నాయకుడంటే


గొప్ప పనులు చేసే
మహనీయులే గొప్ప నాయకులు కాదు. గొప్ప పనులు చేసే వారిని తయారుచేసేవాడే గొప్ప లీడర్ అవుతాడు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు లీడర్‌గా మారి తన ఫిలాసఫీని, తన ఆదర్శాలను విద్యార్థుల ముందు పెట్టి వారిని గొప్ప ఆవిష్కర్తలుగా* తయారుచేస్తాడు. ఉపాధ్యాయుడు ‘లీడర్’గా మారాలంటే తన ఫిలాసఫీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ‘నేనేందుకు చదువు చెప్పుతున్నాన’నే ప్రశ్న వేసుకోవాలి. గొప్ప విద్యార్థులు తయారుకావాలనే కోరిక అతడిలో వ్యక్తం కావాలి. గొప్ప అవకాశాలు, గొప్ప నైపుణ్యాలు నా విద్యార్థులకు రావాలనే ఆకాంక్ష ఉపాధ్యాయుని పనివల్ల కలగాలి. వ్యక్తిగా కాకుండా ఒక జట్టుగా ఎదగాలనే లక్ష్యం దిశగా ఉపాధ్యాయుడు పయనం సాగించాలి.
తరగతి గది ఉద్యోగం చేసే క్షేత్రం మాత్రమే కాదు, సమాజ నిర్మాణంలో అదొక సోపానమనే భావన కలగాలి. తరగతి గదిలో ఉండే ప్రతి విద్యార్థి తనలో దాగి వున్న అద్భుతమైన ప్రతిభను సామూహిక కార్యక్రమంలో ప్రదర్శించే స్థాయికి టీచర్ తీసుకురావాలి. పోటీతత్వంతో కాదు, సామూహికమైన టీమ్ స్పిరిట్‌గా మార్చే ప్రయత్నంగా చేయాలి. జయమైనా, అపజయమైనా కానీ అది వ్యక్తులది కాదు, తప్పులు జరగవచ్చు. తప్పులను సమర్థించుకోవడం కన్నా సవరించుకోవటంలోనే గొప్పతనముంటుంది. తరగతి పనులు చేసేటప్పుడు అధికార గర్వం కన్నా ప్రజాస్వామిక దృక్పథం ప్రధానం. ఇతరులను చివాట్లు పెట్టడం కన్నా అందర్నీ కలుపుకపోవటమే తన లక్ష్యం కావాలి. ఉపాధ్యాయుడు తను మాట్లాడినదానికన్నా వినటానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. శిక్షకుడు అనే భావనకు బదులుగా తరగతిలో తాను భాగస్వామిననే భావన కలిగి ఉండాలి. తన గతం కన్నా, వర్తమాన శైలినే ప్రధానమనుకోవాలి. నేను అనేదాని కన్నా మనం అనే భావనతోనే తరగతి గదికి నాయకత్వం వహించాలి.

సేకరణ, శ్రీగిరిమస్తాన్

మీ గ్రామములో ఉన్న విశేషములైన కట్టడములు,కోటలు గుళ్ళు లేదా ఆశ్రమాలు మొదలగు అనేక వాటిని గురించిన సమాచారము justview.co ద్వారా అందించాలని సంకల్పించాము. కావున మీ ఊరి విశేషాలు ఈ క్రింది వివరాలతో పంపండి.1. మీ పేరు,మొబైల్ నం.,అడ్రసు మరియు పోటొ
2. ఊరులోని విశేషము పేరు
3. వాటి పోటోలు
4. చరిత్ర-ఆధారాలు
మొదలగు అనేక వివరాలతో ఈమెయిలు లేదా వాట్సాప్ ద్వారా పంపండి.Email : justview.co@gmail.com
Whatsapp No; 9110333597
website: www.justview.co               మా ఊరు

Web hosting

ఒక శిష్యుడు గురువుగారి ని అడిగిన ప్రశ్న....

భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా.
హృదయంలో ఉండే హరిని వెతకటానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్లడం దేనికి?

గురువు గారి జవాబు:

ముఖం మన దగ్గరే ఉంది.
కానీ మన కంటికి మన ముఖం కనిపించదు. కనపడడానికి అద్దం లో చూసుకొంటాము,
అద్దంలో ప్రాణం లేదు,
కంటికి ప్రాణం ఉన్నా ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకు కనిపిస్తుంది.

అలాగే తెలుసుకోవాల్సిన మనం ఇక్కడే ఉన్నాం.
తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండు కాకుండా మనకి ఏదయినా ఒక అద్దం లాంటిది కావాలి,

అదే విగ్రహం ....

భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు.
అందులో భగవంతుడిని చూసే భక్తి మనకి కావాలి.
మనలోన భక్తి, విగ్రహం ఈ రెండు అద్దం లాంటి ఫలితాన్నిస్తుంది....
అప్పుడే భగవంతుడి సాక్షాత్కారం పొందవచ్చు....
అందుకే గుడికి వెళ్ళాలి....

వేదిక మీకు ఆహ్వానము పలుకుతొంది.

మీలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ వేదిక (platform) మీకు అండగా వుంటుండి. కవితలు,వ్యాసాలు, సందేశత్మకమైన విషయాలు, ఆద్యాత్మికము ఏదైనా సరే పంపండి. భాగస్వాములు కండి. ఈ క్రింది దరఖాస్తు ద్వారా పంపగలరు

వేదిక కు పంపే అన్ని విషయాలు ఈ లింకు ద్వారా పంపండి.

Web hosting

యక్ష ప్రశ్న
ప్రపంచములో ఉన్న ప్రతి మనిషికి పుష్కలమైన తరగని సంపద లభిస్తీ - ఏమౌవుతుందో చెప్పగలరా? 

సమాదానం కొరకు ఇక్కడ చూడండి


THIS SPACE FOR RENT 

Rs800/- per 3years
నరసింహక్షేత్రాలు

1. అహోబిలమ నరసింహ స్వామి దేవాలయం -అహోబిలం 
-------------------------
నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్క్కటైన అహోబిలమ నరసింహ స్వామి దేవాలయం కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కి మీ దూరం లో ఉంది . నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశాపుని చిలిచి చెండాడిన క్షెత్రమిదెనని స్థల పురాణం చెబుతుంది . హిరణ్యకశాపుని చిలిచి చెండాడిన నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం ,అహో బలం అని ఆశ్చర్యంతో పొగడరటా అందుకీ ఈ క్షేత్రానికి అహోబిలమ నరసింహ స్వామి దేవాలయం గా పేరు వచ్చింది అని చెబుతారు . 
బ్రహ్మాండ పురాణం లో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది . 
శ్రీ మహావిష్ణువు ఉగ్రనారసింహ అవతారం లో స్థంబం నుంచి ఉద్బవిన్చినట్లు చెప్పే స్థంబాన్ని కూడా అహోబిలం లో చూడవచ్చు . 
దిగువ అహోబిలం : లక్ష్మి నరసింహ స్వామి శాంతి మూర్తి ఆయె వెలసిన క్షేత్రం ఇది 
ఎనిమిది కి మీ ఎత్తున కొండ పైన ఎగువ అహోబిల నరసింహుని చుడవొచ్చు . హిరణ్య కసపుడిని సంవరించి వికట హట్ట్ హాసాలు చేస్తూ అహోబిలమ కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి .  

1) భార్గవ నరసింహ స్వామి 
(2) యోగానంద నరసింహ స్వామి 
(3) చత్రపట నరసింహ స్వామి 
(4) ఉగ్ర నరసింహ స్వామి 
(5) వరాహ నరసింహ స్వామి 
(6) మాలోల నరసింహ స్వామి 
(7) జ్వాల నరసింహ స్వామి 
(8) పావన నరసింహ స్వామి 
(9) కారంజ నరసింహ స్వామి 
నవ నరసింహ క్షేత్రాలు . ఫాల్గుణ మాసం లో ఇక్కడ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి . 

....మరిన్ని విషయాలకు ఇక్కడ నొక్కండి

 

ప్రశ్న: ఎండాకాలంలో వడదెబ్బ ఎందుకు వస్తుంది? వడదెబ్బ నుంచి ఎలా కాపాడుకోగలం?
- ఎం.జగన్మోహన్‌రెడ్డి, హన్మకొండ 
                    జవాబు : శరీరంలో నిర్దిష్ట ఉష్ణోగ్రతలోనే జీవ రసాయనిక చర్యలు సజావుగా సాగుతాయి. జీవ రసాయనిక చర్యల వేగాన్ని బట్టి జీవి ఆరోగ్య స్థితిని నిర్ణయించబడుతుంది. ఆ వేగం తగ్గినా, విపరీతంగా పెరిగినా ప్రమాదం వస్తుంది. వివిధ జీవజాతుల దేహ నిర్మాణం వివిధ మోతాదుల్లో వుంటుంది. మానవుడి దేహ సగటు ఉష్ణోగ్రత సుమారు 370జ లేదా 98.40ఖీ వుండాలి. సాధారణంగా ఇంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత పరిసరాల్లో ఉంటే ఉక్కపోస్తోంది అంటాము. పరిసరాల ఉష్ణోగ్రత యింతకన్నా తక్కువ ఉంటే చలి వేస్తోంది అంటాము. వేసవి కాలంలో దేహ ఉష్ణోగ్రత కన్నా చాలా ఎక్కువగా బయటి ఉష్ణోగ్రత వుంటుంది. ప్రాంతాల్ని బట్టి వేసవికాలపు ఉష్ణోగ్రత 400జ నుంచి 500జ వరకూ ఉంటుంది. ప్రకృతి నియమాల్లో భాగమైన ఉష్ణ గతిక శాస్త్ర శూన్య నియమం ప్రకారం ఉష్ణశక్తి ఎల్లపుడూ అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి వెళుతుంది. అంటే వేసవికాలంలో బయటి ఉష్ణోగ్రత ఎక్కువగా వుండడం వల్ల బయటి నుంచి ఉష్ణం శరీరంలోకి వెళ్లే అవకాశం వుంది. దరిమిలా దేహ ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం వుంది. అదేవిధంగా చలికాలంలో పరిసరాల ఉష్ణోగ్రత ప్రాంతాన్ని బట్టి -100జ నుంచి 150జ వరకు ఉండే అవకాశం వుంది. అంటే ఉష్ణ గతికశాస్త్ర శూన్య నియమం ప్రకారం శరీరం నుంచి పెద్ద మోతాదులో ఉష్ణశక్తి బయటికి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో దేహ ఉష్ణోగ్రత 370జ కన్నా తక్కువ అయ్యే ఉపద్రవం వుంది. 
జీవ పరిణామ వారం (Theory of Organic Evolution) ప్రకారం ప్రకృతి వల్ల కలిగే పెను ముప్పుల నుంచి కాపాడుకోగల జీవ ధర్మాలు, నిర్మాణం ఉండే జాతులే ఎదిగాయి, పరిణమించాయి. కాబట్టి బయటి ఉష్ణోగ్రత దేహ ఉష్ణోగ్రతకన్నా ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా వున్నా శరీర దేహోష్ణగ్రతను నియంత్రించే యంత్రాంగం (Thermoregulation Mechanism)  జీవించి వున్న జీవుల్లో వుంది. మానవుడి మెదడులో వున్న హైపోథలామస్‌ ఈ కార్యకలాపాన్ని నిర్వర్తిస్తుంది. చలికాలంలో శరీరం నుంచి వేడి పోళ్లిపోయి శరీరపు ఉష్ణోగ్రత తగ్గే ప్రమాదం వుంది. కాబట్టి ఆకలి ఎక్కువయ్యేలా చేస్తుంది. తర్వాత ఎక్కువ మోతాదులో పోషక పదార్థాలు ఖర్చయి ఎప్పటికప్పుడు వేడి జనిస్తుంది. అలాగే శరీరపు చర్మం పైపొరల్ని పొడి (dry) గా ఉంచేలా రక్త నాళాల్ని కుంచింపజేస్తుంది. దానికి తోడుగా మనం స్వెట్టర్లు, దుప్పట్లు, మఫ్లర్లు కప్పుకొని ఉష్ణ నష్టాన్ని తగ్గించుకొంటుంటాము. 
అలాగే వేసవి కాలంలో శరీరం లోకి వేడి చేరే ప్రమాదం వుంది కాబట్టి ఆ వేడి శరీరంలో నిల్వ వుండ కుండా దాన్ని ఖర్చు చేసేలా చెమట పోసే యంత్రాంగం ఉంది. దానికి తోడుగా మనం పలుచని దుస్తులు ధరిస్తాము. ఫ్యాన్లు, ఎసీలు వేసుకొని సేదదీరుస్తాము. అయితే ఇలాంటి అవకాశాలు, సదుపాయాలు అవగాహన లేని పేదలు, రైతులు, శ్రామికులు ఎండనక, నీడనక కష్టించి పని చేయడం వల్ల అధిక మోతాదులో చెమట ద్వారా నీటిని లవణాల్ని పోగొట్టుకొంటారు. త్రాగడానికి సరియైన మోతాదులో నీరు లేకున్నా విపరీతమైన మోతాదులో వేసవి ఎండకు లోనైనా హైపోథలామస్‌ చేయగల నియంత్రణకు మించి ఉష్ణశక్తి శరీరంలోకి వెళుతుంది. అపుడు వడదెబ్బ తగిలింది అంటాము. దీన్నే Heat Stroke లేదాSun Stroke అని కూడా అంటారు. వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరం పొడిగా వుంటుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. మాట తడబడుతుంది. నోరు ఎండిపోయి ఉంటుంది. శరీరం చాలా వేడిగా వుంటుంది. వడదెబ్బ చాలా ప్రమాదకర స్థితి. వడదెబ్బ సోకిన వ్యక్తిని వెనువెంటనే చల్లని ప్రాంతంలోకి మార్చి మంచు గడ్డలతో చల్లబర్చాలి. ఎక్కువ మోతాదులో లవణాలు కలిపిన నీటిని తాగించాలి. చల్లగాలి తాకేలా సేదదీర్చాలి. నోటిద్వారా గానీ, సిరింజి ద్వారా గానీ సెలైన్‌ బాటిళ్లు ఎక్కించాలి. మజ్జిగ, పళ్లరసాలు అందించాలి. మద్యపానం పూర్తిగా నివారించాలి. త్వరగా జీర్ణమయ్యేలా ద్రవ ఆహారాన్ని ఇవ్వాలి. వైద్యుణ్ణి సంప్రదించి తగు చికిత్స చేయించాలి. జ్వరానికి, వడదెబ్బకు చాలా తేడా ఉంది. జ్వరంలో ఉన్న వ్యక్తికి చలి వేస్తుంటుంది. ఎప్పటిలాగే చెమట వస్తుంది. కానీ వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరం నుంచి చెమట రాదు. పైగా పొడిగా ఉంటుంది. 

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, 
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.

we trustfinity

మాస శివరాత్రి ?
ఎందుకు జరుపుకోవాలి?
ఎలా జరుపుకోవాలి?
దాని వలన ఉపయోగములు                    .....మరిన్ని విషయాలకు ఇక్కడ నొక్కండి 


THIS SPACE FOR RENT 

Rs800/- per 3yearsనారాయణ తత్వాన్ని దర్శించిన మొదటి ముగ్గురు ఆళ్వారులు (ముదల్ ఆళ్వార్లు)

మనకు నాలుగు వేల దివ్య ప్రబంధాలను పాడి అందించిన వాళ్ళు పన్నెండు మంది ఆళ్వారులు. ఆందులో మొదటి ముగ్గురు ఆళ్వార్లు కలియుగానికి ముందు జన్మించిన వారు. వారు అందమైన రీతిలో తత్వాన్ని దర్శించినవారు. అందుకు ఒక చరిత్ర ఉంది. అందులో ఒక ఆళ్వార్ సరస్సులో లభించారు. అందుకు ఆయనకు సరోయోగి అని పేరు. పొయ్-గై  అంటే ద్రవిడ భాషలో సరస్సు అని అర్థం.  మరోక ఆయన పుష్పంలో పుట్టారు అందుకే ఆయనకు పూదత్త, క్రమేపి భూత యోగి లేక భూదత్తాళ్వార్ అని పేరు వచ్చింది. మరొకాయనకు భగవంతుడు అంటే పిచ్చి వ్యామోహం, అందుకే ఆయనకు మహాయోగి అని పేరు. పేయ్ ఆళ్వార్ అని అంటారు. పేయ్ అంటే ద్రవిడ భాషలో పిచ్చి అని అర్థం.     
                                ..................మరిన్ని విషయాలకు ఇక్కడ నొక్కండి
 


THIS SPACE FOR RENT 

Rs800/- per 3years

THIS SPACE FOR RENT 

Rs800/- per 3yearsమజ్జిగను ఎలా తాగాలి ?
*********
పూర్వం ప్రతి ఇంట్లో ఆవులు గేదెలు వుండేవి అప్పుడు పెరుగు బాగా వుండి కుడా మజ్జిగ ఎందుకు మాత్రమే వాడారు ? మరి ఇప్పుడు అందరు పెరుగు వాడుతున్నారు . ముఖ్యంగా పెరుగును రాత్రి తిన కూడదు . రాత్రి పెరుగు తింటే వాతం ఎక్కువగా ఉంటుంది . ఈ నాటి గృహిణులు అందరు తెలుసుకోవాలి . ఆయుర్వేదంలో మజ్జిగను పది రకాలుగా చెప్పారు అవి ఇప్పుడు చూద్దా౦. మదితము అనే మజ్జిగ ; పేరు కొన్న పాలలో నీరు కలపకుండ చిలికి తయారు చేసిన మజ్జిగ . ఇది చిక్కగా జిడ్డుగా వుంటుంది ఈ మజ్జిగ ఆహారంలో వాడుతూ ఉంటె నిరసం ఉదర రోగాలు పైత్యం వల్ల కలిగిన వాతం నాలుకకు రుచి తెలియక పోవడం మూత్రము ఆగి పోవుట . నీళ్ళ విరోచనాలు మొదలైనవి హరించి పోయి శరీరానికి బలము కలుగు తుంది . ఈ రకమైన మజ్జిగ మన రెండు రాష్టాల ప్రజలు గ్రీష్మ ,శరత్ , హేమంత శిశిర రుతువులలో సేవించి ఆరోగ్యం పొందవచ్చు . (2) మిలితమను మజ్జిగ ; పెరుగు ఒక వంతు నీళ్ళు మూడు వంతులు పోసి చిలికి తయరు చేసిన మజ్జిగ . ఇది శరీరంలో ని పైత్యం అరుచి ని అతిసార , విరేచానాన్ని రక్తంలో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను కుడా హరించి వేస్తంది . ( ౩) గోళము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు ఒకటిన్నర వంతు నీరు కలిపి తయారు చేసినది . ఈ విధమైన మజ్జిగ ను వాడుతూ వుంటే వీర్య వృద్ది , కలిగి శరీరానికి కాంతి వస్తుంది . కళ్ళకు మేలు చేస్తుంది . ఉదరములో మందగ్ని విష దోషములు , మేహము , ప్రమేహము , కఫ , రోగము ఆమ రోగము , అను వానిని పోగొడుతుంది . ఈ రకమైన మజ్జిగ గ్రీష్మ , వర్ష , రుతువుల యందు సేవించ దగినది . ( 4) షాడభము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు అయిదు వంతుల నీళ్ళు కలిపి చేసినది ఇది శ్లేష్మ రోగాలను గుల్మ రోగాలను రక్త మూల వ్యాదిని పోగొడుతుంది తేలికగా ఉండి ఉదరములో జటరాగ్నిని పెంచి శరీరానికి కాంతి వస్తుంది . (5) కాలేశేయము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు కలిపి తయరు చేసినది ఈ మజ్జిగ బంక విరేచనాలు , విషములను , ఉబ్బులను , మంటను , వాతమును ముఉల వ్యాదిని , పోగొట్టి శరీరమును త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది . ఇప్పటికే పడిన ముడతలు కుడా తిసి వేస్తుంది . ( 6) కరమదితము అను మజ్జిగ ; పెరుగు నీళ్ళు సమంగా కలిపి చిలికి తయారు చేసినది . ఈ మజ్జి గ వగరుగా , పుల్లగా , రుచి కరముగా ఉంటుంది . ఈ మజ్జిగలో కొద్దిగా వేడి స్వబావం , మల బద్ధకం చేసే గుణం కుడా ఉంది . అయితే దీని వలన జట రాగ్నిబాగా పెరుగు తుంది . ప్రమేహము , చర్ది , ఉబ్బు , ముఉల రోగం ,భగందరమూ , కామెర్లు , కఫ వాతము , అరుచి , వీటిని పోగొట్టి వీర్య వృద్దిని బలాన్ని అందిస్తుంది . ఈ మజ్జిగ ముఖ్యంగా వర్ష కాలలో సేవించడానికి అనుకూల మైనది . ( 7 ) ఉదాస్వితము అను మజ్జిగ ; పెరుగులో నాలుగవ వంతు నీళ్ళు పోసి చిలికి చేసినది . ఇది గుల్మములను , దెబ్బలను , అన్ని రకాల వాతములను , దారుణ వీరేచనాలను , తల తిప్పే రోగమును , మొదలైన సమస్త రోగాలను పోగొడుతుంది . దేహ పుష్టిని , ఇస్తుంది . ముఖ్యంగా ఈ మజ్జిగ గ్రీష్మ రుతువులో సేవింప దగినది . ( 8 ) తక్రమ అను మజ్జిగ ; పెరుగులో సగం వంతు నీళ్ళు కలిపి చిలికి తయారు చేసినది . ఇది తేలికగా ఉండి వేడిని అణచి వేస్తుంది . శరీరం తెల్లగా మారే పాండు రోగము , ఉబ్బు , కఫ , వాతము , కడుపులో బల్లలు , భందరము , ఉదార రోగాలు పోగొడుతుంది . దీనిని వసంత రుతువులో శొంటి , పిప్పలి , మిరియాలు , ఉసిరిక పప్పు , ఈ నాలుగు ఒకొక్క గ్రాము వంతున కలిపి తాగాలి . ( 9 ) దండ హతము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు పోసి కవ్వముతో చిలికి తయారు చేసినది . ఇది రుచి కరముగా ,ఉంటుది . శరీరంలో అతి వేడి , అధిక కపము , ముత్రంలో పడే సుద్దా మొదలైన మేహములను మూలా వ్యాదిని పోగొడుతుంది . ఆహరం బాగా జీర్ణం చేస్తుంది . ఈ రకమైన మజ్జిగ ఎల్లప్పుడూ తీసుకోవచ్చు . ( 1౦ ) అతి మీలితము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు తొమ్మిది వంతుల నీళ్ళు పోసి చిలికి చేసిన మజ్జిగ . ఇది ముఖ్యంగా ముఖానికి సంబందిచిన రోగములను గుల్మ్ మును , బల్ల , భాగందరము , ఉదర రోగము , అనే సమస్యలను పోగొడుతుంది . ** మజ్జిగ గుణ దోష ప్రభావాలు ** మజ్జిగ త్రి దోష సంహరి అనగా వాత , పిత్త , కపము , అనబడే మూడు దోషాలను సమ స్థితికి తీసుకొచ్చి సర్వ రోగములను పోగొడుతుంది . నాటు ఆవు పాల నుండి కాని , నాటు గేదెల నుండి కాని పాలు తిసి పేరా పెట్టి చిలికి తయారు చేసిన మజ్జిగ భూలోక అమృతం . * వాత రోగులు మజ్జిగ ఎలా వాడాలి ? * శరీరంలో ఇ ఒక్క భాగం లో నైన గాని , వాతము చేరి నందు వళ్ళ కలిగిన వాత వ్యాదులకు ఒక గ్లాసు పుల్లని మజ్జిగ లో ఒకటి లేదా రెండు గ్రాములు దోరగా వేయించిన శొంటి పొడి అదే మోతాదులో సైందవ లవణం కలిపి రెండు పూటల తాగుతూ ఉంటే వాత వ్యాదులు అదుపులోకి వస్తాయి .
** పైత్య రోగులు మజ్జిగను ఎలా వాడాలి ? *** శరీరంలో అరి కాళ్ళ మంటలు , అరి చేతులు మంటలు లేదా కళ్ళ మంటలు , తల , లేదా శరీరం అంత అమిత వేడితో కాలి పోతు ఉండడం చర్మ ము పై ఎర్రని పొక్కులు పుడ్లు రావడం నవ రంద్రాలలో ఎటు నుండి అయిన రక్తం రావడం మొదలైన అనేక సమస్యలు ఉన్న వారు తియ్యని పలుచని ఒక గ్లాసు మజ్జిగ లో ఒక టే స్పూన్ కండ చక్కర పొడి కలిపి రెండు లేక మూడు పూటల తాగుతూ ఉంటే పైత్య రోగం అదుపులోకి వస్తుంది

కాశీ ఖండం

కాశీ ఖండం అనే కావ్యాన్ని కవిసార్వభౌముడైన శ్రీనాథుడు రచించారు. కాశీఖండము శ్రీనాథుడు రచించిన తెలుగు కావ్యము. ఇది క్రీస్తుశకం 1440 కాలంనాటి రచన.[1] స్కాంద పురాణంలో సులభగ్రాహ్యంగా ఉన్న ఈ కథా భాగాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండముగా రూపుదిద్దారు. ఇందులో వారణాశిగా ప్రసిద్ధిచెందిన కాశీ క్షేత్ర మహత్యం, దాని వైశిష్ట్యం, కాశీ యాత్రా విశేషాలు, శివునికి కాశీకి గల అనుబంధం, అనేక కథలు, ఉపకథలు మరియు కాశీకి సంబందించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ముద్రించేందుకు ఉత్పల నరసింహాచార్యులు పరిష్కరించగా, వ్రాతప్రతులను సమకూర్చడంలో వేటూరి ప్రభాకరశాస్త్రి సహకరించారు..       
                                                                             ..................మరిన్ని విషయాలకు ఇక్కడ నొక్కండి

షిర్డీ సాయిబాబా

సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు.  సాయిబాబా నిశ్చయంగా దేవుడే        
                                ..................మరిన్ని విషయాలకు ఇక్కడ నొక్కండి

 

మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

★నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:
నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?
క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండాపోయాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు.

1.అక్షరలక్ష:
ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం,గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

2.శబ్దశాస్త్రం:
రచయిత ఖండిక ఋషి.సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.

3.శిల్పశాస్త్రం:
రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు.గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి.ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,
మయుడు,మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

4.సూపశాస్త్రం:
రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు,పిండివంటలు
,తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి,ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

5.మాలినీ శాస్త్రం:
రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

6.ధాతుశాస్త్రం:
రచయిత అశ్వినీకుమార.సహ
జ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.మిశ్
రలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

7.విషశాస్త్రం:
రచయిత అశ్వినీకుమార.32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం):
రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి.సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు.ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.

9.మల్లశాస్త్రం:
రచయిత మల్లుడు. వ్యాయామాలు,ఆటలు,వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.

10.రత్నపరీక్ష: రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూ
పం,బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.

11.మహేంద్రజాల శాస్త్రం: సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత.నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

12.అర్థశాస్త్రం:
రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు.

13.శక్తితంత్రం:
రచయిత అగస్త్యముని.ప్ర
కృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి.అణువిచ్చేదనం ఇందులోని భాగమే.
14.సౌధామినీకళ:
రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

15.మేఘశాస్త్రం:
రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

16.స్థాపత్యవిద్య:
అదర్వణవేదం లోనిది. ఇంజనీ రింగ్,ఆర్కిటెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.
ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సామ
ుద్రిక శాస్త్రం,అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,కుమారస్వామి రచించిన గజశాస్త్రం,భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.
నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?
వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​.