ఉగాది

Image result for ugadi 2018 greetings in telugu

ఉగస్య ఆది: ఉగాది: - "ఉగ" అనగా నక్షత్ర గమనము - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' 'ఉగాది'. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది.

'యుగము' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది.

ఉగాది - వసంతములకు గల అవినాభావ సంబంధము, మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపము.భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.

ఉగాది పుట్టుపూర్వోత్తరాలు

వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'

ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు. అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరుపొందింది.

హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.. ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది.ఆ సంవత్సరము లోని మంచి చెడులను, కందాయ ఫలములను, ఆదాయ ఫలములను, స్ధూలంగా ఆ ఏడాదిలో తమ భావిజీవిత క్రమము తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోటానికి ఇష్టత చూపుతారు.ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు.

ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది.రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ మన ఉగాది-పర్వదినం.

గోదావరి జిల్లాలో ఉగాది పచ్చడి చేసే విధానం

గోదావరి జిల్లాలలో చేసే ఉగాది పచ్చడి చాల రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్డాలు: వేప పువ్వు-1కప్పు, బెల్లంపొడి-1కప్పు, కొబ్బరికోరు-1కప్పు, బాగాముగ్గిన అరటి పండ్లు-6, మామిడికాయ-1, కొత్తకారము-చిటెకెడు, ఉప్పు-అరస్పూను, శనగట్నాల) పప్పు పొడి-1కప్పు, చింతపండు-నిమ్మకాయంత, కొద్దిగా చెరుకుముక్కలు, వేయించిన వేరుశనగపప్పు-అరకప్పు చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి. వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.

యుగయుగాల ఉగాది

రామాయణంలో చైత్రం 12 వనెల.రాముడు ఋతువులన్నీ గడిచి 12 వ నెల అయిన చైత్రమాసంలో శుద్ధ నవమినాడు జన్మించినట్లు బాల కాండలో ఉంది. ( తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిధౌ) దీనినిబట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే సంవత్సరాది. మార్గశిర పుష్య మాసాలున్న హేమంతంతో సంవత్సరం ప్రారంభమని కౌత్యుడు మతం. అమరసింహుడు అమరకోశము కాలవర్గంలో మార్గశిర పుష్య మాసాలతోనే మొదటి ఋతువని అన్నాడు.మార్గశిర మాసానికి '''ఆగ్రహాయణికః''' అనేది పర్యాయ పదం. ఆగ్రంలో హాయనం కలది- అంటే సంవత్సరమంతా ముందుండేది, లేక సంవత్సరాగ్రంలో ఉండేది. అంటే మన సంవత్సరాది మార్గశిర పుష్య, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖాల వరకు డేకుతూ వచ్చిందనడం స్పష్టం. అంటే ఆశ్వీజామావాస్య కార్తీక పూర్ణిమ, మార్గశిర పుష్యాలలో సంక్రాంతి పండుగ, మాఘ పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణిమ, హోలీ పండుగ, వసంతపంచమి, వైశాఖ పౌర్ణమీ ఇవన్నీ సంత్సరాదులే. రామాయణంలో అన్నట్లు వైశాఖంలో సవత్సరం ప్రారంభించె ఆచారం వల్లనే కాబోలు నేడు ఉత్తరాపధంలో సూర్యమాన సంవత్సరాదికి బైసాఖి ( వైశాఖి) అనే వ్యవహారం ఉంది. భారతంలో చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువనే గణన ఉంది. భవిష్య పురాణంలో యుగాదులను గూర్చిన వర్ణన కూడా సంవత్సరాది వైవిధ్యాన్ని ధ్రువ పరుస్తాయి. కృతయుగం వైశాఖ తృతీయనాడు, త్రేతాయుగం కార్తీక నవమినాడు, ద్వాపరయుగం ఆశ్వీజ త్రయోదశినాడు, కలియుగం ఫాల్గుణ పౌర్ణమినాడు పుట్టాయని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్టు, వీటిని యుగాదులంటారని అన్నట్టు ఉంది. ( యుగాదయశ్చ కథ్యంతే తధైతా స్సర్వ సూరిభిః) మరి ఈ దినమే ఉగాది ఎలా?

ఋతువులు కాలధర్మంతో సంబంధించినవి కనుక సాయనాలు.ఎప్పటికప్పుడు కదిలిపోతుంటాయి విషువత్తునిబట్టి. విషువత్ మారినా మనం ఇప్పటికీ చైత్ర వైశాఖమాసాలు వసంతఋతువు అంటున్నాము. రామాయణకాలంలో వైశాఖజ్యేష్ఠాలు వసంతం.భారతకాలంలో విషువత్ చలించడంవల్ల చైత్ర వైశాఖమాసాల్లో పడ్డది.అంటే భారతకాలంలో విషువత్ మృగశిరంలో వచ్చి, వరాహమిహిరుని కాలానికి అశ్విన్యాదికి చలించింది.కనుకనే విష్ణుపురాణం '''మేషాదౌచ మృగాదౌచ మైత్రేయ విషవః స్థితాః ''' అని చెప్పింది. తర్వాత మారుతూ వచ్చిందనే కదా!! నేడు మాఘమాసంతోనే వసంతఋతువు ప్రారంభమవుతున్నది.చైత్ర వైశాఖ మాసాలలో ఎండలు.నేడు ధర్మసింధువుకారుడు ఉగాది కాలానికి వేపకొళ్ళు తినడం చేయమన్నాడు. కాని మన ఉగాది కాలానికి వేపచిగుళ్ళు ముదిరి పూతకూడ రాలిపోయి, పిందెలు పుడుతున్నాయి. వరాహమిహిరుడు క్రీస్తుశకం 5వ శతాబ్దివాడు.తనకు కొన్ని శతాబ్దాలముందే విషువత్ మృగశిరనుండి అశ్వినీనక్షత్రం ప్రథమపాదానికి రావడం గుర్తించాడు. వేదాంగ జ్యోతిష్య కాలంకంటె ప్రాచీనమైన ప్రాహ్మణాలకాలంలో వసంత విషుత్కాలం కృత్తికానక్షత్రంలో సంభవించిందని పరిశీలించాడు. తనకాలంలో వసంత విషువత్కాలం అశ్విన్యాదిలో సంభవించడం చేత ఆనాటినుంచి ఉత్తరాయణం దేవమానదినం ప్రారంభం కావడం ప్రాచీన సాంప్రదాయం కనుక అదే వసంత కాల ప్రారంభంగాను, ఆనాడే సంవత్సర ప్రారంభంగాను నిర్ణయించి మాస ఋతు సామరస్యం చేసాడు. వసంత విషుత్కాలం చైత్రమాస ప్రారంభంగా పరిగణితమైందన్నమాట, కాని మనం ధర్మసింధు కారుడన్నట్టు శుక్ల ప్రతిపదాదినుంచి అమావాస్యతో ముగిసే కాలాన్ని నెలగా పరిగణిస్తున్నాము.నాటినుంచి నేటివరకు చైత్రమాసంలోనే ఉగాది పండుగ అనే ఆచారం ఏర్పడింది.

వరాహమిహిరుడు వసంత విషువత్తునుబట్టి ఋతుమాస సామరస్యం సాధించనేమో సాధించాడు.కాని అప్పటినుంచి వసంత విషువత్ 23 డిగ్రీలు వెనక్కు వస్తూ ఉంది.

మన ఉగాది చైత్ర మాసంతోనే ఎందుకు మొదలవుతుంది అనే ప్రశ్నకు హెమాద్రి పండితుడు:

చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రధమేహని,

శుక్ల పక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి.

చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ సమయంలో బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సృష్టించాడు. అని సమాధానం చెప్పాడు. ఇది ఇలా ఉంచితే మన దేశంలో పుష్య-మాఘ మాసాలు పంటలు పండి ప్రకృతి రసభరితంగా ఉండేకాలం. ప్రజలు తమ శ్రమ ఫలితాన్ని కట్టెదుట చూస్తూ పొంగి పోతారు.ఇదే మొదట్లో మన సంవత్సరాది. దీనిని సూచించే దినం మకర సంక్రమణం.ఇది మార్గశిర-పుష్య-మాఘమాసాల మధ్యన వచ్చేది విషువత్కాలం. విషువత్కాలమంటే పగలూ రాత్రీ సరిసమానంగా ఉండే కాలం.'''సమరాంత్రిందివే కాలే విషువత్''' అన్నాడు అమరసింహుడు. ఈ విషువత్తులు రెండు.మకర సంక్రాంత్రి అలాంటి విషువత్తు లలో ఒకటి. ఈనాటి నుంచి ప్రకృతిలో క్రొత్త క్రొత్త మార్పులు కలగడం ఆరంభం అవుతుంది.

ఈవిషువత్ నిర్ణయంలోనూ మత బేధం ఉంది.కటకం నుంచి- కటక విషువత్ నుంచి- దక్షిణాయనం, మకర విషువత్ నుంచి ఉత్తరాయణం ప్రారంభమౌతాయని నేటి సాంప్రదాయం.కానిపూర్వం ఆశ్లేషారధం నుంచి దక్షిణాయనం, ధనిష్థా ప్రథమపాదం నుంచి అంటే అభిజిత్తుతో సహా లెక్కపెడితే కుంభం నుంచి ఉత్తరాయణం, సింహంనుంచి దక్షిణాయనం ఉండేవని ఇప్పుడు అవి కటకాలకు మారాయని వరాహమిహిరుడు బృహత్సంహితలో తెలిపాడు.

మనకొక సంవత్సరమైతే దేవతలకొక దినం. వారి దినం మేషంతో ప్రారంభమౌతోంది; తులతో రాత్రి. కనుక నేడు మకర కటకాలనుంచి ఉత్తర దక్షిణాయనాలు చెబుతారు అని శ్రీ పత్యాచార్యుడు అన్నాడు.

మనం ఉత్తరధ్రువ ప్రాంతం నుంచి బయలుదేరామనువాదం నిజమైతే, మేషవిషువత్తునుంచి మనకు దినం ప్రారంభం కావడం -6 నెలలు చీకటి 6 నెలలు వెలుతురు ఉండేదినం మొదలుకావడం నిజం. మనం ఉత్త్రార్ధగోళం వారం కనుక మేషంలోనే మనకు సూర్యోదయం.భూమధ్య రేఖపై సూర్యుడుండే దినం విషువత్.మానవుడు ఋతువులు తన లెక్కలకు ముందు వెనుకలుగా రావడం చూచి, సూర్యచారాన్ని తక్కిన గ్రహాల చారాన్ని లెక్కలు కట్టసాగాడు.సూర్యుడు విషువత్తులో ప్రవేశించిన నాటినుంచి లెక్కకట్టి రాసులు విభజించాడు.ఈవిధంగా నభో మండలం- 12 భాగాలు అయినది.ఆరాసులతోనే మాస సంకేతం చేసుకున్నాడు.సూర్యుడు ఒక రాశినుంచి మరొకరాశికి ప్రవేశించడానికి దాదాపు 30,31 దినాలవుతుంది. కాని చంద్రుని వృద్ధిక్షయాలతో ఏర్పడిన నెలకు, తర్వాత సూర్యమానపు నెలకూ క్రమంగా నెలవారా రావడం మొదలైంది. చంద్రమానానికి 19 సం.లకు ఏడు అదనపు నెలలు చేర్చి రెండు మానాలను సర్దుకోవలసి వచ్చించి.కనుకనే ప్రతి మూడోఏటా చంద్రమాన సం.లో ఒక అధిక మాసం వస్తూవుంటుంది.

నిజానికి చంద్రమానమే వేదకాలం నుంచి ఆచరణలో ఉన్నదేమో!! సౌరమానం వ్యవహారంలో ఉన్న ప్రాంతాలలోనూ వైదిక కర్మలకు చంద్రమానాన్ని అనుసరించడమే దీని ప్రాచీనతకు ప్రమాణం. అగ్ని పూజకులైన ఫార్సీలు ఎప్పుడో మననుంచి విడిపోయినవారు. వారి సంవత్సరాది నౌరోజ్. అది కూడా వసంతమాసంలో దాదాపు ఉగాదిదరిదాపులలోనే రావడం కూడా చంద్రమానం ప్రాచీనతకు నిదర్శనం, ముస్లింలు ఏదేశం వారైనా పూర్తిగా చంద్రమానాన్ని వాడేవారే.కనుకనే వారి పండుగలు ఒకసారి చైత్రంలో, మరొకసారి వైశాఖంలో మారుతూఉంటాయి.చాళుక్యుల కాలంలో మాత్రం సూర్యమానం ఆంధ్రదేశంలో అధికవ్యాప్తిలో ఉండేదట.ఇప్పుడు మనదేశంలో సౌరమానాన్ని వంగ, తమిళ, కేరళ, పంజాబు, సింధు, అస్సాం వారు అనుసరిస్తున్నారు.

మేషవిషువత్తే దైవతదినానికి - అంటే సంవత్సరార్ధానికి-ప్రారంభమైనప్పుడు; భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిలో సూర్యుడు లంకానగరంలో వసంతఋతువు శుక్లపక్ష ప్రతిపత్తునాడు ఉదయించడంవల్ల (భూ మధ్య రేఖపై ఉండడాన్ని బట్టి) అనాడే ఉగాది అనడంవల్ల; సంవత్సరం వసంతర్తుతో ప్రారంభిస్తుందని యజుర్వేదం ఒకవైపు ఘోషిస్తుండగను; ధర్మసింధు, నిర్ణయసింధు కారులు ఈ ఉగాది పండుగ సంవత్సరాది పండుగ అనడం మాత్రమేకాక, నిర్ణయసింధుకారుడు శుద్ధపాడ్యమి నుంచి అమావాస్య వరకుగల కాలమే నెల అని నిర్ణయించినప్పుడూ; వివిధ విధాల సంవత్సరాదులేమిటి? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కాని ఋతునిర్ణయం లోను, సంవత్సరాది నిర్ణయంలోనూ ప్రాచీనకాలంలో వివిధాచారాలున్నాయనడమె దానికి సమాధానం.ఒకప్పుడు కార్తులను బట్టి ఋతు నిర్ణయం జరిగేది. వేదాంగ జ్యోతిష్ కాలంలో ధనిష్ఠా కార్తితో ప్రారంభమైన శిశిర ఋతువుతో- మాఘపూర్ణిమనుండి రెండు నెలలతో మొదటి ఋతువు- సంవత్సరం ప్రారంభమయ్యేది.ఇది ఉత్తరాయణ ప్రవేశ కాలం కూడాను. ఇది పరాశరుడు మతం. స

ంవత్సరాది పండుగమాట సరే!! ఉగాది అనే మాట ఏమిటి? యుగమంటే కాలం. తదాది యుగాది. మనతోడివారైన కన్నడులు నేడూ యుగాది అని యకారాదిగానే దీనిని వ్యవహరిస్తారు.యకారాది పదాలు తెలుగుభాష సంప్రదాయం కాదు గనుక ఉగాది అయి ఉంటుంది.

 Image result for sri ramudu

ఉగాది పండుగ దినాన భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని ఆద్యాత్మిక గురువులు అంటున్నారు. శ్రీరాముని ఆరాధన, శ్రీ మద్రామాణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రవిధిగా నువ్వులతో తలంటుకుని, నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయస్తే మంచిది. తిలకధారణ, నూతన వస్త్రాల ధారణ తరువాత భగవంతుడిని పూజించాలి. పూజా అయిన తరువాత పెద్దల దీవెనలను పొందడం, దేవాలయాల సందర్శనం చేస్తే పుణ్యఫలములు చేకూరుతాయి.  చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఏ రోజున వుంటే ఆ రోజున ఉగాది పండుగ పరిగణిస్తారు. ఇంకా బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున శ్రీరామునిని ఆరాధించడంతో పాటు శక్తి ఆరాధనకు కూడా విశిష్టమని పురోహితులు చెబుతున్నారు. 

we trustfinity

"షడ్రుచుల" సమ్మేళనం ఉగాది పచ్చడి

తోరణాలు, రంగురంగుల ముగ్గులు, పిల్లల అల్లరి చేష్టలు, పనుల మధ్య పెద్దల హడావుడి, కొత్త బట్టలతో అనేక మంది ఇళ్లు కళకళలాడుతుంటాయి. పల్లెల్లో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఉగాది పండుగ రోజు నుంచి శ్రీరామనవమి వరకు ఏడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. 

ఉగాది పచ్చడి... 
ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనంతో తయారుచేసే శ్రేష్టమైన పదార్ధమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత ఉందో... ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణులు కూడా సూచిస్తున్నారు. 

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రకాల రుచులు కలపి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. కొత్తసహస్రాబ్ధికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం. 

ఈ పచ్చడి తయారీ చేయడం కోసం చెరకు, మామిడి పిందెలు, అరటి పళ్ళు, చింతపండు, వేప పువ్వు, బెల్లం, జామకాయలు మొదలగునవి వాడుతుండటం ఆనవాయితీ.

we trustfinity

What is Ugadi and importance

Ugadi literally means beginning of an era (Perl). The name comes from two Sanskrit words yuga-which means era, and aadi-which means beginning, so Ugadi is the South Indian Hindu New Year (Perl). It is believed by many Hindus, that Brahma, the Hindu god of creation, created the universe on this day (Perl).

Ugadi literally means beginning of an era (Perl). The name comes from two Sanskrit words yuga-which means era, and aadi-which means beginning, so Ugadi is the South Indian Hindu New Year (Perl). It is believed by many Hindus, that Brahma, the Hindu god of creation, created the universe on this day (Perl).

వసంతే కపిల స్సూర్యో గ్రీష్మే కాంచన సుప్రభః


శ్వేతో వర్షా సువర్ణేన పాండుశ్శధి భాస్కరః


హేమంతే తామ్ర వర్ణస్తు శిశిరే లోహితో రవిః


ఇతి వర్ణా సమాఖ్యా తాసూర్యసనతు సముద్భవా!

చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని,


వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ


ఈ శ్లోకం తాత్పర్యం తెలుసుకుందాం. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం. మొదటి నెల చైత్రం. మొదటి తిథి పాడ్యమి. మొదటి వారం ఆదివారం. ఆ వేళ ఈ సృష్టి ప్రారంభమైందని అర్థం. ప్రభవించిందని అర్థం. అందుకే తెలుగుసంవత్సరాలలో మొదటిది ప్రభవ. చివరిది క్షయ. నాశనమైందని. అంటే ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే సంవత్సరం అన్నమాట. అందువల్ల చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. నిర్ణయసింధుకారుడుకూడా అదే చెప్పాడు. తత్ర చైత్రశుక్ర ప్రతిపదిసంవత్సరారంభ అన్నాడాయన. ఉగస్య ఆదిః ఉగాదిః అంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్కల ప్రకారం 432,00,00,000 సంవత్సరాలు. రాత్రికూడా అంతే. అంటే బ్రహ్మకు ఒకరోజు అంటే… 864,00,00,000 సంవత్సరాలన్నమాట. ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్లు లెక్క. అంటే 3 లక్షల 11 వేల 40 కోట్ల సంవత్సరాలన్నమాట. ఇలా వందేళ్లు బ్రహ్మ ఆయుర్దాయం.


ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టికార్యాలు ముగించారు. ఏడవ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయపరార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలన్నమాట. కలియుగం ప్రమాది నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 197,29,49,114 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం. ఇది ప్రారంభమై 5114 సంవత్సరాలైంది. ఉగాదినాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని అంటారు. మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజుకూడా ఇదేనని ప్రతీతి. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుకూడా ఉగాదే. వరాహమిహిరుడు పంచాగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాదినాడే.

హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.

ఉగాది పండుగని ఏ విధంగా జరుపుకోవాలో తెలుసుకోండి…!

AAuthor: Ajayay_Go

‘ఉగాది’ అంటే ప్రకృతి పుట్టినరోజు. కాలగణనానికి కూడా అదే శ్రీకారం. మనది చాంద్రమాన గణనం. చైత్ర శుద్ధ పాడ్యమే ‘యుగాది’. మనమందరం ప్రకృతిపై ఆధారపడి ఉన్నాం. మన బ్రతుకుల్ని నిలబెడుతూ, హాయినిస్తుంది ఈ ప్రకృతి. ఈ ప్రకృతి అందరికీ తల్లి. అందువల్ల ప్రకృతి మాత పుట్టినరోజును జరుపుకోవడం మనందరి బాధ్యత. ప్రకృతిని ప్రేమించి పచ్చదనాన్ని రక్షించుకుంటే మన జీవనయాత్ర సాఫీగా సాగుతుంది. ఇందులో కులమత భేదాలేవీ లేవు.

బ్రహ్మ చైత్ర మాసం శుక్లపక్షంలో మొదటిరోజున సూర్యోదయ కాలంలో సమగ్రంగా ఈ ప్రకృతిని రూపొందించారు. చంద్రుడిసంచారాన్ని బట్టి చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం మొదలైన పేర్లతో నెలలు ఏర్పడుతున్నాయి. 12 నెలలో చివరిదైన ఫాల్గుణమాసం నాటికి చెట్లన్నీ ఆకులు రాలిపోయి, పచ్చదనం తక్కువ కావడంతో ప్రకృతి వెలవెల బోతుంది. తిరిగి నవనవోన్మేషమైన ప్రకృతి శోభలతో చైత్ర మాసం ప్రారంభమవుతుంది. ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఔషధ విలువలు కలిగిన ఆరింటిని మనం ఉగాది పచ్చడి రూపంలో తీసుకోవడం జరుగుతోంది. ఉగాది నాడు తప్పనిసరిగా చేయవలసిన పనులను మనం వివరంగా తెలుసుకుందాం.

  •  ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెను ఒంటికి పట్టించి, పసుపు కలిపిన సున్నిపిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, తలంటు స్నానం చేయాలి. గానుగనూనెను మర్దన చేసుకుంటే, లావుగా ఉన్నవారు సన్నబడతారు. తేజస్సు పెరుగుతుంది. సన్నటివారికి మంచి బలం చేకూరుతుంది.
  • ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలను ధరించాలి. క్రొత్త బట్ట ఆయుష్షునీ, దేహవర్చస్సును పెంచుతుంది.
  • తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే 5 అంశాల పరిజ్ఞానంతో కూడిన పంచాంగ శ్రవణం ఆ రోజున తప్పక చేయాలి. ఈ ఐదింటి వల్ల క్రమంగా  సంపద, ఆయుష్షు, పాపహరణం, రోగాలు తొలగడం, చేసిన ప్రయత్నాలు ఫలించడం అనే సత్ఫలితాలు కలుగుతాయి.
  •  ఆరు రుచుల పచ్చడిని సేవించడాన్నిసంప్రదాయంగా చేశారు. అమూల్యమైన ఔషధ విలువలు కలిగిన ఉగాది పచ్చడిని అందరూ తప్పనిసరిగా సేవించాలి.

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత :

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక.

  • బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం
  • ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
  • వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
  • చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
  • పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు
  • కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు.

we trustfinity

we trustfinity

© Copyright Just View