాడు .ప్రయాగ లో త్రివేణీ సంగమ స్నానం చేశాడు .తరువాత కాశీ కి వచ్చి తల్లి అస్తికలను గంగలో కలిపితే విశ్వేశ్వరా నుగ్రహం లేక పోవటం వల్ల నెట్టి వేయ బడ్డాయి .శ్మ అంటే శవం .శాన అంటే శయ నించేది .అంటే శవం శయనించేది కనుక కాశి కి మహా శ్మశానం అని పేరొచ్చింది .అంటే ప్రళయ కాలం లో సమస్త భూత జాలం శవం పై ఈ మహా క్షేత్రం లో శయనిస్తుంది అని అర్ధం .కనుకనే మహా శ్మశానం అయింది .ప్రళయ కాలం లో ఈశ్వరుడు ప్రతి నిత్యం కాశీ పట్నం లో త్రిశూలం పై ఉంచి రక్షిస్తూ ఉంటాడు .అందుకే కాశీ కి ప్రళయ భయం లేదు .కాశి కలి కాల వర్జిత మైనది .దీనిని కాశి ,అని ,వార ణాసి అని ,రుద్రా వాసమని ,మహాశ్మశానమని ,ఆనంద కాననం ,దేవీ పురమని అంటారు .

కాశీ ఖండం –29

కాల భైరవుడు
కాల భైరవ ప్రాదుర్భవాన్ని గురించి అగస్త్యునికి కార్తికేయుడు వివ రించాడు .పూర్వం మేరు శృంగం లో బ్రహ్మ దేవుడు ఏకాంతం గా తపస్సు చేస్తున్నాడు ..మహర్షులు ఆయన దగ్గరకు వెళ్లి ఏకాంతం గా ఏమి చేస్తున్నావని ప్రశ్నించారు .దానికి బ్రహ్మ ‘’నేను దాతను .జగత్తును సృష్టించి ,పెంచి లయం చేస్తుంటాను .స్వయంభు ని .సర్వేశ్వరుడిని .జగాలన్ని నా అధీనం .నా కంటే గొప్ప దేవుడు లేదు ‘’అని ప్రగల్భాలు పలికాడు .అప్పుడు నారాయణఅంశ తొ వచ్చిన క్రతువు బ్రహ్మ తొ ‘’పర తత్వాన్ని తెలుసుకోకుండా అజ్ఞానం తొ మాట్లాడుతున్నావు ..నేనే కర్తను ,నారాయణుడిని ,యజ్న స్వరూపుడను .’’అన్నాడు ఇద్దరికీ వాగ్వాదం జరిగింది .చతుర్వేదాలలో ప్రవీణులైన విప్రులను సాక్షు లు గా ఉంచుకొని వాదు లాడుకొన్నారు .వేదాలలో ఏమి చెప్ప బడిందో తెలియ బర్చమని వారిద్దరూ కోరారు .వేదాలే తమకు ప్రమాణం అని తెలియ జేశారు .ఋగ్వేదం ‘’ఈ సకల భూత గణం ఎక్కడి నుంచి వచ్చి ,మళ్ళీ ఎక్కడికి చేరుతుందో అదే పర తత్త్వంఅయిన రుద్రుడు ‘’అన్నది యజుర్వేదం ‘’ఎవరు యజ్ఞాధి పతి యో ,యోగం చేత అర్చింప బడే వాడేవ్వడో, ఎవరు అందరికి ప్రమాణమో ఆయనే సర్వజ్ను డైన శివుడు ‘’అని చెప్పింది .సామ వేదం’’ఎవరి చేత విశ్వ భ్రమణం జరుగు తోందో ,యోగులెవరిని గూర్చి చిన్తిస్తారో ,ఎవని కాంతి చే ఈ విశ్వం ప్రకాశిస్తుందో ఆయనే పరమ శివుడైన న త్రయంబకుడు ‘’అన్నది .అధర్వ వేదం ‘’దేవేశ్వరుడేవడో ,కైవల్య స్వరూపుడేవ్వడో అతడే దుఃఖ హారి అయిన శంకరుడు‘’అని చెప్పింది .
అప్పుడు బ్రహ్మా క్రతువు లిద్దరూ శ్మశానం లో విభూతి పూసుకొని దిగంబరం గా తిరిగే వాడూ ,ఎద్దునేక్కి తిరిగే వాడు సర్ప భూషణుడు ఎలా బ్రహ్మత్వం పొందుతాడు అన్నారు . .అప్పుడు సనాతన ప్రమాణం అమూర్తి అయినా మూర్తి మత్వాన్ని పొంది నవ్వుతు ‘’పరమేశ్వరుని తెలుసు కోవటం కష్టమైన పని .లీలా రూపం తొ నాట్యమాడుతాడు .ఆయన స్వయం జ్యోతి ,సనాతనుడు ,ఆనంద స్వరూపుడు ‘’అని చెప్పింది .అయినా బ్రహ్మ అజ్ఞానం నాశనం కాలేదు .అప్పుడు ఒక జ్యోతి వారి ముందు ప్రత్యక్ష మైంది .అది భూమ్యాకాశాలను ఆక్రమించింది ..జ్యోతిర్మండల మైన పురుషా కారం తొ అది బ్రహ్మ కున్న ఐదో శిరస్సు ను తగుల బెట్టింది .తరువాత ఆజ్యోతి శివ రూపం చెంది ప్రత్యక్ష మై నాడు. .బ్రహ్మ అహంకారం చావలేదు ‘’పూర్వం నువ్వు నా ఫాలభాగం నుండి పుట్టావు .నన్ను శరణు వేడు నేను నిన్ను రక్షిస్తా‘’అని గర్వం గా అన్నాడు .అప్పుడు కోపం తొ ఒక భైరవా కారాన్ని శివుడు తన నుంచి సృష్టించాడు .
శివుడు కాల భైరవుని తొ ‘’నువ్వు ఈ ప్రపంచాన్ని భరించే శక్తి కల వాడివి .నిన్ను ‘’పాప భక్షకుడు ‘’అని పిలుస్తారు కాశీలోనే నీ ఉనికి కాలమే నిన్ను చూసి భయ పడే కాల భైరవుడివి .’’అన్నాడు అప్పుడు భైరవుడు తన ఎడమ చేతి బొటన వ్రేలి తొ బ్రహ్మ ఐదో తలను గిల్లి వేశాడు .భయ పడిన బ్రహ్మ శత రుద్రీయాన్ని పఠించాడు ..శివుడు బ్రహ్మను ఓదార్చి కాల భైరవుని తొ ‘’నువ్వు యజ్ఞాలలో మాన్యత్వాన్ని పొందుతావు .బ్రహ్మ కపాలాన్ని చేతి లో ధరించి ,బ్రహ్మ హత్యా దోషం పోవటానికి తపస్సు చెయ్యి .’’అని చెప్పాడు .
ఆ శివుడు బ్రహ్మ హత్య అనే పేరుకల కన్య ను సృష్టించాడు .ఆమె ఎర్రనిది. యెర్రని వస్త్రాలు యెర్ర చందనం ధరించి కోరలతో కూడిన విశాల మైన నోటి తొ వ్రేలాడే నాలుక తొ ,ఒక కాలు పైకెత్తి రక్త పానం చేస్తూ ఖడ్గం రక్త పాత్ర ,తల పుర్రె చేతుల్లో ధరించి అందర్ని భయ భ్రాంతులను చేసింది .శివుడు కాల భైరవు ని తొ ‘’నువ్వు అన్ని ప్రదేశాలలో తిరిగే అధికారం కల వాడివి .ఈమె తొ నీకు కావాల్సిన పని చేయించుకో ‘’అని చెప్పి అంతర్ధానమయ్యాడు .
కపాల పాణియై ,కాపాలికా వ్రతము ధరించి భైరవుడు త్రిలోక సంచారి అయాడు .కాశీ లో కాల భైరవుడు నిరంతరం సంచరిస్తూ ఏ దోషాలు రాకుండా కాపాడుతాడు .అన్ని కోరికలను తీరుస్తున్నాడు .భైరవుడు కాశీ లో ప్రవేశించగానే ‘’బ్ర హ్మ హత్య ‘’భయ పడి పాతాళ లోకానికి పారి పోయింది .

కాశీ ఖండం –30

దండ పాణి ఆవిర్భావం
పూర్వం రత్న భద్రుడు యక్షుడుందే వాడు .పుణ్యాత్ముడు ,ధార్మికుడు .అతనికి పూర్ణ భద్రుడనే కుమారుడున్నాడు .కుమారునికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత తండ్రి అన్నిటి విషయాలు కొడుక్కి అప్ప గించి శాంభవ యోగం చేత మరణించాడు .కుమారుడు సర్వ భోగాలు అనుభ విస్తు పుత్రులు లేక పోవటం వల్ల కలత చెందాడు .భార్య తొ తాను ఉంటున్న ఈ ప్రాసాదాలు ఏమీ నచ్చటం లేదని మనస్శాంతి లేకుండా పోయిందని ,పుత్రుని పొందితేనే జీవితం ధన్యమని చెప్పాడు .
పూర్ణ భద్రుడు తన సంగీత విద్య చేత మహా శివుని మెప్పించాడు .శివానుగ్రహం వల్ల భార్య కనక కుండల గర్భం దాల్చింది .కుమారుడు జన్మించాడు .వాడికి హరి కేషుడు అని పేరు పెట్టారు .కొడుకు పుత్తి న సంతోషం తొ అనేక దాన ధర్మాలు చేశాడు ..ఎనిమి దో ఏటేహరి కేశునికి శివ భక్తీ అలవడింది .శివుడిని తప్ప వేరొకరి ధ్యాస లేదు .నాలుక మీద హర నామం మాత్రమె ఉండేది .దుమ్ముతో లింగాన్ని చేసి గరిక తొ పూజించే వాడు .తండ్రి పూర్ణ భద్రుడికి కొడుకు వింత ప్రకృతి అర్ధం కాలేదు .ఈ పూజలు ముసలి తనం లో చేసుకో వచ్చు ,ముందు వివాహం చేసుకొని సంతానాన్ని కని తమకు సంతోషం కలుగ జేయమని నచ్చే చెప్పే వాడు .ఒక్కోసారి తండ్రి గట్టిగా మందలించే వాడు .భయ పడి ఒక రోజున ఇల్లు వదిలి పెట్టి వెళ్లి పోయాడు .
హరి కేషుడు అందరికి దారి చూపేది కాశీ నగరమే అని భావించి ఒక అరణ్యంలో ప్రవేశించి .అక్కడ శివుడి కోసం ఉత్తమ తపస్సాచ రించాడు .శివుడు మెచ్చి పార్వతీ సమేతం గా ప్రత్యక్ష మై నాడు .అతని జుట్టు అంత జడలు కట్టింది .శరీరం అంతా పుట్టలు పట్టాయి .మాంసం లేని ఎముకల గూడు గా ఉన్నాడు .తెల్లని శరీరం తొ శంఖం లా మెరుస్తున్నాడు .మాంసాన్ని కీటకాలు పొడుచుకు తింటున్నాయి .అతని పింగళా దృష్టి దిగంతాల వరకు వ్యాపించి ,అతని తపోగ్ని అంతటా ప్రసరిస్తోంది .భక్తీ తప్ప ఇంకేమీ అతనికి తెలియదు సింహానికి భయ పడ్డ లేడి పిల్లలు అతన్ని రక్షిస్తున్నాయి .
పరమేశ్వరుడు వృషభ వాహనం దిగి పుట్టలో ఉన్న హరి కేషుని చేయి పట్టి బయటికి తెచ్చాడు .అతడు పరమేశ్వర సాక్షాత్కాసరం తొ పరవ షించి స్తుతించాడు .అప్పుడు శివుడు మెచ్చి ‘’నువ్వు దక్షిణ దిశలో నివ శిస్తు నా కను సన్న లలో మెలుగు తు ఉండు దుష్టులను దండిస్తు దండ పాణి అనే పేరప్రసిద్ధి చెండుతావు ‘’అని చెప్పి అదృశ్యమైనాడు .స్కందుడు అగస్త్య మహర్షితొ హరి కేషుడు అనే యక్షుడే కాశీ లో దండ నాయకుడనే పేరుతో ఉంటున్నాడు అని,దండ పాణి అనుగ్రహం లేనిదే కాశీ లో ఎవరు సుఖం అనుభ విన్చలేరని చెప్పాడు