కాశి ఖండం మిగతా బాగములు

01 to 10

11 to 20

21 to 30

31 to 40

41 to 50

51 to 60

61 to 70

కాశీ ఖండం

కాశీ ఖండం అనే కావ్యాన్ని కవిసార్వభౌముడైన శ్రీనాథుడు రచించారు. కాశీఖండము శ్రీనాథుడు రచించిన తెలుగు కావ్యము. ఇది క్రీస్తుశకం 1440 కాలంనాటి రచన.[1] స్కాంద పురాణంలో సులభగ్రాహ్యంగా ఉన్న ఈ కథా భాగాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండముగా రూపుదిద్దారు. ఇందులో వారణాశిగా ప్రసిద్ధిచెందిన కాశీ క్షేత్ర మహత్యం, దాని వైశిష్ట్యం, కాశీ యాత్రా విశేషాలు, శివునికి కాశీకి గల అనుబంధం, అనేక కథలు, ఉపకథలు మరియు కాశీకి సంబందించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ముద్రించేందుకు ఉత్పల నరసింహాచార్యులు పరిష్కరించగా, వ్రాతప్రతులను సమకూర్చడంలో వేటూరి ప్రభాకరశాస్త్రి సహకరించారు..

ప్రాణ సందేహమైనట్టి పట్టు నందు
ననృతములు పల్కి యైనను నౌర్వ సేయ!
యన్యు రక్షింప దలచుటత్యంతమైన
పరమ ధర్మంబు కాశికా పట్టణమున!

శ్రీనాధుడు (క్రీ.శ 1360 - 1450)
కవిత్రయంలొ ఎవరిని తల్చుకున్నా నైష్ఠికమైన ఒక రూపం మనసులో సాక్షాత్కరిస్తుంది. మడికట్టుకుని కూర్చున్న రూపు కళ్ళముందు మెదులుతుంది. శ్రీనాథుని పేరు చెప్పగానే ఒక విలాస పురుషుడు, ఒక భోగపరాయణుడు, రాజసం ఉట్టిపడే రూపంతో కనబడతాడు. జనజీవనంతో చెయ్యి కలిపిన చైతన్యమూర్తి స్ఫురిస్తాడు. బహుశ దీనికి కారణం శ్రీనాథుని పేర ప్రసిద్ధికెక్కిన చాటువులూ, క్రీడాభిరామం, పలనాటి వీర చరిత్ర రచనలూ కావచ్చు, నాటి రెడ్డి రాజులతో శ్రీనాథుని చెలిమి, పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి పదవి మరికొంత కారణం కావచ్చు. పోతనతో బంధుత్వం కలిపి ప్రచారంలోకి వచ్చిన కథలు సరేసరి. అన్నీ కలిసి శ్రీనాథుడికి ఒక రూపం ఇచ్చాయి. అది తెలుగు ప్రజల హృదయాల్లో స్థిరపడిపోయింది.
కాశీఖండం అవతారికలో శ్రీనాథుడు చెప్పుకున్న "చిన్నారి పొన్నారి చిఱుత కూకటినాడు రచియించితి మరుత్త రాట్చరిత్ర..." పద్యం ప్రకారం శ్రీనాథుడు పుట్టుకవి అనిపిస్తాడు. కవిగా పుట్టి, కవిగా జీవించి కవిగానే గిట్టినవాడు. యావజ్జీవితం కవితా సృష్టి చేసినవాడు. మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి ఇతని తొలి రచనలు. ఇవి ఇంతవరకూ దొరకలేదు. శ్రంగారనైషధం, భీమేశ్వరపురాణం,కాశీఖండం, ఇవేకాక హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం కూడా శ్రీనాథుడి రచనలే. పలనాటి వీరచరిత్రలో కల్లు ప్రతిష్ఠ బాలచంద్రుని యుద్ధం అనే భాగాలను శ్రీనాథుడు రచించాడంటారు. అలాగే క్రీడాభిరామం వల్లభరాయని రచనమే అయినా శ్రీనాథుడి చెయ్యి ఉంది అంటారు. ఇవి ఏడూ లభిస్తున్న రచనలు.
ధనంజయ విజయం, నందనందన చరిత్ర, వల్లభాభ్యుదయం అనేవి కూడా శ్రీనాథుడి రచనలుగా చెబుతున్నారు. కానీ అవి ఇంతవరకూ అలభ్యం. ఇతడి మరొక రచన పండితారాధ్య చరిత్ర. అదీ దొరకలేదు.
వక్రత, కాఠిన్యం, సరసత అనేవి తన కవితా గుణాలుగా శ్రీనాథుడు పేర్కొన్నాడు. అలంకారికులు వక్రత సౌందర్య పర్యాయ పదంగా ప్రకటించారు. శబ్ద వక్రత, అర్థ వక్రత అని ప్రధానంగా రెండు విధాలు. శబ్ద సౌందర్యం, అర్థ సౌందర్యం ఉంటాయని. శ్రీనాథుని కావ్యాలు శివపారమ్య స్థాపకాలనీ, ఆహ్లాదకరత్వం ప్రధాన లక్షణమనీ పండితుల అభిప్రాయం. సరసత్వం అన్నింటికీ పైది. పతాక, రససహితత్వం"రస ప్రసిద్ధ ధారాధుని" అని శ్రీనాథుని ప్రసిద్ధి. ఏది చెప్పినా రసమహితంగా చెబుతాడు. రసోచితమైన కాఠిన్యం, రసోచితమైన వక్రత ఉంటాయని. తెలుగు సాహిత్యంలో క్షేత్రమాహాత్మ్య కావ్యశాఖకు భీమఖండ, కాశీఖండాలతో శ్రీకారం చుట్టినవాడు శ్రీనాథుడు.
శ్రీనాథుడు కవిసార్వభౌముడు.
కాశీ ఖండం నుండి కొన్ని రసగుళికలు.
చిన్నారి పొన్నారి చిఱుత కూకటి నాడు
రచియించితి మరుత్తరాట్చరిత్ర
నూనూగు మీసాల నూత్న యౌవనమున
శాలివాహన సప్తశతినొడివితి
సంతరించితి నిండు జవ్వనంబున యందు
హర్షనైషధ కావ్య మాంధ్ర భాష
బ్రౌఢ నిర్భర వయః పరిపాకమునఁ గొని
యాడితి భీమనాయకుని మహిమఁ
బ్రాయ మింతకు మిగులఁ గై వ్రాలకుండఁ
గాశికాఖండ మను మహా గ్రంథమేను
దెనుఁగుఁ జేసెదఁ గర్ణాట దేశ కటక
పద్మవనహేళి శ్రీనాథ భట్ట సుకవి
అవతారికలోని ఈ పద్యంలో శ్రీనాథ మహాకవి తాను రచించిన గ్రంథాల పేర్లు చెప్పుకున్నాడు. అంతకుమించి ఏమీ లేదు. కానీ"చిన్నారి పొన్నారి చిఱుతకూకటినాడు", "నూనూగుమీసాల నూత్న యౌవనమున" వంటి సొగసైన తెలుగుమాటలకూర్పుతోగల సమాసాలూ, "ప్రౌఢనిర్భర వయః పరిపాకము" వంటి గడుసు సమాసం ఉన్నాయి. ఇలాంటి రచనా శైలివల్లనే తెలుగు జాతి ఆయనకి వశమైపోయింది.
భారతాంధ్రీకరణకర్తలు, ఇంకా ఇతర పూర్వకవులు కథా కథన దృష్టితో రససంపాదన దృష్టితో, ధర్మబోధ దృష్టితో ఆయా పురాణాలలో ఉన్న మహా విషయాలని తెలుగువారికి అందించే దృష్టితో రచనల చేశారు. పద్యాన్ని తీర్చి దిద్దాలన్న భావము తక్కువ.
తెలుగు పద్యాన్ని తీర్చి దిద్దడమెలాగో శ్రీనాథుడు మొదలుపెట్టాడని చెప్పవచ్చును. లేదా నాచన సోమనాథునితో మొదలై,శ్రీనాథునియందు విరబూసి పెద్దనాదులయందు వెల్లివిరిసిందని చెప్పవచ్చును.

Videos

కాశీఖండము (1)Shri Samavedam Shanmukha sharma

కాశీఖండము (2)Shri Samavedam Shanmukha sharma

కాశీఖండము (3)Shri Samavedam Shanmukha sharma

కాశీఖండము (4)Shri Samavedam Shanmukha sharma

కాశీఖండము (5)Shri Samavedam Shanmukha sharma

కాశీఖండము (6)Shri Samavedam Shanmukha sharma

కాశీఖండము (7)Shri Samavedam Shanmukha sharma

కాశీఖండము (8)Shri Samavedam Shanmukha sharma

కాశీఖండము (9)Shri Samavedam Shanmukha sharma

కాశీఖండము (10)Shri Samavedam Shanmukha sharma

కాశీఖండము (1)- బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనము.

కాశీ ఖండం –1

‘’ఆది పూజ్యం ,ఆది వన్ద్యం ,సిద్ధి బుద్దీశ్వరం ప్రభుం –శుభ ,లాభ తనూజం తం ,వందేహం ,గణ నాయకం ‘’
‘’విశ్వేశం ,మాధవం దుమ్దిం,దండ పాణించభైరవం –వందే కాశీం ,గుహాం ,గంగాం ,భవానీం ,మణి కర్ణికాం
‘’న గాయత్ర్యా సమో మంత్రం –న కాశీ సదృశీ పురీ –న విశ్వేశ సమం లింగం –సత్యం ,సత్యం ,పునః పునః ,
‘’కలౌ విశ్వేశ్వరోదేవః –కలౌ వారాణశీ పురీ –కలౌ భాగీరధీ గంగా –కలౌ దానం విశిష్యతే ‘’
‘’కాశ్యాం హి కాశ్యతే కాశీ –కాశీ సర్వ ప్రకాశికా –సాకారీ విదితా ఏవ –తేన ప్రాప్తాహి కాశికా ‘’
‘’కాశీ బ్రహ్మేతి వ్యాఖ్యానం –తబ్రహ్మ ప్రాప్యతే –త్రాహి –తస్మాత్ కాశీ గుణాన్ ,సర్వే-తత్ర తత్ర వదన్తిహి’’
‘’కాశీ కాశీ తి కాశీతి –రాసానా రస సం యుతా –యస్య కస్యాపి భూ యాశ్చేత్త్ –స రసజ్నో న చేతరః ‘’
వింధ్యాద్రి వర్ధనం
ఒకప్పుడు నారద మహర్షి నర్మదా నది లో స్నానం చేసి ఓంకార నాధుడిని దర్శించి ,సంచారం చేస్తున్నాడు ..ఆ రేవా నది ఒడ్డున ఉన్న వింధ్య పర్వతాన్ని చూశాడు .దాని నిండా ఫల పుష్ప వృక్షాలు కన్నుల విందు చేస్తున్నాయి .అనేక జంతు సమూహాలు ,పక్షులు తిరుగుతూ దాని శోభను పెంచుతున్నాయి ..నారదుని చూసి వింధ్యాద్రి పర వశించింది .ఆయన కు సపర్యలు చేయాలని కోరిక కలిగింది .నారదుని రాకతో పునీతుడై నట్లు వింధ్యాద్రి చెప్పుకొన్నది .మూడు లోకాలలో సంచరించే మహర్షికి తెలిసిన ఆశ్చర్య కర విశేషాలను అడిగి తెలుసుకొన్నది .మేరు పర్వతం మొదలైన వాటికి భూమిని దర్శించే భాగ్యం ఉందని , హిమాలయం శివ పార్వతుల నివాస స్తానము , పర్వతాలకు రాజు కనుక దానికి గౌరవించాలి అన్నాడు వింధ్యుడు .మేరువు స్వర్ణ మయం అయినా ,రత్నాల తో నిండి ఉన్నా తాను గౌర విన్చాల్సిన పని లేదని బింకం గా పలికాడు .మందేహాదులకు నిలయ మైన ఉదయ పర్వతం కూడా ఉంది కదా, నీలం రంగులో నీలాద్రి ఉన్నది ,సర్వ సర్ప సమూహాలున్నరైవతాద్రి ఉన్నది ,హేమ ,త్రికూట ,క్రౌంచ పర్వతాలు భూ భారాన్ని నిర్వ హింప లేవు మొత్తం మీద భూ భారాన్ని మోసే శక్తి ,సామర్ధ్యాలు తనకు మాత్రమె ఉన్నాయని వింధ్య పర్వతం నారద ముని తో ప్రగల్భాలు పలికింది
నారదునికి వింధ్యాద్రి నిజ రూపం తెలిసింది .గర్వం తో అందర్ని చులకన గా మాట్లాడు తున్నాడని గ్రహించాడు .శిఖర దర్శనం తోనే మోక్షమిచ్చే శ్రీ శైల పర్వతం ఉంది దాని ముందు వింధ్య ఎంత ?అను కొన్నాడు .కాని ఉపాయం గా వింధ్యాద్రి తో ‘’వింధ్య రాజా ! నిజం చెప్పావు .మేరు పర్వతం నీ చేత కించ పరచ బడింది .నేనూ అదే అనుకొన్నాను నీ నోటి నుంచి నిజం బైటికి వచ్చింది .అయినా ఏదో పేరు ,ప్రతిష్టా సంపాదించుకొన్న వారి గురించి మనకెందుకు చింత ?మనం విమర్శించటం ఉచితం కాదు .నీకు స్వస్తి ‘’అని చెప్పి ఆకాశ మార్గం లో వెళ్లి పోయాడు .నారదుని మాటలు విన్ధ్యాద్రికి మాత్సర్యం కలిగించాయి .’’శాస్త్రం తిరస్కరించిన వారి జీవితం ,జ్ఞాతుల చే పరాభ వింప బడిన వారి జీవితం వృధా .వారికి కునుకు పట్టాడు ..దుఖం తో నాకేమీ పాలు పోవటం లేదు .దుఖం జ్వరం లాంటిది.వైద్యుడికి లొంగదు.మేరువును ఎలా జయించాలి ?యెగిరి వెళ్లి మేరువు మీద పడదామను కొంటె, మా రెక్కల్ని టిని వాజ్రాయుధం తో ఇంద్రుడు నరికేశాడాయే .మేరు పర్వతం ఇంత ఔన్నత్యాన్ని ఎలా పొందుతోంది ?దాని గొప్ప తనానికి ఈర్ష్య నాలో పెరిగి, దహిస్తోంది .భూములన్నీ దాన్ని ఎలా చుట్టి వస్తున్నాయి .భూభారం ఎలా మోస్తోంది ?బ్రహ్మ చారి నారడుడి మాటలు నర్మ గర్భం గా ఉన్నాయి .నాకు సరైన మార్గాన్ని చూప గల వాడు విశ్వేశ్వరుడే .సాక్షాత్తు సూర్య భాగ వానుడే మేరువు చుట్టూ నిత్యం ప్రదక్షిణం చేస్తుంటాడు ..కనుక నేను కూడా నిలువు గా పెరిగి నా ఔన్నత్యాన్ని నిరూపించు కోవాలి ‘’అని అనేక రకాలు గా మధన పడింది .చివరకు ఆకాశం లోకి నిలువు గా పెరగటం ప్రారంభించింది ‘
సూర్య గమనానికి అడ్డు కోనేంత ఎత్తుకు వింధ్య పర్వతం పెరిగి పోయింది .సూర్యుడే తనను దాటి వెళ్ళ లేడుఇక యముడెలా దాటి దక్షిణ దిక్కు కు వెళ్తాడు ?అను కొన్నది .మనసు లోని చింత తీరి ధైర్య స్తైర్యాలు కలిగాయి వింధ్యకు .
సత్య లోక వర్ణనం
సకల జగత్తుకు సూర్యుడు ఆత్మ .చీకటికి విరోధి రోజూ ఉదయాద్రిన ఉదయించి చీకటిని సంహరించి వెలుగు నింపుతూ పద్మాలకు ప్రకాశాన్నిస్తూ నిత్య కృత్యాలకు తోడ్పడుతాడు సాయంకాలం పశ్చిమాన అస్తమించి కలువలకు వికసనం కలగ టానికి కారణం అవుతున్నచంద్రుని రప్పిస్తున్నాడు . .సూర్యునికి మలయానిలం ఉచ్చ్వాసం క్షీరోదకం అంబరం ,త్రికూట పర్వతం రత్న రాశుల ఆభరణం ,సువేల పర్వతం నితంబం ,కావేరి గౌతములు జన్ఘాలు ,చోళ రాజ్యం అమ్శుకం ,మహారాష్ట్ర వాగ్విలాసం .అలాంటి దక్షిణ నాయకుడైన రవి అక్కడే నిలిచి పోవాల్సి వచ్చింది .అప్పుడు ఆయన సారధి అనూరుడు మేరువు తో పోటీ పడి వింధ్య పెరిగి మార్గాన్ని అడ్డ గిన్చిందని తెలిపాడు .గగన మార్గానికి నిరోధం కలిగి నందుకు సూర్యుడు ఆశ్చర్య పడ్డాడు .
సూర్య గమనం లేక పోయే సరికి యజ్న యాగాదులు ,బ్రాహ్మల సంధ్యా వందనాదులు ఆగి పోయాయి .సృష్టి స్తితి లయాలకు కారణమైన సూర్యుని గతి ని స్తంభింప జేసి నందుకు మూడు లోకాలు తల్లడిల్లి పోయాయి .దేవత అందరు బ్రహ్మ దేవుని చేరి మొర పెట్టుకోవాలని బయల్దేరారు న్’బ్రహ్మను దర్శించి స్తోత్రాలతో తృప్తి చెందించారు ,దానికి బ్రహ్మ పరమానంద భరితుడైనాడు .ఏమి వరం కావాలో కోరుకో మన్నాడు త్రిమూర్తుల మైన తాము సృష్టి స్తితి లయాలను చేస్తామని కోరిన కోర్కెలను తీరుస్తామని చెప్పాడు .అప్పుడు బ్రహ్మ వారికి సత్య లోకం లోని విశేషాలను వివ రించిచేప్పాడు ‘’ఈమె భారతి నా భార్య .ఇవి శ్రుతి స్మృతులు .ఇక్కడ కామ క్రోధ మద మాత్సర్యాలుండవు .వీరందరూ చాతుర్మాస్యాది వ్రతాలు చేసిన బ్రాహ్మణులు .వీరు పతివ్రతలు .వీరు బ్రహ్మ చారులు .వీరు మాతా పితర పూజ చేసిన పుణ్యాత్ములు .వీరు గోసంరక్షణ చేసిన వారు .వీరు నిష్కామ కర్ములు .వీరు నిత్యాగ్ని హోత్రులు ,కపిల దానం చేసిన వారు వీరు .వీరు సారస్వత తపో సంపన్నులు .వీరు దానం తీసుకోని వారు .వీరంతా నాకు ప్రియులు సూర్య తేజం ఉన్న వారు .ప్రయాగలో మాఘ మాసం లో రవి మకర రాశి లో ప్రవేశించి నపుడు పుణ్య స్నానం చేసిన వారు వీరు .కార్తీకం లో కాశీలో పంచ నదాలలో మూడు రోజులు స్నానం చేసిన వారిరుగో .మణి కర్ణిక లో స్నానం వీరు చేసిన వారు .వీరు వేదాధ్యన పరులు వీరు పురాణ ప్రవచకులు వీరు వైద్య విద్యా భూ దానాలు చేసిన వారు వీరంతా ఇలాంటి పుణ్య కార్యాలు చేసి ఇక్కడి నా సత్య లోకం చేరారు .’’అని అక్కడ ఉన్న వారందరినీ దేవత లందరికి చూపించాడు బ్రహ్మ .
బ్రహ్మ మరల మాట్లాడుతూ బ్రాహ్మణులలో మంత్రాలున్నాయని ,గోవులలో హవిస్సులున్నాయని ,బ్రాహ్మణులు అంటే నడిచే తీర్ధాలని ,ఆవులు పవిత్ర మైనవని ,గోవు గిట్టల నుండి రేగిన దుమ్ము కణాలు గంగా జలం అంత పవిత్ర మైనవని ,ఆవుల కొమ్ముల చివర్లలో అన్ని తీర్ధాలు ఉన్నాయని ,గిట్ట లలో అన్ని పర్వతాలు ఉన్నాయని ,కొమ్ముల మధ్య గౌరీ దేవి ఉంటుందని ,గోదానం చేస్తే పితృదేవతలు మహా సంతోషిస్తారని ,ఋషులు దేవతలు ప్రీతీ చెందుతారని గోవు లక్ష్మీ స్వరూపమని పాపాలను పోగొట్టు తుందని వివరించాడు .గోమయం యమునా నది అని ,గోమూత్రం నర్మదా నదీ జలం ,ఆవు పాలు గంగోదకంఅని , దాని అన్ని అంగాలలో అన్ని లోకాలు ఉన్నాయని బ్రహ్మ చెప్పాడు .ఎవరు గంగా స్నానం చేస్తూ ఆ నది ఒడ్డున నివశిస్తూ పురాణాలు వింటాడో వాడు సత్య లోకానికి అర్హుడు అని తెలిపాడు .ఇంతకూ దేవతలేందుకు వచ్చారో మళ్ళీ అడిగాడు .వింధ్యాద్రి చేసిన పనిని వివరించారు దేవతలు .అప్పుడు బ్రహ్మ వారితో ‘’కాశీ క్షేత్రం అవి ముక్త క్షేతం .అక్కడ మహా తపస్వి అయిన అగస్త్య మహర్షి నిత్య విశ్వేశ్వర దర్శనం గంగా స్నానాల తో పునీతు డవుతున్నాడు .ఆయన దగ్గరకు వెళ్ళండి .ఆయనే తగిన ఉపాయం చెప్ప గలదు .మీ ప్రయత్నం సఫలం అగు గాక ‘’అని చెప్పి అదృశ్య మయాడు .బ్రహ్మ దర్శనం అయి నందుకు ,కాశీ క్షేత్ర దర్శనం,గంగా విశ్వేశ్వరఅగస్త్య దర్శనం చేయమని ఆయన చెప్పిన సలహా కు ఆనంద పడి దేవత లందరూ కాశీ పట్నానికి బయల్దేరి వెళ్లారు

కాశి ఖండం 2

వింధ్యాద్రి వర్ధనం
ఒకప్పుడు నారద మహర్షి నర్మదా నది లో స్నానం చేసి ఓంకార నాధుడిని దర్శించి ,సంచారం చేస్తున్నాడు ..ఆ రేవా నది ఒడ్డున ఉన్న వింధ్య పర్వతాన్ని చూశాడు .దాని నిండా ఫల పుష్ప వృక్షాలు కన్నుల విందు చేస్తున్నాయి .అనేక జంతు సమూహాలు ,పక్షులు తిరుగుతూ దాని శోభను పెంచుతున్నాయి ..నారదుని చూసి వింధ్యాద్రి పర వశించింది .ఆయన కు సపర్యలు చేయాలని కోరిక కలిగింది .నారదుని రాకతో పునీతుడై నట్లు వింధ్యాద్రి చెప్పుకొన్నది .మూడు లోకాలలో సంచరించే మహర్షికి తెలిసిన ఆశ్చర్య కర విశేషాలను అడిగి తెలుసుకొన్నది .మేరు పర్వతం మొదలైన వాటికి భూమిని దర్శించే భాగ్యం ఉందని , హిమాలయం శివ పార్వతుల నివాస స్తానము , పర్వతాలకు రాజు కనుక దానికి గౌరవించాలి అన్నాడు వింధ్యుడు .మేరువు స్వర్ణ మయం అయినా ,రత్నాల తో నిండి ఉన్నా తాను గౌర విన్చాల్సిన పని లేదని బింకం గా పలికాడు .మందేహాదులకు నిలయ మైన ఉదయ పర్వతం కూడా ఉంది కదా, నీలం రంగులో నీలాద్రి ఉన్నది ,సర్వ సర్ప సమూహాలున్నరైవతాద్రి ఉన్నది ,హేమ ,త్రికూట ,క్రౌంచ పర్వతాలు భూ భారాన్ని నిర్వ హింప లేవు మొత్తం మీద భూ భారాన్ని మోసే శక్తి ,సామర్ధ్యాలు తనకు మాత్రమె ఉన్నాయని వింధ్య పర్వతం నారద ముని తో ప్రగల్భాలు పలికింది
నారదునికి వింధ్యాద్రి నిజ రూపం తెలిసింది .గర్వం తో అందర్ని చులకన గా మాట్లాడు తున్నాడని గ్రహించాడు .శిఖర దర్శనం తోనే మోక్షమిచ్చే శ్రీ శైల పర్వతం ఉంది దాని ముందు వింధ్య ఎంత ?అను కొన్నాడు .కాని ఉపాయం గా వింధ్యాద్రి తో ‘’వింధ్య రాజా ! నిజం చెప్పావు .మేరు పర్వతం నీ చేత కించ పరచ బడింది .నేనూ అదే అనుకొన్నాను నీ నోటి నుంచి నిజం బైటికి వచ్చింది .అయినా ఏదో పేరు ,ప్రతిష్టా సంపాదించుకొన్న వారి గురించి మనకెందుకు చింత ?మనం విమర్శించటం ఉచితం కాదు .నీకు స్వస్తి ‘’అని చెప్పి ఆకాశ మార్గం లో వెళ్లి పోయాడు .నారదుని మాటలు విన్ధ్యాద్రికి మాత్సర్యం కలిగించాయి .’’శాస్త్రం తిరస్కరించిన వారి జీవితం ,జ్ఞాతుల చే పరాభ వింప బడిన వారి జీవితం వృధా .వారికి కునుకు పట్టాడు ..దుఖం తో నాకేమీ పాలు పోవటం లేదు .దుఖం జ్వరం లాంటిది.వైద్యుడికి లొంగదు.మేరువును ఎలా జయించాలి ?యెగిరి వెళ్లి మేరువు మీద పడదామను కొంటె, మా రెక్కల్ని టిని వాజ్రాయుధం తో ఇంద్రుడు నరికేశాడాయే .మేరు పర్వతం ఇంత ఔన్నత్యాన్ని ఎలా పొందుతోంది ?దాని గొప్ప తనానికి ఈర్ష్య నాలో పెరిగి, దహిస్తోంది .భూములన్నీ దాన్ని ఎలా చుట్టి వస్తున్నాయి .భూభారం ఎలా మోస్తోంది ?బ్రహ్మ చారి నారడుడి మాటలు నర్మ గర్భం గా ఉన్నాయి .నాకు సరైన మార్గాన్ని చూప గల వాడు విశ్వేశ్వరుడే .సాక్షాత్తు సూర్య భాగ వానుడే మేరువు చుట్టూ నిత్యం ప్రదక్షిణం చేస్తుంటాడు ..కనుక నేను కూడా నిలువు గా పెరిగి నా ఔన్నత్యాన్ని నిరూపించు కోవాలి ‘’అని అనేక రకాలు గా మధన పడింది .చివరకు ఆకాశం లోకి నిలువు గా పెరగటం ప్రారంభించింది ‘
సూర్య గమనానికి అడ్డు కోనేంత ఎత్తుకు వింధ్య పర్వతం పెరిగి పోయింది .సూర్యుడే తనను దాటి వెళ్ళ లేడుఇక యముడెలా దాటి దక్షిణ దిక్కు కు వెళ్తాడు ?అను కొన్నది .మనసు లోని చింత తీరి ధైర్య స్తైర్యాలు కలిగాయి వింధ్యకు


అగస్త్యాశ్రమం
దేవతలందరూ వార ణాసి చేరి అయిదు రోజులు నిత్యమ గంగా స్నానం చేస్తూ విశ్వేశ్వర విశాలాక్షీ అన్నపూర్ణా,దుం థిగణపతి ,కాల భైరవులను దర్శించారు .ఆ తర్వాత అగస్త్య ముని ఆశ్రమాన్ని చేరుకొన్నారు ..అగస్త్యుడు తన పేర అగస్త్యేశ్వర స్వామిని స్తాపించి ,జప హోమాలను చేస్తూ పరమేశ్వర ధ్యానం లో భార్య లోపాముద్ర తో గడుపుతున్నాడు .సముద్రాలను తన పురది శిలి లో ఉంచి పానం చేసి నప్పుడు అందులో ఉండే బడ బాగ్ని ఆయన శరీరం లో ప్రవేశించి ,దివ్య కాంతులను వెలువరుస్తోంది .ఆయన తన తపస్సు చే సూర్యుని ప్రకాశింప జేస్తున్నాడు ,అగ్నిని మండింప జేస్తున్నాడు ,ఆయన తపో బలం వల్ల చపలాలు ఆచపలాలుగా మారాయి ..ఆశ్రమం లో క్రూర మృగాల తో సాదు జంతువులు కలిసి మెలుగు తున్నాయి .మహా ప్రశాంతం గా అగస్త్యా శ్రమం ఉన్నది .దుష్ట మృగాలు మాంస భక్షణ మాని పచ్చ గడ్డి మేస్తున్నాయి .కొంగలు చేపలను ,పెద్ద చేపలు చిన్న వాటిని తినటం లేదు .ఆశ్రమంలో‘మాంసం ఎక్కడ ?శివ భక్తీ ఎక్కడ ?మందిర మెక్కడ ?శివార్చనం ఎక్కడ ?మద్య మాంసాలు తిన్న వారికి శంకరుడు దూరం గా ఉంటాడు .శివానుగ్రహం లేక అజ్ఞానం నశించదు ‘’అన్న వాక్యం రాసి అందరికి అహింసా ధర్మాన్ని బోధిస్తోంది .
ఈ ప్రశాంతత ను చూసి దేవతలు ఆశ్చర్య పడ్డారు .’’ఇక్కడున్న పక్షులు విశ్వేశ్వరుని ధ్యానిస్తున్నాయా ?చిలుకలు విశ్వ నాధుని కీర్తిస్తున్నాయా ?కోకిలలు కలికాల పరి స్తితులకు కలత చెంది విశ్వేశ్వర తలం పు తో చిత్త శాంతి పొందు తున్నాయి .స్వర్గం లో నుండి పతనం చెడటం ఉంది కాని కాశి లో పతనం ఉండదు .యముడి దగ్గర ఉండటం కంటే ,కాశీలో ఉండటం శ్రేయస్కరం .బ్రహ్మాండం లో ఏ ప్రదేశం లో ఉన్న దాని కంటే కాశి లో నివశించటం శ్రేష్టం .ఇక్కడ ఉన్నా ,ఈశ్వర దర్శనం లేక పోతే వ్యర్ధం .ఉత్తర వాహిని అయిన గంగా నదిలో స్నానం చేసి ,విశ్వేశుని దర్శించిన వారి శ్రేయస్సు కు అంతం ఉండదు .’’దేవ దేవ మహా దేవ శంభో !శివా శివా !దూర్జటే !నీల కంథేశ!పినాకీ !శశి శేఖర !నన్ను రక్షించు ‘’అంటూ ముక్తి మండపం పై కూర్చోవటం ,ధర్మ విషయాలు మాట్లాడుకోవటం పురాణ శ్రవణం చేయటం ,నిత్య కర్మలు చేయటం పిండాదులు పెట్టటం ,పరోప కారం చేయటం ,అంటే సమస్త ధర్మాలను ఆచరిన్చటమే .శుక్ల పక్షం లో చంద్ర కల అభి వృద్ధి చెంది నట్లు కాశీ క్షేత్రం లో ఉన్నవారికి పుణ్యం అలా పెరుగుతూ ఉంటుంది ..ఇక్కడ పురుషార్ధాలను ఇచ్చేది భవానీ మాత .కోరికలను తీర్చే వాడు డున్తి విఘ్నేశ్వరుడు .విశ్వేశ్వరుడు మరణ కాలం లో సమస్త ప్రాణులకు రామ తారక మంత్రాన్ని చెవిలో బోధించి మొక్షాన్నిస్తాడు .విశ్వేశ్వరుడు ధర్మార్ధ కామ మోక్ష స్వరూపుడు .పరమాత్మ స్వరూపుడు .అందుకనే కాశీ వంటి పట్టణం మూడు లోకాలలోనూ లేదనే ప్రఖ్యాతి వచ్చింది .’’అని దేవత లందురు అను కొంటూ ,అనేక మంది బ్రహ్మ చారి శిష్యుల తో పరి వేష్టించి ఉన్న అగస్త్య ముని ని దర్శించారు .శ్యామక ధాన్యాన్ని హోమం కోసం చేతులో పట్టుకొన్న రుషి కన్యలను చూశారు .సాధ్వి లోపాముద్ర పాద ముద్ర లను చూసి పులకించారు .ఆ పాద ముద్ర లకు భక్తీ గా నమస్కరించారు .అక్కడ సమాధి నుండి మేల్కొన్న బ్రహ్మ దేవుని లా ప్రకాశి స్తున్న అగస్త్య మహర్షిని దర్శించి నమోవాకాలనర్పించారు .ఆయన వీరిని సాదరం గా ఆహ్వా నించి, అతిధి మర్యాదలు చేసి, శుఖాసీనులను చేశాడు ..వారి రాకకు కారణాన్ని అడిగాడు మహర్షి.
పతివ్రతాఖ్యానం
అప్పుడు దేవతలందరి తరఫున దేవ గురుడు బృహస్పతి మహర్షి తో ‘’లోపాముద్ర వల్లభా !నీవు ఘనులలో ఘనుడవు ..నీవంటి తపోధనులు లేరు .ఈ కల్యాణి లోపాముద్ర నీ సహా ధర్మ చారిని గా నీ ఛాయ లాగా ప్రవర్తిస్తోంది .మహా పతి వ్రత లైన అరుంధతి ,అనసూయ ,సావిత్రి ,శాండిల్య ,సత్య ,లక్ష్మి ,శతరూప లతో ఈమె సమానం .ఈమె ను మించిన పతివ్రత ను ఊహించలేము .’’అని లోపాముద్రాగాస్త్యులను కీర్తించాడు .తర్వాత పతివ్రతా ధర్మాలను వివ రించాడు బృహస్పతి ‘’కన్య వివాహ సందర్భం లో పెండ్లి కుమార్తె తో పురోహితుడు ‘’భర్త తో జీవించినా లేక పోయినా సహా చరిగా ఉండు ‘’అని చెబుతారు .కనుకభార్య భర్తను నీడ లాగా అనుసరించాలటం పతివ్రత లక్షణం .యమ దూతలు పతివ్రతను చూస్తె అగ్నిని చూసి నంత భయం తో పారి పోతారు .ఆమె తేజస్సు ముందు సూర్యాగ్నుల తేజస్సు దిగ దుడుపు .స్త్రీల పతివ్రతాచారణం వల్లనే భూమి భారం తగ్గుతోంది .ఈ లోకానికి ,పర లోకానికి భార్యయే మూలం .భార్య తో కలిసి దేవ ,పితృ కార్యాలు చేయాలి .,భర్త ను కోల్పోయిన స్త్రీ ఏ దానం చేసినా ‘’నా భర్త సంతోషించు గాక ‘’అని చేయాలి శ్రావణ ,భాద్ర పద మాసాలలో ఆమె భోజనాలు అతిధులకు పెట్టాలి .కార్తీకం లో మౌనాన్ని పాటించాలి .ఆకులలో భుజించాలి .దీప దానం చేయాలి ఈ దానం తో ఏదీ సమానం కాదు .సూర్యోదయం అవగానే మాఘ స్నానం చేయాలి దీపాన్ని దానం చేసే టప్పుడు పరమేశ్వర స్వరూపుడైన తన భర్త సంతోషించాలి అని అనుకోవాలి .కొడుకు అనుమతి తో పనులు చేయాలి . పాతివ్రత్యం గల స్త్రీ ని పూజిస్తే గంగా స్నానం చేసి నంత ఫలితం కలుగు తుంది .అమ్మా లోపా ముద్రా దేవీ !మీ దర్శనం మాకు గంగా స్నానం తో సమానం ‘’అని చెప్పాడు .
బృహస్పతి తాము వచ్చిన కారణాన్ని ఇప్పుడు వివ రించి చెబుతున్నాడు ‘’మహర్షీ !వీరు అగ్ని ,యమ ,నిరుతి ,వరుణ ,వాయు ,కుబేర ,రుద్రదేవతలు .లోకం లో జనం వీరి వల్ల అన్ని అర్ధాలను పొందుతున్నారు .మేరు పర్వతం వింధ్య గిరి పై ఈర్ష్య పెంచుకొని విపరీతం గా పెరిగింది .సూర్యుని మార్గానికి అవరోధమేర్పడింది .దానిని మీరే దారి లోకి తేవాలి ,లోక కార్యాలన్నీ మళ్ళీ యదా ప్రకారం జరిగేటట్లు చేయాలి అందుకే మేమంతా మీ దర్శనం చేసి అర్ధించటానికి వచ్చాం .’’అని విన్న వించాడు .అగస్త్య మహర్షి ‘’అలాగే చేస్తాను ,నిశ్చింత గా వెళ్ళండి ‘’అని అభయమిచ్చి దేవతలను పంపించాడు . .

కాశి ఖండం 3

సత్య లోక వర్ణనం
సకల జగత్తుకు సూర్యుడు ఆత్మ .చీకటికి విరోధి రోజూ ఉదయాద్రిన ఉదయించి చీకటిని సంహరించి వెలుగు నింపుతూ పద్మాలకు ప్రకాశాన్నిస్తూ నిత్య కృత్యాలకు తోడ్పడుతాడు సాయంకాలం పశ్చిమాన అస్తమించి కలువలకు వికసనం కలగ టానికి కారణం అవుతున్నచంద్రుని రప్పిస్తున్నాడు . .సూర్యునికి మలయానిలం ఉచ్చ్వాసం క్షీరోదకం అంబరం ,త్రికూట పర్వతం రత్న రాశుల ఆభరణం ,సువేల పర్వతం నితంబం ,కావేరి గౌతములు జన్ఘాలు ,చోళ రాజ్యం అమ్శుకం ,మహారాష్ట్ర వాగ్విలాసం .అలాంటి దక్షిణ నాయకుడైన రవి అక్కడే నిలిచి పోవాల్సి వచ్చింది .అప్పుడు ఆయన సారధి అనూరుడు మేరువు తో పోటీ పడి వింధ్య పెరిగి మార్గాన్ని అడ్డ గిన్చిందని తెలిపాడు .గగన మార్గానికి నిరోధం కలిగి నందుకు సూర్యుడు ఆశ్చర్య పడ్డాడు .
సూర్య గమనం లేక పోయే సరికి యజ్న యాగాదులు ,బ్రాహ్మల సంధ్యా వందనాదులు ఆగి పోయాయి .సృష్టి స్తితి లయాలకు కారణమైన సూర్యుని గతి ని స్తంభింప జేసి నందుకు మూడు లోకాలు తల్లడిల్లి పోయాయి .దేవత అందరు బ్రహ్మ దేవుని చేరి మొర పెట్టుకోవాలని బయల్దేరారు న్’బ్రహ్మను దర్శించి స్తోత్రాలతో తృప్తి చెందించారు ,దానికి బ్రహ్మ పరమానంద భరితుడైనాడు .ఏమి వరం కావాలో కోరుకో మన్నాడు త్రిమూర్తుల మైన తాము సృష్టి స్తితి లయాలను చేస్తామని కోరిన కోర్కెలను తీరుస్తామని చెప్పాడు .అప్పుడు బ్రహ్మ వారికి సత్య లోకం లోని విశేషాలను వివ రించిచేప్పాడు ‘’ఈమె భారతి నా భార్య .ఇవి శ్రుతి స్మృతులు .ఇక్కడ కామ క్రోధ మద మాత్సర్యాలుండవు .వీరందరూ చాతుర్మాస్యాది వ్రతాలు చేసిన బ్రాహ్మణులు .వీరు పతివ్రతలు .వీరు బ్రహ్మ చారులు .వీరు మాతా పితర పూజ చేసిన పుణ్యాత్ములు .వీరు గోసంరక్షణ చేసిన వారు .వీరు నిష్కామ కర్ములు .వీరు నిత్యాగ్ని హోత్రులు ,కపిల దానం చేసిన వారు వీరు .వీరు సారస్వత తపో సంపన్నులు .వీరు దానం తీసుకోని వారు .వీరంతా నాకు ప్రియులు సూర్య తేజం ఉన్న వారు .ప్రయాగలో మాఘ మాసం లో రవి మకర రాశి లో ప్రవేశించి నపుడు పుణ్య స్నానం చేసిన వారు వీరు .కార్తీకం లో కాశీలో పంచ నదాలలో మూడు రోజులు స్నానం చేసిన వారిరుగో .మణి కర్ణిక లో స్నానం వీరు చేసిన వారు .వీరు వేదాధ్యన పరులు వీరు పురాణ ప్రవచకులు వీరు వైద్య విద్యా భూ దానాలు చేసిన వారు వీరంతా ఇలాంటి పుణ్య కార్యాలు చేసి ఇక్కడి నా సత్య లోకం చేరారు .’’అని అక్కడ ఉన్న వారందరినీ దేవత లందరికి చూపించాడు బ్రహ్మ .
బ్రహ్మ మరల మాట్లాడుతూ బ్రాహ్మణులలో మంత్రాలున్నాయని ,గోవులలో హవిస్సులున్నాయని ,బ్రాహ్మణులు అంటే నడిచే తీర్ధాలని ,ఆవులు పవిత్ర మైనవని ,గోవు గిట్టల నుండి రేగిన దుమ్ము కణాలు గంగా జలం అంత పవిత్ర మైనవని ,ఆవుల కొమ్ముల చివర్లలో అన్ని తీర్ధాలు ఉన్నాయని ,గిట్ట లలో అన్ని పర్వతాలు ఉన్నాయని ,కొమ్ముల మధ్య గౌరీ దేవి ఉంటుందని ,గోదానం చేస్తే పితృదేవతలు మహా సంతోషిస్తారని ,ఋషులు దేవతలు ప్రీతీ చెందుతారని గోవు లక్ష్మీ స్వరూపమని పాపాలను పోగొట్టు తుందని వివరించాడు .గోమయం యమునా నది అని ,గోమూత్రం నర్మదా నదీ జలం ,ఆవు పాలు గంగోదకంఅని , దాని అన్ని అంగాలలో అన్ని లోకాలు ఉన్నాయని బ్రహ్మ చెప్పాడు .ఎవరు గంగా స్నానం చేస్తూ ఆ నది ఒడ్డున నివశిస్తూ పురాణాలు వింటాడో వాడు సత్య లోకానికి అర్హుడు అని తెలిపాడు .ఇంతకూ దేవతలేందుకు వచ్చారో మళ్ళీ అడిగాడు .వింధ్యాద్రి చేసిన పనిని వివరించారు దేవతలు .అప్పుడు బ్రహ్మ వారితో ‘’కాశీ క్షేత్రం అవి ముక్త క్షేతం .అక్కడ మహా తపస్వి అయిన అగస్త్య మహర్షి నిత్య విశ్వేశ్వర దర్శనం గంగా స్నానాల తో పునీతు డవుతున్నాడు .ఆయన దగ్గరకు వెళ్ళండి .ఆయనే తగిన ఉపాయం చెప్ప గలదు .మీ ప్రయత్నం సఫలం అగు గాక ‘’అని చెప్పి అదృశ్య మయాడు .బ్రహ్మ దర్శనం అయి నందుకు ,కాశీ క్షేత్ర దర్శనం,గంగా విశ్వేశ్వరఅగస్త్య దర్శనం చేయమని ఆయన చెప్పిన సలహా కు ఆనంద పడి దేవత లందరూ కాశీ పట్నానికి బయల్దేరి వెళ్లారు

అగస్త్య ప్రస్థానం
అగస్త్య మహర్షి కాశీ విశ్వేశ్వరుని ప్రార్ధించి ,భార్య లోపాముద్ర తో ‘’మన పై ఎంత భారాన్ని దేవతలు పెట్టారో చూశావా ?ముని వ్రుత్తి లో ఉండే మనం ఎక్కడ ?ఈ కార్యభారం ఎక్కడ ?పర్వతాల రెక్కలను చేదించిన ఇంద్రునికి ఇది అసాధ్య మైనదా ?ఈ వింధ్యాద్రి అతనినే జయిన్చిందా ?కల్ప వృక్షం ,కామ ధేనువు ,చింతా మణి కలిగి ఉన్న దేవేంద్రుడు ,ముక్కు మూసుకొని తపస్సు చేసుకొనే ఈ బ్రాహ్మణుడిని ప్రార్ధించ టానికి వచ్చాడు .అన్నిటిని దహించ గల శక్తి ఉన్న అగ్ని దేవుడికి ఈ పని అసాధ్య మైందా ?దండం ధరించి ప్రాణుల ను శాసించే యముడీ పని చేయ లేడా ?ఆదిత్యులు ,వసువులు ,రుద్రులు ,విశ్వేదేవులు ఈ స్వల్ప కార్యాన్ని చేయ లేక పోయారా ?ఇంత మందికి సాధ్యం కాని వింధ్యాద్రి గర్వాపహరణం నేను చేయగలనని వారు నమ్మారంటే ఆశ్చర్యం గా ఉంది’’.
‘’ కాశీ క్షేత్రాన్ని గురించి మహాత్ములు చెప్పిన మాటలు మల్ళీ మళ్ళీ జ్ఞాపకానికి వస్తున్నాయి .కాశీ లో నివశించే వారికి అనేక విఘ్నాలు కలుగు తుంటాయి .అలాంటి విఘ్నమే మనకిప్పుడు వచ్చింది .విశ్వేశ్వరుడు విముఖం గా ఉన్నప్పుడే వ్యతి రేకం గా ప్రవర్తించాలి .కాశీని వదలుట చేతి లోని మోక్షాన్ని వలటమే .పుణ్యం నశిస్తేనే కాశీ నుండి వెళ్ళాలని పిస్తుంది .ఉత్తమ పురుషార్ధ మైన మోక్షం కాశి లోనే లభిస్తుంది .ఇది అతి పుణ్య క్షేత్రమని శ్రుతులు చెబుతున్నాయి .జాబాలి ,అరుణి ,వరణ పింగళ నాడీ మధ్య ఉన్న అవిముక్త క్షేత్రం కాశి .వాటి మధ్య ఉన్నసు షుమ్నా నాడియే కాశి .ఇక్కడ ప్ప్రాణం ఉత్క్రమణం జరిగితే విశ్వ నాధుడు మోక్షమిస్తాడు .ఆయనే తారక మంత్రోప దేశం చేస్తాడు దానితో బ్రహ్మత్వం సిద్ధిస్తుంది .కాశితో సమాన మైన క్షేత్రం ,విశ్వేశ్వరునికి సమానమైన దైవం లేవు .ఇలాంటి పుణ్య రాశి కాశి ని ఇప్పుడు మనం విడిచి పెట్టి వెళ్ళాల్సి వస్తోంది .మనసు స్వాధీనం లో ఉండటం లేదు ‘’అని మహర్షి దుఖాశ్రువులను ధారా పాతం గా కార్చాడు ..
దంపతులిద్దరూ విశ్వేశ్వరుని దర్శించారు .స్వామికి విన్న విన్చుకొంటు ముని ‘’నువ్వు కాశీ విభుడవు .కనుక నీకు విన్న విన్చుకోవటానికి వచ్చాను .నేనేమి అపరాధం చేశాను ?అన్నపూర్ణా దేవిని వదిలి పెట్టాల్సి వచ్చింది ?కాల భైరవా నువ్వైనా అభయం ఇవ్వవా ?దండ పాణీ !నువ్వైనా మేము వెళ్ళ కుండా చేయలేవా ?డుమ్ది వినాయకా !విఘ్నాలకు అది రాజువు .నీకు మా మీద ఎందుకు కోపం కలిగింది ?పంచ వినాయకులారా !చింతా మణి గణపతీ !కపర్దీ !ఆశా గజాశ్యా !సిద్ధి వినాయకా !నేనేమి కాశీ వదిలి వెళ్ళేంత తప్పు చేయలేదు .ఇతరుల తప్పు ఎంచ లేదు .పరులకు అపకారం చేయ లేదు .త్రికాలాలో గంగా స్నానం చేసి విశ్వేశ్వరుడిని సందర్శిస్తూ నా జీవితాన్ని చరితార్ధం చేసుకొంటున్నాను .ప్రతి పర్వం లోను పంచ గంగా యాత్ర చేస్తున్నాను .తల్లీ విశాలాక్షీ !భవానీ ! శివ రంజనీ !నువ్వైనా కనిక రించవా ?కాశీ పట్టణ దేవత లారా !నేనేమీ నా స్వార్ధం కోసం కాశీ ని వదిలి పెట్టి వెళ్లటం లేదు .దేవతల అభ్యర్ధన మేరకు ,పరోప కారం కోసమే వెడుతున్నాను .పూర్వం దధీచి తన ఎముకను ఇంద్రుడికి ఇవ్వ లేదా ?బలి తన సర్వస్వాన్ని పోగొట్టు కొ లేదా ?’’అని అందరికి విన్న విన్చుకొంటు మునులను, ఆబాల వ్రుద్ధులను వృక్ష జంతు కోటికి మ్రొక్కి అందరికి వీడ్కోలు చెప్పి ,ధర్మ పత్ని లోపాముద్ర వ్రేలు పట్టుకొని ‘’పుణ్య రాశి అయిన కాశి ని వదిలి పెట్టి వెళ్తున్నాను ‘’అని కన్నీరు కారుస్తూ ,చప్పట్లు చరుస్తూ’’అయ్యో కాశీ కాశీ ఆరుస్తూ శివ ,శివ అని ప్రలాపిస్తూ కింద పడి పోయాడు మహర్షి .మళ్ళీ కొంచెం స్తిమిత పడి భార్య చేయి ఊత గా తీసుకొని ‘’నాకు వినాశం దగ్గర పడింది ‘’అని పలవరిస్తూ ముందుకు కదిలాడు .
కొద్ది కాలానికే ,ఆకాశ మంత ఎత్తు పెరిగి ,సూర్య గమనానికి నిరోధం గా ఉన్న వింధ్యాద్రి వద్దకు చేరుకొన్నారు దంపతులు .వింధ్యాద్రి భయం తో ‘’స్వామీ ! నేను మీ సేవకుడిని .ఏమి ఆజ్న ?’’అని వినయం గా అడిగాడు .దానికి మహర్షి ‘’వింధ్య రాజా !నువ్వు చాలా ప్రాజ్ఞుడవు .నా శక్తి సామర్ధ్యాలు తెలిసిన వాడివి .నేను దక్షిణ దేశానికి వెళ్తున్నాను తిరిగి వచ్చే దాకా ఇలాగే ఉండు ‘’అని చెప్పాడు .మహర్షి కోప పడ నందుకు సుముఖం గా మాట్లాడి నందుకు,శపించ నందుకు వింధ్య సంతోష పడిఅలాగే వినమ్రం గా కిందికి వంగి ఉండి పోయింది .మహర్షి వింధ్య ను దాటి వచ్చాడు .సూర్యుడు మళ్ళీ తన గమనాన్ని నిరాటంకం గా కోన సాగించాడు .’’నేడోరేపో అగస్త్య మహర్షి తిరిగి వస్తాడు ‘’అని ఎదురు చూస్తూ అలానే ఉండి పోయాడు వింధ్య రాజు .అగస్తుడు మళ్ళీ తిరిగి రాడు ,వింధ్య ఇక పైకి లేవడు అనే సంతృప్తి తో సూర్యుడు మరీ ప్రచండం గా తన దిన యాత్ర సాగించాడు .దుష్టుల సంకల్పాలను ఇలానే మహాత్ములు నీరు గార్చుతారని అందరు అనుకొన్నారు .
అగస్త్యుడు గోదా వరి తీరానికి చేరి సంచ రిస్తున్నా ఇంకా మనసులో కాశి భావం తొలగి పోలేదు .పదే పదే తలుచుకొంటునే ఉన్నాడు ..పిచ్చి వారి వలె ఇద్దరు గాలిని చూసి ‘’కాశీ పట్నం కుశల మేనా ?ఎప్పుడు మళ్ళీ కాశీకి వేడతాము /అని ప్రశ్నిస్తున్నారు .అంత అవినా భావ సంబంధం తో వారు కాశీ లో మెలిగారు ..కొల్హాపురం చేరి అక్కడి మహా లక్ష్మి అమ్మ వారిని దర్శించారు .ముల్లోకాలను అడవి పంది గా భయ పెట్టిన కోలాసురుడిని సంహరించిన లక్ష్మీ దేవి ఇక్కడ కొలువై ఉంది .మహా లక్ష్మి ని ఇద్దరు మనసా రా స్తోత్రం చేసి ,ప్రార్ధించారు ‘’అమ్మా లక్ష్మీ దేవీ ! నువ్వు ఎక్కడ ఉంటె అక్కడ సమస్త మంగళాలు ఉంటాయి.నువ్వు అనుగ్రహిస్తే అన్నీ చేకూరుతాయి ‘’అని ప్రార్దిన్చారు .అమ్మవారు ప్రత్యక్షమై ‘’మిత్రా వరుణ సంభవా అగ్స్త్యమునీ ! !పతివ్రతా శిరోమణీ లోపాముద్రా !’’అని సంబోధించి ,లోపాముద్రా దేవి ని తన సమీపం లో కోర్చో బెట్టుకొని ,ఆమె శరీరాన్ని స్పర్శించింది మహా లక్ష్మి అమ్మ వారు ..’’కోలాహల రాక్షసుని అస్త్రం చేత బాధింప బద్ద నా శరీరాన్ని నీ స్పర్శ తో స్వాస్త్యం పొందుతున్నాను ‘’అని పలికి , లోపాముద్రను కౌగిలించుకొని ,సౌభాగ్యాలను కారణాలైన ఆభరణాల తో ఆమె ను అలంకరించింది .మహర్షితో ‘’రుషి సత్తమా !నీ తాప కారణం తెలిసింది కాశీ ని వదిలి నందుకు నీ మనసు అమిత బాధ పడుతోంది ,ఏదైనా వరం ఇవ్వాలని ఉంది ‘’అన్నది .దానికి ముని ‘’అమ్మా మహా లక్ష్మీ !వరం ఇవ్వ దలిస్తే మళ్ళీ మాకు కాశి సందర్శన భాగ్యం అనే వరమే ఇవ్వు .ఇంకేమి వద్దు ‘’అన్నాడు .లక్ష్మీ దేవి ‘’తధాస్తు ‘’అని దీవించి స్వస్తత కలిగించింది .’’మహర్షీ !రాబొయె ద్వాపర యుగం లో పందొమ్మిదవ బ్రహ్మ కాలం లో నువ్వు వ్యాసుడవు అవుతావు .మళ్ళీ వారణాసి కి వెళ్లి వేద శాస్త్రాలను పరిష్కరించి ,ధర్మ బోధ చేస్తావు ..ప్రస్తుతం ఇక్కడి నుండి నువ్వు బయల్దేరి వెళ్లి స్కందుని దర్శనం చేసుకో .అతడు నీకు వారణాసి రహస్యమంతా వివరం గా చెబుతాడు .’’ అని చెప్పి ఇద్దరినీ దీవించి పంపించింది .

కాశీ ఖండం –4

తీర్దాధ్యాయం
కొల్హా పుర మహా లక్ష్మీ దేవి సందర్శనం తో పులకించిన అగస్త్య లోపాముద్ర దంపతులు తమకు అమ్మ వారి దర్శనం పరోప కారం వల్ల కలిగిన ఫలం అని భావించారు .అక్కడి నుండి త్రిపురాంతకం చూసి శ్రీశైలం చేరారు .శ్రీ శైల శిఖరం చూసి పునర్జన్మ లేని దాని దర్శనానికి ఆనంద పడ్డారు .;శ్రీ శైల పర్వతం ఎనభై నాలుగు యోజనాల విస్తీర్ణం కలదని భార్యకు తెలియ జేశాడు ముని .లోపాముద్ర భర్త తో ‘’స్వామీ ! భర్త అనుజ్న లేకుండా భార్య యే పనీ చేయ రాదు కదా .ఇక్కడి శిఖరాన్ని చూస్తె పునర్జన్మ లేదు కదా మరి మనకింక కాశీ తో పనేమిటి ?’’అని అడిగింది .దానికి మహర్షి ‘’ఈ విషయాన్ని పూర్వం మహర్షులు చర్చించి కొన్ని నిర్ణయాలు చేశారు .ఆ వివరాలను నీకు తెలియ జేస్తాను .ముక్తి క్షేత్రాలు చాలా ఉన్నాయి .అందులో మొదటిది తీర్ధ రాజం అని పేరు పొందిన ప్రయాగ .ధర్మార్ధ మోక్ష కామాలనిచ్చేది నైమిశారణ్యం .కురుక్షేత్రం ,హరిద్వారం ,ఉజ్జయిని ,అయోధ్య ,మధుర,ద్వారక ,అమరావతి ,సరస్వతీ సాగర సంగమం ,గంగా సాగర సంగమం ,కాంతి త్ర్యయంబకం .సప్త గోదావరీ తీరం ,కాలంజరం ,ప్రభాస తీర్ధం ,బదరికాశ్రమం ,కాశి ,ఓంకారక్షేత్రం ,పురుషోత్తమం ,గోకర్ణం భ్రుగు కచ్చం ,భ్లు తుంగం ,పుష్కరం ,శ్రీ శైలం ,ధారారా తీర్ధం ,మానసతీర్ధం లమొదలైనవి మొక్షాన్నిచ్చేవి .గయా తీర్ధం పితృదేవత లకు మోక్షాన్ని స్తుంది .అక్కడే పితృ పితామహ ప్రపితామహులు తరిస్తారు ‘’అని చెప్పాడు .
అప్పుడు భార్య మానస తీర్ధాన్ని గురించి వివరించ మని కోరింది .అగస్త్యుడు ‘’సత్యం ,క్షమా ,ఇంద్రియ నిగ్రహం ,సర్వ భూత దయ ,నిష్కాపట్యం ,దానం దమం ,శమం సంతోషం అనేవి మానస తీర్ధాలు .వీటన్నిటి తో బాటు బ్రహ్మ చర్యం ,ప్రియ భాషణం ,జ్ఞానం, ధృతి ,తపస్సు కూడా మానస తీర్ధాలే .వీట న్నిటి కంటే ముఖ్యం మనసును పరి శుద్ధం గా ఉంచుకోవటం .తీర్ధాలలో స్నానం స్నానమే కాదు .ఇంద్రియ నిగ్రహం ,మాస పరిశుద్ధత లేకుండా ఎక్కడ స్నానం చేసినా మలినాలు ,,పాపాలు పోవు .మనసు లో మాలిణ్యం లేని వాడే సుస్నాతుడని పిలువ బడుతాడు .దానం తపస్సు శౌచం లేకుండా చిత్తం ప్రశాంతిని నిర్మలత్వాన్ని పొందడు .ఇంద్రియాలను నిగ్రహించి ఉన్న చోటే నైమిశం కురుక్షేత్రాదులు .రాగ ద్వేషాలను వదిలి జ్ఞాన జలములో ధ్యానం చేత పవిత్రుడయ్యే వాడు మానస తీర్ధ స్నానం చేసిన వాడే .ఉత్తమ లోకా లను పొందుతాడు .ఋషులు తిరుగాడిన నెల ,స్నానం చేసిన తీర్ధాలు పుణ్యప్రదాలు ,పరమ పవిత్రాలు .కనుక అక్కడ స్నానం చేస్తే ఉత్తమ లోకం వస్తుంది .తీర్ధాలలో ఉపవాసం చేసి దానాలిచ్చి ,అగ్నమాది క్రతువులు చేయాలి .ఎవరి మనసులో విద్యా తపస్సు కేర్తి ఉంటాయో వారికి తీర్ధ యాత్రలు ఫలిస్తాయి .గర్వం లేని వాడు సత్య భాషి ,దృఢ వ్రతుడు ,సర్వ భూత సముడు పొందే ఫలాన్ని తీర్ధ యాత్ర చేసిన వారు పొందుతారు ..తీర్ధాలకు వచ్చి అక్కడి దేవతలను ముందుగా ప్రార్ధించాలి అప్పుడు స్నానం చేస్తేనే ఫలితం ఉంటుంది .శ్రద్ధ తో తీర్ధ యాత్ర చేస్తే పాప ప్రక్షాళనం జరుగు తుంది .ఇతరుల కోసం తీర్ధ యాత్ర చేస్సిన వాడికి పదహారవ వంతు ఫలం దక్కుతుంది .తీర్ధం లో ఉప వాసం శిరో మున్దనం చాలా ముఖ్య మైనవి .క్షౌరం వల్ల శిరోగత పాపాలు పోతాయి .తీర్ధాలలో శ్రాద్ధం పిండ ప్రదానం చేస్తే పితృ దేవతలు తృప్తి చెందుతారు .తీర్ధ యాత్ర సర్వ సాధక మైనది ..మోక్ష ప్రదాయక మైనది .కాశి ,కంచి ,హరిద్వారం ,అయోధ్య ,ద్వారక ,మధుర ,ఉజ్జయిని మోక్ష పురాలు గా ప్రశిద్ధి చెందాయి .శ్రీ శైలం మోక్షదాయకం అంతకంటే కేదారం గొప్పది ఈ రెంటికంటే .గొప్పది ప్రయాగ. దీనికంటే అవిముక్త క్షేత్రం కాశి మహా గొప్పది కాశిలో చని పోతే మోక్షమే .తీర్ధ కోటికి అందని ముక్తి కాశీ లో లభిస్తుంది ..పూర్వం విష్ణు దూతలు శివ శర్మ అనే అతనికి చెప్పిన విషయాన్ని తెలియ జేస్తా విను ‘’అన్నాడు మహర్షి


అగస్త్యాశ్రమం
దేవతలందరూ వార ణాసి చేరి అయిదు రోజులు నిత్యమ గంగా స్నానం చేస్తూ విశ్వేశ్వర విశాలాక్షీ అన్నపూర్ణా,దుం థిగణపతి ,కాల భైరవులను దర్శించారు .ఆ తర్వాత అగస్త్య ముని ఆశ్రమాన్ని చేరుకొన్నారు ..అగస్త్యుడు తన పేర అగస్త్యేశ్వర స్వామిని స్తాపించి ,జప హోమాలను చేస్తూ పరమేశ్వర ధ్యానం లో భార్య లోపాముద్ర తో గడుపుతున్నాడు .సముద్రాలను తన పురది శిలి లో ఉంచి పానం చేసి నప్పుడు అందులో ఉండే బడ బాగ్ని ఆయన శరీరం లో ప్రవేశించి ,దివ్య కాంతులను వెలువరుస్తోంది .ఆయన తన తపస్సు చే సూర్యుని ప్రకాశింప జేస్తున్నాడు ,అగ్నిని మండింప జేస్తున్నాడు ,ఆయన తపో బలం వల్ల చపలాలు ఆచపలాలుగా మారాయి ..ఆశ్రమం లో క్రూర మృగాల తో సాదు జంతువులు కలిసి మెలుగు తున్నాయి .మహా ప్రశాంతం గా అగస్త్యా శ్రమం ఉన్నది .దుష్ట మృగాలు మాంస భక్షణ మాని పచ్చ గడ్డి మేస్తున్నాయి .కొంగలు చేపలను ,పెద్ద చేపలు చిన్న వాటిని తినటం లేదు .ఆశ్రమంలో‘మాంసం ఎక్కడ ?శివ భక్తీ ఎక్కడ ?మందిర మెక్కడ ?శివార్చనం ఎక్కడ ?మద్య మాంసాలు తిన్న వారికి శంకరుడు దూరం గా ఉంటాడు .శివానుగ్రహం లేక అజ్ఞానం నశించదు ‘’అన్న వాక్యం రాసి అందరికి అహింసా ధర్మాన్ని బోధిస్తోంది .

కాశీ ఖండం -5

సప్త పురి వర్ణనం
అగస్త్య మహర్షి భార్య లోపా ముద్రా దేవికి శివ శర్మ కధను చెప్పటం ప్రారంభించాడు .మధురా నగరం లో శివ శర్మ అనే బ్రాహ్మనుడుండే వాడు. వేద, వేదాంగాలు, సకల శాస్త్రాలు నేర్చి ,సత్పుత్రులను కని వారికి సమానం గా ఆస్తి పంచి ,ముసలి తనం లోకి ప్రవేశించాడు .వయస్సంతా ధన సంపాదన లో ఖర్చు అయి పోయిందని విద్య నేర్వటానికి సరి పోయిందని దైవా రాధనా తీర్ధ యాత్రలు చేయ లేక పోయానని విచారించాడు .దానాలు చేయలేక పోయానని బాధ పడ్డాడు చివరికి తీర్ధ యాత్రలు చేసి జీవితానికి పరమార్ధాన్ని కల్పించుకొంటానని నిశ్చయానికి వచ్చాడు మంచి రోజు చూసుకొని విఘ్నేశ్వర పూజ చేసుకొని ననాందీశ్రార్ధాన్ని నిర్వర్తించి తీర్ధ యాత్రలకు బయల్దేరాడు .
శివ శర్మ మొదట అయోధ్య కు చేరాడు. సరయు నదిలో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అయిదు రాత్రులు ఉండి ,ప్రయాగ చేరాడు. తివేణీసంగమం లో పవిత్ర స్నానం చేసి ,గంగా నది ఇక్కడే కలుస్తుందన్న విషయం తెలిసి కొన్నాడు. ప్రకృష్ట మైన క్షేత్రం కనుక ప్రయాగ అనే పేరొచ్చింది. సప్త పాతాళాలలో వ్రేళ్ళూనుకొని ఉన్న అక్షయ వట వృక్షాన్ని భక్తితో దర్శించాడు . బ్రాహ్మణులకు సమారాధన చేశాడు .ఇది ధర్మార్ధ కామ మొక్షాలనిచ్చే క్షేత్ర రాజం .బ్రహ్మ హత్యా దోషాన్ని కూడా నివారించే శక్తి ఈ క్షే త్రానికి ఉంది .విష్ణు స్థానమైన వేణీ మాధవా న్ని దర్శించాడు .రజో రూపం లో ఉండే సరస్వతి, తమో రూపం లో ఉండే యమునా ,సత్వ రూపం లో ఉన్నగంగా నది ఇక్కడ కలిసి నిర్గుణ బ్రహ్మ రూపాన్ని పొందినాయి . ఈ త్రివేణీ సంగమం బ్రహ్మ లోకానికి నిచ్చెన .ఇది తీర్ధ రాజం ..బిందు మాధవుడు సేవించు కాశీ పట్నం వరుణ ,అసి నదుల మధ్య ఉంది ప్రయాగ నుండి అక్కడికి చేరాడు .మణి కర్ణిక లో స్నానం చేసి విశ్వేశ్వరుడిని దర్శించాడు కాశి ఎప్పటికప్పుడు కొత్తగా కనీ పిస్తుంది .ఉత్తమ ప్రబంధాలలో స్రవించే రసం లాగా కాశి మనోజ్ఞం గా ఉంటుంది. సంసారులకు చింతా మణి వంటిది .ముక్తి లక్ష్మీపీఠ.మణి.ఇక్కడ సకల జీవ రాసులు దేవతల తో సమానం .సప్త క్షేత్రాలలో కాశి ఒరిపిడి రాయి వంటిది .ఇతర క్క్షేత్రాలను దర్శించిన వారు కూడా మళ్ళీ కాశీ కే చేరుకొంటారు .
అక్కడి నుండి శివ శర్మ ఉజ్జయిని వచ్చాడు .తన లీలచే ,ప్రతి కల్పం లోను ప్రళయం చెందే ఈ విశ్వాన్ని చూసి ,చూసి శివుడు మహా కాళుడయ్యాడిక్కడ .లోకం లోని పాపాలను పోగొట్టు తుంది కనుక అవంతి అనీ అంటారు .ప్రతి యుగం లోనుకళలను నింపి కళకళ లాడుతూ కని పిస్తుంది .మహా కాళుని సమీపం లో కోటి లింగాలున్నాయి .హాటకేశ్వరుడైన మహా కాలుడు తారకేశ్వరుడై ఒకే లింగాన్ని మూడు గా భేదించి, మూడు లోకాలను ఆక్రమించాడు. ఇక్కడున్న సిద్ధ వటం వద్ద ఉండే జ్యోతిని దర్శించాడు .’’మహా కాళా ,మహా కాళా’’ అంటూ ఆర్తి గా పిలిస్తే యమ దూతలు దగ్గరకు రారు .ఇక్కడి నుంచి కంచి నగరం చేరాడు .కాంతి నిచ్చేది కనుక దీన్ని కాంతి లేక కంచి అంటారు ఇక్కడ మహా విష్ణువు ను లక్ష్మీ దేవిని సందర్శించాడు .తీర్ధ విధులు నిర్వర్తించి, ద్వారా వతి అంటే ద్వారక చేరాడు అన్ని వర్ణాల వారికి ఇది పుణ్య ద్వారం కనుక ద్వారక అనే పేరొచ్చింది ఇక్కడి సముద్రుడు అనేక యుగాలుగా రత్నాలను సేకరించుకొని రత్నా కరుడయ్యాడు. ఇక్కడ మరణిస్తే వైకుంఠమే చేరుతారు .శ్రీ మహా విష్ణువుకు నిలయం. తర్వాత మాయాపురికి వచ్చాడు .దీనినే హరిద్వారం అంటారు .మోక్షద్వారం అని, గంగా ద్వారం అనీ పిలుస్తారు .కొద్ది కాలం ఇక్కడున్నాడు చలి జ్వరంవచ్చి తీవ్రం గా బాధ పడ్డాడు .సప్తపురీ యాత్ర లను సంపూర్ణం గా చేద్దా మనుకొంటే, ఈ విపత్తు వచ్చిందని బాధ పడ్డాడు .ఎక్కడికి కదల లేక నలభై తొమ్మిది రోజు లు అక్కడే ఉండి మరణించాడు. వైకుంఠ ము నుండి విమానం వచ్చి శివ శర్మ ను విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు .

కాశీ ఖండం –6

యమపురి వర్ణనం
సాధ్వి లోపాముద్ర భర్త అగస్త్య ముని ని ‘’శివ శర్మ హరిద్వారం లో మరణింన్చినా మోక్షం పొందకుండా ,విష్ణు లోకానికి ఎందుకు వెళ్లాడు ?/అని ప్రశ్నించింది .దానికి మహర్షి వివరించి చెబుతున్నాడు .అన్ని క్షేత్రాలు ముక్తి క్షేత్రాలు కావనియు ,దాని గురించిన వివరాలను చెప్పాడు .శివ శర్మ ను యమ లోకానికి తీసుకొని వెళ్లారు ముందుగా విష్ణు దూతలు …అక్కడ విక్రుతాకారులు కన్పించారు .అది పిశాచాలోకమని పాప కర్మలు చేసిన వారు ,పరిశుద్ధ మైన మనస్సు లేని వారు ఇక్కడికి వస్తారని చెప్పారు .ఆ తర్వాతా కొంత దూరం లో మనోహరాకారులు ,శ్యామలాకారులు కనిపించారు .అది గుహ్య లోకమని ,న్యాయం గా డబ్బు సంపాదించిన వారు ఇక్కడికి వస్తారని చెప్పారు .సంపాదించిన డబ్బును దాస్తారు కనుక గుఖ్యక లోకం అంటారు వీరిది దాన ధర్మాలు తెలియవు .సుఖం గా మాత్రం ఉంటారు .బ్రాహ్మణులను పూజించి గోదానం ఇస్తారు .దేవతల్లాగా స్వర్గ సౌఖ్యం పొందుతారు .
కొంత దూరం పోయిన తర్వాతా గాంధర్వ లోకం కని పించింది డబ్బున్న వారిని సంగీతం తో సంతోష పెట్టినవారిక్కడికి వస్తారు ఈ గాంధర్వ విద్య తోనే నారదుడు దేవర్షి అయ్యాడు .వీరంతా శివుని సంతోష పెడతారు .హరి హరుల సమక్షం లో పాడిన వారు మోక్షం పొందుతారు .తర్వాత విద్యాధర లోకం చేరారు .అన్ని విద్యలలో నిష్ణాతులు ఈ లోకం లో ఉంటారు ..ఇంతలో యమ ధర్మ రాజు అనుచర గణం తో అక్కడికి చేరాడు .ఆయన సౌమ్య మైన ఆకారం తో ,తెల్లని వస్త్రాల తో కని పించాడు .యముడంటే అందరు భయ పడతారు కాదా ఇంత సాధువు లాగా ఉన్నాడేమిటి /?అని శివ శర్మకు సందేహం కలిగింది .అప్పుడు విష్ణు దూతలు పాపాత్ములకు యముడు భీకరం గా ,సజ్జనులకు సౌ మ్యుడు గా దర్శన మిస్తాడని ,హరిద్వారం లో చని పోవటం ,ధర్మ శాస్త్రధ్యయనం చేయటం వల్ల శివ శర్మకు మంచి గా కని పించాడని చెప్పారు .(ఒకప్పుడు బళ్ళారి రాఘవ గారు సావిత్రి నాటకం లో సావిత్రి వద్దకు ఆమె భర్త సత్య వంతుని ప్రాణాలను తీసుకొని వెళ్ళే సందర్భం లో ధవళ వస్త్రాల తో చాలా సౌమ్యం గా రంగ ప్రవేశం చేసి నటించారట ,.ఆ నాటకం అయిన తర్వాతా విశ్లేషకులు అలా ఎందుకుఅలా చేశారు అనిఅడిగారట .దానికి రాఘవ –నేను యమధర్మ రాజు గా సతీ సావిత్రి అనే పతీవ్రత దగ్గరకు వస్తున్నాను యముడుధర్మాధర్మాలు తెలిసిన వాడు కనుక ధర్మ రాజు అని పిలువబడుతాడు . మంచి వారికీ మంచి గా, దుష్టులకు భయంకరం గా కనీ పిస్తాడని శాస్త్రాలు చెప్పాయి అని వివ రించారట )..నిజం గా ఆయన పసుపు పచ్చని నేత్రాలు కలవాడు .కోపం తో అవి యెర్ర గా ఉంటాయి .అక్కడున్న వారికి వారి పాపాలననుసరించి శిక్షలు ప్రకటిస్తున్నాడు యమ ధర్మ రాజు .
దుఖితుల దుఖాన్ని పోగొట్టే రాజులు యమ ధర్మ రాజు సభా సదులు గా ఉంటారు .ఉసీనరుడు ,సుధాన్వుడు ,వృష పర్వుడు ,జయద్రధుడు ,రాజ సహస్ర జిత్తు ,దృఢ దానవుడు ,రిపున్జయుడు ,యవనాశ్వుడు ,దంత వక్త్రుడు ,నాభాగుడు ,రిపు మంగళుడు ,కరంధముడు ,ధర్మ సేనుడు ,పరమర్ధనుడు ,పరాన్తకుడు మొదలైన నీతి మంతులైన రాజులు ,ధర్మా ధర్మాలు తెలిసిన వారు సుధర్మ సభ లో ఉంటారు .శివ ,విష్ణు నామాలను సదా జపించే వారు యమునికి దూతలు గా పని చేస్తారు ..వీరు విష్ణు శివ కీర్తనలను చేసే వారి దగరకు పోరాదని యమ శాసనం .యమ ధర్మ రాజు రచించిన ‘’లలిత ప్రబంధం ‘’అనే మహా గ్రంధం నామాన్ని స్మరించే వారికికూడా పునర్జన్మ ఉండదు అని విష్ణు దూతలు శివ శర్మ కు చెప్పినట్లు అగస్త్య ముని లోపాముద్ర కు తెలియ జేశాడు .అక్కడి నుండి విష్ణు దూతలు శివ శర్మను అప్సరలోకానికి ,ఆ తర్వాత సూర్య లోకానికి తీసుకొని వెళ్లారు .ఆలోకాల వివరాలు ఈ సారి తెలుసు కొందాం

కాశీ ఖండం - 7

అప్సరస ,సూర్య లోక వర్ణన
విష్ణు దూతలు శివ శర్మ ను అప్సరస లోకానికి తీసుకొని వెళ్లారు .అక్కడ ద్యూత విద్య లో నేర్పరులు, రసజ్ఞులు అయిన ఆడ వారుంటారు .సమస్త భాషలలో వారు కోవిదులు .క్షీర సాగర మధనం లో జన్మించిన వారు .మన్మ ధుని త్రిభువన విజయాస్త్రాలు వారే .ఊర్వశి ,మేనక ,రంభ ,చంద్ర లేఖ ,తిలోత్తమ ,వపుష్మతి ,కాంతిమతి ,లీలావతి ,ఉత్పలావతి ,అలంబుష ,గుణవతి ,స్థూల కేశి ,కళావతి ,కళానిధి ,గుణనిధి ,కర్పూర తిలక ,ఉర్వార ,అనంగతిలక ,మదన మోహిని,చకోరాక్షి ,చంద్ర కళ ,ముని మనోహర ,గవద్రావ ,తపోద్వేష్టి ,చారునాన ,సుకర్నిక ,దారు సంజీవని ,సుశ్రీ ,క్రమ శుల్క శుభానన ,తపస్శుల్కల్క ,హిమావతి ,పంచాశ్వ మేదిక ,రాజ సూయార్ధిని ,అష్టాగ్ని హోమిక ,వాజపేయ శతోద్భవ ,మొదలైన వారు అప్సరస గణం .వేరి సంఖ్య 6,000 ..ఇతర స్త్రీలు కూడా కొందరుంటారు .వీరంతా లావణ్యం తో ,నిత్య యవ్వనం తో ,దివ్యామ్బరాలతో ఉంటారు .వీరందరూ స్వైరుణులు ,సు సంపన్నులు ..కోరిక తీర్చే వ్రతాలు చేసి ఉద్యాపనాలు చేసిన వారు అప్సరస లోకం కి చేరుకొంటారు .వీరంతా సంగీత నృత్యాలలో అఖండులు .వీరిని దేవ వేశ్యలని అంటారు .సూర్య సంక్రమణం నాడు దానం చేసిన వారు ,’’మొదాత్ ‘’అనే మంత్రాన్ని అనుష్టించి దానాలిచ్చిన వారు ఇక్కడికి చేరుకొంటారు .
తర్వాత సూర్య లోకానికి చేరుకొన్నాడు శివ శర్మ .సూర్య లోక ము తిమ్మిది యోజనాల విస్తీర్ణం కలది .విచిత్రాలైన ఏడు గుర్రాలు ,ఒకే చక్రం ఉన్న రధం పై అనూరుడు సారధి గా సూర్యుడు నిత్య సంచారం చేస్తూంటాడు .క్షణ కాలం లోనే ఆవిర్భావ ,తిరోభావాలను పొందే సూర్యుడు ప్రత్యక్ష వేద పురుషుడు .ఆదిత్యుడే సాక్స్శాత్తుబ్రహ్మ .సూర్యుని వల్లనే సకల జీవరాశులు ఆహారాన్ని సంపాదిన్చుకొంటున్నాయి .ప్రత్యక్ష సాక్షి ,కర్మ సాక్షి .గాయత్రీ మంత్రం తో సకాలం లో వదల బడిన అర్ఘ్యం నశించదు అది మూడు లోకాల పుణ్యాన్ని అందిస్తుంది .సూర్యోపాసన చేసే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ,మిత్ర ,పుత్ర ,కలత్రాలు అష్ట విధ భోగాలు స్వర్గ మోక్షాలు కలుగుతాయి .
ఆస్టా దశ విద్యల్లో మీమాంస గొప్పది .దాని కంటే తర్కం ,దాని కంటే పురాణం గొప్పవి .వీటి కంటే ధర్మ శాస్త్రం ,వాటికంటే వేదాలు వేదం కంటే ఉపనిషత్తులు వీటికంటే గాయత్రీ మంత్రం గొప్పవి .అది ప్రణవ సంపుటి .గాయత్రి మంత్రం కంటే అధిక మైన మంత్రం మూడు లోకాలలోనూ లేదు .గాయత్రి వేద జనని .గాయత్రి వల్ల బ్రాహ్మణులు జన్మిస్తున్నారు .తన మంత్రాన్ని ఉపాశించే వారిని రక్షిస్తుంది కనుక గాయత్రి అని పేరు .సూర్యుడు సాక్షాత్త్ వాచ్యుడు .గాయత్రి సూర్యుని గూర్చి చెప్పే వాచకం .
గాయత్రి మంత్రం చేత రాజర్షి విశ్వా మిత్రుడు బ్రహ్మర్షి అయాడు .గాయత్రియే విష్ణువు ,శివుడు ,బ్రహ్మా .అమ్శుమాలి అని పిలువ బడే సూర్యుడు దేవత్రయ స్వరూపుడు .అన్ని తేజస్సులు దివాకరునిలో ఉన్నాయి .ఆయనే కాల స్వరూపుడు, కాలుడు కూడా .తూర్పున ఉదయించి సమస్త విశ్వాన్ని ధరించే విశ్వ సృష్టికర్త .పడమర దిశ లో సర్వతోముఖుడై కనీ పిస్తాడు . ఉత్తరాయణ ,దక్షిణాయణ పుణ్య కాలాలో షడతీతుల్లో ,విష్ణు పంచకం లో ఎవరు మహా దానం చేస్తారో పిత్రుక్రియలు నిర్వ హిస్తారో ,వారు సూర్య సమాన తెజస్కులై ,సూర్య లోకం లో నివ శిస్తారు .ఆదివారం సూర్య గ్రహణం నాడు దానం చేస్తే ఉత్తమ లోక ప్రాప్తి .
హంసుడు ,భానుడు ,సహస్రామ్శువు ,తపనుడు ,తాపనుడు ,రవి ,వికర్తనుడు వివశ్వంతుడు ,,విశ్వ కర్మ ,విభావనుడు ,విశ్వ రూపుడు ,విశ్వ కర్త ,మార్తాండుడు మిహిరుడు ,అంశు మతుడు ,ఆదిత్యుడు ,ఉష్నగుడు ,సూర్యుడు ,ఆర్యముడు ,బ్రద్నుడు ,ద్వాదశాదిత్యుడు ,సప్త హయుడు భాస్కరుడు ,ఆహాస్కరుడు ,ఖగుడు ,శూరుడు ,ప్రభాకరుడు ,శ్రీ మంత్ర్హుడు ,లోక చక్షువు ,గ్రహేశ్వరుడు ,త్రిలోకేశుడు ,లోక సాక్షి ,తమోరి ,శాశ్వతుడు ,శుచి ,గభస్తి ,హస్తాంషుడు ,తరణి ,సుమాహారిణి ,ద్యుమణి ,హరిదాశ్వుడు ,అర్కుడు ,భాను మంతుడు ,భయ నాశనుడు ,చందోశ్వుడు ,వేద వేద్యుడు ,భాస్వంతుడు ,పూషుడు ,వృషాకపి ,ఏక చక్ర ధరుడు ,మిత్రుడు ,మందేహారి ,తమిశ్రఘ్నుడు ,దైత్యఘ్నుడు ,పాప హర్త ,ధర్ముడు ,ధర్మ ప్రకాశకుడు ,హీళి,చిత్రభానుడు ,కలిఘ్నుడు ,తార్ష్య వాహనుడు ,దిక్రుతి ,పద్మినీ నాభుడు ,కుశేషయ కారుడు ,హరి ,ఘర్మ రశ్మి ,దుర్ని రీక్షుడు ,చందాంశువు ,కశ్యపాత్మజుడు ,అనే డెబ్బది రెండు పేర్లు సూర్యునికి ఉన్నాయి .ఇందులో ప్రతి నామం మొదట ఓం అని చేర్చి ,ఉచ్చ రిస్తూ ,సూర్యుని చూస్తూ నమస్కరిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగు తుంది .రెండు చేతులతో ఎర్రగా తోమిన రాగి చెంబు నిండా నిర్మల మైన జలాన్ని నింపి మోకాళ్ళ పైన భూమి మీద కూర్చుని, గన్నేరు పూలు ,రక్త చందనం ,గరిక ,అక్షతలు ఆ పాత్రలో ఉంచి ,స

కాశీ ఖండం –8

ఇంద్ర ,అగ్ని లోక వర్ణనం
శివ శర్మను ఇంద్ర లోకానికి తీసుకొని వెళ్లారు .విశ్వ కర్మ తన తపో బలం తో దీన్ని నిర్మించాడు పగలే వెన్నెల అక్కడ .చంద్రుడు ఎక్కడ తిరిగినా తన ప్రేయసి అయిన వెన్నెల ను ఇక్కడ ఉంచి వెడతాడు .చింతా మణి అన్ని టిని క్షణం లో తయారు చేస్తుంది కనుక నేతగాల్లు బంగారపు పని వారు మొదలైన వారుండరు ..అన్నీ ఇచ్చే కామ ధేనువు ఉందికనుక వంట వాళ్ళు ఉండరు .ఇంద్ర పదవి ఉత్కృష్ట మైనది .నూరు అశ్వ మేదాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుంది .అర్చిష్మతి ,సమయమని ,పుణ్య వతి ,అమలా వతి ,గంధవతి ,అలక ,ఈశాన్య లోకం స్వర్గం తో సమానం .ఇంద్రుడిని సహస్రాక్షుడు ,దివస్పతి ,శతమన్యుడు అనీ పిలుస్తారు .నారదాది మహర్షులు తరచు వచ్చి ఆశీర్వదిస్తారు .అన్ని లోకాలకు స్తైర్యం ,ధైర్యం ఇంద్ర లోకమే .మహేంద్రుడు ఓడిపోతే మూడు లోకాలు ఒడి పోయినట్లే .రాక్షసులు ,మనుష్యులు ,గంధర్వ,యక్షులు ఇంద్ర పదవికోసం ఘోర తపస్సు చేస్తారు .నూరు యాగాలు భూలోకం లో చేసి జితెన్ద్రియుడైన వారికి ఇంద్ర పదవి దక్కుతుంది యుద్ధం లో వీర మరణం పొందిన వారు ఇక్కడికే చేరుతారు .ధర్మ నిర్ణయం చేసే వారికి కూడా భోగ భూమి
అగ్ని హోత్రుని నగరమే అర్చిష్మతి .అగ్ని దేవుడిని నిష్ఠ తో ఉపాశించిన వారికి ఈలోకం దక్కుతుంది .శీతా కలం లో చలి బాధను తట్టుకొనలేక పోయే వారికి కట్టెలను దానం చేసిన వారు ,ప్రతి పౌర్ణమి నాడు ఇష్టులు ఆచరించే వారు ఇక్కడ నివ సహిస్తారు .అనాధ ప్రేతకు అగ్ని సంస్కారం చేసినా ,దాన్ని ప్రోత్స హించినా అగ్ని లోక ప్రాప్తి ఖాయం .గురువు ,దేవుడు ,వ్రతము ,తీర్ధము ,అన్నీ అగ్ని దేవుడే .అన్ని వస్తువులు అగ్ని స్పర్శ తో పవిత్రమవుతాయి .అందుకే అగ్నికి పావనుడు అని పేరొచ్చింది .శివ శర్మ విష్ణు దూతలను ‘’అగ్ని దేవుడు ఎవరు? /అని ప్రశ్నించాడు దానికి వారు సవివరం గా సమాధానం చెప్పారు .
నర్మదా నదీ తీరం లో విశ్వానరుడనే శివ భక్తుడున్నాడు .శాండిల్య గోత్రజుడు ,జితేంద్రియుడు బ్రహ్మమ తేజశ్వి ఆశ్రమ ధర్మాలను చక్కగా పాటించి ,అనుకూల వతి అయిన భార్యను తెచ్చుకొన్నాడు అతిధి సత్కారాలు చేస్తూ కపటం లేకుండా కాలం గడిపాడు అతని భార్య శుచిష్మతికి చాలా కాలం సంతానం కలుగ లేదు .ఒక రోజు ఆమె భర్తను సమీపించి ,గృహస్తులకు ఉచిత మైన తత్వాన్ని తనకు బోధించ మని కోరింది .దానికి ఆయనతాను ఆమెకు అన్నీ సమకూర్చాను కదా ఇంకా ఏమైనా కావాలంటే కోరుకో మన్నాడు .ఆమె మహేశ్వరుని తో సమాన మైన పుత్రుని ప్రసాదించమని అర్ధించింది .ఆయన అలానే అని చెప్పి కాశీ నగరం చేరాడు .రోజూ గంగా స్నానం నిత్యం విశ్వేశ్వరాది దేవ దర్శనం చేశాడు ..తన భార్య కొరికి వెంటనే తీరాలి అంటే యే లింగాన్ని అర్చించాలి అని ఆలోచించాడు అక్కడ కాలేషుడు ,వృద్ధ కాలేషుడు ,కలశేశ్వరుడు ,కామేషుడు ,చందేషుడు ,జ్యేష్టేషుడు ,త్రిలోచనుడు ,జంబు కేషుడు ,జైగీషుడు ,దశాశ్వ మేధ ఘట్టం లోని ఈశ్వర లింగం ,చండీషుడు ,ద్రుక్కేషుడు ,గరుదేషుడు ,గోకర్నేషుడు ,గనేశ్వరుడు వీటిలో దేన్నీ అర్చిన్చాలనే సందేహ కలిగింది ఆ తర్వాత ఆతని దృష్టిలో గౌరీశ లింగం ,ధర్మేష లింగం ,తారకేశ్వర లింగం ,సర్వేశ్వర లింగం ,ప్రతీశ లింగం ,ప్రీతి కేశ్వర లింగం ,పర్వతేశ్వర ,బ్రహ్మేశ ,అధ్యమేశ్వర ,బృహత్పతీశ్వర ,విభాన్దేశ్వర ,భార భూతేశ్వర ,మహాలక్ష్మీశ్వర ,మరుటేశ ,మొక్షీశ ,గంగేశ ,నర్మదేశ్వర ,మార్కండేయేశ్వర ,మణి కర్నేశ ,రత్నేశ ,సిద్దేశ్వర ,యామునేశ ,లాంగావీశ ,విశ్వేశ ,అవిముక్టేశ ,విశాలక్ష్మీశ ,వ్యాఘ్రేశ్వర ,వరాహేశ్వర ,వ్యాశేష ,వృషభధ్వజేశ ,వరుణేశ ,విదేశ ,వసిష్టేశ ,శానైశ్చరేశ ,ఇంద్రేశ ,సంగమేశ ,హరిశ్చంద్రేశ ,హరికేశ్వర ,త్రిసందీశ ,మహాదేవ ,శివ ,భవానీశ ,కపర్దీశ ,కందుకేశ ,మక్షేశ్వర ,మిత్రా వరుణేశ ,లో ఎవరు తన కోర్కె తీరుస్తారని మీమమాంస పడ్డాడు .
చివరకి సిద్దేశ్వర లింగాన్ని పూజిస్తే సకల సిద్ధ కలుగు తుందని భావించాడు .అక్కడే వీరేశ్వర లింగం ఉందని గ్రహించాడు .ఇదే ఉక్తమైన లింగం అని నిర్ణయించుకొన్నాడు .దీనినే పూర్వం వేద శిరుడు అనే మహర్షి శత రుద్రీయ అభి షేకం చేసి సశరీర లింగైక్యం పొందాడని జ్ఞాపకం చేసుకొన్నాడు అలాగే జయద్రధుడు ,విదూరుడు మున్నగు వారికోర్కేలను తీర్చింది ఈ లింగమే అని భావించాడు అనేక రకాలైన నియమాల తో నిష్టతో వీరేశ్వర లింగాన్ని అభిషేకిస్తూ దీక్ష గా సేవించాడు .అతని తీవ్ర తపస్సుకు మెచ్చి బాల మహేశ్వరుడు ప్రత్యక్ష మై వరం కోరుకోమన్నాడు .ఆయన్ను పరి పరి విధాల స్తుతించి తనకు ఈశ్వరుని తేజస్సు గల కుమారుని ఇవ్వ మని కోరాడు ..శివుడు ‘’నేను నీ భార్య సుచిష్మతి గర్భాన ‘’గృహ పతి’’గా జన్మిస్తున్నాను . అతడు దేవతలకు ప్రీతీ కల్గిస్తాడు ‘’తవ పుత్రస్య మేష్యామి ,శుచిష్మత్యాం మహా మతే –ఖ్యాతో గృహ పతి ర్నామనా ,శుచిహ్ సర్వామర ప్రియః ‘’అనే శ్లోకాన్ని ఎవ్వరు శ్రద్ధ గా ప ఠిస్తారో వారికి శివుని వంటి కుమారుడు కలుగుతాడు ‘’అని ఆశీర్వా దించి అంతర్దానమైనాడు .ఈ కధను లోపాముద్రకు అగస్త్యుడు చెప్పాడు

కాశీ ఖండం –9

గృహ పతిజననం
లోపాముద్రా దేవికి అగస్త్యముని బ్రహ్మ లోక వివరాలను తెలియ జేస్తున్నాడు .దానికి ప్రారంభం గా విశ్వానర ,శుచిష్మతి దంపతులకు శివుని వరం గా సంతానం కలిగిన విషయాన్ని చెబుతున్నాడు .చంద్రుడు ఉత్తమ నక్షత్రం లో ఉండగా ,గురుడు కేంద్రం లోఉన్నప్పుడు శుచిష్మతికి ఒక పుత్రుడు జన్మించాడు .ఆ సమయం లో ముల్లోకం లోని జనులు’’గంధధ వాహా ,గంధ వాహా ‘‘’అని ఉచ్చరించారు .అప్పుడు ఆకాశం లోని మేఘాలు ఉత్తమ వాసనలను వర్షించాయి .దేవ దుందుభులు మ్రోగాయి .అంతా నిండి ఉన్న తమస్సు హరించింది .రజోగుణం నాశనమై ,సాత్వికత ఆవ రించింది .అప్పుడు దేవ వేశ్యలైన అప్సరలందరూ ఆడుతూ పాడుతూ నృత్యాలు చేశారు .అంతటా ఆనందం తాండ వించింది .మరీచి,అత్రి ,పులహుడు ,పులస్త్యుడు ,క్రతువు ,అంగిరసుడు ,వసిష్టుడు ,కశ్యపుడు ,విభాన్దుడు ,లోమషుడు ,చరనుడుడు ,భరద్వాజుడు ,గౌతముడు ,భ్రుగువు ,గాలవుడు ,గర్గుడు ,జాత కర్ణుడు ,పరాశరుడు ,ఆపస్తంభుడు ,యాజ్ఞ వల్క్యుడు ,దక్షుడు ,వాల్మీకి ,ముద్గలుడు ,శాతాతపుడు ,లిఖితుడు ,శిలాదుడు ,శంఖుడు ,జమదగ్ని ,సంవర్తుడు ,మాతంగుడు ,భరతుడు ,అంశుమంతుడు ,వ్యాసుడు ,కాత్యాయనుడు ,కుత్సుడు శౌనకుడు ,సుశ్రుతుడు ,శుకుడు ,రుష్యశ్రుమ్గుడు ,దుర్గాషుడు ,రుచి ,నారదుడు ,తుంబురుడు ,ఉత్తంకుడు ,వామ దేవుడు ,చ్యవనుడు ,ఆశితుడు ,దేవతలుడు ,శాలంకాయనుడు ,హారీతుడు ,విశ్వామిత్రుడు ,భార్గవుడు ,మృకండుడు ,దాల్భ్యుడు ,ఉద్దాలకుడు ,ధౌమ్యుడు ,ఉపమన్యువు ,వత్సుడు ,మొదలైన మునీశ్వరులు ,ముని కన్యలు అక్కడికి చేరారు .బ్రహ్మ ,బృహస్పతి ,విష్ణువు ,నంది భ్రుగులతో శంకరుడు గౌరీదేవి ,దేవేంద్రునితో దేవతలు ,పాతాల వాసులగు నాగులు విలువైన మణులను తెచ్చారు .వీరంతా ఆకాశం లో వెన్నెల లా వ్యాపించారు బ్రహ్మ దేవుడు దగ్గరుండి జాత కర్మ జరిపించి ,,’’ఆగ్నే గృహ పతే ‘’అనే వేదోక్త మంత్రం చేత అందరు ఆశీర్వా దించి ,మళ్ళీ తమ ప్రదేశాలకు వెళ్లి పోయారు .
మంచి తేజస్సు ,వర్చస్సు గల ఆ శిశువు ను అందరు పొగిడారు .ఆ తల్లిదండ్రుల భాగ్యమే భాగ్యం అన్నారు’గృహ పతి ‘’అని నామ కారణం చేశారు . నాల్గవ మాసం లో అన్నప్రాశన ,ఏడాదిన్నరకు చూడా కర్మ చేశారు .శ్రవణా నక్షత్రం లో కర్ణ వేధ జరిపించారు .అయిదవ ఏడు న ఉపనయనం చేశారు ,ఉపా కర్మ కూడా చేసి వేద విద్యనునేర్పించటం ప్రారంభించారు తలిదంద్రులైన విశ్వానరుడు శుచిష్మతి దంపతులు .వేదం ప్రారంభించిన మూడేళ్లలో పద,క్రమాదులు పూర్తీ చేశాడు బాలుడు .గురుముఖతా నామ మాత్రమె నేర్చి ,స్వయం కృషి తో వేద విశారదుడని పించుకొన్నాడు ..నారద మహర్షి వీరి ఆశ్రమానికి వచ్చి కుమారుడైన గృహ పతిని చూసి ,అతని వినయానికి ముచ్చట పడి ,తన ఒడిలో కూర్చో బెట్టుకొన్నాడు ..అతని శరీర లక్షణాలను పరీక్షించాడు దేవముని .దారం తో అతని శరీరావయవాలను కొలిచాడు. అడ్డమూ ,నిలువు కలిపి నూట ఎనిమిది అంగులున్నాడని చెప్పాడు .ఇలాంటి లక్షణం పృధివీ పతికే ఉంటుందని తెలిపాడు అతని అవయవాలలో అయిదు సూక్ష్మాలుగా ,అయిదు దీర్ఘాలుగా ,ఏడు రక్తాలుగా ,ఆరు ఉన్నతాలుగా ,మూడు విశాలం గా ,అయిదు సూక్ష్మాలుగా గంభీరాలుగా ఉన్నాయని తేల్చాడు .ఇలా 32అవయవాలు ఉండాలని సూచించాడు .దీర్ఘావయవాల వల్ల దీర్ఘాయువు కలుగుతుంది .రెండు భుజాలు రెండుకళ్ళు ,దవడలు మోకాళ్ళు ,ముక్కు పొడవుగా ఉండాలి .మెడ ,పిరుదులు ,పురుషాంగం పొట్టి గా ఉండాలి .ధ్వని నాభి గంభీరం గా ఉండాలి .చర్మం కేశాలు వ్రేళ్ళు ,పళ్ళు, వ్రేళ్ళ యందలి పర్వాలు, జానువులు సూక్ష్మం గా ఉండాలి ఇలా ఉంటె దిక్పాలకుడవుతాడు .వక్షస్తలం పొట్ట ,ముంగురులు భుజాలు నోరు చేతులు ఉన్నతం గా ఉంటె ఐశ్వర్య సంపన్నుడవుతాడు .అరచేతులు ,కంటి కొసలు ,దవడలు నాలుక ,కింది పెదవి గోళ్ళు ఎర్రగా ఉంటె రాజ్యాధి పత్యం వస్తుంది .నుదురు నడుము వక్షస్తలం ,విశాలం గా ఉంటె మహా తేజశ్వి అవుతాడు .పిరుదులు తాబేటి చిప్ప లాగా కఠినం గా ఉండి ,చేతులు కాళ్ళు కోమలం గా ఉంటె రాజ్య హేతువులు .కనిష్టిక నుండి తర్జని వరకు అవిచ్చిన్నం గా వ్యాపించిన రేఖ ఉంటె దీర్ఘాయుస్సు .పాదాలు బలం గా ఎర్రగా ,మడమలు చెమట లేకుండా ,బలిష్టం గా ఉంటె ఐశ్వర్య చిహ్నం .హస్త రేఖలు తక్కువ ఉంటె సుఖాన్ని ఎక్కువ గా పొందుతాడు .పురుషావయవం పొట్టిగా ,సన్నగా ఉంటె రాజ రాజే అవుతాడు .పిరుదులు ,పిక్కలు గుండ్రం గా ఉండి,ఎర్రగా దక్షినా వర్తం గా ఉంటె మహాదైశ్వర్య వంతుడవుతాడు వృషణాలు విశాలం గా, పుష్టితో ఉంటె సుఖ వంతుడు .చేతులలో శ్రీ వత్సము ,వజ్రము ,చక్రము ,తామర పూవు ముత్యము ,కొదంతము ,దండ ధారణం మొదలైన రేఖ లుంటే ఇంద్రాది పత్యమే వస్తుంది .ముప్ఫై రెండు పళ్ళు ,భుజం మెడ శంఖా కారం లో ఉండి హంస మేఘ ధ్వని లా స్వరం ఉంటె సర్వేశ్వరుడే అవుతాడు .తేనె కళ్ళున్న వాడికేప్పుడు దరిద్రం కలుగదు .ముఖం మీద అయిదు రేఖలుండి ,సింహం నడుము ఉంటె శుభాలే అన్నీ .పాదాలలో ఊర్ధ్వ రేఖలు పద్మ గంధం వాసన గల నిట్టూర్పులు ఉండి ,సందులేని చేతులు,మంచి గోళ్ళున్న వాడు మహా లక్షణాలు కల చంద్రుని లా విధిని జయిస్తాడు .అని నారదుడు వివ రించి తలి దండ్రులకు చెప్పి ,పన్నెండో ఏడు ‘’విద్యుదగ్ని ‘’వల్ల బాలుడైన వైశ్వానరునికి అంటే గృహ పతికి గండం ఉంటుందని హెచ్చ రించి వెళ్లి పోయాడు .

కాశీ ఖండం – 10

గృహ పతి అగ్ని దేవుడుగా మారటం
తమ పుత్రుడు గృహ పతికి అరిష్టం సంభవించే సూచనలున్నాయనినారద మహర్షి చెప్పి నందుకు తలిదంద్రులైనవిశ్వానరుడు ,సుచిష్మతి తీవ్ర అందోళనపడ్డారు .అదే విషయం ఒకరికొకరు చెప్పుకొంటూ నిద్రలోనూ పలవరిస్తున్నారు .శివుని తలచుకొంటూ మార్కండేయుని మరణాన్ని ఆపావు నువ్వు మ్రుత్యున్జయుడవని అందరు అంటారు మాకీ శిక్ష ఏమిటి అని వాపోయారు .ఒక రోజు కొడుకు అర్ధ రాత్రి తలి దండ్రుల రోదనకు మెలకువ వచ్చి దుఖానికి కారణం అడిగాడు .,వారు వివరం గా చెప్పారు .అతడు ‘’వరాకినిని , చంచల మైన పురుగు ఏమి చేయ గలదు ?నేనిప్పుడే ప్రతిజ్ఞచేస్తున్నాను .మీ కుమారుడి నైన నేను నా మృత్యువుకు కారణ భూతం అవుతున్న విద్యుద్వహ్ని ని నాశనం చేస్తాను ‘’అన్నాడు .వారా మాటకు పరమ సంతోష పడ్డారు ..శివుని మహిమలను గుర్తు చేశారు .శ్వేత కేతువు కాల పాశ బద్ధుడైతే త్రిపురాన్తకుడైన శివుడే రక్షించాడని ,పాల సముద్ర మధనమప్పుడు పుట్టిన హాలాహలాన్ని కంఠము లో దాచి లోకాలను రక్షించాడని మూడు లోకాల సంపదను హరించి విర్ర వీగిన అందకాశురుడిని హత మార్చాడని బ్రహ్మాదులను సైతం తన కంటి చూపు తో భయ పెట్టె మన్మ దుడిని మూడోకంటి తో భస్మం చేసి, అనంగుడిగా చేశాడని శివుడు బ్రహ్మ ఇంద్రాది దేవతలకే అది పతి అని చెప్పి శివుని శరణు వేడి అనుగ్రహం పొందమని హితవు చెప్పారు కుమారుడైన గృహ పతికి
గృహపతి వెంటనే బయల్దేరి కాశీ పట్నం చేరాడు .అది గంగా నది మణి హారం లాగా ప్రకాశిస్తోంది తెల్లని మంచుతో కప్పబడి సత్వ గుణ లక్షణం తో కనీ పించింది మణి కర్ణికా ఘట్టం చేరి గంగా స్నానం తో పునీతుడై ,విశ్వేశ్వర దర్శనం చేసుకొన్నాడు ఆజ్యోతిర్లిన్గాన్ని దర్శించి ధన్యుదయాడు .మూడు లోకాల సారమంతా ఈ లింగాకారం లో ఉంది .క్షీర సముద్రం నుండి ఆవిర్భా వించిన అమృత భాండమిది .బ్రహ్మానంద దాయకం .నిరాకార బ్రహ్మం సాకారం గా విశ్వేశ్వర లింగం లో కనీ పిస్తుంది .బ్రహ్మాండ భాండం లోని రత్న సమూహామీ లింగం .మోక్ష వృక్షం యొక్క తియ్యని ఫలం .మోక్షం అనే మల్లికా కుసుమాల మాల .మోక్ష ధనాన్ని చేకూర్చేది .సంసారం అనే చీకటి ని పోగొట్టే వజ్రాయుధమైన సూర్య బింబం .కళ్యాణ రమణి అలంకరించుకొన్న శృంగారపు అద్దం .దేహ దారుల సమస్త కర్మ బీజాలను పండించే బీజ పూరం .విశ్వం లోని కర్మ బీజాల నన్నిటిని లయం చేసి ,మోక్షమిచ్చే విశ్వ లింగం ..తన అదృష్టం నారద మహర్షి హెచ్చరిక వల్ల తాను కాశీ చేరి ఇంత మహాద్భుత శివ లింగాన్ని దర్శించగలిగానని సంబర పద్డాడు విశ్వేశ్వరుని అభిషేకం చేసి ,నీలోత్పలాల తో పూజ చేశాడు .
ఒక శివ లింగాన్ని ప్రతిష్ట చేసి ,కంద మూలాలను తింటూ రోజూ వెయ్యి ఎనిమిది పుష్పాలతో పూజిస్తూ ఆరునెలల పది హేను రోజులు గడిపాడు .రాలిన ఆకులను మాత్రమె భక్షిస్తూ ,జలం మాత్రమె త్రాగుతూ మరో ఆరు నెలలు ఆ శివలింగానికి పూజ జరిపాడు .ఇలా రెండు సంవత్స రాలు తీవ్ర ధ్యానం చేశాడు .అప్పుడు అతనికి పన్నెండవ ఏడు వచ్చి ,నారదుడు చెప్పిన గండం సమీపించింది
వజ్రాయుధం తో ఇంద్రుడు వచ్చి గృహ పతి ఎదుట ప్రత్యక్ష మైనాడు .వరం ఇస్తాను గ్రహించామన్నాడు .గృహ పతి ‘’నీ వరం నాకక్కర లేదు .నాకు వరం ఇవ్వాల్సిన వాడు శంకర మహా దేవుడొక్కడే ‘’అని కరా ఖండీ గా చెప్పాడు .దేవేంద్రుడు ‘’నా కంటే శంకరుడు అంటూ వేరే లేడు .నేనే దేవ దేవుడిని వరం కోరుకో ‘’అన్నాడు గృహ పతి‘’అహల్యా జారుడివి నువ్వు .నేను పశు పతిని తప్ప వేరొకరి నుండి వరాన్ని గ్రహించను ‘’అని చెప్పేశాడు .కోపా వేశం తో ఇంద్రుడు వజ్రాయుధం ఎత్తిఆ బాలుని మీదకు వచ్చాడు .ఆ హఠాత్ సంఘటనకు పశుపతి మూర్చ పోయాడు .వెంటనే మహా శివుడు ప్రత్యక్షమై బాలుని శరీరాన్ని స్పృశించాడు .బాలుడు లేచి కూర్చున్నాడు .శ్రుతి వాక్యాలు ,గురు వాక్యాల వల్ల వచ్చింది శివుడని గ్రాహించాడు . ఆ ఆనంద పార వశ్యం లో ఆయనకు నమస్కరించటం ,స్తోత్రం చేయటమే మర్చి పోయాడు .అప్పుడు గౌరీ పతి గృహ పతి తో ‘’ఇంద్రుడిని వజ్రాయుధం చూసి నువ్వు భయ పడ్డావు ..అది కాని ,యముడు కాని నిన్నేమీ చేయలేరు .నేనే ఇంద్రుని రూపం లో వచ్చి నిన్ను భయ పెట్టాను .నేను నీకు వరమిస్తున్నాను .ఇప్పటి నుంచి నువ్వు ‘’అగ్ని ‘’అనే పేరుతో పిలువబడతావు .నువ్వు దేవతలకు ముఖం గా ఉంటావు .అన్ని జీవ రాసుల జఠ రాలలో నివ శిస్తావు .దేవేంద్ర ,యమధర్మ రాజుల మధ్య ఉన్న దిక్కుకు నువ్వు అధిపతివి అవుతావు .నువ్వు స్తాపించిన ఈ లింగం ‘’అగ్నీశ్వరుడు ‘’అని పిలువ బడ తాడు ఈ లింగం అన్ని లింగాల కంటే తెజస్వంత మైనది .దీన్ని అర్చించిన వారికీ విద్యుత్ వల్లా ,అగ్ని వల్లా భయం ఉండదు .అగ్ని మాన్ద్యభయం ఉండదు .అకాల మరణం రాదు .సర్వ సమృద్దినిస్తుంది నీ భక్తులు ఎక్కడ మరణించినా అగ్ని లోకం చేరతారు .తిరిగి కాశీ నగరం వచ్చి ,కల్పాంతం లో మోక్షాన్ని పొందుతారు .అగ్నీశ్వరుని అర్చించిన వాడు అగ్ని లోకం చేరుతాడు .అతని పితృ దేవతలు కూడా తరిస్తారు ‘’అని చెప్పి శంకరుడు అదృశ్యమైనాడు .గృహపతి అయిన అగ్ని తల్లి దండ్రులు చూస్తుండగానే దేవ విమానమెక్కి ఆగ్నేయ దిశకు వెళ్ళాడు .శివుడు అగ్నిని ఈ దిశకు అది పతి గా అభిషేకించాడు శివుడు ఆగ్నేయ లింగం లో ప్తతిష్టిత మై, భక్తుల కోర్కెలను తీరుస్తున్నాడు .ఈ విషయాలన్నీ విన్న శివశర్మ ,భర్త అగస్త్యముని వల్ల విన్న లోపాముద్రా దేవి పరమానందం అనుభవించారు.

కాశి ఖండం మిగతా బాగములు

01 to 10

11 to 20

21 to 30

31 to 40

41 to 50

51 to 60

61 to 70

Web hosting

owlImg.img.name image