*దేవాలయాల మిస్టరీ*

ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటివరకూ వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది.

ఆలోచనాతరంగాలను రేకెత్తించే పుణ్యక్షేత్రాలు, వాటి విశేషాలు, వాటి *మిస్టరీలు* కొన్ని మీ కోసం... చదవండి....

*శని శింగనాపూర్*

మహారాష్ట్రలో ఇది ఒక గ్రామం. ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు.. శని రూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. అంత పవర్ ఆ శనిసింగనాపూర్ శనిదేవుడిది..

*యాగంటి*

ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం యాగంటి ఆలయం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగావున్న నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే.. ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగివుందని, అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే భక్తులనమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూవుంటారు..

*లేపాక్షి*

లేపాక్షీ మన ఆంధ్రాలో.. అనంతపురం జిల్లాలో వుంది. ఇక్కడ వున్న స్థంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్థంభం క్రింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పట్టించేయోచ్చు. అంటే స్థంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్థంభం క్రింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్థంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు..

*తంజావూరులో మిస్టరీ*

తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి వుంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం *నీడ*. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా.. సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికుపయోగించిన గ్రానైట్ ను కూడా ఎక్కడ నుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు. ఇలాగే మరొకటి కూడా వుంది.

అదే...
*పూరీజగన్నాథ్ ఆలయం*

పూరీజగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరీక్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం వుంది. ఆ సముద్రపు శబ్దంకూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతుచిక్కలేదు..

*షోలాపూర్*

మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజూ ఉపయోగించే బెడ్ షీట్ లకు పెట్టిందిపేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది పేరు షెత్పల్.. ఈ గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతిఇంట్లో పాములకు కూడా ఒక గదివుంటుంది. ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూవుంటాయి. కాని ఇంతవరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతోంది.. అంటేనే భయమేస్తోంది కదూ..

*అమ్రోహా*

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధిచెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? *తేళ్ళు!!* అవును.. ఇక్కడ ఆలయంలోపల.. చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఒకటికాదు, రెండుకాదు వేలసంఖ్యలో. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా.

కాశి ఖండం మిగతా బాగములు

01 to 10

11 to 20

21 to 30

31 to 40

41 to 50

51 to 60

61 to 70

కాశీ ఖండం – 11

నైరుతి ,వరుణ లోక వర్ణన
శివ శర్మ నై రుతి మొదలైన లోకాలను గురించి తెలియ జేయమని విష్ణు దూతలను కోరగా వివరిస్తున్నారు. మొదటిది నైరుతి.పుణ్య వతి పుణ్య జనులకు ఆవాసం .వేద మార్గాన్ని అనుసరించే వారు ఇక్కడికి వస్తారు.దయా ధర్మాలతో ప్రవర్తించే అన్త్యజులకు కూడా ఈ లోకంలభిస్తుంది అని పింగాక్షుని ఉపాఖ్యానాన్ని తెలిపారు
పింగా క్షోపాఖ్యానం
విన్ధ్యాటవి లో ఒక పల్లె కు పింగాక్షుడు ప్రభువు .మంచి శూరుడు క్రూరకర్మాలంటే అయిష్టం .నిర్దాక్షిణ్యం గా జంతువులను, మనుష్యులను చంపే వారిని కఠినం గా శిక్షించే వాడు అడవిలో ప్రయాణించే వారిని వెంట ఉండి దాటిస్తాడు .ఒక సారి ఇతని బంధువు ప్రయాణీకులను హిమ్సిన్చాడని విన్నాడు రహస్యం గా వచ్చి వాడిని పట్టుకొన్నాడు ఇతరులకు అపకారం చేయ వద్దని హెచ్చ రించాడు .వాడు దోచుకొన్న దానికి రెట్టింపు ఇచ్చి గౌరవం గా సాగ నమ్పాడు .ఇంకో సారి మరో బృందం వస్తుంటే కొందర్ని వాళ్ళను చంపమని దోచుకోమనీ హెచ్చరికలు వచ్చాయి అప్పుడు వారంతా తాము పిన్గాక్షుడున్నాడనే ధైర్యం తో వచ్చామని కావాలంటే తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తామని ప్రాణాలను రక్షించమని యాత్రికులు వేడుకొన్నారు .ఈ మాటలను విన్న పింగాక్షుడు వారిని భయ పడ వద్దని అనునయిస్తూ ,ఆ చోటుకు చేరుకొన్నాడు .ఇంతలో ఒక భిల్లుడు అక్కడికి వచ్చి తన అనుచర గణం తో పిన్గాక్షుడిని చంపమని ఆదేశించాడు .ఇరువైపులా ఘోర పోరాటం జరిగింది శత్రువులైన భిల్ల గణాన్ని ఓడించి బంధించాడు .కాని అతని ధనుస్సు బాణాలు ముక్కలు ముక్కలయ్యాయి శత్రువులు అనేకు లవటం తో వారి చేతిలో మరణించాడు పింగాక్షుడు .నైరుతి దిక్కు నుండి దేవ దూతలు వచ్చి పింగాక్షుని దేవ విమానం లో తీసుకొని వచ్చి నైరుతి దిక్కుకు ప్రభువును చేశారు
వరుణ లోక వర్ణన
అక్కడి నుండి విష్ణు శర్మ ను వరుణ లోకానికి విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు .ప్రజలకోసం బావులు ,చెరువులు త్రవ్వించిన వారు వరుణ లోకానికి వస్తారు ఐశ్వర్య సంపన్నం .దారిలో నీడ కోసం రావి, మద్ది చెట్లను నాటించె వారు ఈ లోకం చేరుతారు .వేసవిలో విసన కర్రలను దానం చేసిన వారు ,సుగంధ పు చల్లని పానీయాలిచ్చే వారు ,చలివెంద్రాలను ఏర్పాటు చేసే వారు వరుణ లోకానికి చేరతారు .జలదారా మండపాలను నీడ నిచ్చే మండపాలను నిర్మించిన వారికిది నెలవు .పుణ్య నదులలో స్నానం చేయటానికి వీలుగా మెట్ల నిర్మాణం చేసే వారు ,వరుణ లోకం ఆవాస భూమి .అన్ని జలాశయాలకు వరుణుడు అది పతి .అన్ని సముద్రాలకు నీటిని ,ప్రాణాన్ని కల్పించేవాడు. కర్మ సాక్షి కూడా
వరుణుని జన్మ వృత్తాంతం
కర్దమ ప్రజా పతికి శుచిష్మన్తుడనే కుమారుడున్నాడు .వినయ శీలి సుగుణ వంతుడు ధైర్య శాలి .ఒక రోజు ఇతడు కొందరు బాలురతో కలిసి ఒక సరస్సులో స్నానానికి వెళ్లాడు .నీటి లో దిగ గానే అతడిని ఒక మొసలి పట్టుకోంది .ఈ విషయాన్ని స్నేహితులు తండ్రికి తెలియ జేశారు .ఆయన అప్పుడు శివధ్యానం లో ఉన్నాడు .తన సర్వజ్ఞత్వం వల్ల ఒక సరస్సులో కొంత మందిముని బాలురు జలక్రీడలాడటం కనీ పించింది .అందులో రుద్రరూపుడైన ఒక ముని బాలుడు‘’ఓయి సముద్రాదిపా !భక్తుడైన కర్దమ ప్రజా పతి కుమారుడడేక్కడ ఉన్నాడు ?శివుని సామర్ధ్యం తెలియ కుండా దుష్క్రుత్యానికి పాలు పడ్డావు ‘’అని గర్జించాడు .సముద్రుడు భయ పడి బాలుడిని రత్నాల తో అలంకరించి శిశు మారక మైన మొసలిని బంధించి తెచ్చి శివుని పాదాల చెంత పడే శాడు .శివుని పాదాలకు నమస్కరించి ‘’మహా శివా !నా తప్పేమీ లేదు .ఈ జంతువ వల్లనే శిశువు కు మరణం సంభవించింది .’’అని విన్న విన్చుకొన్నారు .అప్పుడు శివుడు మన్నించి ఆ బాలుని తండ్రి కర్దమ ప్రజాపతి వద్దకు తీసుకొనివెళ్ళి అప్పగించమని ప్రమధగణాలకు చెప్పాడు .తండ్రి కుమారుని చూచి సంతోషం తో కౌగలించుకొని యోగాక్షేమాలను విఛా రించాడు .బాలుడు జరిగిన వృత్తాంతం అంతా తండ్రికి తెలియ జేశాడు .తండ్రి అనుమతి గ్రహించి బాలుడుకాశీలో శివ లింగాన్ని ప్రతిష్టించి అయిదు వేల సంవత్స రాలు శిల లాగా నిశ్చలం గా శివుని కోసం తపస్సు చేశాడు .మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తనకు జలాల పై ఆధి పత్యం కావాలని బాలుడు విన్న వించాడు .అప్పుడు భవానీ పతి ‘’నువ్వు వాపీ ,కూప తటాకాది ,నదీ నదాలకు సమస్త జలాలకు అది పతి వి అవుతావు .సమస్త రత్నాలకు అది పతి వి నీవే . .పశ్చిమ దిక్కునకు అధిపత్యం నీదే . .పాశ పాణి వై సమస్త దేవతలకు ఇష్టుడవవుతావు .నువ్వు స్థాపించిన లింగం ‘’వరుణేశ్వర లింగం ‘’గా ప్రసిద్ధి చెందుతుంది మణి కర్నేశ్వరుని నైరుతి దిశలో సంస్తాపిత మై ఉంటుంది .దీని నర్చించిన వారికి అకాల మరణం రాదు .నీరసాలైన అన్న పానాదులు వరుణుని అనుగ్రహం తో సరసములు గా మారుతాయి ‘’అని వరమిచ్చి అంతర్ధాన మయ్యాడు .శుచిష్మంతుడు అనే ఆ బ్రాహ్మణ బాలుడు నైరుతి దిశకు అధిపతి అయాడు .

కాశీ ఖండం -12

గంధ వతి - అలకా పుర వర్ణనం
వరుణ నగరానికి ఉత్తరాన వాయువు నగర మైన గంధవతి నగరం ఉంది .దీని అది పతి ప్రభంజనుడు అంటే వాయు దేవుడు శివభక్తుడై ఈ ఆధిపత్యాన్ని పొందాడు .పూర్వం కశ్యప ప్రజాపతి వంశం లో జన్మించిన ధూర్జటి అనే పుణ్యాత్ముడు కాశీ లో పవనేశ్వర లింగాన్ని స్తాపించి దీక్ష గా శివుని కోసం తపస్సు చేశాడు .శివ దేవుడు ప్రత్యక్ష మై వరం కోరుకోమన్నాడు .అప్పుడు ధూర్జటి శివుని స్తోత్రం చేశాడు ‘’మహేశ్వరా !శత పధ బబ్రాహ్మాణంకూడా నిన్ను గూర్చి‘’నేతి –నేతి –అని వర్ణించింది .బ్రహ్మా విష్ణు దేవతలు కూడా నిన్ను వర్నిన్చలేరంటే నేనెంత /నువ్వు ఒక్కడివే శివ శక్తివి .భేదం చేత రెండు అయావు .శవ ,శక్తి అయిన మీరిద్దరూ నిత్య యవ్వనులు .మీ లీలచే క్రియా శక్తి ఏర్పడుతుంది .దాని స్వరూపమే ఈజగత్తు..కనుక అన్నిటికీ నీవే కారణం. నీకుడి వైపు బ్రహ్మ ,ఎడమ వైపు అచ్యుతుడుఉంటారు .సూర్య చంద్రులు నీ నేత్రాలు ..నీ ఉచ్వాస ,నిస్శ్వాసాలే మూడు వేదాలు .నీ చెమట సముద్ర జలం .నీ శరీరం లో వివిధ భాగాలనుండి నాలుగు వర్ణాల వారు జన్మించారు .నీ తల వెంట్రుకలే మేఘాలు .నువ్వు పురుషుడవు .ప్రకృతి రూపం లో బ్రహ్మాండ మంతా సృష్టించావు నువ్వు సర్వ భూత మయుడివి ..అన్ని తత్వాలు బోధిస్తావు .సమస్త జీవులకు ఆయుస్వరూపం నువ్వే .నీ మీద శ్రద్ధా భక్తీ నిశ్చలం గా ఉండేట్లు అనుగ్రహించు’’అని ప్రార్ధించాడు .దానికి శివుడు ‘’నీవు స్తాపించిన లింగం వాయు లింగం గా ప్రసిద్ధి చెందుతుంది .ఈ పవమానేశ్వర లింగాన్ని అర్చించిన వారు సర్వ లోక పూజితుడవుతాడు పడమటి దిశకు నువ్వు అధిపతివి అవుతావు ‘’అని దీవించి అదృశ్యమైనాడు .
అలకా నగరం
గంధ వతికి తూర్పుగా కుబేరుని అలకా పురి ఉంది .ఇతడు శివునికి మిత్రుడు కూడా నవనిధులకు దాత ,భోక్త .శివశర్మ కుబేరుడేవరు ఆదిపత్యం ఎలా వచ్చ్చింది శివ మిత్రుడేలాఅయాడు అని ప్రశ్నిస్తే సమాధానం గా విష్ణు దూతలు ఇలా చెప్పారు .పూర్వం కామ్పిల్య నగరం లో సోమయాజుల వంశం లో యజ్న దీక్షితు డైన యజ్న దత్తుడు అనే సద్బ్రాహ్మణుడున్నాడు అందరి చేత గౌరవింప బడుతున్నాడు నిత్యాగ్ని హోత్రం చేస్తూ క్రతువులు నిర్వ హిస్తు బ్రాహ్మణ ధర్మాన్ని వేద విధి గా సాగిస్తున్నాడు ఆయనకు ‘’గుణ నిది ‘’అనే కుమారుడున్నాడు .వాడు జూదం వ్యభిచారం మొదలైన సకల దురాచారాలకు అలవాటు పడి తండ్రికి ఎదురు పడకుండా తల్లి చాటున వచ్చి పోతు ఉండే వాడు .కొడుకు ఇంట్లో కనిపించలేదని ఎప్పుడైనా ఆయన అడిగితే అప్పుడే దేవతార్చన చేసి వెళ్ళాడని భార్య అబద్ద ఆడుతూ కొడుకును వెనకేసుకోచ్చేది ..ఒక సారి తండ్రికి కోపం తెప్పించ వద్దని హితవు చెప్పింది .దానితో అసలు ఇంటికి రావటం మానేశాడు .పందోమ్మిదేల్లు వచ్చేసరికి వివాహం చేశారు .కాని భార్యనూ అలక్ష్యం చేస్తూ దురాచారాలను ఏమాత్రం తగ్గించుకో లేదు .సప్త వ్యసన పరుడని పేరు పొందాడు ,.దొంగ చాటు గా ఇంటికి వచ్చి దొరికింది దొంగిలించి జూదం ఆడే వాడు
ఒక రోజు తల్లి కి తండ్రి ఇచ్చిన నవరత్నాల ఉంగరాన్ని దొంగిలించి జూదం లో పోగొట్టుకొన్నాడు .దాన్ని ధరించిన జూదగాడిని దీక్షితుల వారు చూసి ఎక్కడిదని గద్దించాడు .వాడు నిజం చెప్పాడు .కోపం తో ఇంటికి చేరిన గుణ నిది తండ్రి భార్యను ఉంగరం ఎక్కడుంది అని అడిగితే ఆమె దాన్ని మాయ మాటలతో కప్పి పుచ్చింది .ఇంట్లో వెండిగిన్నె మొదలైన వాటిని గురించి అడిగినా సరైన సమాధానం రాలేదు .ఆమెను కోపగించి కొడుకును ఇంటికి రానివ్వ వద్దని హెచ్చరించాడు .అన్ని దారులు మూసుకు పోయాయి గుణ నిది కి .
ఒక శివ రాత్రి నాడు శివభాక్తుడొకడు శివుని నైవేద్యం పెడ దామని మధుర పదార్ధాలను చేయించి శివాలయానికి వెళ్లాడు .అక్కడే చాలా రోజులనుంచి ఆకలి తో అలమటిస్తున్న గుణ నిది నెమ్మది గా భక్తుడు వెళ్లి పోయే దాకా ఆగి అక్కడ జరిగే భజనలు స్తోత్రాలను విని చూసి ప్రసాదం కోసం వేచి ఉన్నాడు .అందరు వెళ్లి పోయిన తర్వాత గర్భాలయం చేరాడు .అక్కడ ఉన్న దీపారాధన కొండేక్కు తున్నట్లు గమనించి ,అందులో అక్కడే ఉన్న చమురు పోసి వత్తిని ఎగా దోశాడు .తన కొంగు చింపి వత్తి చేసి నూనె లో తడిపి మరింత కాన్తికోసం వెలిగించాడు .లోపలి నైవేద్యాన్ని చేత్తో పట్టుకొని బయటికి పరి గెత్తు తుండగా ,అక్కడే నిద్రిస్తున్న ఒక భక్తుడి పై పడ్డాడు .అతడు కేకలు వేస్తె అందరు వచ్చి దొంగతనానికి గుణ నిది వచ్చాడని భావించి చావ బాదారు .వెంటనే అతడు మరణించాడు .శివున అనుచర గణంఅక్కడికి వచ్చి అతన్ని తీసుకు పోబోతుంటే యమ దూతలు అడ్డ గించారు అప్పుడు శివదూతలు శివ నిర్మాల్యాన్ని తాకితేనే పాపాలు పోతాయని శివ రాత్రి పర్వ దినం నాడు గుణ నిది ఉపవాసం తో దాన్ని తెచ్చు కోన్నాడని దీపా రాదన చేశాడని పూజ ,భజనలు చూశాడని విన్నాడని కనుక అతనికి పుణ్యమే తప్ప పాపమే లేదని వాధనతో తెలిపి శివలోకానికి తీసుకొని వెళ్లారు .
గుణ నిది తర్వాతా జన్మ లో కలింగ రాజు అరిన్దముడికి దమనుడు అనే కొడుకు గా పుట్టాడు తండ్రి తర్వాత రాజ్యమేలాడు .అతనికేమీ భక్తీ విషయాలు తెలీవు .అయితే తన రాజ్యం లో అన్ని శివాలయాలలో దీపాలు వెలిగించాలి అని శాసనం చేసి అమలు చేశాడు .జీవించి ఉన్నంతకాలం దీన్ని అమలు చేశాడు .దమనుడు మరణించాడు ఈ దీపా రాధనా పుణ్యం చేత అతడు ‘’అలకా పురం ‘’కు రాజయ్యాడు
పద్మ కల్పం లో బ్రహ్మ మానస పుత్రుడు గా పులస్త్యుడు జన్మించాడు .పులస్త్యునికొడుకు విశ్వా వసువు .ఇతడు విశ్వ కర్మ చేత అలకా పురిని నిర్మింప జేసుకొన్నాడు శివుని కోసం దీర్ఘ తపస్సు చేశాడు తరువాతి కల్పం అయిన మేఘ వాహన కల్పం లో యజ్న దత్తుని కుమారుడు గుణ నిది శివాను గ్రహం కోసం తపస్సు చేశాడు .దీపారాధన పుణ్యం చేత కాశీ నగరాన్ని పొందాడు అక్కడ ఒక శివ లింగాన్ని స్తాపించి తపస్సు చేస్తే మహేశ్వరుడు విశాలాక్షి తో ప్రత్యక్షమై వరాన్ని కోరుకో మంటే శివుని పాదాలను నిత్యం తన కళ్ళ తో చూసే భాగ్యాన్ని ఇవ్వమని వేడుకొన్నాడు .శివుడు సంతోషించి అతడిని చేతి తో తాకి తనను దర్శించే భాగ్యం కల్గించాడు కంటి తో మొదటి చూపును అమ్మవారిని వక్ర బుద్ధి తోచూశాడు .ఆమే గ్రహించి తీక్షణం గా అతని వైపు చూస్తె ఎడమ కన్ను చూపు లేకుండా పోయింది అప్పుడు ఈశ్వరుడు ‘’ఇతడు క్రూర దృష్టి తో నిన్ను చూడ లేదు ఇతడు నీకుమారుడు నీ తపస్సును మెచ్చుకొంటు నీ అదృష్టాన్ని వర్ణిస్తున్నాడు ‘’అన్నాడు అతనితో ‘’నీ తపస్సుకు మెచ్చాను నువ్వు నవ నిధులకు అధిపతివి అవుతావు గుహ్యకులకు అంటే డబ్బు దాచుకొనే వారికి నువ్వు అధి పతివి .అందరికి దనం ఇచ్చే‘’ధనడుడవు ‘’అని పించుకొంటావు .అలకా పట్నం అన్నిటా శ్రేష్టమైంది .విశాలాక్షీ దేవి అతనికి శివ భక్తీ స్తిరం గా ఉంటుందని అనుగ్రహించింది .అతని చే కాశీ లో ప్రతిష్టింప బడ్డ లింగం ‘’కుబేర లింగం ‘’గా ప్రసిద్ధి చెంది పూజించిన వారికీ దారిద్ర్యాన్ని రాకుండా కాపాడుతుందని తెలిపి అదృశ్య మయ్యారు .ఈ విధం గా గుణ నిది ధనడుడైన కుబేరుడి అలకా పురాన్ని ఏలుతు దిక్పాలకుడయ్యాడు అలకాపురమే కైలాసం అయింది .అదే శంకరాలయం

కాశీ ఖండం –13

సోమ లోక వర్ణనం
అలకా పురి కి ముందు ఈశానుని పట్నం ఉండి .అక్కడ తపోధను లైన రుద్రా భక్తులుంటారు .అజైక పాదుడు ,ఆహిర్బుద్నుడు మొదలైన ఏకాదశ రుద్రులు శూలాలు ధరించి ఈ లోకం లో ఉంటారు .వీరంతా కాశీ లో ఈశానేశ లింగాన్ని స్తాపించి అర్చించి తపస్సు చేసిన వారే .వీరందారు దిక్కులకు ఈశ్వరు లవుతున్నారు . జటా జూతాలతో ఫాల నేత్రాలతో ఉంటారు నీల గళులు .వృషభ ధ్వజులు
పగటి వేళ పురాన్ని చంద్రుడు తన కాంతి తో ప్రకాశింప జేస్తున్డటం చూసి సోమ శర్మ కు సందేహం వచ్చి ప్రశ్నించాడు విష్ణు గణాన్ని ..ఇదే సోమ లోకమని అది పతి చంద్రుడని చెప్పారు .అమృత వర్షం తో చంద్రుడు ఈ లోకాన్ని వెన్నెల ల తో తడుపుతుంటాడు .సోమనాధుని తండ్రి అత్రి భగ వానుడు .ఇతడు ప్రజాపతి అయిన బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేశాడు .ఆయన రేతస్సు ఊర్ధ్వ ముఖం గా ప్రయాణించి సోమత్వాన్ని పొందింది .ఆ రేతస్సును బ్రహ్మ గారి అనుజ్న చేత పది మంది స్త్రీలు భుజించి గర్భాన్ని పొందారు .నెలలు గడిచిన కొద్దీ గర్భాన్ని భరించలేక పోయి ,పది దిక్కులలోనూ సోములను కన్నారు .ఆ పదీ ఒక ఆకారం గా మారి సోముడు అనే పేరు తో భూమి మీద పడ్డాడు అతన్ని బ్రహ్మ రదా రూఢుని చేసి ఇరువది ఒక్క సార్లు భూ ప్రదక్షిణ చేశాడు .ఆ సోమ నుండి తేజం భూమి మీద పడింది ఆ తేజస్సు వల్ల అన్ని ఓషధులు ,జన్మించాయి .విశ్వం ఆ ఒషదులన్నిటిని ధరించి కాంతి వంత మయింది .సోముడు బ్రహ్మ కృప వల్ల వృద్ధి పొందాడు తామర తూడులు మాత్రమె తింటూ తపస్సు చేశాడు .కాశీ పట్టణ రూపాన్ని పొంది అక్కడ తన పేరా అమృత లింగాన్ని స్తాపించాడు .ఒషధులకు ,ఉదకాలకు ,అగ్ర జన్ములకు కారణ మయ్యాడు .అక్కడ ఒక బావి త్రవ్వించి ,అందలి నీటికి అమృత జలం అని పేరు పెట్టాడు .ఆ నీటిలో స్నానం చేసి త్రాగిన వారికి జ్ఞానాభి వృద్ధి కలుగుతుంది .శివుడు సోముని కళల లో ఒక కల ను గ్రహించి తన శిరసున ధరించాడు .దీంతో జగత్తంతా సంజీవితం పొందింది .ఆ తర్వాతశాపం పొంది పదిహేను రోజులు వృద్ధిని పది హేను రోజులు క్షీణత ను పొందాడు .అతని లోకానికి బ్రహ్మాది దేవతలు వచ్చి పోతుంటారు .అత్రి భ్రుగువు మున్నగు ఋషులకు నిలయం .సోమునికి ‘’కుహు ,సిని ,ద్యుతి ,పుష్టి ,ప్రభావసు ,కీర్తి ధృతి ,లక్ష్మి ‘’మొదలైన తొమ్మిది మంది దేవతలు సేవించారు .యజనము తసస్సు చేశాడు చంద్రేశ్వర లింగ సమీపం లో రాజ సూయ యాగం చేశాడు .
చంద్రేశ్వర దర్శనం చేసిన వారికి పూజించిన వారికి పాప ప్రక్షాళన జరుగుతుంది .అక్కడ సిద్ధ యోగీశ్వర పీఠం ఉండి .సాధకుల కోసం అనేక పీఠం లున్నాయి ..అక్కడి నుండి నక్షత్రలోకానికి శివ శర్మ ణు విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు .

కాశీ ఖండం –14

నక్షత్ర ,బుధ లోక వర్ణన
శివ శర్మ విష్ణు దూతలను నక్షత్ర లోక విశేషాలను గురించి చెప్పమని అడుగగా వారు వివరించారు .పూర్వం బొటన వ్రేలి వెనుక భాగం చేత సృష్టి నంతా సృజించిన దక్ష డు ప్రజాపతి అయాడు .ఆయనకు అరవై మంది కుమార్తెలు .వారంతా మంచి రూపం తో లావణ్యం తో ఉన్న వారు .వారిలో రోహిణి మిక్కిలి సౌందర్య వతి .వారందరితో దక్షుడు కాశీ నగరం లో ఘోర తపస్సు చేశారు .సోమ శేఖరుని ఆరాధించారు .ఈశ్వరుడు సంతోషించి ప్రత్యక్ష మై వరం కోరుకో మన్నాడు .దక్షుని కూతుళ్ళు ‘’నీ వంటి తాపహారి,రూప సంపన్నుడు ,అయిన భర్తను ప్రసాదించు ‘’అని కోరారు .వారు నక్షత్రేశ్వర లింగాన్ని స్తాపించి వరుణా నది ఒడ్డున సంగమేశ్వర స్వామి సన్నిధి లో చాలా కాలం తపస్సు చేశారు .వారి స్తిర మనస్సు కు సంతసించి ‘’అమ్మాయిలూ !మీరు చేసిన పురుషాయతన తపస్సుకు మెచ్చాను .మీ కోరిక నేర వేరుతుంది .జ్యోతిశ్చక్రం లో మీరు అగ్ర గణ్యు లవుతారు .మీ నుడి మేషం మొదలైన రాశులు జన్మిస్తాయి బ్రహ్మ చేత ఒషదీషుడు గా చేయ బడిన సోముడు మీకు భర్త అవుతాడు .మీరు పూజించిన ఈ నక్షత్రేశ లింగాన్ని అర్చించిన వారు నక్షత్ర లోకం చేరతారు
అక్కడి నుండి బుధ లోకం చేరారు ఇది బుధ లోకమని విష్ణు దూతలు చెప్పారు .దీనిని చూసిన వారు స్వర్గాన్ని కూడా కోరుకోరు .సోముడుద్విజ రాజయ్యాడు .రోజుకు పది పద్మాలను మాత్రమె భుజిస్తూ రాజ సూయ యాగం చేశాడు .త్రిభువనాలను దక్షిణ గా ఇచ్చాడు .అతడు బ్రహ్మ మనుమడు .అత్రి నేత్రం నుండి జన్మించాడు .ఒషధులకు అధిపతి .షోడశ కలలున్న వాడు .తన అమృత కిరణాలచే లోకాల తాపాన్ని తీరుస్తాడు .సోముని పదునారవ కళను శివుడు శిరస్సున ధరించాడు .
చంద్రుడు ఆంగిరసుని తమ్ముడగు బృహస్పతి భార్యను మదము తో కామించాడు .దేవతలు ,ఋషులు వద్దని వారించినా విన కుండా బృహస్పతి భార్య తార ను మోహించాడు .ఇదంతా మన్మధుని ప్రతాపం .అజగం అనే ధనుస్సును చేతి లో ధరించి తన తలపై ఇతన్ని ఉంచుకొన్నా తారను వదిలి పెట్ట లేదు .అప్పుడు బృహస్పతి బ్రహ్మ శిరో నామ కాస్త్రాన్ని సోముడి పై విడిచి పెట్టాడు . బ్రహ్మాండ మంతా భయపడి పోయింది .వెంటనే బ్రహ్మ వచ్చి తారను సోముని నుండి విడి పించి బృహస్పతికి ఇచ్చాడు .ఆమె అప్పుడు గర్భ వతి.ఆ గర్భాన్ని వదిలించుకో మని బృహస్పతి ఆమె కు చెప్పాడు .ఆమె ముండ్ల పోద లోకి వెళ్లి ఒక స్తంభం చాటు చేరి గర్భ స్రావం చేసుకొన్నది .దేవతలు ఆ శిశువును తీసుకొని వచ్చి తారను గ్రహించ మన్నారు .ఆ శిశువు సోముడికి జన్మించాడా బృహస్పతికా అని అడిగారు .ఆమె చెప్ప లేక పోయింది .బ్రాహ్మ వాళ్ళను దూషించాడు .బ్రహ్మ తారనే అడిగాడు .చంద్రుని కుమారుడే అని చెప్పింది .శిశువుకు‘’బుధుడు ‘’అని పేరు పెట్టాడు .కొడుకు తండ్రి దగ్గరికి వెళ్లి తాను తపస్సు చేసుకోవాలను కొంటున్నానని చెప్పాడు .కాశీ వెళ్లి ఒక లింగాన్ని స్తాపించి పూజించాడు అదే బుదేశ్వర లింగం .శివుడు ప్రీతీ చెంది వరం కోరుకో మన్నాడు .అతని కోరిక నను సరించి నక్షత్ర లోకానికి పైన ఉన్న లోకం బుధ లోకమని పేరు పొందింది .బుదేశ్వర లింగం దుష్ట బుద్ధిని పోగొట్టు తుంది .సజ్జను ల చే గౌర వింప బడే వారు బుధ లోకం చేరుతారు .చంద్రేశ్వర నుకు తూర్పుగా ఉన్న బుదేశ్వర లింగాన్ని దర్శించిన పుణ్యాత్ముడు అంత్య కాలం లో ఉత్తమ బుద్ధి పొందుతాడు .

కాశీ ఖండం –15

శుక్ర లోక వర్ణనం
శుక్ర లోక వృత్తాంతాన్ని శివ శర్మకు విష్ణు దూతలు వివరిస్తున్నారు .శుక్రా చార్యుడు వెయ్యేళ్ళు కణ ధూమ పానాన్ని చేసి ,శివుని కృప వల్ల మృత సంజీవినీ విద్య సాధించాడు .శుక్రుని కద వింటే అప మృత్యు భయం ఉండదు .భూత ప్రేతాలు దరికి రావు .ఒకప్పుడు అందకాసురినికి ,శివునికి యుద్ధం జరి గింది .అప్పుడు గిరి వ్యూహం ,వజ్ర వ్యూహాలను పన్ని రాక్షస బలాన్ని నివారించారు . వాడు శుక్రాచార్యుల వద్ద కు వెళ్లి గోల చేశాడు .దనుజులు ముందడుగు వెయ లేకుండా పోతున్నారని ,కనుక వారిని కాపాడే బాధ్యత రాక్షస గురువైన ఆయనదే నని విన్న వించాడు .శుక్రుడు సంపాదించిన మృత సంజీవినీ విద్యనూ ఇప్పుడు సార్ధకం చేసే సమయం ఆసన్న మైందని కోరాడు .
అంధకుని మాటలు విన్న భ్రుగువు సమయానికి మృత సంజీవిని విద్య ను జ్ఞాపకం చేసి నందుకు సంతోష పడి ,రాక్షస గణాన్ని రక్షించే బాధ్యత తీసుకొంటానని అభయం ఇచ్చాడు .యుద్ధం లో చని పోయిన వారిని పునర్జీవితులను చేశాడు .గాయాల పాలైన వారికి అవయవ లోపం లేకుండా క్షణాల మీద చేశాడు .మళ్ళీ రాక్షసులు విజ్రుమ్భించారు .శివుని ప్రధమ గణం బెంబేలెత్తి పోయారు .శివునికి విషయం తెలియ జేశారు యుద్ధం లో మరణిన్స్తున్న రాక్షసులను శుక్రుడు బ్రతికిస్తున్నాడని ,తమకేమీ దారి కాన పడటం లేదని చెప్పారు .మళ్ళీ ప్రమధ గణానికి రాక్షసులకు భీకర యుద్ధం సాగింది .
పరమ శివుడు నందీశ్వరుని పిలిచి ,శుక్రా చార్యులను ఎత్తుకు రమ్మని ఆనతిచ్చాడు .అతడు వెంటనే వెళ్లి ఏనుగు పట్టు పట్టి ,,మీదకు వచ్చే రాక్షసులను కొమ్ములతో కాళ్ళతో చంపి తీసుకొచ్చి ఈశ్వరుని ముందు పడేశాడు .శివుడు శుక్రుడిని పండు ను తిన్నట్లు నోట్లో వేసుకొని క్షణం లో మింగేశాడు .రాక్షసులకు ఈ విషయం తెలిసి లబో దిబో మన్నారు .ప్రమద గణం విజ్రుమ్భించి యుద్ధం చేశారు .రాక్షస మూక నిలువ లేక పారిపోయి అందకాసురునికి తెలిపారు .దైత్యులు ,దానవులు సంప్రదించుకొని ఏకమై ప్రమద గణాలను ఎది రించారు .మొదట వీరిదే పై చేయి గ ఉన్నా క్రమేపీ ప్రమద సేనలు విజ్రుమ్భించి రాక్షసులను దేవతలను సంహరించారు .తన సేనా బలం తగ్గి పోయిందని తెల్సుసుకొన్న అన్ధకుడు స్వయం గా యుద్ధానికి దిగాడు .అతడిని వినాయకుడు కుమారస్వామి అడ్డగించారు వాడికళ్ళు శూలాల దెబ్బలకు కనీ పించాకుండా పోయాయి .శివుని పొట్టలో ఉన్న శుక్రుడు బయటికి వచ్చే మార్గం కోసం వెతుకు తున్నాడు .శివుని ఉదరం లో పాతాళాది లోకాలను దర్శించాడు ఆచార్యుడు .ఆరు సంవత్సరాలు శివుని పొట్ట లో ఉండిపోయి బయట జరిగే యుద్ధాన్ని, బ్రహ్మాది లోకాలను చూశాడు .చివరికి ‘’శాంభవ యోగం ‘’చేత భార్గవుడు శివుని ముఖం నుండి బయటకు వచ్చి శివుని ఎదుట నిల బడినమస్కరించాడు .శివుడు అతని పై కటాక్షం చూపి తన ముఖం నుండి వెలువడ్డాడు కనుక తన కుమారుని తో సమానం అని చెప్పి వెళ్లి పోమన్నాడు .తన ఉదరం లో శుక్రుడు మరణించ కుండా ఉన్నాడని ,అతని యోగశక్తి అద్భుతమని కొని యాడాడు .అందకుడికి శివుడికి మహా యుద్ధం జరిగింది .అతన్ని సంహరించాడు మహేశ్వరుడు
శుక్రుడు మృత సంజీవినీ విద్యనూ ఎలా సంపాదించాడని శివ శర్మ అడుగగా విష్ణు దూతలు వివరించారు .పూర్వం శుక్రుడు కాశీ లో శివ లింగాన్ని స్తాపన చేసి భక్తీ తో తపస్సు చేశాడు .ఇంద్రియాలను జయించి ,మనసును స్వాధీన పరచుకొని చేసిన అతని తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్ష మయ్యాడు .శుక్రుడు ఆయన్ను సర్వ విధాలా స్తోత్రాలు చేసి ప్రసన్నుడిని చేసుకొన్నాడు .’’నీకు ఇద్దరు కుమారులు కలుగుతారు .నా ఉదరం లో సంచ రించావు కనుక నా వల్ల పుత్ర జన్మ పొందుతావు .నేను నీకు ఒక ప్రత్యెక వరాన్నిస్తున్నాను .ఇది బ్రహ్మా, విష్ణువు లకు కూడా తెలీకుండా రహస్యం గా ఉంచాను మంత్ర పూతం గా నావద్ద ఉన్న మృత సంజీవినీ విద్యనూ నీకు ఇస్తున్నాను .నువ్వు తపస్సంపంన్నుడివి కనుక పొందే అర్హత ఉంది .దీన్ని నియమాల తో అభ్యసిస్తే చని పోయిన వారిని బ్రతి కిస్తుంది .నీ దృష్టి పడ్డ వారి కార్యాలకు విఘాతం కలుగుతుంది .నువ్వు స్తాపించిన లింగం శుక్రేశ ..లింగం గా ప్రసిద్ధి చెందుతుంది దీనిని అర్చిస్తే వంధ్యత్వం రాదు ‘’అని చెప్పి శివుడు శుక్రేశ లింగం లో లీనమై పోయాడు .విశ్వేశ్వర లింగానికి దక్షిణం లో శుక్రేశ లింగం ఉన్నది ‘’అని లోపాముద్రా దేవికి అగస్త్య మహర్షి చెప్పాడు

16

అంగారక ,గురు ,శని లోక వర్ణన
యెర్రని శరీరం గల లోకమే అంగారక లోకం .అన్గారకునిది యెర్రని శరీరం .అతడు భూమి కుమారుడు అందుకే కుజుడు అనే పేరు .దాక్షాయణీ వియోగం తో శివుడు ఘోర తపస్సు చేశాడు .ఆయన ఫాల భాగం నుండి ఒక చెమట బిందువు భూమి పై పడింది .దాని నుంచి లోహితాన్గుడు అనే కుమారుడు పుట్టాడు .అందుకే అతని తల్లిగా భూదేవి నిచెపుతారు .ఆమె పోషణ లో పెరిగి మహేయుడు అనే పేరు పొంది ఉగ్ర పురి లో ఉగ్రం గా తపస్సు చేశాడు .అక్కడి నుండి కాశి చేరి లింగ స్తాపన చేసి మహా తపస్సు చేశాడు .ఇది పంచ ముద్రా స్తానం లో కంబలాశ్వ తరువుకు ఉత్తరం గా ఉంది .అందుకే అంగారకు డనే పేరొచ్చింది .శివుడు సంతోషించి గ్రహాధి పత్యాన్నిచ్చాడు .అన్గాకరేశ్వర లింగాన్ని పూజిస్తే గ్రహ పీడ తొలగి పోతుంది .అంగారక చతుర్ధి నాడు గణ నాధుడు జన్మించాడు
అక్కడ నుండి గురు లోకం చేరాడు శివ శర్మ .పూర్వం బ్రహ్మ మూడు లోకాలను సృష్టించాలని సంకల్పించుకొని మొదటగా మానసము నుండి ఆయన తో సమాన మైన ఏడుగురు పుత్రులకు జన్మ నిచ్చాడు .వారే అంగిరసుడు ,మరీచి మొదలగు వారు .వీరంతా సృష్టి చేసే సమర్ధులు .అన్గిరసుడు బుద్ధికి దేవతల వంటి వాడు .శాంతుడు జితక్రోధి ,మెత్తని వాక్కు కలవాడు వేదార్ధ వేది .రూప శీలగుణ సంపన్నుడు .కాశీ లో శాంభవ లింగాన్ని స్తాపించి శివుని అర్చించారు .ఆ లింగం నుంచి ఒక తేజో రాశి ఏర్పడింది .దానికి నమస్కరించి స్తుతి చేశాడు . దానికి సంతృప్తి పడి ‘’నీ స్తోత్రం చాలా ఉదాత్తం గా ఉన్నది నువ్వు వాచస్పతి అనే పేరు పొందుతావు .బుద్ధికి నీ వంటి వాడు ఉండడు .’’అని చెప్పాడు బ్రహ్మ తో అతడిని వాచస్పతి ని చేయమని ,దేవా చార్య పదవి నివ్వ మనిచెప్పగా అలానే చేశాడు అతనిచే స్తాపింప బడిన లింగం బృహస్పతీశ్వర లింగం గా లోకం ప్రసిద్ధ మైంది .ఈ లింగాన్ని అర్చిన్చితే పంచ మహా పాతకాలు నశిస్తాయి .
అక్కడి నుండి విష్ణు దూతలు శివ శర్మ ను శని లోకం చూపించారు .మరీచికి కశ్యపుని వలన సూర్యుడు ఉదయించాడు అతని భార్య త్వష్ట ప్రజా పతి కుమార్తె సంజ్ఞా దేవి .సూర్య తేజస్సును పొంది ఆమె కాంతి విహీన మయింది సూర్యునికి అప్పటి నుండి మార్తాండుడు అనే పేరు వచ్చింది .సూర్య తేజస్సును భరిస్తోంది సంజ్ఞవల్ల ముగ్గురు సంతానం కలిగారు .వైవశ్వతుడు మొదటి వాడు .యముడు రెందోకొడుకు .యమునా నది కన్యకా .ఇక సూర్యుని తేజస్సు భరించలేక సంజన తన చాయను ఏర్పరిచింది .ఛాయ తో ఆమె’’నేను నా తండ్రి దగ్గరకు వెడుతున్నాను .నువ్విక్కడ సుఖం గా ఉండు .నా కూతురు యమున ను జాగ్రత్తగా పోషించు ‘’అని అప్పగించి వెళ్లి పోయింది
త్వష్ట ప్రజాపతి కూతురుని ఆహ్వానించలేదు .భర్త దగ్గరకే పొమ్మన్నాడు .మళ్ళీ సూర్యుడి వద్దకు వెళ్లటం ఇష్టం లేక ఒక అరణ్యం చేరి బడబ అనే ఆడ గుర్రం గా మారి తపస్సు చేస్తూఉంది .ఛాయ సూర్యుని వల్ల ఎనిమిదవ మనువు అయిన సావర్నుని పుత్రుని గా కన్నది .యమునను సవతి తల్లి గా ఆరడి పెట్టింది .యముడు జాతి వైరాన్ని పూనాడు .సంజ్ఞా రూపం లో ఉన్న చాయను యముడు శపించాడు తన్నటానికి కాలు పైకెత్తాడు ఆ కాలు పడి పోవు గాక అని ఆమె శపించి నది .భర్త దగ్గరకు వెళ్లి ఏడ్చింది .ఆమెకు బుద్ధి చెప్పాడు .సంతానాన్ని సమాన ప్రేమ తో చూడాలని హితవు చెప్పాడు .యముడు తనను క్షమించ మనితండ్రిని కోరుకొన్నాడు .కానీ తల్లి శాపానికి తిరుగు లేదని పురుగులు అతని మాంసాన్ని తింటాయని భూలోకం లో పడటం తప్పదని చెప్పాడు .మళ్ళీ తన అనుగ్రహం వల్ల కాలు వస్తుందని అభయ మిచ్చాడు ..తన దగ్గర ఉన్నది సంజ్ఞా కాదని తెలుసుకొని సూర్యుడు ఆమెను వెతికి బడబ గా ఉండటం తెలుసుకొని తానూ గుర్రం వేషం లో చేరి ఆమె తో సుఖించాడు .ఆమె పరపురుషుడేమో నని అనుమానించి శుక్రాన్ని తన ముక్కు రంద్రాలనుంచి బయటికి బయటికి పంపింది .ఆ శుక్రము నుంచి అశ్వి నీ దేవతలు సూర్య తేజం తో జన్మించారు .సంజ్ఞ కు విషయం చెప్పాడు రవి .శని సూర్యుని అను మతి తో కాశీ వెళ్లి శివుని కోసం తపస్సు చేసి అనుగ్రహాన్ని పొంది గ్రహాది పత్యాన్ని పొందాడు .పోయిన కాలు వచ్చే సింది అందుకే శని మార్గం లో వక్రత ఉంటుంది .శనేశ్వర లింగం శుక్ర లింగానికి ఉత్తరం గా ఉంది .దీన్ని అర్చిస్తే ఉత్తమ లోక ప్రాప్తి, గ్రహ పీడా నివారణా జరుగు తాయి

కాశీ ఖండం –17

సప్తర్షి లోక వర్ణన
అగస్త్య మహర్షి ,భార్య లోపాముద్ర తో ‘’హరిద్వారం లో ప్రాణాలను కోల్పోయిన శివ శర్మ సప్తర్షి మండలాన్ని చూశాడు .ఆ తర్వాత విష్ణు లోకాన్ని ,చూశాడు .దేవకాన్తలు అతనికి స్వాగతమిచ్చారు .కొద్ది సేపు ఉండమని కోరారు ..వారు అతని పుణ్యాన్ని గురించి ప్రస్తు తించి తమ మంద భాగ్యానికి బాధ పడ్డారు .తను ఉన్న లోక మెవరిదని శివ శర్మ ప్రశ్నిస్తే వారు అది సప్తర్షి లోకమని చెప్పారు .బ్రహ్మ మానస పుత్రు లైన మరీచి ,అత్రి ,పులహుడు ,పులస్త్యుడు ,క్రతువు ,అంగీరసుడు ,వసిష్టుడు ,ఏడుగురు ఇక్కడ ఉంటారు .వీరినే సప్త బ్రహ్మలు అని పురాణాలు చెబుతున్నాయి .వీరి భార్యలు సంభూతి ,అనసూయ ,క్షమా ,ప్రీతీ ,సన్నతి ,స్మృతి ,ఊర్జ..వీరు లోక మాతలు గా ప్రసిద్ధులు .సప్తర్షులు తమ తపస్సు చే ముల్లోకాలను ధరిస్తున్నారు .వీరిని సృష్టించిన బ్రహ్మ దేవుడు వీరితో ‘’కుమారులారా !మీమీ ప్రయత్నా లతో నానా రూపాలుండే ప్రజల్ని సృష్టించండి ‘’అని ఆదేశించాడు .వారు తండ్రి కి నమస్కరించి కాశీ చేరి తపో నిష్ఠలో ఉన్నారు ..సమస్త జీవులకు ముక్తి నివ్వ టానికి శివుడు వచ్చాడు .వీరు తమ పేర్ల తో లింగాలను స్థాపించి శివుడిని అర్చిస్తూ తపస్సు చేశారు .మెచ్చిన శివుడు వారికి ‘’ప్రజా పతులు ‘’అనే బిరుదు నిచ్చాడు .సప్తర్షి లింగ దర్శనం చేస్తే సప్తర్షి లోకానికి చేరతారు .
గోకర్ణం అనే పేరు గల సరస్సు పడమటి భాగం లో ఉన్న అత్రీశ్వర లింగాన్ని చూస్తె బ్రహ్మ తేజస్సు పెరుగు తుంది .కర్కోటం అనే దిగుడు బావికి ఈశాన్యం లో ఉన్న మరీచీ మండలం లో స్నానం చేస్తే సూర్య కాంతి లాంటి దేహ వర్చస్సు కలుగు తుంది .అక్కడి మరీచీ లింగ దర్శనం మరీచీ లోకానికి చేరుస్తుంది .స్వర్గ ద్వారానికి పశ్చిమాన పులహుడు ,పులస్త్యుడు స్థాపించిన లింగాలను దర్శించి పూజించిన వారు ప్రజాపతు లవుతారు .రమ్య మైన హరి కేశ వనం లో అంగీరశేశ్వరుని చూస్తె అంగీరస లోకం లో స్థానం లభిస్తుంది .వరుణా నది ఒడ్డున ప్రతిష్టింప బడ్డ వశిష్టేశ్వర లింగ దర్శనం వల్ల ,తీర్దేశ్వరుని సందర్శించిన వారికి సప్తర్షి లోక నివాస భాగ్యం క లుగు తుంది .
అక్కడ అతి లోక సౌందర్యం తో విరాజిల్లు తున్న అరుంధతీ దేవి ని చూశాడు .ఆమె దర్శనమే పుణ్య ప్రదం .ఆమె మహా పతి వ్రత గా గణన కెక్కింది .ఆమె నామ స్మరణ చేతనే గంగా స్నాన పుణ్య ఫలం లభిస్తుంది .సాక్షాత్తునారాయణుడే ఆమె పాతి వ్రత్యాన్ని మిగిలిన పతి వ్రతల ముందు,ల క్ష్మీ దేవి ఎదుటనే పొగిడాడు .’’అరుంధతి ని మించిన పతి వ్రత లోకం లో ఎక్కడా లేదు .ఆమె రూప ,శీలా ,సౌందర్యాలు ,కాలోచిత భర్త్రు సేవ ,చాతుర్యం ,ఎవ్వరికీ లేవు .ఆమె పలుకులు మాధుర్య పూరితాలు .ఆ గాంభీర్యం ,గురు సంతోషణం అరుంధతీ దేవికి ఉన్నట్లు మరెవ్వరికి లేవు ,అరుంధతి ని స్మరించిన స్త్రీలు ధన్యులు,అదృష్ట వంతులు ,పరిశుద్ధులు అవుతారు .అరుంధతి పుణ్య చరిత్రను ఏ ఇంట్లో చెప్పు కొంటారో అప్పుడు వారి లెక్కకు అరుంధతి మొదటి వ్రేలు నలన్కరిస్తుంది ‘’.అని విష్ణు మూర్తి లక్ష్మీ దేవితో అరుంధతి పాతి వ్రత్య గరిమను వివ రించాడు .శివ శర్మ ఎంతో సంతోష పడ్డాడు .ఆ తర్వాత విష్ణు దూతలు అతడిని ధ్రువ లోకానికి తీసుకొని వెళ్లారు అని అగస్త్యముని లోపాముద్రాదేవికి వివ రించాడు

కాశీ ఖండం –18

ధ్రువ చరిత్ర
శివ శర్మ విష్ణు గణాలను ‘’ఏక పాదం మీద నిలిచి ,ఏదో ఆలోచిస్తున్నట్లు ,కాంతుల చేత ముల్లోకాలకు మండప స్థంభం వంటి వాడుగా ,కాంతులు వేద జల్లుతూ ,అనంత తేజో విరాజం గా ఉన్న ,ఆకాశం లో సూత్ర ధారిలా ,దాన్ని కొలుస్తున్న వాడిలా .యూప స్థంభం లా నిల బడి ఉన్న ఈ మహా పురుషుడు ఎవరు ?’’అని ప్రశ్నించాడు .ఆ మహనీయుడే ద్రువుడని చెప్పి ధ్రువ చరిత్ర ను తెలియ జేశారు .స్వయం భువునకు ఉత్తాన పాదుడనే కుమారుడున్నాడు .అతనికి సురుచి అనే భార్య వల్ల ఉత్తముడు అనే పెద్ద కొడుకు ,సునీతి అనే భార్య వల్ల ధ్రువుడు అనే చిన్న కొడుకు కలిగారు .ఒక రోజు సునీతి ఏదో పని లో ఉండి తనకుమారుడు ధ్రువుడిని సర్వాంగ సుందరం గా లంకరించి దాసికి చ్చి రాజు దగ్గరకు పంపింది .అతను తండ్రికి నమస్కరించి నిల బడ్డాడు .అప్పటికే ఉత్తముడు రాజు గారి తోడ మీద కూర్చుని రాజసం ఒలక బోస్తున్నాడు .బాల్య చాపల్యం చేత ధ్రువుడు కూడా తండ్రి తోడ మీద కూర్చొనే ప్రయత్నం చేస్తు కాళ్ళ మీద నుంచి పాకుతున్నాడు . .అప్పుడు చుప్పనాతి సురుచి ‘’నువ్వు బాలిసుడివి .మహా రాజు అంకాన్ని చేరే అదృష్టం నీకు లేదు .అభాగ్యు రాలి గర్భం లో జన్మించావు .నేల మీద పాకే నువ్వెక్కడ ?సింహాసనం మీద కూర్చునే ఉత్తముడేక్కడ ?’’అని లాగి పారేసింది .రాజు కూడా ఏమీ అనలేక పోయాడు .కానీ లోపలి పోయి కన్నీళ్లు పెట్టు కొన్నాడు రాజు .
అమాయకుడైన ధ్రువుడు ఏమీ చేయ లేక తండ్రికి నమస్కరించి తల్లి సునీత వద్దకు చేరి ఏడ్చాడు .తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం తనకు ఎందుకు కలగ లేదని ,ఆ అర్హత సంపాదించ టానికి తానేం చేయాలని అడిగాడు .అప్పుడు తల్లి‘’నాయనా ధ్రువా !సురుచి మానవతి అయిన భార్య ..ఆమె అంటే రాజు గారికి అభిమానం ఎక్కువ .నా దురదృష్టం వల్ల నేను ఆయన ప్రేమకు ఎక్కువ గా నోచుకో లేక పోయాను .పుణ్య వశం చేత ఉత్తముడు ఆమె గర్భం లో జన్మించి రాజ యోగ్యుడైనాడు‘’అని చెప్పి పుణ్యం రావాలంటే ఎలా వస్తుందో వివ రించింది సాత్విక మైన మనస్సు ,దయాదృష్టి ,శివ పూజ ,శాస్త్ర జ్ఞానము ,చదువు ,అరిషడ్వర్గాలను జయించటం ,తియ్యని మాట ,పనులలో శ్రద్ధ ,అలస్యం చేయక పోవటం ,గురు భక్తీ ,నిష్కాపట్యం ,దైన్యం లేని సంభాషణ ,శబ్ద పాండిత్యం ,బంధు గణాలను ఆదరించటం ,క్రయ ,విక్రయాలలో కఠినత్వం భార్యతో మృదువు గా మాట్లాడటం ,తీర్ధాలు సేవించటం ,యుద్ధం లో వీర మరణం ,పిల్లల మీద వాత్సల్యం ,యాచకులకు ,వికలాంగులకు దానం చేయటం ,తల్లి దండ్రుల సేవ ,నిత్య ధర్మా చరణ,ఉత్తమ శీలం ,మంచి వారితో స్నేహం ,ఇతి హాస పురాణాలను వినటం ,ఆపదలలో ధైర్యం ,సంపద చేరినపుడు స్తైర్యం ,యతీశ్వరుల యెడ ఔదార్యం ,దేహాన్ని కృశింప జేసుకోవటం ,ఇంద్రియ జయం ,తపో నియమం అనే ఉత్తమ గుణాల చేత తపో వృక్షం ఫలిస్తుంది .నువ్వు రాజు గారి కుమారుడవే కాని విశేష పుణ్యం చేయలేదు .నువ్వు చేసిన కర్మ కు తగిన ప్రతి ఫలమే లభిస్తుంది .కనుక దుఖించకు అని ఓదార్చింది .
తల్లి సునీతి మాటలు విన్న ధ్రువుడు ‘’అమ్మా !నేను బాలుడిగా మాట్లాడుతున్నానని అనుకో వద్దు .ఉత్తాన పాద రాజు గారి కుమారుడిని కనుక తపస్సు చేస్తాను .తపస్సు సర్వ సంపదలకు కారణం కదా .ఎవరికీ లభించ నంతటి గొప్ప పదవిని నేను సాధిస్తాను .నన్ను ఆశీర్వ డించి పంపించు ‘’అని కోరాడు అప్పుడామె ‘’ధ్రువా !నీకిప్పుడు తోమ్మిదేళ్ళే.నీకు ఆజ్న ఇచ్చే సమర్ధత నాకు లేదు .కానీ నీ మనో నిశ్చయం నాకు సంతృప్తి నిచ్చింది .కన్నీటి తోనే నిన్ను తపస్సుకు అంగీకారిస్తున్నాను‘’అని ఆశీర్వదించి పంపింది .
ధ్రువ బాలకుడు అక్కడి నుండి బయల్దేరి నిర్జరా రణ్యం ప్రవేశించాడు .దారిలో సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది .వారికి నమస్కరించాడు .తన చరిత్ర అంతా వారికి దీనం గా వివ రించి ,వారి మనసులను దోచాడు .అతడి కోరిక ఏమిటని అడిగారు .అప్పుడు ధ్రువుడు వినయం గా వారితో ‘’నా సోదరుడు ఉత్తముడు మా తండ్రి తోడ మీద కూర్చునే అదృష్టాన్ని పుణ్యం వల్ల పొందాడు .నాకూ ఆ అర్హత కావాలి మా తండ్రి సింహాసనం వేరొకరికి దక్క రాదు .ఇది ఇతరుల సింహాసనం కంటే ఉన్నత మైంది .అది ఇంద్రాదులకు కూడా పొంద రానిది .మా తండ్రి వదిలిన సింహా సనం కాదు నాకు కావాల్సింది .నా బలం చేత సాధించుకొన్న సింహాసనం నాకు కావాలి .అది నాకు ఎలా వస్తుంది ?దాని సాధనకు నేనేమి చేయాలి ‘’అని ప్రార్ధించాడు .అప్పుడు వారిలో మరీచి మహర్షి ‘’శ్రీ మన్నారాయణుని భజించకుండా ఆ యోగ్యత రాదు .అన్నాడు .అంగీరసుడు ‘’ఈలోకం లో సంపద ను అను భ వించాలంటే కమలాక్షుని సేవిన్చాల్సిందే ‘’అనగా ,పులస్తుడు ‘’ఎవరిని స్మరిస్తే సమస్త పాపాలు నశిస్తాయో అతడే మహా విష్ణువు ‘’అని ,పులహుడు ‘’ఎవని మాయ చేత అంత ప్రవర్తిస్తోందో ఆ అచ్యుతు డే సర్వాన్ని ఇస్తాడు ‘’అని ,క్రతువు ‘’ఈ జగాలకు ఎవరు అంత రాత్మ యో ఆ విష్ణువు సంతోష పడితే ఇవ్వనిది ఉండదు ‘’అని వసిష్ఠ మహర్షి ‘’ఎవరి కను బొమల అజ్ఞచేత అష్ట సిద్ధులు ప్రవర్తిస్తాయో ,ఆ హృషీ కేషుని ఆరాధించు ‘’అని అందరు విష్ణువే ఏదైనా ఇవ్వ గల సమర్ధుడని బోధించారు .
అప్పుడా ధ్రువ బాలుడు ‘’మహర్షి సత్తము లారా !నిలబడినా ,నడుస్తున్నా ,పడుకొన్నా ,నిద్రిస్తున్నా ,మేలుకొన్నా కూర్చున్నా ,ఎప్పుడూ నారాయణుడిని స్మరించాలి ద్వాదశాక్షరీ మంత్రం వాసు దేవాత్మకం .ఆ జపం తో శ్రీ మన్నారాయనుని జపించి నేను నా కోర్కెను తీచుకొంటాను .ఆయన మనసు కరగిస్తాను .ఈ మంత్రాన్ని పూర్వ బ్రహ్మ ,మునులు ఉపాసిన్చారని తెలుస్తోంది ‘’అన్నాడు మహర్షులు ద్వాదశాక్షర మంత్రం తో వాసు దేవుడిని ప్రసన్నం చేసుకోమని సలహా నిచ్చి మనస్పూర్తిగా ఆశీర్వా దించి అంతర్హితులయ్యారు .ధ్రువుడు వాసు దేవ మనస్కుడై తపస్సు చేసుకోవ టానికి అక్కడి నుండి బయల్దేరాడు

కాశీ ఖండం –19

ధ్రువుని భగవద్దర్శనం
ధ్రువ బాలుడు యమునా నది ఒడ్డున ఉన్న మధు వనం చేరాడు .అది మొదటి భగవత్ స్థానం .అక్కడే హరి మేధసుడు అనే వాడు పాపాన్ని పోగొట్టుకొని పుణ్యాత్ముడైనాడు .ఏ జంతువైనా అక్కడ ఉంటె ,పుణ్యం పొందేట్లు చేసే గొప్ప స్థలం .ధ్రువుడు పర బ్రహ్మ స్వరూపు డైన వాసు దేవుని జపిస్తూ విశ్వ మంతా వాసు దేవ మయం గా భావిస్తూ ఏకాగ్ర దృష్టి తొ ధ్యానం లో నిమగ్నమయ్యాడు .గోవింద నామం తప్ప ,ఆయన ధ్యాస తప్ప అతనికిన్కేమీ లేదు . ఉగ్ర తపస్సుకు ఆయన స్నానం చేసిన నదీ జలాలే కాలుష్యాన్ని వదలించు కొంటున్నాయి .సిద్ధుల తేజస్సు ఆయనలో ప్రకాశిస్తోంది .వాయుదేవుడు ఆయన వాక్కు లో సన్నిహితుడైనాడు .ఆకాశం శబ్ద రూపం తొ అతనిని ఆరాధించా టానికి అతని చెవులను ఆశ్రయిన్చిందిట .అంటే పంచ భూతాలచే ధ్రువుడు ఆరాధింప బడ్డాడు .
సాధారణం గా ఎవరు తీవ్ర తపస్సు చేస్తున్నా చెడ గొట్ట టానికి అప్సరసలను పంపే ఇంద్రుడు ధ్రువుడు బాలుడు కదా అని పంప లేదట .భయ పడేట్లు చేస్తే తపస్సు మానేస్తాదేమో నని భూత గణాలను పంపాడు భల్లూక ఆకారం ,ఒంటె మెడ ,పెద్ద కోరల భూతాలు మూడు వచ్చాయి .రంకెలు వేస్తూ ఒక ఎద్దు మీదికి వచ్చింది .ఒకటి మహా సర్పాకారం గా భయ పెట్టె రూపం తొ పెద్ద పడగల తొ మీదికోచ్చ్చింది .దున్న పోతు ఆకారపు భూతం మీద పడింది .ఖర్జూర చెట్టు వంటి తొడలతో ఒకటి ,మండే మంటలతో ఒకటి ,మబ్బులరూపం లో ఒకటి ,గుడ్ల గూబ ఆకారం లో ఒకటి ,అరుస్తూ వచ్చాయి .ఒక భూతం నోటిలో శిశువును కరచుకొని వచ్చి ధ్రువుని ఎడుటనే కర కరానమిలేసింది .ఒకటి పెద్ద మంటలను సృష్టించి భయ పెట్టె ప్రయత్నం చేసింది .ఒక భేతాళం పర్వతాలను ,చెట్లను నగ్గు నుగ్గు చేస్తూ భీభత్సం సృష్టించే ప్రయత్నం చేసింది ,ఒకటి అరుస్తోంది ,ఒకటి ప్రక్క వాటిని కరుస్తోంది .విపరీతం గా ఏడుస్తూ ఒకటి, బ్రతిమి లాడుతూ ఇంకోటి హడా విడి చేస్తున్నాయి .ఇంకో భూతం ఆడ దాని పొందు కంటే సుఖం ఏముంది ?తపస్సు చేసినా ఈ సౌఖ్యానికే గా అని అరిచింది .ఇంద్రియాను భవం కంటే గొప్పేమీ లేదని కామ సుఖాన్ని అనుభ వించ మని ప్రార్ధించింది ఇంకో గడుసు దెయ్యం .వీటికి వేటికీకి ధ్రువుని మనస్సు చలించలేదు భయ పడ లేదు .మళ్ళీ ఏకాగ్రత తొ నారాయణ మంత్రాన్నే జపిస్తున్నాడు .ఇంతలో భయంకర ఆభరణాలను ధరింఛి సుదర్శన చక్రం అక్కడున్న భూతాలకు భాయోత్పాతాలను కల్పించి పార ద్రోలింది .దాన్ని సాక్షాత్తు నారాయణుడే ధ్రువుని రక్షణ కోసం పంపాడు .
ఒక అందాల రాశి అక్కడికి వచ్చి ధ్రువుడు భూమి నుండి జన్మించిన తపోమ్కురం అని భావించి ,అతని నిశ్చల తపస్సుకు మెచ్చి నమస్కరించి వెళ్లి పోయింది .భయ పడిపారి పోయిన భూత గణమంతా బ్రహ్మ దేవుని చేరి పరిస్తితి వివ రించారు తమ ప్రయత్నాలన్నీ వ్యర్ధమైనాయని చెప్పారు .బ్రహ్మ వచ్చిన ఆ దేవ గణాన్ని చూసి ‘’దేవత లారా భయ పడద్దు .ధ్రువుడు ధ్రువ మైన పదాన్ని కాన్క్షిస్తున్నాడు .అంతే కాని మీ పదవులకోసం ఆశించటం లేదు .అతడు భగవద్భక్తుడు .అతని వలన భగవద్భక్తు లైన మీకు భయం లేదు .,విష్ణువు నే అతడు నమ్ముకొన్నాడు .ఆయన మాత్రమె అతని మనో భీష్టాన్ని తీరుస్తాడు .మీ పదవులకేమీ ఢోకా లేదు. స్తిర చిత్తం తొ ఉండండి ‘’అని చెప్పి పంపించాడు .
నారాయణుడు ధ్రువుని దృఢ దీక్షకు, తీవ్ర తపస్సుకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్ష మయాడు .’’బాలకా !నీ తపస్సుకు మెచ్చాను .తపస్సు చాలించు .కావలసిన వరాన్ని కోరుకో ‘’అన్నాడు .ధ్రువుడు కళ్ళు తెరచి అక్కడున్న్న లక్ష్మీ నారాయనులను చూసి సంభ్రమాశ్చర్య చకితుడై డైనాడు .ధ్రువ బాలుని వ్రేలు అంది పుచ్చుకొని విష్ణు మూర్తి పైకి లేవ దీశాడు .అతని ధూళి దూసర శరీరాన్ని ఆప్యాయం గా స్పృశించాడు వాసు దేవుడు .దీని తొ ధ్రువుడు తెప్ప రిల్లి తేరి పార జూశాడు .మహ దానందం తొ ధ్రువుని నోటి నుండి సుశబ్ద భూయిష్టమైన సంస్కృత స్తోత్రం గంగా ప్రవాహం లా వెలు వడింది

కాశీ ఖండం –20

ధ్రువుని నారాయణ స్తుతి
తన ముందు ప్రత్యక్ష మైన వాసు దేవుడిని ధ్రువుడు ఇలా స్తుతించాడు ‘’పరాత్పరా నారాయణుడా !సృష్టి కర్తవు ,హిరణ్య గర్భుడివి ,హిరణ్య రేతస్కుడివి ,హిరణ్య దాతవు ,అయిన నీకు నా ప్రణామం .మనో రణ్యానికి దావాగ్ని వంటి వాడవు .చక్ర దారివైన ,శ్రీ పతివి ,వరాహ రూపం లో భూమిని రక్షించావు.నరకాన్ని హరించే నారాయణుడవు .హరివి ,శౌరివి .అనంత శయనుడవు .రుక్మిణీ పతివి .పుండ రీకాక్షుడవు .జయ స్వరూపుడవు .బలి యజ్న హర్తావు .వర ప్రదాతవాగు నీకు నమస్సులు .వేలకొలది కన్నులు ,వేలకొలది పాదాలు ,వేలాది ఆకారాలు ధరించిన యజ్న పురుషుడవు . భూమిని ధరించి ఉద్ధరించావు .కమలా కాన్తుడవు .కమలహస్తుడవు ,కౌస్తుభ వక్షస్కుడవైన నీకు నమస్కారం .శ్రీ వత్సం ధరించిన వేద వేద వేదాంగ వేద్యుడవు .గుణ రూప వాసుదేవుడవు .పద్మ నాభవుడవు .దేవకీ నందనుడవు .పాంచజన్య ధారివి .వాసుదేవుడవు .ప్రద్యుమ్న ,అని రుద్ధడవు .దామోదర, హృషీ కేశుడవు …వేద త్రయుడవు .వైకుంఠవాసివి ,గరుడ గామినివి ,విష్టర స్రవుడ వైన నీకు వందనం .అండజ ,స్వేద ,ఉద్భిజ ,జరాయుజ రూపుడవు .గ్రహాలలో సూర్యుడవు .దేవతలకు దేవేంద్రుడవు .సముద్రాలలో పాల సముద్రానివి .గోవులలో కామ ధేనువు ,లోహాల్లో బంగారం ,రాళ్ళలో స్పటికం ,పూలలో నల్ల తామర ,వృక్షాలలో తులసి ,శిలలో సాలగ్రామం,ముక్తి క్షేత్రమైన కాశీ ,నీవే ..తీర్ధాలలో ప్రయాగ ,రంగులలో తెలుపు ,మానవులలో బ్రాహ్మణుడు ,పక్షులలో గరుత్మంతుడు ,వ్యవహారాల్లో వాక్ స్వరూపం ,వేదాలలో ఉపనిషత్తు ,మంత్రాలలో ప్రణవం ,అక్షరాలలో ఆకారం ,యజ్ఞం లో సోమరసం ,ప్రజా పతులలో అగ్ని ,నువ్వే .అని వేదాలన్నే ఘోషిస్తున్నాయి .దాతలలో మేఘానివి .ల విత్రులలో పరుడవు .సర్వ శాస్త్రాలలో ధనుస్సువి .వేగం కల వానిలో వాయువువి .ఇంద్రియాలలో మనసువు .భయ రహితులలో ఏనుగువు .వ్యాపక శక్తి కల వాటిలో ఆకాశానివి .యజ్ఞా లలో అశ్వ మేధానివి .దానాలలో అభయం నువ్వే .యుగాలలో కృత యుగానివి .తిధులలో‘’కుహు ‘’వు .నక్షత్రాలలో పుష్యమివి .పర్వాలలో సంక్రమణానివి .యోగాలలో వ్యతీ పాతి వి .గడ్డి రకాలలో దర్భవు .అన్ని యత్నాలలో నిర్వాణం నీవే .బుద్ధులలో ధర్మ బుద్ధివి .వృక్షాలలో అశ్వత్తము నువ్వే .లతలలో సోమ తీగవు .సాధనాలలో ప్రాణా యామానివి .అన్నీ ఇచ్చే వారిలో కాశీ విశ్వేశ్వరుడివి .హితులలో భార్య వంటి వాడవు .బంధువులలో ధర్మం వంటి వాడివి .నువ్వే తల్లీ తండ్రీ గురువు దైవం .నిన్ను ధ్యానిన్చటమే తపస్సు
నీకోసం ఖర్చు పెట్టిందే దానం .నీ సేవలో గడిపిందే కాలం .నీవు ఎంతకాలం హృదయం లో ఉంటావో అంతకాలమే జీవితం .నీ సంకీర్తనమే మాంగల్యం ,ధనార్జనం ,జీవిత ఫలం .అదోక్షతుని కంటే వేరే ధర్మం లేదు నారాయణు ని ని కంటే వేరే దానం లేదు .కేశవుని కంటే వేరే కామం లేదు .హరి కంటే మించిన అప వర్గం లేదు .వాసుదేవుని స్మరించ కుండా ఉండటం కంటే వేరే హాని ఉండదు ఆపద లేదు ,దురదృష్టమూలేదు .తెలీకుండానే హరీ అన్నా పాపాలు దహించుకు పోతాయి .నీ ప్రసాదం యజ్ఞం లోనీ పవిత్ర మైన పురోడాశం వంటిది .నీ స్మరణ యజ్ఞం చేసి అవ బృద స్నానం చేసి నంత పుణ్యం .’’అని ధ్రువుడువిష్ణు వు ను మనసారా ,ఆర్తి గా స్తుతించాడు .
వాసు దేవుడు అత్యంత ప్రీతీ చెంది ధ్రువుని తొ ‘’ధ్రువ బాలకా !నీ స్తిర చిత్తానికి మెచ్చాను .నీ స్తోత్రం పరమాద్భుతం గా ఉంది.భక్తీ భావ బంధురం .కొన్ని విషయాలు చెబుతాను జాగ్రత్త గా విని అర్ధం చేసుకో .అన్నం వల్ల భూతాలు పుడుతున్నాయి .వర్షానికి కారణం సూర్యుడు ఆ సూర్యుడికి నువ్వు ఆధార భూతుడవవు తావు .జ్యోతిస్చక్రం లో సర్వ గ్రహ ,నక్షత్రా లకు ,ఆకాశం లో సంచ రించే వాటి కన్నిటికి నువ్వు ఆధార భూతుడవు గా ఉంటావు ..పశువును కట్టు గొయ్య కు తాడుతో బంధించి తిప్పి నట్లు నువ్వు జ్యోతిస్చక్రాన్ని త్రిప్పు తావు .ఆ కల్పాంతం నువ్వు ఆ ధ్రువ పదం లో ఉండి పోతావు .నేను పూర్వం ఈశ్వరుని ఆరాధించి ,ఏమేమి పొందానో నువ్వు పొందుతావు .కొంత మంది ఈ పదవిలో నాలుగు యుగాలుంటారు .కొద్ది మంది మన్వంతరాలు ఆ పదివిలో ఉండగలరు .నువ్వు మాత్రం ఈ ధ్రువ పదం లో ఆకల్పాంతం ఉంటావు .ఇదే అత్యుత్తమ పదం .ఇంద్రాదులకు కూడా ఈ పదవి దక్కదు .నీ తల్లి సునీత కూడా నీతో నే ఉండు గాక ..నువ్వు చేసిన స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో వారింటి వద్ద లక్ష్మీ దేవి ఎప్పుడు కొలువై ఉంటుంది .పాపాలన్నీ నశిస్తాయి . .మాత్రు వియోగం ఉండదు .నా మీద చాలా మంది స్తోత్రాలు చెప్పారు .వాటన్నిటి కంటే నీ ధ్రువ స్తోత్రం సర్వోత్తమ మైనది .సర్వ ఫలదాయక మైనది
‘’ ధ్రువా !నాకిప్పుడు మోక్ష కారకుడగు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించాలనే కోరిక తీవ్రం గా ఉంది .కాశి అంటే ఆనంద కాననం .నేను రోజూ వైకుంఠంనుంచి కాశీ వెళ్లి విశ్వ నాధుని దర్శించు కొంటాను .నేను మూడు లోకాలను పాలించ టానికి కావలసిన శక్తి సుదర్శన చక్రం వల్లనే కలుగు తుంది .దాన్ని పరమ శివుడు తన పాదం బొటన వ్రేలిని నేలకు రాసి ఆ చక్రాన్ని సృష్టించి నాకు అనుగ్రహించాడు .ఇది ఈ హరికి ఆ హరుడు ప్రసాదించిన దివ్యా యుధం .ఆ చక్రాన్నే నిన్ను భయ పెట్టె భూతాలను పారద్రోలింది .’’అని చెప్పి ధ్రువుని గరుడ వాహనం పై ఎక్కించుకొని శ్రీ మహా విష్ణువు కాశీ క్షేత్రానికి తీసుకొని వెళ్లాడు .మణి కర్ణిక లో ఇద్దరు స్నానం చేశారు విశ్వ నాద దర్శనం చేశారు .ఆ తర్వాత వాసు దేవుడు ధ్రువుడిని కాశీ లో ఒక లింగాన్ని ప్రతిష్టించి నిష్టగా శివార్చన చేయ మని చెప్పి అదృస్య మయాడు ధ్రువుడు అలానే చేసి శివానుగ్రహాన్ని సాధించుకొన్నాడు .ధ్రువ కుండం లో స్నానం చేసి ద్రువేశ్వర లింగాన్ని అర్చించిన వారికి ధ్రువ లోకం లభిస్తుందని పరమ శివుడు వరమిచ్చాడు .పొందిన వరాలతో, సంతృప్తి చెందిన మనసు తొ ధ్రువ బాలుడు ఇంటికి తిరిగి వెళ్లాడు

21

22

23