ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

 సాయి పురోహితాలయము

Excel To HTML using codebeautify.org ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
జననం కర్నూలు జిల్లాలోని రూపనగుడి
మరణం ఫిబ్రవరి 22, 1847
మరణ కారణము ఉరి
ఇతర పేర్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
ప్రసిద్ధి బ్రిటిషు వ్యతిరేఖ తిరుగుబాటుదారుడు
మతం హిందూ మతం
భార్య / భర్త ముగ్గురు భార్యలు. పెద్దభార్య సిద్దమ్మ
పిల్లలు దొర సుబ్బయ్య
తండ్రి పెదమల్లారెడ్డి

రేనాటి చరిత్ర

బ్రిటీషువారు దక్షిణ భారతదేశంలో అడుపెట్టినప్పుడు ఇక్కడ నిజాం నవాబు, మైసూర్‌ ను పరిపాలించే హైదర్‌ ఆలి బలమైన నాయకులుగా ఉండేవారు. వారికి సంబంధించిన వాళ్లందినీ ఓడించి మద్రాసు ను బేస్ చేసుకుని దక్షిణాదిన బ్రిటీష్‌ వాళ్లు పాలన చేపట్టారు. బ్రిటీష్ వాళ్లకు సాయం చేయడంతో నిజాం నవాబుకు కొన్ని ప్రాంతాలు ఇచ్చారు. ఆయన ఆధీనంలో ఉన్న కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి ప్రాంతాలను పాలెగాండ్లు చూసుకునేవారు. ఈ క్రమంలో కడప జిల్లాలోని జమ్మలమడుగు, కర్నూలు జిల్లా లోని కోయిలకుంట్ల వరకు ఉన్న భూభాగాన్ని చెంచురెడ్ల వంశానికి చెందిన నొస్సం పాలేగాండ్లు పాలించేవారు. వీరి వంశీయుల్లో ఒకరే జయరామిరెడ్డి.

‘సైసైరా నరసింహారెడ్డి... రెడ్డీ... నీ పేరే బంగారపు కడ్డీ...’ అంటూ జానపద శైలితో, ప్రజానోళ్లలో జాలువారే ఇలాంటి పాటలెన్నో ఆయన వీరత్వానికి ప్రతీకగా నిలు స్తాయి. బ్రిటీషువారి దాష్టీకాన్ని ప్రశ్నించి, వారిపై సాగిం చిన మడమ తిప్పని పోరాట పటిమను కళ్లముందు సాక్షాత్కరింపజేస్తాయి. కుంఫిణీ (ఈస్టిండియా కంపెనీ) వారి కుటిల కుతంత్రాలపై కన్నెర్రజేసి కత్తిదూసి కదన రంగంలోకి దూకిన తొలితరం యోధుని రూపాన్ని ఆవి ష్కరిస్తాయి. వెయ్యి ఏనుగులనైనా నిలువరించే బ్రిటీషు సైన్యానికి... ఆ ఒక్కపేరు చెబితేనే సింహ స్వప్నం. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే తిరుగుబాటు చేసిన ఈ యోధుని పేరు చరిత్రలో అంతగా కనిపించదు. అయితేనేం.. రేనాటి సీమలో ఏ ఇంట అడిగినా ఆయన వీరత్వాన్ని వివరిస్తారు. రాలసీమ పౌరుష పతాకంపై చెరగని గుర్తు.. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. ఉరికొయ్య ఎక్కేముందుకూడా తొడగొట్టి మీసం మెలేసి, పరాక్రమాన్ని వీలునామాగా రాసిపోవెళ్లిన ధీరుడు.

రేనాటి చరిత్ర...

బ్రిటీషువారు దక్షిణ భారతదేశంలో కాలుమోపిన 1750 ప్రాంతంలో ఇక్కడ బలమైన పాలకులు ఒకరు నిజాం నవాబు, మరొకరు మైసూర్‌ పాలకుడు హైదర్‌ ఆలి. హైదర్‌ ఆలిని ఓడిస్తే దక్షిణాన పాగా వేయవచ్చని బ్రిటీషువారు యుద్ధం చేశారు. హైదర్‌ ఆలి కుమారుడు టిప్పుసుల్తాన్‌ ఆంగ్లేయులను పలుమార్లు ఓడించి తరిమే శాడు. చివరికి మరాఠా పీష్వా, నిజాం నవాబు సహ కారంతో నాల్గవ మైసూర్‌ యుద్ధం (1799)లో టిప్పు సుల్తాన్‌ సైన్యాన్ని బ్రిటీష్‌వారు ఓడించారు. టిప్పును చంపి రాజ్యాన్ని ముగ్గురూ పంచుకున్నారు. కర్ణాటకలోని కొంతప్రాంతం మరాఠా పీష్వాలకు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు నిజాం నవాబుకు దక్కాయి. మద్రాసు కేంద్రంగా దక్షిణాదిన బ్రిటీష్‌ పాలన ఆరంభమైంది. నిజాం నవాబు ఏలుబడిలోకి వచ్చిన కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి ప్రాంతాల్లో పాలెగాండ్లు స్థానిక పాలకులు. ఒక్క పాలెగాని కింద వంద నుంచి రెండు వందల గ్రామాలు ఉండేవి. ఈ వ్యవస్థను బలోపేతం చేసిన వారు విజయనగర రాజులు. పాలెగాండ్లు వారి సామంతులు.

నొస్సం పాలెగాండ్ల చరిత్ర..

కడప జిల్లాలోని జమ్మలమడుగు, కర్నూలు జిల్లా లోని కోయిలకుంట్ల వరకు ఉన్న భూభాగాన్ని చెంచురెడ్ల వంశానికి చెందిన నొస్సం పాలేగాండ్లు పాలించేవారు. వీరి వంశీయుల్లో ఒకరు జయరామిరెడ్డి. విజయనగర రాజుల కాలం నుంచి పాలన సాగిస్తున్న ఈయన మన్రో హయాంలో బ్రిటీషువారిని ఎదురించి బంధీ అయ్యాడు. నొస్సం బ్రిటీషువారి వశమైంది. ఆయనకు భరణం ఏర్పా టు చేశారు. జయరామిరెడ్డి కొడుకుకు సంతానం లేకపో వడంతో, అతని సోదరి కుమారుడు ఉయ్యాలవాడ నర సింహారెడ్డికి భరణం అందేది. ఆయన జన్మించింది రూప నగుడిలో. పెరిగింది ఉయ్యాలవాడలో. భరణం అందు కుంటూ ఉంటున్నది నొస్సం కోటలో. పాలించే అధికారం లేకపోయినా జయరామిరెడ్డి వంశీయుల ప్రభావం ఆ ప్రాంతంలో ఏమాత్రం తగ్గలేదు. ప్రజలు వారి కుటుం బాన్ని గౌరవభావంతో, ఆదరాభిమానాలతో చూసేవారు. అప్పటికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వయసు సుమా రు నలభై ఏళ్లు. ఆయనకు బ్రిటీషు వారి నుంచి నెలకు రూ.11 భరణం అందేది.

ఆత్మాభిమానానికి ప్రతీక నరసింహారెడ్డి..

వంశానుసారంగా అందాల్సిన భరణం విషయంలో జరిగిన ఓ చిన్న సంఘటన నరసింహారెడ్డిలోని ఆత్మాభి మానాన్ని దెబ్బతీసింది. తన ప్రాంతంపై పెత్తనం చెలా యిస్తూ, దేశాన్ని కొల్లగొడుతున్న బ్రిటీషు వారిపట్ల ఆయ నకు అప్పటికే ఉన్న కోపం, కసి, పగ, ద్వేషం తారా స్థాయికి చేర్చింది. నాటి కోవెలకుంట్ల తహసీల్దారు రాఘవాచారి నరసింహారెడ్డికి చెల్లించాల్సిన భరణం విషయంలో అవహేళనగా మాట్లాడి ఆయనలో కోపావేశాలు పెరిగేలా చేశాడు. నరసింహారెడ్డి పంపిన అనుచరుడితో ‘ముష్టి తీసుకునే వాడికి మరోక ముష్టివాడా..? అతను బ్రిటీషు వారి నుంచి భరణం తీసుకుంటూ బ్రిటీషు వారికి శిస్తు కట్టొద్దని చెబుతున్నాడట. ఆ ముష్టివాడినే రమ్మను.. ఇస్తా భరణం’ అని చెప్పి పంపడంతో నర సింహారెడ్డిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. వెంటనే ఏకంగా ‘ట్రెజరీనే కొల్లగొల్లడతాను. నీ ప్రాణాలు తీస్తాను. చేతనైతే రక్షించుకో..’ అంటూ లేఖరాసి పంపిం చాడు. దీంతో తహసీల్దారు అప్రమత్తమై, ట్రెజరీలోనే ఉండిపోయాడు.

రక్షణగా కొంత బ్రిటీషు సైన్యాన్ని ఏర్పా టు చేసుకున్నా... నరసింహారెడ్డి చెప్పిన మాట ప్రకారం 1846 జూలై 10న మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ కోవెలకుంట్లలోని ట్రెజరీపై తన అనుచరులతో దాడి చేశాడు. రెడ్డి అనుచరుల కత్తులు స్వైర విహారం చేశాయి. ఎదురొచ్చిన మిలిటరీ సైన్యాన్ని మట్టుబెట్టి, తనను అవహేళనగా మాట్లాడిన తహసీల్దారు రాఘవాచారి శిరస్సు ఖండించాడు నరసింహారెడ్డి. ట్రెజరీ అధికారి థామస్‌ ఎడ్వర్టుకి గుండుగీయించి, ‘నీ బ్రిటీషు అధికారు లకు దమ్ముంటే మరుసటి రోజు సాయంత్రం నయనా లప్ప వద్ద కలుసుకోమను’ అని చెప్పి, ఎనిమిది వందల అయిదు రూపాయల పది అణాల నాలుగు పైసలను కొల్లగొట్టుకెళ్లి బ్రిటీషు సైన్యానికి సవాలు విసిరాడు.

నొస్సం కోటపై బ్రిటీషువారి తొలి దాడి

తహసీల్దార్‌ రాఘవాచారిని నరసింహారెడ్డి చంపిన విషయం తెలుసుకున్న నాటి కడప కలెక్టర్‌ కాక్రేన్‌ ఆగ్ర హోదగ్రుడయ్యాడు. వెంటనే సైన్యాన్ని తీసుకొని నొస్సం కోటపై దాడి చేయాలని బళ్లారిలోని బ్రిటీషు బ్రిగేడియర్‌ జనరల్‌ వాట్సన్‌ను ఆదేశించాడు. అప్పటికే స్థానికులకు తోడు అవుకు రాజు నారాయణరాజు పరివారం, ఆయుధ సామగ్రిని సిద్ధం చేసుకున్నాడు నరసింహారెడ్డి. కోట చుట్టూ కందకాలు తవ్వించాడు. శుత్రుసైన్యం వేగంగా నడవకుండా కోట చుట్టూ పొలాలను తడిపించాడు. కోటను ఎక్కడానికి ప్రయత్నించేవారిపై సలసల కాగే నూనెను కుమ్మరించే ఏర్పాట్లు చేశాడు. మేలురకం శతఘ్నులు సిద్ధం చేసుకున్నాడు. 1846 జూలై 23న బ్రిటీషు సైన్యం నొస్సం కోటపై దాడికి వచ్చింది. గుండె లు జలధరింపజేసే పోరాటం.. బ్రిటీష్‌ సైన్యం చావుకేకల తో భీతావహ వాతావరణం ఏర్పడింది. నరసింహారెడ్డి తెలివితేటల ముందు బ్రిటీష్‌ సైన్యం మట్టికరిచింది. ప్రాణభయంతో పారిపోతున్న వాట్సన్‌ తలను ఒక్కవేటు తో నరికేశాడు నరసింహారెడ్డి.

అడుగడుగునా యుద్ధ తంత్రాలు

నరసింహారెడ్డికి అనుక్షణం అండగా నిలిచిన గురువు గోసాయి వెంకన్న. ఆయన మాటే రెడ్డికి వేదవాక్యం. బ్రిటీషువారిపై సాధించిన విజయాన్ని చూసి పొంగిపో కూడదని, బ్రిటీషు సైన్యం అత్యంత పెద్దదైనందున రక్షణ కోసం మకాం మార్చాలని సూచించాడు. దీంతో వనవిహా రం నిమిత్తం నల్లమల అడవుల్లో కట్టించిన వన దుర్గంలో కి నరసింహారెడ్డి తన అనుచరులతో మకాం మార్చారు. అక్కడి సమీపంలోని రుద్రవరం గ్రామంలో ప్రజలు వంట చెరకు, పశువులకు గడ్డికి అడవిపైనే ఆధారపడ్డారు. పీటర్‌ అనే ఫారెస్ట్‌ అధికారి ప్రజల నుంచి బలవంతంగా రుసుం వసూలు చేసేవాడు. ఆడవాళ్లు అడవిలోకి వెళితే బలా త్కారం చేసి చంపేసేవాడు. ఆ ఊరిలోని రైతు నాయకు డు జంగం మల్లయ్య ద్వారా విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి పీటర్‌ను వెంటాడి వేటాడి చంపాడు. దీంతో రుద్రవరంతో పాటు, కంభం చుట్టు పక్కల గ్రామాలన్నీ పండుగ చేసుకున్నా యి. నరసింహారెడ్డిపై పల్లె పదాలు, కోలాటపు గేయాలు పుట్టుకొచ్చాయి. బ్రిటీషు అధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది.

నరసింహారెడ్డి తలపై రూ.10 వేల బహుమతి

కర్నూలులో తుంగభద్ర తీరం వద్ద ఉన్న బ్రిటీషు ప్రభుత్వ తాలుకా కార్యాలయంలో కడప కలెక్టర్‌ కాక్రేన్‌ అధ్యక్షతన వాట్సన్‌ స్థానంలో నియమితుడైన కెప్టెన్‌ నార్టన్‌, కర్నూలు కెప్టెన్‌ రసెల్‌, మిలిటరీ కమాండింగ్‌ ఆఫీసర్‌ జోసఫ్‌, గవర్నర్‌ ఏజెంట్‌ డానియెల్‌ సమావేశ మయ్యారు. నరసింహారెడ్డిని ఒక్కడిని చేసి పట్టుకోవాల ని, అతని తలపై రూ.10 వేలు బహుమతి ప్రకటించి ప్రజల్ని ప్రలోభపర్చాలని ఈ సమావేశంలో నిర్ణయించు కున్నారు. ఆ మర్నాడే బ్రిటీష్‌ అధికారులు ఒక ప్రకటన చేశారు. ‘రాజద్రోహి నరసింహారెడ్డి స్థావరం, ఆచూకి తెలిపిన వారికి రూ.5 వేలు బహుమానం, అతన్ని సజీ వంగా లేదా నిర్జీవంగా పట్టి తెచ్చినవారికి రూ.10 వేలు బహుమానం కలెక్టర్‌ కాక్రెన్‌ దొరవారు ఇస్తారు. వీరులై న వారు నరసింహారెడ్డిని పట్టిచ్చి బహుమానం అందు కోండహో’’.. అంటూ తప్పెటతో చాటింపు వేయించారు.

నొస్సం కోటను కూల్చిన బ్రిటీష్‌ ప్రభుత్వం

ప్రజల్లో భయాన్ని కలిగించి నరసింహారెడ్డిని మట్టు బెట్టవచ్చనే ఉద్దేశంతో కెప్టెన్‌ నార్టన్‌ నొస్పం కోటను ఫిరంగులతో కూల్చేశాడు. ఈ విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకున్న నరసింహారెడ్డి కంటతడి పెట్టాడు. రాయికి రాయి చేర్చి నిర్మించిన నొస్సం కోటను కోల్పోవడం సొంత బిడ్డను కోల్పోయినట్లు భావించాడు. ఇదే సంద ర్భంలో ఎట్టి విషమ పరిస్థితుల్లోనూ తమ స్థావరం ఆచూకీ తెలియజేయకూడదని గోసాయి వెంకన్న ప్రతిజ్ఞ చేయించాడు. నరసింహారెడ్డిని బ్రిటీషు అధికారులకు పట్టించాలని రుద్రవరం తహసీల్దార్‌ శ్రీనివాసరెడ్డి పన్నాగం పన్నాడు. సమీపంలోని దువ్వూరు గ్రామపెద్ద రోశిరెడ్డితో ఎల్లమ్మ జాతరకు సన్నాహాలు చేయించాడు. రోశిరెడ్డి నరసింహారెడ్డికి స్నేహితుడే కావడం వల్ల ఆయ నను కోడిపందేలకు ఆహ్వానించాలని కోరాడు. ఈ ఆహ్వా నాన్ని మన్నించి జాతరకు విచ్చేసిన నరసింహారెడ్డిని మట్టుబెట్టాలని యత్నించగా నరసింహారెడ్డి తెలివిగా తప్పించుకున్నాడు.

సాటి పాలెగాళ్ల మద్దతు

అవుకు నారాయణరాజుతో పాటు మార్కాపురం జాగిర్దారు, వెంకట క్రిష్ణయ్య, అనంతపురం జమిందారు పడకంటి వీరస్వామి, చిత్తూరు జాగిర్దార్‌ శివస్వామి చౌదరి, కర్నూలు నవాబు పాపాఖాన్‌ తదితరుల మద్ద తు సమకూర్చుకున్నాడు నరసింహారెడ్డి. బ్రిటీష్‌ పాలకు లపై తిరుగుబాటు మరింత ఉధృతం చేసేందుకు సహకారం కావాలని కోరారు.

ఆచూకి చెప్పింది బంధువే..

ఉయ్యాలవాడ జాగీర్దార్‌ పెద్దమల్లారెడ్డి కుటుంబాని కి నెలకు రూ.70 భరణం బ్రిటీషు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో సగం సోదరుడు చిన్న మల్లారెడ్డికి పోయేది. పెద్ద మల్లారెడ్డి ముగ్గురు కుమారుల్లో చివరి వాడు నరసింహారెడ్డి. ప్రజల్లో తన తమ్ముడికి ఉన్న ఆదరాభిమానాలు చూసి ఈర్ష్య పెంచుకున్నాడు మల్లా రెడ్డి. తమ్ముడిపై కక్ష సాధించేందుకు వీక్షిస్తుండగా కడప కలెక్టర్‌ కాక్రేన్‌ నుంచి అతనికి వర్తమానం అందింది. కాక్రేన్‌ పథకం పలించింది. కోటలో పాగా పడింది. అత ను అందించిన ఉప్పు మేరకే నరసింహారెడ్డిని పట్టుకో వడానికి మార్గం సులువైంది. నరసింహారెడ్డి భార్యా పిల్లల్ని బందించి కడప పట్టణంలోని లాల్‌ బంగ్లాలో పెట్టాడు. తన అనుమతిలేనిదే లోనికి ఎవ్వరినీ వెళ్లనీయ వద్దని బంగ్లా అధికారులను ఆదేశించారు. నరసింహారెడ్డి కి సాయం చేయకుండా కడప నవాబు మహమ్మద్‌ ఇబ్ర హీం, కర్నూలు నవాబును బంది చేశాడు. నరసింహారెడ్డి తన భార్య దొరసాని సుబ్బమ్మ, కొడుకు దొర సుబ్బయ్య ను విడిపించుకు నేందుకు వస్తాడని కాక్రెన్‌ ఎత్తుగడ వేశాడు. అయితే ఓ అర్ధరాత్రి బంగ్లా అధికారి గుండెలపై కత్తి పెట్టి నరసింహారెడ్డి తన భార్య, బిడ్డలను ధైర్యంగా తీసుకెళ్తున్న దృశ్యాన్ని నివ్వెరపోయి చూడడం కాక్రేన్‌ వంతైంది.

ప్రజలపై హింస..

నరసింహారెడ్డిని ధైర్యంగా ఎదుర్కోవడం, యుద్ధ విద్యలతో పట్టుకోవడం సాధ్యం కాదని బ్రిటీష్‌ అధికారు లకు అర్థమైంది. ఏ ప్రజల కోసమైతే జీవిస్తున్నాడో వారిని హింసించడం ద్వారా నరసింహారెడ్డిని లొంగదీసు కోవచ్చని పన్నాగం పన్నారు. రెడ్డి ని ఆరాధించే 60 గ్రామాలపై సైనికుల దాడి జరిగింది. పిల్లాజెల్లా.., గొడ్డూ గోదా.. ఎవరినీ వదల్లేదు. అనుమా నం ఉన్న ప్రతివారిని పటు ్టకుని ‘నరసింహారెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పు’ అంటూ హింసించారు. కండకుష్టి గల యువకులను బంధీలుగా పట్టుకెళ్లారు. స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ రాక్షస చర్య అంతా నర సింహారెడ్డి సోదరుడు మల్లారెడ్డి సలహా మేరకే జరిగిం ది. ఇవన్నీ తెలుసుకున్న నరసింహా రెడ్డి ప్రజలకోసం స్వచ్ఛందంగా లొంగిపోవడానికి సిద్ధపడ్డాడు.

అంతిమ పోరాటం..

1856 అక్టోబర్‌ 6 చరిత్రలో మరపురాని ఘట్టం లిఖితమైంది. నరసింహారెడ్డి ఆచూకిని కనుగొన్న బ్రిటీష్‌ సైన్యం అతన్ని బంధించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. నరసింహారెడ్డి, ఆయన అనుచరులు ఉంటున్న గుట్టను చుట్టుముట్టింది. కలెక్టర్‌ కాక్రేన్‌ నరసింహారెడ్డి లొంగిపోవాలని గట్టిగా హెచ్చరికలు జారీ చేశాడు. నార్టన్‌ సైన్యం కొండపైకెక్కడానికి ప్రయత్నించగా నరసింహా రెడ్డి సైన్యం ఎదురొడ్డింది. ఈ తరుణంలో నార్టన్‌ నరసింహారెడ్డి తుటాకు బలయ్యాడు. నరసింహారెడ్డి సైన్యం తక్కువగా ఉండటం, కుంఫిణీ సేన ఎక్కువగా ఉండటంతో పరిస్థితి చేజారింది. బ్రిటీష్‌వారు క్షణక్షణం సైన్యాన్ని పెంచుకుంటూ పోవడంతో వారిని నిలువరించడానికి నరసింహారెడ్డికి చాలా సమయం పట్టింది. వెంట తెచ్చుకున్న తూటాలన్నీ అయిపోగా చివరికి కత్తి పట్టి సైనికు ల మధ్య చొరబడి సింహనాదం చేశాడు. బ్రిటీష్‌ సైనికులు నరసింహారెడ్డిని బాగా గాయపరిచారు. దెబ్బతిన్న పులిని చివరకు సైన్యం పట్టుకుంది.

కోవెలకుంట్ల కోట గుమ్మానికి నరసింహారెడ్డి తల

నరసింహారెడ్డిని విచారించిన బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు ఉరిశిక్ష విధించింది. జుర్రెటి ఒడ్డున ఉరి తీస్తున్నట్లు చాటింపు వేయించింది. రాయలసీమ వాసు లంతా తమ దొరను చివరిసారిగా చూసుకొనేందు కు కోయిలకుంట్లకు ప్రయాణం కట్టారు. ప్రతి పల్లె నుంచి జనం తరలివచ్చారు. 1847 ఫిబ్రవరి 22 తెల్లవారుజామున కచేరి జైలు ద్వారం తెరుచుకుంది. కుంఫిణీ సైనికుల వెంట ఒక్కో అడుగు వేస్తూ బయటకు వచ్చిన తమ పాలెగాడు నరసింహారెడ్డిని చూడగానే జనసంద్రం పొంగిపొర్లింది. దొర నరసింహారెడ్డికి జై అంటూ నినాదాలు హోరెత్తాయి. నరసింహారెడ్డి కళ్లు చెమ్మగిల్లాయి. తన ఉద్యమం ఇంత టితో మరణించదు, ఎప్పటికీ జీవించే ఉంటుంది అని జనానికి అభివాదం చేస్తూ జుర్రెటి ఒడ్డుకు సాగిపోయాడు. ఒడ్డుకు పదడుగుల దూరానా నిలువెత్తు పాతిన ఉరికొయ్యలను ఎక్కి చిరునవ్వుతో మరణయాత్ర సాగించాడు. తిరుగుబాటుదార్లకు హెచ్చరికగా నరసింహా రెడ్డి తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి ఇనుపసంకెళ్ల మధ్య వేలాడదీశాడు బ్రిటీష్‌ వారు. 1877 వరకు మూడు దశాబ్దాల పాటు నరసింహారెడ్డి శిరస్సు అలా వేలాడుతూ ఉండిపోయింది.

we trustfinity

1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్యయుద్ధానికి పదేళ్ళముందే బ్రిటిష్ దుష్టపాలనపై తిరుగుబాటుజెండా రెపరెపలాడించిన స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

1857 సిపాయిల తిరుగుబాటుకు భారతదేశ మధ్యయుగ చరిత్రలో ఎంతో కీలకపాత్ర ఉంది. సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో జరిగింది. సిపాయిల తిరుగుబాటు కంటే ముందుగా ఆంగ్లేయులపై తిరుబాటు చేసిన పాలేగార్లకు గురించి చరిత్రకారులు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఉయ్యాలవాడ గురించి పూర్తిగా తెలిసిన వారు అతి కొద్దిమందే ఉన్నారు.

1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకడు. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు. ఈయన పాలెగార్ మనవడు.

విజయనగర రాజులు తళ్ళికోట యుద్ధంలో బహమని సుల్తానుల చేతిలో ఓడిపోయారు. సామంతులుగా వుండిన పాలెగాళ్ళు తమ కత్తికి అడ్డం లేకుండా నియంతల వలె వ్యవహరింపసాగారు. రాజులమని గొప్పగా విర్రవీగేవారు.

పాలెగాళ్ళు

18వ శతాబ్దపు తొలిదినాల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్ళుండేవారు.నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది.

ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు, నొస్సం జమీదారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.

నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వలన తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి.

నరసింహారెడ్డి తల్లి నీలమ్మ ఉయ్యాలవాడ నగరికాపు అయిన పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమేదారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్నకూతురు. నరసింహా రెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొర సుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య పేరమ్మ వలన ఒక కూతురు, మూడవ భార్య ఓబులమ్మ వలన ఇద్దరు కుమారులు జన్మించారు.

తిరుగుబాటు

1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తహసిల్దార్, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.

1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకున్నాడు.ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది.

తరువాత జూలై 23న తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదుచేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించింది.

వీరమరణం

నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.[1]

కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

ITIs

ITIs

సైసైరా నరసింహారెడ్డి!

palegadu

The importance of history is two folds. One is to draw the awesome inspiration of the heroes born before us. The other one is to learn to cultivate the virtues leading to soliderity and prosperity of a nation, and how to avoid the defects leading to contrary results.

– పుల్లెల రామచంద్రుడు గారు రాజతరంగిణి గురించి రాస్తూ అన్న మాటల సారాంశం అది. ఆయన చారిత్రకుడు కారు కానీ చరిత్రకు ఒద్దికైన పాఠకుడు, అనుశీలి అనుకోవచ్చు. ఆయన అన్న ఆ మాటలు ఏ కొంచెం ప్రామాణికత ఉన్న చారిత్రక రచనకైనా వర్తిస్తాయి.

**********

నేటి రాయలసీమ ప్రాంతాల్లో ఓ సామెత/నుడికారం ఉన్నది. “పోవేయ్, పెద్ద పాలేగాడు తయారయినాడు”. ఇతర ప్రాంతాల వారికి, ఇదేదో తిట్టులా తెలుస్తున్నా, కొంచెం విచిత్రమైన, వింతయిన మాట. అయితే ఆ ’పాలెగాడు’ అన్న మాట వెనుక కొంచెం బరువైన చరిత్రే ఉంది. అందుకనే ఏమో, ’పాలెగాడు’  అన్న ‘పేరు’ మీదే ఎస్.డి.వి. అజీజ్ గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటచరిత్రను నవలగా రచించారు. ఈ చరిత్ర క్రీ.శ. 1846 లో మొదలయ్యింది. అంటే – ప్రథమస్వాతంత్రపోరాటానికి పదకొండు సంవత్సరాలకు ముందు.అప్పటికి  ఆ ప్రాంతాలకు ’రాయలసీమ’ అన్న శబ్దం స్థిరపడలేదు. అప్పటికది ’రేనాడు’.  విజయనగర సామ్రాజ్యపు రాజులు ఆ రేనాటిసీమలో 100 లేదా 200 గ్రామాలకు గుత్తగా ఓ అధికారిని పర్యవేక్షణకై నియమించారు. ఆ అధికారిని పారుపత్తెందారు లేదా ’పాళెయగారు’ అనేవారు. పాళెయగారు- పాలేగారు – పాలేగాడు అయింది. ఆ పాలేగాళ్ళలో కొందరు తాము రాజుకన్నా గొప్పగా అధికారులమన్నట్టు భావించేవారు. అలా ఆ సామెత పుట్టుకొచ్చింది.

అయితే ఆ ‘పాలేగాడు’ కు నిస్వార్థ పోరాట చరిత్ర కూడా ఉంది.

క్రీ.శ. 17 వ శతాబ్దం తర్వాత కుంఫిణీ ప్రభుత్వం భారతదేశంలో ఒక్కొక్క సంస్థానాన్ని లోబరుచుకుంటూ వస్తూంది. క్రీ.శ. 1799 లో టిప్పుసులతాను మరణించాడు. ఆ యుద్ధం తర్వాత రేనాటి సీమ, దుట్టుపక్కల ఇతర ప్రాంతాలు నిజాం నవాబుకు దక్కింది. ఆపై క్రీ.శ. 1800 అక్టోబరు 12 న నిజాం – సీమను బ్రిటీషు వారికి లీజికు ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతాలు సీడెడ్ డిస్తిక్ట్స్ గా పిలువబడుతూ వచ్చాయి.  ఆపైన బ్రిటీష్ ప్రభుత్వం 80 మంది పాలెగాళ్ళను కుట్రతో గుత్తికోటలో బంధించి లొంగదీసుకుంది. ఆ పైన భూమి శిస్తుకు తట్టుకోలేక కర్నూలులో తెర్నేకల్లు గ్రామస్తులు తిరుగుబాటు చేసి అమరులయ్యారు. 1839లో కర్నూలు నవాబు వాహబీ తిరుగుబాటు చేస్తే ఆంగ్లేయులు కుట్రతో అతణ్ణి బంధించారు. ఆ నేపథ్యంలో కర్నూలు జిల్లా కోయిలకుంట్ల, కడప జమ్ములమడుగు మధ్యన ఉన్న అరవై గ్రామాలకు చెంచురెడ్ల వంశానికి చెందిన జయరామిరెడ్డి పాలేగారు. ఇతణ్ణి నొస్సం పాలేగారు. ఇతని నివాసం నొస్సంకోట. ఈ పాలేగారుకు సంతానం లేకపోవడంతో – అతని మేనల్లుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అధికారం దక్కింది. నరసింహారెడ్డి – రూపనగుడిలో పుట్టాడు. జయరామిరెడ్డి ఆంగ్లేయులకు లొంగిపోయింది. ఆ ప్రభుత్వం అతనికి కేవలం 11 రూపాయల తనర్జీ (భరణం/నెలజీతం) ఏర్పాటు చేసింది. ఇది ఆ సంస్థానానికి ఏ మాత్రం చాలని భరణం.

ఆ నేపథ్యంతో మొదలైన నవల యిది.

 

*************

నరసింహారెడ్డి మీద రాయలసీమలో వీథిగాయకులు పాడుకునే జానపదగీతం ఒకటి ఉంది. దాన్ని ’రాయలసీమ రాగాలు’ అన్న పుస్తకంలో మల్లిక్ గారు ప్రచురించారు. అది ఇలా సాగుతుంది.

సైరా నరసింహారెడ్డి

నీ పేరే బంగార్పూకడ్డీ

 

రాజారావు తావుబహద్దరు నారసింహారెడ్డి

రెడ్డి కాదు బంగార్పుకడ్డి నారసింహారెడ్డి

ముల్ కోల్ కట్టె సేతిలో ఉంటే మున్నూటికీ మొనగాడు

రెడ్డి మాటలు ఏదాలురా రాండి సూరులారా (సైరా)

 

మొనగాండ్రకు రేనాటి గడ్డరా – రోషగాండ్రకు పెద్ద పేరురా

దానధర్మములు దండిగ జేసే – పురిటిగడ్డలో పుట్టినావురా

కల్వటాల దండదిగో రా సై – ముక్క ముళ్ళ దండదిగోరా సై

సంజామల దండదిగోరా సై – కానాల దండదిగోరా సై (సైరా)

….

….

బానిసగుండి పాయసం తాగుట మేలుకాదురన్నా

పచ్చులలాగా బతికితె రెండే గింజలు మేలన్నా (పచ్చులలాగా = పక్షులలాగా)

బయపడి బయపడి బతికేకంటే సావే మేలన్నా

ఈరుడు సచ్చిన జగతిలొ ఎప్పుడు బతికే ఉండన్నా (సైరా)

 

నరసిమ్మా అని దూకినాడురా రణంలోన రెడ్డి

తెల్లోలందరి కుత్తుకలన్ని కోసినాడు రెడ్డి

“కోబలీ” యంటా తెల్లసర్కరును నరికెను దండంత

గడ్డ కోసము సావో బతుకో తేల్చుకున్నరంత (సైరా)

 

(పూర్తి పాటకై తెలుగు అకాడెమీ వారి ’రాయలసీమ రాగాలు’ పుస్తకం చూడగలరు)

 

*************

narasimhaఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ – క్లుప్తంగా.

1846, జూలై పది.

కర్నూలు కోవెలకుంట్లలో బ్రిటీషోల్ల ట్రెజరీ కొల్లగొట్టి అక్కడి సైనికులను చంపి భీభత్సం సృష్టించాడు రెడ్డి. అతని పేరు బయటకు వచ్చింది. జూలై 26 న బ్రిటీషు వాళ్ళు లెఫ్టినెంట్ వాట్సన్ అనే వాణ్ణి, సైన్యాన్ని నొస్సంకోటకు పంపారు. భయంకరమైన యుద్ధం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. అయినా సరే, వాళ్ళ  సైన్యం రెడ్డి అనుచరుల చేతిలో చచ్చింది. వాట్సన్ యుద్ధంలో అంగవికలుడై పారిపోయాడు.

అక్కడి నుంచి రెడ్డి, ఆకుమళ్ళ గోసాయి వెంకన్న, ఓబన్న ..ఇలా నలుగురైదుగురు సహచరులతో,  నల్లమల అడవులకు స్థావరాన్ని మార్చినాడు. అక్కడ పీటర్స్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేవాడు. వాడు అక్కడ చెంచు వాళ్ళను తెగ హింసలు పెడుతున్నాడు. రెడ్డి అతణ్ణి చంపేశాడు. ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది.

బ్రిటిష్ వాళ్ళు ఇంగ్రిస్ అనే వాణ్ణి స్ట్రాటెజీ కోసం, కాక్రెన్ అనే వాణ్ణి ఫీల్డు మార్షల్ గా పెట్టి పథకం ఆలోచించారు. రెడ్డి తలకు పదివేల వరహాలు బహుమతి ప్రకటించారు. ఆ బహుమతి కాశపడి శ్రీనివాసరావు అనే వాడు (రుద్రవరం) రెడ్డి ఆనవాళ్ళు తెల్లవాళ్ళకు అందించాడు. కోళ్ళ పందేలు నడుస్తుండగా రెడ్డిని మాయోపాయంతో బంధించదల్చుకుంటే – ప్రజలే తిరగబడి, రాళ్ళతో కొట్టి చంపారు. రెడ్డి పట్టుబడలేదు. ఆంగ్లేయులు భంగపడ్డారు.

ఆపై ఆంగ్లేయులు నరసింహారెడ్డి తమ్ముని వరస అయిన మల్లారెడ్డికి ఆశ చూపి లోబరుచుకున్నారు. అతని ద్వారా నరసింహారెడ్డిని లోబరుచుకుందామనుకున్నారు. ప్రయత్నం బెడిసి కొట్టింది. నరసింహారెడ్డి భార్యాపిల్లలను బంధించారు. అదీ విఫలమయ్యింది. అతను అపూర్వ శౌర్యసాహసాలతో వారిని విడిపించుకుంటాడు రెడ్డి. చివరకు ఆంగ్లేయులు రెడ్డి ప్రాణస్నేహితులైన ఓబన్నను, గోసాయి వెంకన్నను వేరు చేసి చంప ప్రయత్నించారు. ఈ ప్రయత్నం పూర్తీగా ఫలించకపోయినా వారిద్దరూ గాయపడ్డం జరుగుతుంది.

ఆపై రెడ్డి ఎర్రమలకు వెళ్ళాడు. బ్రిటిష్ వాళ్ళు నాలుగు వైపులా ముట్టడి జరిపారు. ఆ యుద్ధంలో రెడ్డి బ్రిటీషు వాళ్ళను చాలామందిని చంపాడు. వాట్సన్ కూడా మరణించాడు. చివరకు దొరికాడు. అతని కాళ్ళు, చేతులకు సంకెళ్ళేసి కోవెలకుంట్లకు తెచ్చి విచారించి ఉరి తీశారు. (1847 ఫిబ్రవరి 6).

ఇది అజీజ్ గారు రచించిన నవల వృత్తాంతం చాలా క్లుప్తంగా. ఈ కథలో ఇక్కడ చెప్పని వివరాలు నవలలో చాలా ఉన్నాయి.

*************

నరసింహారెడ్డి చేసిన యుద్ధాలను, ఆంగ్లేయుల కపటోపాయాలను, స్థానిక సాంప్రదాయాలను, స్థానిక ప్రదేశాల వివరణనూ, ఆ నాటి భారతదేశ పరిస్థితినీ వివరిస్తూ రచించిన నవల యిది.

ఈ కథను పాపులర్ నవల లా రచించినా, అజీజ్ గారు – స్థానిక సాంప్రదాయాలు, సంస్కృతినీ చాలా లోతుగా వివరించేరు. ’బూతపిల్లి’, పెద్దమ్మ దేవర వంటి విషయాల వివరణ విస్మయకరంగా ఉంటుంది. ఆరంభంలోనే ’పొలికేక’ అన్న శబ్దం – దానివెనుక స్థానిక సాంప్రదాయాల వివరణ విశదంగా, కథలో భాగంగా ఉంది. ఈ జాతరలు, గ్రామ సాంప్రదాయాలు తెలియని వారికి, ఆ నేపథ్యం కాస్త ’భీభత్సం’ ఎక్కువయినట్టు అనిపించవచ్చు కానీ ఇవి చరిత్రలో భాగం. చారిత్రక నవల – ఇలా నిక్కచ్చి గానే ఉంటేనే బాగు. అలవి మాలిన వర్ణనలు గుప్పించి పేజీలు పెంచే ప్రయత్నాలు లేవు ఈ చారిత్రక రచనలో. చివరన ఆయా ఘట్టాలకు చెందిన ఫుటోలను జోడించారు.

ఒకట్రెండు సందర్భాల్లో బ్రిటీషు అధికార్ల గురించి కాస్త హాస్య ధోరణిలో వ్రాశారు. ఎన్నదగిన లోపం కాదు కానీ చారిత్రక రచనలో ఇటువంటివి అంత బాగోవని ఈ వ్యాసకర్త వ్యక్తిగత అభిప్రాయం.

ఈ నవలకు కళాప్రపూర్ణ. డా. కొండవీటి వెంకటకవి ముందు మాట రాశారు.

చరిత్రలో ఎందరో వీరులు కులమతాలకతీతంగా స్వాతంత్రోద్యమంలో పోరాడి అసువులు బాశారు. అయితే కొందరి పోరాట చరిత్ర మాత్రమే బాగా ప్రచారం కావడం జరిగింది. అది విచారకరం అని ప్రస్తావిస్తూ అజీజ్ గారి మాటలు అక్షరాలా నిజం.

తెలుగునాట పుట్టిన విప్లవవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద విస్తృతమైన రచనలు లేవు. ఉన్నా ప్రాచుర్యం లేదు. ఈ నేపథ్యంలో మరుగుపడిన ఈ మహావీరుని చరిత్ర గురించి ఆసక్తి గలవారికి ఈ నవల తప్పక నచ్చుతుంది.

http://saarangabooks.com/